మూడు గోల్స్ చేసిన అర్జెంటీనా కెప్టెన్
సహచరులు రెండు గోల్స్ చేసేందుకు సహాయం
2026 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీ
బ్యూనస్ ఎయిర్స్: డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు 2026 ప్రపంచకప్ దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఏడో విజయం నమోదు చేసింది. బొలీవియా జట్టుతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. చీలమండ గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అర్జెంటీనా కెప్టెన్, స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మొత్తం 90 నిమిషాలు ఆడిన 37 ఏళ్ల మెస్సీ తన అద్భుతమైన ఆటతీరుతో అభిమానులను అలరించాడు.
మూడు గోల్స్‌తో మెరిసిన మెస్సీ (19వ, 84వ, 86వ నిమిషాల్లో) సహచరులు లా మారి్టనెజ్ (43వ నిమిషంలో), జూలియన్ అల్వారెజ్ (45+3వ నిమిషంలో) గోల్స్ చేసేందుకు సహాయపడ్డాడు. మెస్సీ అందించిన పాస్‌లతో మారి్టనెజ్, అల్వారెజ్ గోల్స్ సాధించారు. అర్జెంటీనా తరఫున అల్మాదా (69వ నిమిషంలో) మరో గోల్ చేశాడు.
మరో మ్యాచ్‌లో మాజీ విశ్వవిజేత బ్రెజిల్ 4–0 గోల్స్‌తో పెరూ జట్టును ఓడించింది. ఉరుగ్వే–ఈక్వెడార్ మ్యాచ్ 0–0తో ‘డ్రా’కాగా... పరాగ్వే 2–1తో వెనిజులాపై, కొలంబియా 4–0తో చిలీ జట్టుపై విజయం సాధించాయి. దక్షిణ అమెరికాకు చెందిన 10 దేశాలు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీపడుతున్న ఈ టోరీ్నలో అన్ని జట్లు 10 మ్యాచ్‌ల చొప్పున ఆడాయి. నిరీ్ణత 18 మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్–6లో నిలిచిన జట్లు 2026 ప్రపంచకప్ టోరీ్నకి నేరుగా అర్హత సాధిస్తాయి. 2026 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోరీ్నకి కెనడా, అమెరికా, మెక్సికో దేశాలు ఉమ్మడిగా ఆతిథ్యమివ్వనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment