Exhibition match
-
సానియా మీర్జా ఫేర్వెల్ మ్యాచ్.. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
విశ్వనాథన్ ఆనంద్‌తో తలపడనున్న ఆమీర్ ఖాన్.. ఎందుకో తెలుసా?
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, చెస్ మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ చదరంగం పోరులో ఎత్తుకు పైఎత్తు వేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 13న(ఆదివారం) సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఈ గేమ్ జరగనున్నట్లు chess.com ప్రకటించింది. ఈ గేమ్‌ను chess.com తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించింది. The moment you all have been waiting for! Superstar Aamir Khan, an ardent chess lover, will be playing an exhibition match against former world champion Vishy Anand! (@vishy64theking) Please feel free to donate generously to make this event a success. https://t.co/mgOmSwr54n pic.twitter.com/YFyK1oeka2 — Chess.com - India (@chesscom_in) June 7, 2021 'చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. చెస్ లవర్ అయిన సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్.. మాజీ ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వండి' అంటూ చెస్.కామ్ ట్వీటర్ ద్వారా పిలుపునిచ్చింది. గతంలో ఈ ఇద్దరూ చెస్ ఆడిన ఫొటోను ఓ అభిమాని కామెంట్స్‌లో షేర్ చేశాడు. ఇద్దరు పర్ఫెక్షనిస్ట్ల మధ్య సాగబోయే ఈ గేమ్ రసవత్తరంగా సాగబోతుందంటూ ఆ అభిమాని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, కోవిడ్‌పై పోరులో భాగంగా విరాళాలు సేకరించేందుకు ఇద్దరు ప్రముఖ పర్సనాలిటీల మధ్య గేమ్‌ను ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్‌కు చెక్‌మేట్ కోవిడ్ అనే పేరు పెట్టారు. కోవిడ్‌తో బాధపడుతున్న చెస్ ఆటగాళ్లు, వాళ్ల కుటుంబ సభ్యులకు ఆర్ధిక భరోసా ఇచ్చేందుకు ఈ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈవెంట్ జరిగే రోజు ఆమీర్ ఖాన్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఆనంద్‌తో చెస్ ఆడనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. చదవండి: టీమిండియా ప్రాక్టీస్ అదుర్స్.. ఈ పర్యటనలో ఇదే తొలిసారి -
సానియా-భూపతి జోరు
* తొలి మ్యాచ్‌లో పేస్ జోడి ఓటమి * నేడు హైదరాబాద్‌లో రెండో మ్యాచ్ కోల్‌కతా: ఐపీటీఎల్ ప్రమోషన్లో భాగంగా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా టెన్నిస్ దిగ్గజాలు భారత అభిమానులను అలరిస్తున్నారు. కోల్‌కతాలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో మహేశ్ భూపతి -సానియా మీర్జా జోడి 7-5, 7-5తో లియాండర్ పేస్ - మార్టినా నవ్రతిలోవాలపై నెగ్గింది. ముఖ్యంగా నవ్రతిలోవా 60 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఆడి అభిమానులను అలరించింది. అటు పేస్ కూడా చాలాకాలం తర్వాత సొంత నగరానికి రావడంతో ఉద్వేగానికి లోనయ్యాడు. నేడు హైదరాబాద్‌లో: టెన్నిస్ దిగ్గజాల రెండో ఎగ్జిబిషన్ మ్యాచ్ నేడు హైదరాబాద్‌లోని సానియా మీర్జా అకాడమీలో జరుగుతంది. మధ్యాహ్నం 3గంటల నుంచి ఈ మ్యాచ్‌ను డీడీస్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. -
నేటి నుంచి దిగ్గజాల సమరం
* పేస్- నవ్రతిలోవా, భూపతి- సానియా జోడీల మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు కోల్‌కతా: టెన్నిస్ క్రీడను భారత్‌లో మరింత మందికి చేరువ చేసేందుకు నేటి (బుధవారం) నుంచి దిగ్గజ ఆటగాళ్లతో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. భారత టెన్నిస్‌ను విశ్వవ్యాప్తం చేసిన లియాండర్ పేస్, మహేశ్ భూపతి, సానియా మీర్జాలతో పాటు అంతర్జాతీయ టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా ఈ మ్యాచ్‌ల్లో అభిమానులను కనువిందు చేయనున్నారు. వచ్చే నెల 2 నుంచి జరిగే అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) ప్రమోషన్లో భాగంగా జరుగుతున్న ఈ మూడు ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో మొదటిది కోల్‌కతాలో జరుగుతుంది. 26న రెండో మ్యాచ్ హైదరాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో, 27న చివరిది న్యూఢిల్లీలో జరుగుతుంది. మ్యాచ్‌ల్లో పేస్‌తో కలిసి నవ్రతిలోవా బరిలోకి దిగుతుండగా మరో జంటగా భూపతి, సానియా ఆడనున్నారు. పేస్, మార్టినా గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లు సాధించారు. అలాగే సానియా, భూపతి జోడి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకుంది.