
జబివాక... జబివాక... జబివాక... ఇప్పుడు ఫుట్‌బాల్ అభిమానులంతా ఈ పేరు జపం చేస్తూ గోల చేస్తున్నారు. ఎవరీ జబివాక? సడెన్‌గా మన కవర్ మీదికి ఎందుకొచ్చిందీ? ఎలా వచ్చిందీ? అనేగా మీ ప్రశ్న? జబివాక ఈసారి ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు అఫీషియల్ మాస్కట్. చిన్ని చిన్ని గంతులేస్తూ ఆడి పాడే తోడేలు ఇది. ఆకారంలో చిన్నదే కానీ, గోల్ కొట్టిందంటే గ్రౌండ్ అంతా అరుపులే! అలాంటి జబివాక ఫుట్‌బాల్ వరల్డ్ కప్ చూద్దురు రండీ అంటూ ప్రపంచాన్ని పిలుస్తోంది! మనవరకు ఆటంటే క్రికెట్. ఇక్కడ అదొక మతం. కానీ క్రికెట్‌తో పాటు ప్రపంచాన్ని ఉర్రూతలూగించే ఆట ఇంకొకటి ఉంది. అదే ఫుట్‌బాల్. సాకర్. ఎలా పిలిస్తే అలా! కళ్లు, కాళ్లు, చేతులు, బాడీ మొత్తం ఒకే ఒక్క దిశగా కదుల్తుంది, ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లందరికీ! ఈ ఆటను ఇష్టపడేవాళ్లైతే కళ్లంతా అప్పగించేసి టీవీల ముందు, స్టేడియంలలో వాలిపోతారు. అలాంటి ఫుట్‌బాల్‌కు అతిపెద్ద పండుగ వరల్డ్ కప్. ఈసారి రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ మరో నాలుగు రోజుల్లో (అంటే జూన్ 14న) మొదలుకానుంది. నెలరోజుల పాటు (జూలై 15 వరకు) ఈ సంబరం జరుగుతుంది. క్రికెట్ సీజన్ అయిపోయిందిగా, స్పోర్ట్స్ చానల్ లిస్ట్‌లో ఫుట్‌బాల్‌కు మారిపోండి! పండుగకు సిద్ధమైపోండి!! జబివాకను పలకరించండి!!!
ఫుట్‌బాల్ పుట్టిందిలా....
ఇంగ్లండ్‌లో తొలిసారి 1863లో ఈ ఆట మొదలైంది. ప్రపంచ క్రీడా చరిత్రలో క్రీడలకు సంబంధించిన తొలి సంఘం ‘ది ఫుట్‌బాల్ అసోసియేషన్ ఇన్ ఇంగ్లండ్’కు అప్పుడే అంకురార్పణ జరిగింది. మొదట్లో ఆట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కూడా ఆ దేశంలోనే. ఆ తర్వాత కొందరు వలసవాదుల వల్ల దక్షిణ అమెరికాకు ఈ క్రీడ వేగంగా వ్యాపించింది. 1901 మే 16న రెండు దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–2తో ఉరుగ్వేను ఓడించింది. మరో ఏడాది తర్వాత బ్రిటన్ బయట (వియన్నాలో) జరిగిన తొలి యూరోపియన్ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆస్ట్రియా 5–0తో జర్మనీని చిత్తుగా ఓడించింది.
రంగంలోకి ఫిఫా...
1904 మే 21న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్–ఫిఫా) మొదటి సమావేశం జరిగింది. ఈ గ్రూప్‌లో ఉండేందుకు ఆరంభంలో ఇంగ్లండ్ నిరాకరించింది. ఫిఫా అధికారికంగా నిర్వహించిన తొలి టోర్నీలో (దక్షిణ అమెరికా చాంపియన్‌షిప్స్) అర్జెంటీనా 4–1తో ఉరుగ్వేను ఓడించి తొలి చాంపియన్‌గా నిలిచింది.
ఒలింపిక్స్‌లో భాగంగా...
ఆరంభంలో ప్రపంచ స్థాయి టోర్నీ నిర్వహించాలన్న ఫిఫా ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఒలింపిక్స్ క్రీడల్లోనే భాగంగా ఉంటూ దానినే వరల్డ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌గా భావించాలని ఫిఫా నిర్ణయించింది. 1920, 1924, 1928 ఒలింపిక్స్‌లలో ఫుట్‌బాల్ నిర్వహణ బాధ్యతలను తానే తీసుకుంది. అదే సమయంలో యూరోప్‌తో పాటు దక్షిణ అమెరికా దేశాల్లో కూడా ఈ ఆట వేగంగా దూసుకుపోయింది. అందుకే 1924 పారిస్ ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ పోటీలను అసలైన అంతర్జాతీయ టోర్నీగా అంతా పరిగణించారు.
ఎట్టకేలకు వరల్డ్ కప్...
1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఫిఫా సమావేశంలో ఎలాగైనా ప్రపంచ కప్ నిర్వహించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణకు ఐదు దేశాలు ముందుకొచ్చాయి. అయితే 1929లో ఉరుగ్వే తమ 100వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోవడంతో పాటు ఆతిథ్య జట్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కొత్త స్టేడియం కూడా నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో మిగతా నాలుగు దేశాలు స్వచ్ఛందంగా తప్పుకున్నాయి. కేవలం 20 లక్షల జనాభా ఉన్న చిన్న దేశం ఉరుగ్వే 1930లో జూలై 13 నుంచి 30 వరకు తొలి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వటంతో కొత్త శకం ప్రారంభమైంది.
వరల్డ్ కప్ విశ్వవ్యాపితం...
గత 88 ఏళ్లలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆదరణ పిచ్చిపిచ్చిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఫిఫా పరిధిలో 210 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో 80 దేశాలు మాత్రం వరల్డ్ కప్‌కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. 12 దేశాలు మాత్రమే ఫైనల్ వరకు చేరగా, ఎనిమిది మాత్రమే విజేతలుగా నిలిచాయి. ఫైనల్ వరకు వెళ్లి ఒక్క టైటిల్ కూడా నెగ్గని దురదృష్ట దేశాల జాబితాలో నెదర్లాండ్స్, హంగేరీ, చెకొస్లవేకియా, స్వీడన్ నిలిచాయి. ప్రపంచకప్‌కు ఆదరణ పెంచేందుకు ఫిఫా ఆసియా దేశాల్లో ఆటను ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేసింది. 1938లో ఈస్ట్ ఇండీస్ (ప్రస్తుత ఇండోనేసియా) వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మొత్తం 12 ఆసియా జట్లు ఇప్పటి వరకు టోర్నీలో పాల్గొన్నాయి. మరోవైపు 13 ఆఫ్రికా దేశాలు కూడా ఈ మెగా టోర్నీలో భాగం కాగా... కామెరూన్, సెనెగల్, ఘనా మాత్రమే క్వార్టర్ ఫైనల్ వరకు చేరాయి. ఇదే అత్యుత్తమం. ఏ ఆఫ్రికా జట్టు కూడా ఒక్కసారీ సెమీఫైనల్‌కు చేరలేదు.
వరల్డ్ కప్ సక్సెస్ స్టోరీ...
ఫుట్‌బాల్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన క్రేజ్ ఉంది. ఆటగాళ్ల పేరు చెబితే చాలు అభిమాన లోకం ఊగిపోతుంది. అదే స్థాయిలో చాంపియన్స్ లీగ్, లా లిగా వంటి క్లబ్ టోర్నీలను జనం విరగబడి చూస్తారు. అయినా సరే వరల్డ్ కప్‌కు ఉండే క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. తమ హీరోలను ఆయా దేశాల జాతీయ జట్లలో చూసుకొని మురిసిపోయేందుకు ఫ్యాన్స్ ఎప్పటికీ సిద్ధమే అని ఈ మెగా టోర్నీ మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది.
నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తూ వరల్డ్ కప్‌ను సూపర్ సక్సెస్ చేయడంలో ఫిఫా వ్యూహం కూడా ఉంది. అతి పెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో ఈ స్టార్లంతా పాల్గొంటే వరల్డ్‌కప్‌కు ఈ స్థాయి క్రేజ్ ఉండకపోయేదేమో. ఒలింపిక్స్‌లో కూడా ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్లను ఆడించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఫిఫా తగ్గకుండా పట్టుదలను ప్రదర్శించింది. అందుకే వరల్డ్ కప్‌లో పాల్గొనని ఆటగాళ్లను మాత్రమే ఒలింపిక్స్‌కు పంపించాలని ఫిఫా నిబంధనలు రూపొందించింది. 1984, 1988లలో ఇలాగే అన్ని దేశాల ద్వితీయ శ్రేణి జట్లే ఒలింపిక్స్‌లో పాల్గొన్నాయి. ఆ తర్వాత ఫిఫా మళ్లీ నిబంధన మార్చింది. 1992 ఒలింపిక్స్ నుంచి ఫుట్‌బాల్ ఈవెంట్ అండర్–23 స్థాయికే పరిమితం చేసింది. 23 ఏళ్లు దాటిన ఆటగాళ్లు గరిష్టంగా ముగ్గురు ఉండవచ్చు. దాంతో ఒలింపిక్స్ నుంచి పోటీ అనేదే లేకుండా ప్రపంచ కప్ విశ్వవ్యాప్తంగా అతి పెద్ద ఫుట్‌బాల్ ఈవెంట్‌గా నిలిచింది.
డబ్బులే డబ్బులు...
ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌ను తొలిసారి 1954లో టీవీలో ప్రసారం చేశారు. 25 మ్యాచ్‌లలో 9 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయగా ఫిఫాకు ప్రసార హక్కుల ద్వారా ఒక్క రూపాయి కూడా రాలేదు. అదే 2010 ప్రపంచకప్‌కు వచ్చేసరికి టీవీ హక్కులను ఏకంగా 2.4 బిలియన్ డాలర్లకు అమ్మగలిగింది. రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో జర్మనీ, అర్జెంటీనా మధ్య జరిగిన 2014 ఫైనల్‌ను టీవీల్లో 695 మిలియన్ల మంది చూశారు. స్టాటిస్టా డాట్‌కామ్ అనే ప్రఖ్యాత వెబ్‌సైట్ లెక్క ప్రకారం 2017లో ఫిఫా వరల్డ్ కప్ బ్రాండ్ వ్యాల్యూ 229 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 16 వేల కోట్లు).
ఒక్క వరల్డ్‌కప్ నిర్వహణతో ఫిఫాకు భారీ ఆదాయం లభిస్తుంది. 2014 వరల్డ్ కప్ ద్వారా ఫిఫా మొత్తం 4.82 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఇందులో 50.3 శాతం టీవీ రైట్స్ అమ్మకాల ద్వారానే కావడం విశేషం. 32.7 శాతం మార్కెటింగ్ రైట్స్ ద్వారా అయితే కేవలం 10.9 శాతం మాత్రమే టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం. 2018 వరల్డ్ కప్ నుంచి కూడా దాదాపు ఇదే తరహా ఆదాయాన్ని నిర్వాహకులు ఆశిస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం తీవ్రంగా చుట్టుముట్టిన ఆర్థికపరమైన వివాదాలు ఆదాయంపై ప్రభావం చూపించవచ్చనివిశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అమెరికా ఈసారి అర్హత సాధించకపోవడంతో కూడా పెద్ద దెబ్బ పడనుంది. మరో పెద్ద జట్టు, నాలుగు సార్లు విజేతగా నిలిచిన ఇటలీ కూడా అర్హత సాధించకపోవడంతో ఒక బిలియన్ యూరోల నష్టం జరగనుందని అంచనా. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా వరల్డ్ కప్ ఆర్థికపరంగా కూడా గత స్థాయికి తగ్గకుండా సక్సెస్ అవుతుందని ఫిఫా విశ్వసిస్తోంది.
కప్ కహానీ...
ప్రపంచకప్ విజేతలకు ఇచ్చే ట్రోఫీ 1930 నుంచి ఒకసారి మారింది. 1930 నుంచి 1970 వరకు ఒక ట్రోఫీని ఇచ్చారు. మొదట్లో దీనిని ‘విక్టరీ’ పేరుతో పిలవగా... ఆ తర్వాత ఫిఫా మాజీ అధ్యక్షుడు ‘జూల్స్ రిమెట్’ పేరుతో దీనిని ఇవ్వడం మొదలు పెట్టారు. 3.8 కిలోల బరువు, 35 సెంటీమీటర్ల ఎత్తు ఉండే ఈ ట్రోఫీని వెండితో తయారు చేసి బంగారు పూత పూశారు. టోర్నీ విజేతలకు దీని ‘రెప్లికా’ను మాత్రమే బహుమతిగా ఇచ్చేవారు. అయితే 1970లో బ్రెజిల్ మూడోసారి టైటిల్ గెలిచిన తర్వాత నిబంధనల ప్రకారం ‘ఒరిజినల్ ట్రోఫీ’ని బ్రెజిల్‌కు ఇచ్చేయాల్సి వచ్చింది. దాంతో ఫిఫా కొత్త ట్రోఫీని రూపొందించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఇస్తున్న ట్రోఫీ అదే. 1974 టోర్నీ నుంచి దీనిని ఇస్తున్నారు. రెండు చేతులు గ్లోబ్‌ను మోస్తున్నట్లుగా ఉండే చిత్రంతో ఇది తయారైంది. దీని ఎత్తు 36.5 సెంటీమీటర్లు కాగా, బరువు 5 కిలోలు. దీనిని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దిగువ భాగంలో ఉండే ప్లేట్‌పై విజేతల జాబితా ఉంటుంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఈ ట్రోఫీని ఎవరికీ శాశ్వతంగా ఇవ్వరు. విజేతకు అదే తరహాలో ఉండే కంచు ట్రోఫీని మాత్రం అందజేస్తారు.
జబివాక గురించి...
రష్యాలో జరగనున్న వరల్డ్ కప్‌కు అఫీషియల్ మాస్కట్ (సింబల్ లాంటిది) జబివాక వుల్ఫ్. వైట్, రెడ్, బ్లూ కలర్స్ ఉన్న టీషర్ట్‌ను ధరించిన ఫన్నీ వుల్ఫ్ ఇది. జబివాక అంటే రష్యన్‌లో ‘బాగా స్కోర్ చేసేది’ అని. ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు జోష్‌ను తెచ్చేందుకు జోష్‌ఫుల్‌గా ఉండేలా జబివాకను డిజైన్ చేశారు. ఆన్‌లైన్‌లో ఓటింగ్ ద్వారా దీన్ని ఎంపికచేశారు. రెడ్, వైట్, బ్లూ.. రష్యా టీమ్ నేషనల్
కలర్స్. దీనికి స్టైల్‌గా ఆరెంజ్ కలర్‌లో ఒక కళ్లజోడు కూడా ఉంటుంది! 2016లోనే దీన్ని సెలెక్ట్ చేశారు. ఇప్పటికే జబివాక సోషల్ మీడియాలో బాగా ఫేమస్!!
జబివాక గురించి...
రష్యాలో జరగనున్న వరల్డ్ కప్‌కు అఫీషియల్ మాస్కట్ (సింబల్ లాంటిది) జబివాక వుల్ఫ్. వైట్, రెడ్, బ్లూ కలర్స్ ఉన్న టీషర్ట్‌ను ధరించిన ఫన్నీ వుల్ఫ్ ఇది. జబివాక అంటే రష్యన్‌లో ‘బాగా స్కోర్ చేసేది’ అని. ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు జోష్‌ను తెచ్చేందుకు జోష్‌ఫుల్‌గా ఉండేలా జబివాకను డిజైన్ చేశారు. ఆన్‌లైన్‌లో ఓటింగ్ ద్వారా దీన్ని ఎంపికచేశారు. రెడ్, వైట్, బ్లూ.. రష్యా టీమ్ నేషనల్ కలర్స్. దీనికి స్టైల్‌గా ఆరెంజ్ కలర్‌లో ఒక కళ్లజోడు కూడా ఉంటుంది! 2016లోనే దీన్ని సెలెక్ట్ చేశారు. ఇప్పటికే జబివాక సోషల్ మీడియాలో బాగా ఫేమస్!!
వరల్డ్‌కప్ చరిత్రలో ఎందరో సూపర్ స్టార్లు తమ ఆటతో అభిమానులను ఉర్రూతలూగించారు. అందులో కొందరు అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాంటి టాప్–5 వరల్డ్‌కప్ స్టార్స్...
పీలే (బ్రెజిల్): ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో దిగ్గజ క్రీడాకారుడిగా అందరికంటే ముందు గుర్తుకొచ్చే పేరు పీలే. బ్రెజిల్ గెలిచిన మూడు వరల్డ్‌కప్‌లలో అతను భాగం కావడం విశేషం. ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడు కూడా పీలేనే. 1958, 1962, 1970లలో బ్రెజిల్ ప్రపంచకప్ గెలవడంలో అతనిదే కీలక పాత్ర. స్టార్ ఆటగాళ్లు ఉన్న జట్టులో 17 ఏళ్ల వయసులో తొలి ప్రపంచకప్‌లో చెలరేగిన పీలే, మరో 12 ఏళ్ల తర్వాత ఎవరికీ అందనంత ఎత్తులో తనే ఒక దిగ్గజంగా ఎదిగాడు. 1958 ప్రపంచకప్‌లో నాకౌట్ దశలోనే సంచలన ప్రదర్శనతో ‘బ్లాక్ పెర్ల్’ పీలే ఆరు గోల్స్ కొట్టాడు.
డీగో మారడోనా (అర్జెంటీనా): 5 అడుగుల 5 అంగుళాల ఎత్తుతోనే డీగో మారడోనా ప్రపంచ ఫుట్‌బాల్‌లోనే ఆజానుబాహులందరినీ వెనక్కి తోసి ఔరా అనిపించాడు. పీలేతో సంయుక్తంగా ‘ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద సెంచరీ’గా నిలిచిన అతను, దేశాలతో సంబంధం లేకుండా ఫుట్‌బాల్ అభిమానులందరి హృదయాలను కొల్లగొట్టాడు. 1986 ప్రపంచకప్‌ను అర్జెంటీనాకు సాధించి పెట్టడంతో అతను సూపర్‌స్టార్‌గా ఎదిగిపోయాడు. 1990లో కెప్టెన్‌గా జట్టును ఫైనల్ చేర్చిన అతను 1994 వరల్డ్ కప్ సమయంలో డ్రగ్స్ వాడి వివాదాల్లో చిక్కుకున్నాడు.
ఫ్రాన్జ్ బెకన్‌బాయర్ (పశ్చిమ జర్మనీ): జర్మనీ అందించిన ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్స్‌లో ఒకడు. తన స్టయిల్, నాయకత్వ లక్షణాలతో అతను ‘ది ఎంపరర్’గా పేరు తెచ్చుకున్నాడు. 1966, 1970 ప్రపంచకప్‌లలో అతను పాల్గొన్న పశ్చిమ జర్మనీ జట్టు అద్భుతమైన ఆట కనబర్చినా... కప్‌ను అందుకోలేకపోయింది. ఈ రెండు సార్లు అతను చెలరేగినా లాభం లేకపోయింది. 1966 ఫైనల్లో అదనపు సమయంలో ఇంగ్లండ్ చేతిలో ఓడిన జర్మనీ... 1970లో ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో ఇటలీకి తలవంచింది. అయితే 1974లో సొంతగడ్డపై బెకన్‌బాయర్ అలాంటి అవకాశం ఇవ్వలేదు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ నుంచే జట్టును విజయ పథంలో నడిపించి ఫైనల్లో 2–1తో నెదర్లాండ్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించి చరిత్రలో నిలిచిపోయాడు.
గెర్డ్ ముల్లర్ (పశ్చిమ జర్మనీ): ‘ద నేషన్స్ బాంబర్’ అనే నిక్‌నేమ్ ఉన్న గెర్డ్ ముల్లర్ ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాళ్లలో ఒకడు. రెండు ప్రపంచకప్‌లలో (1970, 1974 ) 13 మ్యాచ్‌లలోనే మొత్తం 14 గోల్స్ కొట్టిన ముల్లర్ ఓవరాల్‌గా ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. 1970 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై చిరస్మరణీయ విజయం సాధించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. సొంతగడ్డపై తర్వాతి ప్రపంచకప్ ఫైనల్లో ముల్లర్ చేసిన గోల్‌తో జర్మనీ రెండో సారి విజేతగా నిలిచింది.
రొనాల్డో (బ్రెజిల్): ఫుట్‌బాల్‌ను ప్రాణంగా ప్రేమించే బ్రెజిల్‌లో పీలే తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేసిన ఆటగాడు రొనాల్డో లూయీ డి లిమా. మూడు సార్లు ‘ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’, రెండు సార్లు ‘గోల్డెన్ బాల్’ గెలుచుకోవడం మాత్రమే రొనాల్డో గొప్పతనం కాదు. పీలే రిటైర్మెంట్ తర్వాత 24 ఏళ్ల పాటు వరల్డ్ కప్ విజయానికి నోచుకోకుండా నిరాశగా కనిపించిన బ్రెజిల్ అభిమానులకు కొత్త ఊపిరి పోసింది అతనే అనడంలో అతిశయోక్తి లేదు. 17 ఏళ్ల వయసులో 1994లో బ్రెజిల్ కప్ గెలిచినప్పుడు జట్టులో భాగంగా ఉన్నాడు. ఆ సమయానికి నివురుగప్పిన నిప్పులా ఉన్న రొనాల్డో మరో నాలుగేళ్ల తర్వాత మండుతున్న అగ్నికణికే అయ్యాడు. ఫైనల్లో బ్రెజిల్ ఓడినా... రొనాల్డో అద్భుత ఆటకు ‘గోల్డెన్ బాల్’ పురస్కారం దక్కింది.
ఫుట్‌బాల్ అక్షరమాల...
సాకర్ – ఫుట్‌బాల్‌కు మరో పేరు.సమయం– ఫుట్‌బాల్ మ్యాచ్ 45 నిమిషాల నిడివిగల రెండు భాగాలతో కలిపి మొత్తం 90 నిమిషాలు జరుగుతుంది. నిర్ణాయక మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయం పూర్తయ్యాక స్కోరు సమంగా నిలిస్తే ఫలితం తేలడానికి 15 నిమిషాలు నిడివిగల రెండు అర్ధభాగాలను ఆడిస్తారు. అదనపు సమయంలోనూ ఫలితం తేలకపోతే ‘పెనాల్టీ షూటౌట్’ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు.
ఇంజ్యూరీ టైమ్ – మ్యాచ్ సమయంలో ఏవైనా కారణలతో ఆటకు అంతరాయం ఏర్పడితే ఆ అంతరాయం కలిగిన సమయాన్ని నిర్ణీత సమయం పూర్తయ్యాక జోడించి ఆటను కొనసాగిస్తారు. సభ్యుల సంఖ్య – 23 మంది సభ్యులతో పూర్తి జట్టు ఉంటుంది. అయితే మ్యాచ్‌లో మాత్రం ఒక్కో జట్టు తరఫున 11 మంది ఆటగాళ్లు మాత్రమే బరిలోకి దిగాలి. కొలతలు – మైదానం పొడవు 105 మీటర్లు... వెడల్పు 68 మీటర్లకు తక్కువగా ఉండకూడదు. గోల్‌పోస్ట్ ఎత్తు 2.44 మీటర్లు, వెడల్పు 7.32 మీటర్లు ఉంటుంది. డిఫెండర్ – రక్షణ పంక్తి ఆటగాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు చేసే దాడులను నిరోధించడం ఇతని విధి.ఫార్వర్డ్ – ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించేవాడు.హెడర్ – తలతో బంతిని షాట్ కొట్టడం. సాధారణంగా ‘డి’ ఏరియాలో ఇలాంటి షాట్‌లు ఆడతారు.బైసైకిల్ కిక్ లేదా సిజర్స్ కిక్ – తల భాగం కిందికి వచ్చి, కాళ్లు పైకి లేపి గాల్లోనే ఉంటూ కొట్టే షాట్. పెనాల్టీ కిక్ – ‘డి’ ఏరియాలో ప్రత్యర్థి ఆటగాళ్లను డిఫెండింగ్ జట్టు సభ్యులెవరైనా మొరటుగా అడ్డుకుంటే రిఫరీ పెనాల్టీ కిక్‌ను ప్రకటిస్తాడు. గోల్‌పోస్ట్‌కు 11 మీటర్ల దూరంనుంచి ప్రత్యర్థి ఆటగాడు సంధించే ఈ కిక్‌ను గోల్‌కీపర్ మాత్రమే నిలువరించాలి. పెనాల్టీ షూటౌట్æ– నిర్ణాయక మ్యాచ్‌లో రెండు జట్లు సమ ఉజ్జీగా నిలిస్తే విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌నుఉపయోగిస్తారు. ఈ షూటౌట్‌లో ఒక్కో జట్టు తరఫున ఐదుగురు ఆటగాళ్లు ‘కిక్’లను తీసుకుంటారు. అత్యధికసార్లు సఫలమైన వాళ్లు విజేతగా నిలుస్తారు. సడన్‌డెత్ – షూటౌట్‌లోనూ స్కోరు సమంగా అయ్యాక రెండు జట్లకు అదనంగా అవకాశాలు ఇస్తారు. గోల్ చేయడంలో ఒక జట్టు సఫలమై, మరో జట్టు విఫలమైతే ఫలితాన్ని ప్రకటిస్తారు.డ్రిబ్లింగ్ – ఆటగాళ్లకు బంతి అందకుండా కాళ్లతో చాకచక్యంగా చేసే విన్యాసం.రెడ్ కార్డు – ప్రత్యర్థి క్రీడాకారుడిని అత్యంత మొరటుగా అడ్డుకున్న డిఫెండింగ్ జట్టు సభ్యుడికి ‘రెడ్‌కార్డు’ ప్రకటించి ఆ మ్యాచ్ నుంచి తొలగిస్తారు. ఎల్లో కార్డు – ప్రత్యర్థి క్రీడాకారుడిని ప్రమాదకరంగా అడ్డుకున్న డిఫెండింగ్ జట్టు సభ్యుడిని హెచ్చరిస్తూ అంపైర్ ‘ఎల్లో కార్డు’ ఇస్తాడు. వరుసగా రెండు ఎల్లో కార్డులు వచ్చిన ఆటగాడు తదుపరి మ్యాచ్‌లో పాల్గొనే అర్హత కోల్పోతాడు.
ఎవరి కల ఫలించేను...
లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో... ఆధునిక ఫుట్‌బాల్‌లో వీళ్లిద్దరిని మించిన సూపర్ స్టార్లు లేరు. చాంపియన్స్ లీగ్‌తో పాటు ఇతర క్లబ్ టోర్నీలలో తమ ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన మాయగాళ్లు. వీరు సాధించిన రికార్డులు, కీర్తి కనకాదులకు లెక్కే లేదు. అడుగు తీసి అడుగేస్తే కోట్లాభిషేకమే. కానీ వీరిద్దరి కెరీర్‌లో ఒకే ఒక వెలితి తమ జాతీయ జట్టు తరఫున ప్రపంచ కప్ గెలవలేకపోవడం. పోర్చుగల్ తరఫున రొనాల్డో, అర్జెంటీనా తరఫున మెస్సీ ఒక్క వరల్డ్ కప్ విజయంలోనూ భాగం కాలేకపోయారు. 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాకపోగా... రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. క్లబ్‌లతో పోలిస్తే దేశం తరఫున వీరి ఆట చాలా సందర్భాల్లో సాదాసీదాగానే సాగింది. అలాంటి వీరిద్దరు ఆఖరిసారిగా ప్రపంచ కప్ బరిలోకి దిగబోతున్నారు. ఈసారైనా వీరు తమ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తారా లేక ఎప్పుడూ కప్ గెలవలేకపోయిన దిగ్గజాల జాబితాలో చోటుతో ఆటను ముగిస్తారా చూడాలి!
ఫుట్‌బాల్ పుట్టిందిలా....
ఇంగ్లండ్‌లో తొలిసారి 1863లో ఈ ఆట మొదలైంది. ప్రపంచ క్రీడా చరిత్రలో క్రీడలకు సంబంధించిన తొలి సంఘం ‘ది ఫుట్‌బాల్ అసోసియేషన్ ఇన్ ఇంగ్లండ్’కు అప్పుడే అంకురార్పణ జరిగింది. మొదట్లో ఆట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కూడా ఆ దేశంలోనే. ఆ తర్వాత కొందరు వలసవాదుల వల్ల దక్షిణ అమెరికాకు ఈ క్రీడ వేగంగా వ్యాపించింది. 1901 మే 16న రెండు దక్షిణ అమెరికా దేశాల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో అర్జెంటీనా 3–2తో ఉరుగ్వేను ఓడించింది. మరో ఏడాది తర్వాత బ్రిటన్ బయట (వియన్నాలో) జరిగిన తొలి యూరోపియన్ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆస్ట్రియా 5–0తో జర్మనీని చిత్తుగా ఓడించింది.
రంగంలోకి ఫిఫా...
1904 మే 21న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్–ఫిఫా) మొదటి సమావేశం జరిగింది. ఈ గ్రూప్‌లో ఉండేందుకు ఆరంభంలో ఇంగ్లండ్ నిరాకరించింది. ఫిఫా అధికారికంగా నిర్వహించిన తొలి టోర్నీలో (దక్షిణ అమెరికా చాంపియన్‌షిప్స్) అర్జెంటీనా 4–1తో ఉరుగ్వేను ఓడించి తొలి చాంపియన్‌గా నిలిచింది.
ఒలింపిక్స్‌లో భాగంగా...
ఆరంభంలో ప్రపంచ స్థాయి టోర్నీ నిర్వహించాలన్న ఫిఫా ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో ఒలింపిక్స్ క్రీడల్లోనే భాగంగా ఉంటూ దానినే వరల్డ్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌గా భావించాలని ఫిఫా నిర్ణయించింది. 1920, 1924, 1928 ఒలింపిక్స్‌లలో ఫుట్‌బాల్ నిర్వహణ బాధ్యతలను తానే తీసుకుంది. అదే సమయంలో యూరోప్‌తో పాటు దక్షిణ అమెరికా దేశాల్లో కూడా ఈ ఆట వేగంగా దూసుకుపోయింది. అందుకే 1924 పారిస్ ఒలింపిక్స్‌లో ఫుట్‌బాల్ పోటీలను అసలైన అంతర్జాతీయ టోర్నీగా అంతా పరిగణించారు.
ఎట్టకేలకు వరల్డ్ కప్...
1928లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఫిఫా సమావేశంలో ఎలాగైనా ప్రపంచ కప్ నిర్వహించాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. నిర్వహణకు ఐదు దేశాలు ముందుకొచ్చాయి. అయితే 1929లో ఉరుగ్వే తమ 100వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకోవడంతో పాటు ఆతిథ్య జట్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కొత్త స్టేడియం కూడా నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో మిగతా నాలుగు దేశాలు స్వచ్ఛందంగా తప్పుకున్నాయి. కేవలం 20 లక్షల జనాభా ఉన్న చిన్న దేశం ఉరుగ్వే 1930లో జూలై 13 నుంచి 30 వరకు తొలి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వటంతో కొత్త శకం ప్రారంభమైంది.
వరల్డ్ కప్ విశ్వవ్యాపితం...
గత 88 ఏళ్లలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆదరణ పిచ్చిపిచ్చిగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఫిఫా పరిధిలో 210 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో 80 దేశాలు మాత్రం వరల్డ్ కప్‌కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. 12 దేశాలు మాత్రమే ఫైనల్ వరకు చేరగా, ఎనిమిది మాత్రమే విజేతలుగా నిలిచాయి. ఫైనల్ వరకు వెళ్లి ఒక్క టైటిల్ కూడా నెగ్గని దురదృష్ట దేశాల జాబితాలో నెదర్లాండ్స్, హంగేరీ, చెకొస్లవేకియా, స్వీడన్ నిలిచాయి. ప్రపంచకప్‌కు ఆదరణ పెంచేందుకు ఫిఫా ఆసియా దేశాల్లో ఆటను ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేసింది. 1938లో ఈస్ట్ ఇండీస్ (ప్రస్తుత ఇండోనేసియా) వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మొత్తం 12 ఆసియా జట్లు ఇప్పటి వరకు టోర్నీలో పాల్గొన్నాయి. మరోవైపు 13 ఆఫ్రికా దేశాలు కూడా ఈ మెగా టోర్నీలో భాగం కాగా... కామెరూన్, సెనెగల్, ఘనా మాత్రమే క్వార్టర్ ఫైనల్ వరకు చేరాయి. ఇదే అత్యుత్తమం. ఏ ఆఫ్రికా జట్టు కూడా ఒక్కసారీ సెమీఫైనల్‌కు చేరలేదు.
వరల్డ్ కప్ సక్సెస్ స్టోరీ...
ఫుట్‌బాల్ ఆటకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్యమైన క్రేజ్ ఉంది. ఆటగాళ్ల పేరు చెబితే చాలు అభిమాన లోకం ఊగిపోతుంది. అదే స్థాయిలో చాంపియన్స్ లీగ్, లా లిగా వంటి క్లబ్ టోర్నీలను జనం విరగబడి చూస్తారు. అయినా సరే వరల్డ్ కప్‌కు ఉండే క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. తమ హీరోలను ఆయా దేశాల జాతీయ జట్లలో చూసుకొని మురిసిపోయేందుకు ఫ్యాన్స్ ఎప్పటికీ సిద్ధమే అని ఈ మెగా టోర్నీ మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది. నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తూ వరల్డ్ కప్‌ను సూపర్ సక్సెస్ చేయడంలో ఫిఫా వ్యూహం కూడా ఉంది. అతి పెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్‌లో ఈ స్టార్లంతా పాల్గొంటే వరల్డ్‌కప్‌కు ఈ స్థాయి క్రేజ్ ఉండకపోయేదేమో. ఒలింపిక్స్‌లో కూడా ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్లను ఆడించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) తీవ్ర ఒత్తిడి తెచ్చినా ఫిఫా తగ్గకుండా పట్టుదలను ప్రదర్శించింది. అందుకే వరల్డ్ కప్‌లో పాల్గొనని ఆటగాళ్లను మాత్రమే ఒలింపిక్స్‌కు పంపించాలని ఫిఫా నిబంధనలు రూపొందించింది. 1984, 1988లలో ఇలాగే అన్ని దేశాల ద్వితీయ శ్రేణి జట్లే ఒలింపిక్స్‌లో పాల్గొన్నాయి. ఆ తర్వాత ఫిఫా మళ్లీ నిబంధన మార్చింది. 1992 ఒలింపిక్స్ నుంచి ఫుట్‌బాల్ ఈవెంట్ అండర్–23 స్థాయికే పరిమితం చేసింది. 23 ఏళ్లు దాటిన ఆటగాళ్లు గరిష్టంగా ముగ్గురు ఉండవచ్చు. దాంతో ఒలింపిక్స్ నుంచి పోటీ అనేదే లేకుండా ప్రపంచ కప్ విశ్వవ్యాప్తంగా అతి పెద్ద ఫుట్‌బాల్ ఈవెంట్‌గా నిలిచింది.
డబ్బులే డబ్బులు...
ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌ను తొలిసారి 1954లో టీవీలో ప్రసారం చేశారు. 25 మ్యాచ్‌లలో 9 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయగా ఫిఫాకు ప్రసార హక్కుల ద్వారా ఒక్క రూపాయి కూడా రాలేదు. అదే 2010 ప్రపంచకప్‌కు వచ్చేసరికి టీవీ హక్కులను ఏకంగా 2.4 బిలియన్ డాలర్లకు అమ్మగలిగింది. రియో డి జనీరోలోని మరకానా స్టేడియంలో జర్మనీ, అర్జెంటీనా మధ్య జరిగిన 2014 ఫైనల్‌ను టీవీల్లో 695 మిలియన్ల మంది చూశారు. స్టాటిస్టా డాట్‌కామ్ అనే ప్రఖ్యాత వెబ్‌సైట్ లెక్క ప్రకారం 2017లో ఫిఫా వరల్డ్ కప్ బ్రాండ్ వ్యాల్యూ 229 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 16 వేల కోట్లు).
ఒక్క వరల్డ్‌కప్ నిర్వహణతో ఫిఫాకు భారీ ఆదాయం లభిస్తుంది. 2014 వరల్డ్ కప్ ద్వారా ఫిఫా మొత్తం 4.82 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఇందులో 50.3 శాతం టీవీ రైట్స్ అమ్మకాల ద్వారానే కావడం విశేషం. 32.7 శాతం మార్కెటింగ్ రైట్స్ ద్వారా అయితే కేవలం 10.9 శాతం మాత్రమే టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం. 2018 వరల్డ్ కప్ నుంచి కూడా దాదాపు ఇదే తరహా ఆదాయాన్ని నిర్వాహకులు ఆశిస్తున్నారు. అయితే కొన్నాళ్ల క్రితం తీవ్రంగా చుట్టుముట్టిన ఆర్థికపరమైన వివాదాలు ఆదాయంపై ప్రభావం చూపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అమెరికా ఈసారి అర్హత సాధించకపోవడంతో కూడా పెద్ద దెబ్బ పడనుంది. మరో పెద్ద జట్టు, నాలుగు సార్లు విజేతగా నిలిచిన ఇటలీ కూడా అర్హత సాధించకపోవడంతో ఒక బిలియన్ యూరోల నష్టం జరగనుందని అంచనా. ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా వరల్డ్ కప్ ఆర్థికపరంగా కూడా గత స్థాయికి తగ్గకుండా సక్సెస్ అవుతుందని ఫిఫా విశ్వసిస్తోంది.
మహిళలకు కూడా...
ఫిఫా నేతృత్వంలోనే మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కూడా జరుగుతుంది. ఫిఫా ఉమెన్స్ వరల్డ్ చాంపియన్‌షిప్ పేరుతో 1991లో తొలిసారి ఈ టోర్నీ నిర్వహించారు. పురుషులలాగే నాలుగేళ్లకు ఒకసారి టోర్నీ జరుగుతుంది. ఆతిథ్య దేశం మినహా మిగతా జట్ల ఎంపిక కోసం మూడేళ్ల పాటు క్వాలిఫయింగ్స్ నిర్వహిస్తారు. ఇప్పటి వరకు 7 మహిళా ప్రపంచ కప్‌లు జరిగాయి. ఇందులో మూడుసార్లు అమెరికా టైటిల్ గెలవగా... జర్మనీ రెండుసార్లు, నార్వే, జపాన్ ఒక్కోసారి విజేతలుగా నిలిచాయి. 2015లో కెనడాలో నిర్వహించిన వరల్డ్ కప్‌లో అమెరికా చాంపియన్ అయింది. 2019 ప్రపంచకప్‌కు ఫ్రాన్స్ ఆతిథ్యం ఇవ్వనుంది.
నాడు గొప్ప.. నేడు!
97. ఫిఫా తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం. గత కొన్నేళ్లలో ఎప్పుడూ వందకు చేరువలో రాని మన ప్రదర్శనతో పోలిస్తే ఇది మెరుగైన ర్యాంక్ అనే చెప్పాలి. క్రికెట్ మాయలో పడి మన దేశంలో ప్రాభవం కోల్పోయిన ఎన్నో ఆటల్లో ఫుట్‌బాల్ కూడా ఒకటి. 1950, 60వ దశకాల్లో భారత జట్టు ఆసియాలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ టీమ్‌లలో ఒకటిగా నిలిచింది. 1951, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించిన మన జట్టు 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం మన అత్యుత్తమ ఘనత. అనేక మంది ఆటగాళ్లు తమ వ్యక్తిగత ప్రదర్శనతో అప్పట్లో అందరినీ ఆకర్షించారు. అయితే ఆ తర్వాత 1970 నుంచి మన తిరోగమనం వేగంగా సాగింది. బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి తదితర స్టార్లు మాత్రమే కొన్ని సార్లు అద్వితీయ ప్రదర్శనతో మెరిసి భారత్ బయట కూడా తమదైన గుర్తింపు తెచ్చుకోగలిగారు.
బెంగాల్‌లో భలే... భలే...
దేశంలో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఫుట్‌బాల్‌కు వీరాభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఎక్కువగా బెంగాల్ రాష్ట్రంలో ఆట చురుగ్గా కొనసాగుతోంది. ముఖ్యంగా కోల్‌కతాలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లు గత ప్రాభవాన్ని కొనసాగిస్తున్నాయి. భారత్‌లో ఏడు ఈశాన్య రాష్ట్రాలు కూడా ఫుట్‌బాల్‌ను బతికిస్తున్నాయి. ఇటీవల మిజోరాంలోని ఐజ్వాల్‌లో అండర్–14 స్థాయి సెలక్షన్స్ నిర్వహిస్తే ఏకంగా 811 మంది హాజరయ్యారు. దేశంలో 3 శాతం జనాభా లేని ఈ ప్రాంతం నుంచి భారత ఫుట్‌బాల్‌లో 20 శాతంకు పైగా ఆటగాళ్లు వస్తున్నారు. ఇంకా బాలీవుడ్, క్రికెట్ సరిగా చేరని ఆ రాష్ట్రాల్లో అందరికీ ఏకైక వినోదం ఫుట్‌బాల్ మాత్రమే అని విశ్లేషకుల అభిప్రాయం. వారి దృఢమైన శరీర నిర్మాణం, ఎంత ఎత్తుకు పరుగెత్తినా ఇబ్బంది పెట్టని బలమైన ఊపిరితిత్తులు కూడా ఈ ఆటను ఎంచుకునేలా చేస్తున్నాయి. సిక్కిం నుంచి వచ్చిన బైచుంగ్ భూటియా వీరందరికీ ఆదర్శం.
మన ఘనమైన గతం...
ఒకప్పుడు హైదరాబాద్‌లో కూడా ఫుట్‌బాల్ అద్భుతంగా రాజ్యమేలింది. మొత్తం 16 మంది హైదరాబాదీలు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా 25 మంది అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ఆడారు. 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో 9 మంది హైదరాబాదీలు ఉండటం విశేషం. జుల్ఫిఖరుద్దీన్, బలరామ్, పీటర్ తంగరాజ్, మొహమ్మద్ సలామ్, లతీఫ్, అహ్మద్ హుస్సేన్, అజీజ్, నూర్ మొహమ్మద్‌లు ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగారు. ఈ జట్టుకు మరో దిగ్గజం రహీం సాబ్ కోచ్‌గా వ్యవహరించారు. అయితే 80ల నుంచి పరిస్థితి నానాటికీ దిగజారుతూ వచ్చింది. నగరంలో ప్రతిష్టాత్మక రహీం లీగ్ నిర్వహణ ఆగిపోవడంతో కొత్త ప్రతిభను గుర్తించే అవకాశమే లేకుండా పోయింది. 2000 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ సంఘంలో వచ్చిన చీలికలు, గొడవల కారణంగా ఫుట్‌బాల్ దాదాపుగా చచ్చిపోయింది.
ఆహ్వానంతోనే ఆఖరు...
వరల్డ్ కప్ వచ్చిన ప్రతీసారి మన భారత్ ఉంటే బాగుండేది అనుకోవడం లేదంటే మన జట్టు ఒక్కసారైనా ఆడగలదా అని ఆశపడటం సగటు ఇండియన్ ఫ్యాన్‌కు అతి సహజం. అయితే 68 ఏళ్ల క్రితం 1950 ప్రపంచకప్‌లో తొలిసారి భారత్‌కు ఆడే అవకాశం దక్కింది. కానీ మన టీమ్ మాత్రం టోర్నీలో పాల్గొనలేకపోయింది. దీనికి సంబంధించి అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అరుదైన అవకాశానికి సంబంధించిన విశేషాలు మాత్రం ఆసక్తికరం. రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన బీభత్సం తర్వాత జరిగిన తొలి ప్రపంచ కప్‌ను 1950లో బ్రెజిల్‌లో నిర్వహించారు. కాబట్టి ఎక్కువ సంఖ్యలో దేశాలు ఆసక్తి చూపించలేదు. ఫలితంగా క్వాలిఫయింగ్‌లో ఇప్పుడున్న తరహాలో 210 దేశాలు కాకుండా 33 జట్లే పోటీ పడ్డాయి. అప్పట్లో ఫిఫా ర్యాంకింగ్ వ్యవస్థ లేదు. గ్రూప్‌లు నిర్ణయించే విషయంలో ఫిఫా భౌగోళిక సౌలభ్యాన్ని కూడా లెక్కలోకి తీసుకుంది. దాంతో మన జట్టు క్వాలిఫయింగ్‌లో బర్మా, ఫిలిప్పీన్స్‌ల గ్రూప్‌లో నిలిచింది. ఆ రెండు జట్లు తప్పుకోవడంతో భారత్ ఆటోమెటిక్‌గా అర్హత సాధించింది. అయితే చివరి నిమిషంలో టోర్నీ నుంచి భారత్ తప్పుకుంది. ఏఐఎఫ్‌ఎఫ్ (అఖిల భారత ఫుట్‌బాల సమాఖ్య) అధికారిక వివరణ ప్రకారం... జట్టు ఎంపికపై భేదాభిప్రాయాలు, తగినంత ప్రాక్టీస్ సమయం లేకపోవడం దీనికి కారణాలు.ఆ తర్వాత 1954లో కూడా మన జట్టు ఆహ్వానం తిరస్కరించడంతో చాలా ఏళ్ల పాటు ఫిఫా, ఏఐఎఫ్‌ఎఫ్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగింది. చివరకు అంతా సమసిన తర్వాత 1986లో మన జట్టు క్వాలిఫయింగ్ ఆడింది. అప్పటి నుంచి అన్నిసార్లూ బరిలోకి దిగినా... ఒక్కసారి కూడా అర్హత సాధించలేకపోయింది.
మండేలాను మెరిపించిన ఆట...
దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలాకు ఫుట్‌బాల్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయనకు ఈ ఆటంటే విపరీతమైన అభిమానం. అదే కారణంగా 2010 వరల్డ్ కప్‌ను దక్షిణాఫ్రికాలో నిర్వహించేందుకు మండేలా తీవ్రంగా కృషి చేశారు. ఇందులో సఫలమయ్యారు కూడా. 92 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉండి కూడా ఆ మెగా టోర్నీ ముగింపు ఉత్సవానికి హాజరై అభిమానులను అలరించారు. దక్షిణాఫ్రికాలో 2010 ప్రపంచ కప్ నిర్వహించబోతున్నట్లుగా ఫిఫా అధికారిక ప్రకటన చేసిన తర్వాత మండేలా భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘జనాలను ఏకం చేసి, వారిలో స్ఫూర్తి నింపే శక్తి క్రీడలకు ఉంది. ఆఫ్రికాలో సాకర్‌కు ఎంతో ఆదరణ, ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. అందుకే తొలిసారి దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ జరగడం ఎంతో ముఖ్యమని నేను భావించా. ఆతిథ్య దేశంగా మాకు అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. వరల్డ్ కప్‌ను అద్భుతంగా నిర్వహించి మా ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసేందుకు మనందరం శ్రమించాలి. సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటంలో దక్షిణాఫ్రికా ప్రజలు సహనంతో ఎలా ఉండాలో నేర్చుకున్నారు. ఎంతో కాలం వేచి చూసిన తర్వాత వరల్డ్ కప్ నిర్వహణకు ఫిఫా ఇచ్చిన అవకాశానికి తగిన విలువను చూపించాలి’ అని మండేలా అన్నారు.
– మొహమ్మద్ అబ్దుల్ హాది, కరణం నారాయణ
స్పోర్ట్స్ డెస్క్, సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment