మెస్సీ నా ఫేవరేట్
- కృతి సనన్
నాకు ఆటలంటే చాలా ఇష్టం. అందులోనూ ఫుట్‌బాల్ అంటే పిచ్చి. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్ట్రైకర్ మెస్సీకి నేను వీరాభిమానిని. మెస్సీ అర్జెంటీనాకు కప్ ఇస్తాడని కోరుకుంటున్నా. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నా’ అంటూ సాకర్ ఫీవర్ తనకెంతుందో చాటుకుంది క్యూట్‌గాళ్ కృతి సనన్. ఇలా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందో లేదో.. మహేష్ సరసన నటించే చాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. శుక్రవారం నగరంలో సందడి చేసింది. టిస్సాట్ వాచ్‌ల క్విక్‌స్టార్ వరల్డ్‌కప్ కలెక్షన్ ప్రారంభించింది.
ఈ సందర్భంగా ‘సిటీప్లస్’తో ముచ్చటిస్తూ టాలీవుడ్‌లో సక్సెస్ సాధించడమే తన లక్ష్యమని చెప్పింది. మొదటి సినిమా మహేష్‌తో కలసి చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చింది. మహేష్ అందగాడు మాత్రమే కాదు.. మంచి స్నేహశీలని కితాబిచ్చింది. ‘ సుధీర్‌వర్మ డెరైక్షన్‌లో నాగచైతన్య సరసన నటించబోతున్నా. తొందర్లోనే సెట్స్‌పైకి వెళ్తున్న ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అంటూ అప్‌కమింగ్ మూవీ ముచ్చట్లు వెల్లడించింది. వాచ్‌లు ధరించడం చాలా ఇష్టమన్న కృతి.. టిస్సాట్ వాచ్‌ల కలెక్షన్ మనసు దోచేసిందని మురిసిపోయింది.
- సుమన్