లియోనల్ మెస్సీ రికార్డ్ | Messi record as Argentina thrash Venezuela | Sakshi
Sakshi News home page

లియోనల్ మెస్సీ రికార్డ్

Published Sun, Jun 19 2016 12:41 PM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

లియోనల్ మెస్సీ రికార్డ్

లియోనల్ మెస్సీ రికార్డ్

ఫాక్స్ బారో: కోపా అమెరికా కప్ ఫుట్బాల్ టోర్నిలో అర్జెంటీనా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం జరిగి క్వార్టర్ ఫైనల్లో వెనిజులాను 4-1 తో ఓడించింది. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ రికార్డ్ గోల్ తో వెనిజులాను ఇంటిదారి పట్టించాడు. ఈ బార్సిలోనా సూపర్ స్టార్ ఆట 60 నిమిషంలో గోల్‌ సాధించాడు. ఈ టోర్నమెంట్ అతడు చేసిన నాలుగో గోల్ ఇది. 54 అంతర్జాతీయ గోల్స్ తో గాబ్రియల్ బాటిస్టుటా రికార్డును సమం చేశాడు.

ఆట ఆరంభం నుంచి వెనిజులాపై అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట ద్వితీయార్థంలో ఎరిక్ లమేలా గోల్ కొట్టాడు. గొంజాలో హిగారియన్ రెండు గోల్స్  చేశాడు.

కాగా, అత్యధిక గోల్స్ రికార్డును సమం చేయడం పట్ల మెస్సీ సంతోషం వ్యక్తం చేశాడు. దీని కంటే మ్యాచ్ గెలవడమే తనకు ఎక్కువ సంతోషం కలిగించిందన్నాడు. టైటిల్ దక్కించుకోవడమే తన ముందు లక్ష్యమని చెప్పాడు. గతేడాది ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement