సానియా-భూపతి జోరు | Not thinking of partnering Paes for Olympics now: Sania | Sakshi
Sakshi News home page

సానియా-భూపతి జోరు

Published Thu, Nov 26 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

సానియా-భూపతి జోరు

సానియా-భూపతి జోరు

* తొలి మ్యాచ్‌లో పేస్ జోడి ఓటమి    
* నేడు హైదరాబాద్‌లో రెండో మ్యాచ్
కోల్‌కతా: ఐపీటీఎల్ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా టెన్నిస్ దిగ్గజాలు భారత అభిమానులను అలరిస్తున్నారు. కోల్‌కతాలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో మహేశ్ భూపతి -సానియా మీర్జా జోడి 7-5, 7-5తో లియాండర్ పేస్ - మార్టినా నవ్రతిలోవాలపై నెగ్గింది.

ముఖ్యంగా నవ్రతిలోవా 60 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఆడి అభిమానులను అలరించింది. అటు పేస్ కూడా చాలాకాలం తర్వాత సొంత నగరానికి రావడంతో ఉద్వేగానికి లోనయ్యాడు.
 
నేడు హైదరాబాద్‌లో: టెన్నిస్ దిగ్గజాల రెండో ఎగ్జిబిషన్ మ్యాచ్ నేడు హైదరాబాద్‌లోని సానియా మీర్జా అకాడమీలో జరుగుతంది. మధ్యాహ్నం 3గంటల నుంచి ఈ మ్యాచ్‌ను డీడీస్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement