* పేస్- నవ్రతిలోవా, భూపతి- సానియా జోడీల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు
కోల్‌కతా: టెన్నిస్ క్రీడను భారత్‌లో మరింత మందికి చేరువ చేసేందుకు నేటి (బుధవారం) నుంచి దిగ్గజ ఆటగాళ్లతో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. భారత టెన్నిస్‌ను విశ్వవ్యాప్తం చేసిన లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలతో పాటు అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఈ మ్యాచ్‌ల్లో అభిమానులను కనువిందు చేయనున్నారు.
వచ్చే నెల 2 నుంచి జరిగే అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) ప్రమోషన్‌లో భాగంగా జరుగుతున్న ఈ మూడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో మొదటిది కోల్‌కతాలో జరుగుతుంది. 26న రెండో మ్యాచ్ హైదరాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో, 27న చివరిది న్యూఢిల్లీలో జరుగుతుంది.
మ్యాచ్‌ల్లో పేస్‌తో కలిసి నవ్రతిలోవా బరిలోకి దిగుతుండగా మరో జంటగా భూపతి, సానియా ఆడనున్నారు. పేస్, మార్టినా గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు సాధించారు. అలాగే సానియా, భూపతి జోడి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకుంది.
నేటి నుంచి దిగ్గజాల సమరం
Published Wed, Nov 25 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM
Advertisement
Advertisement