Pakistan
-
ఉగ్రవాదుల పాపాలు పండాయి
శ్రీనగర్: ఉగ్రవాదుల పాపాలు పండాయని, దేశంలో ఉగ్రవాదాన్ని తక్షణమే పెకిలించివేయాలని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. ఉగ్రవాదం ఆనవాళ్లు సైతం ఉండడానికి వీల్లేదని అన్నారు. ఉగ్ర విష భుజంగాలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై మన ప్రభుత్వం చేపట్టే ప్రతీకార చర్యలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. ఆయన శనివారం పహల్గాంలో పర్యటించారు. గత నెల 22న పర్యాటకులపై దాడి జరిగిన తర్వాత ఆయన ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ దాడికి పాల్పడిన ముష్కరులను, వారిని వెనుక ఉండి నడిపించిన కుట్రదారులకు నరకమే గతి అని స్పష్టంచేశారు. పహల్గాంలో పర్యాటకులను రక్షించే క్రమంలో ఉగ్రవాదులతో తలపడి ప్రాణాలు కోల్పోయిన అదిల్ షా కుటుంబాన్ని ఫరూఖ్ అబ్దుల్లా పరామర్శించారు. ముష్కరులు సాగించిన మారణకాండను తీవ్రంగా ఖండించారు. వారిపై నిప్పులు చెరిగారు. ‘‘ఇక్కడ 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరు రోజుల క్రితమే వివాహం జరిగిన ఓ నవ వధువు తన భర్తను పోగొట్టుకుంది. రక్తపు మడుగులో పడి ఉన్న తండ్రిని చూసి ఓ బిడ్డ బిగ్గరగా రోదించాడు. మారణకాండ చూసిన తర్వాత మాకు భోజనం సహించలేదు. మానవత్వాన్ని పొట్టనపెట్టుకున్న ఆ భూతాలు ఇప్పటికీ ప్రాణాలతో సంచరిస్తున్నాయి. వారు తమను తాము ముస్లింలం అని చెప్పుకుంటున్నారు. కానీ, వారు ముమ్మాటికీ ముస్లింలు కాదు. బాధితుల త్యాగాలు వృథా కావడానికి వీల్లేదు. ఉగ్రవాదుల పాపాల పుట్ట నిండిపోయింది. వారిపై తగిన ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. జమ్మూకశ్మీర్‌లో 35 ఏళ్లుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. కానీ, వారు ఎప్పటికీ విజయం సాధించలేరు’’ అని ఫరూఖ్ అబ్దుల్లా తేల్చిచెప్పారు. మానవత్వాన్ని హత్య చేసిన వారు నరకానికి తప్ప స్వర్గానికి వెళ్లలేరని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఆగిపోతేనే జమ్మూకశ్మీర్ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. పహల్గాం తరహా దాడులను తీవ్రంగా వ్యతిరేకించాలని స్థానికులకు పిలుపునిచ్చారు. భయపడితే మరణించినట్లే... పహల్గాంలో పలువురు పర్యాటకులతో ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. ఉగ్రదాడుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్భయంగా ఉండాలని సూచించారు. జమ్మూకశ్మీర్‌ను మధ్యలోనే వదిలివెళ్లొద్దని కోరారు. పర్యటన పూర్తి చేసుకోవాలని చెప్పారు. ఇక్కడికి మరెంతో మంది పర్యాటకులు రావాలని ఆకాంక్షించారు. ఎవరూ భయపడొద్దని అన్నారు. భయం అనేది చావుతో సమానమని వ్యాఖ్యానించారు. భయపడితే మరణించినట్లేనని పేర్కొన్నారు. -
దిగుమతులు బంద్
న్యూఢిల్లీ/శ్రీనగర్: పహల్గాం దుస్సాహసానికి ము ష్కరులను ప్రేరేపించిన దాయాదికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. పాకిస్తాన్ నుంచి దిగుమతులను పూర్తిగా నిషేధిస్తూ భారత్ శనివారం నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులకూ ఇది వర్తిస్తుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాక్‌లో ఉత్పత్తయ్యే, ఆ దేశం గుండా ఎగుమతయ్యే అన్ని రకాల వస్తువులు, ఉత్పత్తుల ప్రత్య క్ష, పరోక్ష దిగుమతులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేగాక పాక్ నౌకలకు భారత్‌లోకి అనుమతి నిషేధించింది. ఆ దేశానికి సముద్ర రవాణా మార్గాలను పూర్తిగా మూసేసింది. దీని ప్రభావం కూడా పాక్‌పై తీవ్రంగా ఉండనుంది. ఇక పాక్‌కు అన్నిరకాల పార్సిల్, పోస్టల్ సేవలను కూడా సంపూర్ణంగా నిలిపేశారు. ఈ నిర్ణయాలన్నీ తక్షణం అమల్లోకి వచ్చినట్టు కేంద్రం ప్రకటించింది. పాక్‌కు మన గగనతలాన్ని ఇ ప్పటికే మూసేయడం తెలిసిందే. అంతేగాక సింధూ జల ఒప్పందం నిలిపివేత, పాక్ పౌరులకు వీసాల రద్దు వంటి పలు కఠిన చర్యలు కూడా కేంద్రం ఇప్పటికే తీసుకుంది. దివాలా ముంగిట ఉన్న పాక్‌కు ఆర్థికంగా ప్రాణాధారం వంటి 700 కోట్ల ఐఎంఎఫ్ రుణాన్ని అడ్డుకునే ప్రయత్నాలకు కూడా పదును పెట్టింది. ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాక్‌ను గ్రే లిస్టులో చేర్చి రుణాలు, ఆర్థిక సాయాలు పూర్తిగా నిలిపేయాలని అంతర్జాతీయ సంస్థలకు శుక్రవారం విజ్ఞప్తి చేయడం తెలిసిందే. తద్వారా దాయాది ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేలా కేంద్రం వ్యూహరచన చేస్తోంది. దీనిపై పాక్ శనివారం గగ్గోలు పెట్టింది. రాజకీయ దురుద్దేశాలతోనే ఐఎంఎఫ్ రుణానికి భారత్ మోకాలడ్డుతోందంటూ ఆక్రోశించింది. దిగుమతులు అంతంతే పాక్ నుంచి దిగుమతుల నిషేధం ప్రభావం మనపై ఏమీ ఉండదు. పుల్వామా దాడుల నేపథ్యంలో 2019 నుంచే ఆ దేశంతో వాణిజ్య కార్యకలాపాలను భారత్ దాదాపుగా తగ్గించుకుంది. గతేడాది దాయాది నుంచి మనం దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ కేవలం 4.2 లక్షల డాలర్లు! ప్రధానంగా సేంద్రియ లవణంతో పాటు ఫార్మా ఉత్పత్తులు, పళ్ల వంటివి వీటిలో ఉన్నాయి. అదే సమయంలో పాక్‌కు మన ఎగుమతుల విలువ ఏకంగా 44.8 కోట్ల డాలర్లుగా ఉంది. పాక్ ఉత్పత్తులపై భారత్ ఇప్పటికే 200 శాతం విధిస్తోంది. పహల్గాం దాడి నేపథ్యంలో పాక్‌కు అన్ని ఎగుమతులనూ భారత్ ఇప్పటికే నిలిపేయడం తెలిసిందే. తొమ్మిదో రోజూ కాల్పులు సరిహద్దుల వెంబడి పాక్ దుశ్చర్యలు వరుసగా తొమ్మిదో రోజూ కొనసాగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం శనివారం కూడా కాల్పులకు తెగబడింది. వాటికి దీటుగా బదులిచి్చనట్టు సైన్యం ప్రకటించింది. పహల్గాంలో 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట సాగుతోంది. కశీ్మర్‌ను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. శనివారం శ్రీనగర్‌లో ఐదుచోట్ల ముమ్మర తనిఖీలు కొనసాగాయి. రెచ్చగొట్టేలా పాక్ క్షిపణి పరీక్షలుఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర దాడితో అసలే దెబ్బ తిన్న పులిలా ఉన్న భారత్‌ను మరింత రెచ్చగొట్టేలా పాక్ వ్యవహరిస్తోంది. ఉద్రిక్తతలు తారస్థాయికి చేరిన వేళ క్షిపణి పరీక్షలకు దిగింది. 450 కి.మీ. రేంజ్‌తో కూడిన అబ్దాలీ సర్ఫేస్ టు సర్ఫేస్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పరీక్షించినట్టు పాక్ సైన్యం శనివారం ప్రకటించుకుంది. పైగా, ఇది ‘సింధూ విన్యాసా’ల్లో భాగమంటూ గొప్పలకు పోయింది. ఇది అద్భుతమంటూ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్ సైన్యాన్ని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఉదంతంపై భారత్ మండిపడింది. దీన్ని కచ్చితంగా రెచ్చగొట్టే చర్యగానే పరిగణిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ‘సింధూ’ నిర్మాణాలను పేల్చేస్తాం పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలు ఇస్లామాబాద్: సింధూ నదీ వ్యవస్థపై భారత్ ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రేలాపనలకు దిగారు. వాటిని తమపై దురాక్రమణ చర్యగానే పరిగణిస్తామన్నారు. ‘‘నదీ జలాలను ఆపేస్తే మేం ఆకలిదప్పులతో అలమటిస్తాం. అందుకే అలాంటి పరిస్థితి రానివ్వబోం’’అని చెప్పుకొచ్చారు. సింధూ ఒప్పందం నిలిపివేతపై అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు. -
పాకిస్తాన్ ‘నీడ’ను దాచిపెట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ నీడలు ఎక్కడున్నా పసిగట్టే పనిలో పడింది కేంద్రం. ఈ క్రమంలోనే ఒక భారత జవాన్ దొరికేశాడు. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని, ఆ విషయాన్ని తెలియకుండా గుట్టుగా ఉంచాడు. ప్రత్యేకంగా ద సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు తెలియకుండా అత్యంత జాగ్రత్త పడ్డాడు.ఇప్పుడు విషయం బయటపడటంతో సదరు జవాన్ ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వచ్చింది. సీఆర్పీఎఫ్ 41 బెటాలియన్ కు చెందిన మునీర్ అహ్మద్.. పాకిస్తాన్ మహిళను వివాహం చేసుకుని దాన్ని సీక్రెట్ గా ఉంచడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయాన్ని సీఆర్పీఎఫ్ ధృవీకరించింది. దేశ భద్రతకు సంబంధించి నియమావళిని అహ్మద్ అతిక్రమించడంతో చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇలా చేయడం దేశ భద్రతకు అత్యంత హానికరం కావడంతోనే జవాన్ అహ్మద్ పై చర్యలు తీసుకోవాల్సినట్లు సీఆర్పీఎఫ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.పాక్ పంజాబ్‌కు చెందిన మినాల్ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్లైన్లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.పూర్తి కథనం కోసం కింద ఆర్టికల్‌ను క్లిక్ చేయండిభారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా -
ఉగ్రవాదుల్నే కాదు.. వారి మద్దతుదారుల అంతు కూడా చూస్తాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.ఈరోజు (శనివారం) అంగోలా అధ్యక్షుడు మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకోతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్పరెన్స్ లో పాల్గొన్న మోదీ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకో భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే.ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు అసువులు బాసిన నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ కు ఒకవైపు హెచ్చరికలు పంపుతూనే, ఏ క్షణంలో ఏం జరిగిన భారత బలగాలు సిద్ధంగా ఉండాలనే స్వేచ్ఛను కూడా వారికి అప్పగించింది. దాంతో పాకిస్తాన్ ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే అందుకు బదులు తీర్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది. -
పాకిస్థాన్ కు వరుస షాక్ లు ఇస్తున్న భారత్
-
మరింత అగ్గి రాజేసేలా.. పాక్ మంత్రి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
తీరుమార్చుకోని పాకిస్థాన్ మరోసారి బెదిరింపులకు దిగింది. సింధూ జలాలను మళ్లించే ఏ నిర్మాణమైనా పేల్చేస్తామంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి.. సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. పాక్ నేత చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మరింత అగ్గిని రాజేస్తున్నాయి.తాజాగా పాకిస్థాన్ ఓడలపై భారత్ నిషేధం విధించింది. పాకిస్థాన్ జెండా ఉన్న ఏ ఓడ కూడా భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలే తీసుకుంటోంది.అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేసింది. పాక్ నుంచి వాయు, ఉపరితల మార్గాల్లో వచ్చే మెయిల్స్, పార్సిళ్లపై ఆంక్షలు విధించింది. కాగా, భారత్‌లో ఉన్న పాక్ జాతీయులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలంటూ వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో 1960లో కుదిరిన సింధు జలాల నదీ ఒప్పందం నిలిపివేత నేపథ్యంతో భారత్‌ను ఉద్దేశించి పలువురు పాక్ నేతలు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. -
పాక్ ఓడలపై నిషేధం విధించిన భారత్
-
భారత్ పై బంగ్లాదేశ్ - పాకిస్తాన్ కుట్ర
-
ఆస్తుల్లో వీరెంత.. వారెంత..?
ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థానికంగా ఉన్న ఆర్థిక, సామాజిక పరిస్థితుల నేపథ్యంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వాటి ఉత్పత్తులకు ఆదరణ లభిస్తే అపార సంపద చేకూరుతుంది. ఈ నేపథ్యంలో భారతదేశం, పాకిస్థాన్ అత్యంత ప్రభావవంతమైన సీఈఓలను తయారు చేశాయి. సంపదలో హెచ్చుతగ్గులున్నా ఎవరి ప్రత్యేకత వారిదే. ఇరుదేశాలకు చెందిన ఈ సీఈఓలు తమ కంపెనీల లాభాలను పెంచడమే కాకుండా దేశ వ్యాపార ముఖచిత్రాలను మారుస్తున్నారు. భారత్, పాకిస్థాన్‌కు చెందిన టాప్ సీఈఓలు, వారి నికర ఆస్తులు, వారి పరిశ్రమల వివరాలు కింద తెలుసుకోవచ్చు.2025 లెక్కల ప్రకారం ఇండియాలోని టాప్ 5 సీఈఓలు.. వారి నికర ఆస్తులు1. ముఖేష్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్‌గా ముఖేశ్ అంబానీ ఉన్నారు. 110 బిలియన్ డాలర్ల (రూ.9.1 లక్షల కోట్లు) నికర విలువతో దేశంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. టెలికాం నుంచి గ్రీన్ ఎనర్జీ వరకు అన్ని రంగాలను అంబానీ శాసిస్తున్నారు.2. గౌతమ్ అదానీఅదానీ గ్రూప్ ఛైర్మన్‌గా గౌతమ్ అదానీ ఉన్నారు. ఆయన నికర సంపద 56.3 బిలియన్ డాలర్లు(రూ.4.75 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. దేశంలోని ప్రముఖ పోర్ట్స్ దగ్గర నుంచి పవర్ జనరేషన్ వరకు చాలా రంగాల్లో సేవలందిస్తున్నారు.3. సుందర్ పిచాయ్ఆల్ఫాబెట్ ఇంక్ సీఈఓ. 1.3 బిలియన్ డాలర్లు (రూ.10,800 కోట్లు) సమీకరించారు. తమిళనాడులో జన్మించిన సుందర్ పిచాయ్ గూగుల్ మాతృసంస్థకు నేతృత్వం వహిస్తూ కృత్రిమ మేధ, ఆన్లైన్ సెర్చ్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నారు.4. సత్య నాదెళ్లమైక్రోసాఫ్ట్ సీఈఓ. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సంస్థను ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ పవర్హైజ్గా మార్చారు. అతను 331 మిలియన్ డాలర్ల (రూ.2,750 కోట్లు) నికర విలువను కలిగి ఉన్నారు.5. ఫాల్గుణి నాయర్ఫాల్గుణి నాయర్ నైకా అనే బ్యూటీ అండ్ లైఫ్ స్టైల్ రిటైల్ కంపెనీకి సీఈఓ. ఫోర్బ్స్ ప్రకారం ఆమె భారతదేశపు అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా ఉన్నారు. ఆమె నికర ఆస్తుల విలువ 3.64 బిలియన్ డాలర్లు (రూ.30,300 కోట్లు).ఇదీ చదవండి: రోజూ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు..?పాకిస్థాన్‌లోని టాప్ 5 సీఈఓలు.. వారి నికర ఆస్తులు1. షాహిద్ ఖాన్పాకిస్థానీ-అమెరికన్ వ్యాపార దిగ్గజం ఫ్లెక్స్-ఎన్-గేట్ సీఈఓ షాహిద్ ఖాన్. 13.3 బిలియన్ డాలర్ల (రూ.1.1 లక్షల కోట్లు) సంపదతో పాక్‌లో ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. అతను ఎన్ఎఫ్ఎల్ జట్టు జాక్సన్ విల్లే జాగ్వార్స్, ఇంగ్లీష్ క్లబ్ ఫుల్హామ్ ఎఫ్‌సీలకు ఆధిపతిగా ఉన్నారు.2. మియాన్ ముహమ్మద్ మాన్షామాన్షా నిషాత్ గ్రూప్ ఛైర్మన్. 5 బిలియన్ డాలర్ల (రూ.41,500 కోట్లు) నికర విలువతో పాకిస్థాన్ తొలి బిలియనీర్ వ్యాపారవేత్త. అతని వ్యాపార సామ్రాజ్యం బ్యాంకింగ్, టెక్స్టైల్స్, సిమెంట్, విద్యుత్ ఉత్పత్తిలో విస్తరించి ఉంది.3. షాజియా సయ్యద్యూనిలీవర్ పాకిస్తాన్ సీఈఓ షాజియా సయ్యద్ నికర విలువ 5 మిలియన్ డాలర్లు (రూ.41 కోట్లు). ఆమె నాయకత్వంలో మహిళలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఎఫ్ఎంసీజీ పరిశ్రమలో సుస్థిరత, బ్రాండ్ నమ్మకాన్ని ప్రోత్సహించడంలో గుర్తింపు పొందారు.4. అసద్ ఉమర్ఎంగ్రో కార్పొరేషన్ మాజీ సీఈఓ. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా ఉన్న ఉమర్ విలువ 3 మిలియన్ డాలర్లు (రూ.25 కోట్లు) ఉంటుందని అంచనా.5. షోయబ్ సిద్ధిఖీజాజ్ పాకిస్థాన్ సీఈఓ షోయబ్ సిద్ధిఖీ. ఈయన సంపద 2 మిలియన్ డాలర్లు (రూ.16.5 కోట్లు). దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ సేవలు, మొబైల్ ఫైనాన్షియల్ ప్లాట్‌ఫామ్‌లను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. -
పాకిస్తాన్ ఓడలపై భారత్ నిషేధం
ఢిల్లీ: పాకిస్తాన్‌కు భారత్ వరుస షాకులిస్తోంది. ఇవాళ పాకిస్తాన్ ఓడలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆ నోటిఫకేషన్‌లో పాకిస్తాన్ జెండా ఉన్న ఏ ఓడ భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించవద్దని ఆదేశించింది. భారత ఓడలేవి పాకిస్తాన్ పోర్టుల్లోకి వెళ్ళొద్దని సూచించింది. భారత్ ఆస్తులను, కార్గో , మౌలిక సదుపాయాలను రక్షించే క్రమంలో ఓడరేవుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. పాకిస్తాన్ విమానాలకు ఇప్పటికే గగనతలం నిషేధం విధించింది భారత్. తాజాగా సముద్ర మార్గాన్ని సైతం బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా పాక్ అన్ని మార్గాల్లో నిషేధం విధిస్తూ అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నాల్ని భారత్ కొనసాగిస్తోంది. -
సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తివేత.. వరద భయంతో పాక్ గగ్గోలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ చినాబ్ నదిలో వరద ప్రవాహాం పెరుగుతుండడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు విడుదల చేశారు.చినాబ్‌లో నీటి ప్రవాహం డేంజర్ మార్క్‌కు చేరుకోవడంతో సలాల్ డ్యామ్ గేట్లు తెరిచారు జమ్మూకశ్మీర్ అధికారులు. దీంతో పాకిస్తాన్లో వరద భయాలు మరింత పెరిగిపోయాయి. భారత్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గేట్లు ఎత్తివేసిందంటూ పాక్ అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఇది వాటర్ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ తప్పుడు ప్రచారానికి దిగారు. అయితే, గత రెండు రోజులుగా జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బస్టర్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. వెరసీ సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తకపోతే వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తారు. -
పాకిస్థాన్ కు వరుస షాక్ లు ఇస్తున్న భారత్
-
బాంబు ఇవ్వండి.. పాకిస్తాన్ వెళ్తా..
-
పహల్గాం ఉగ్రదాడి: పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో షాక్
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఎగుమతులు, దిగుమతులపై నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావు దెబ్బ తీసే ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక, అనధికారిక దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే, ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు అమానుషంగా 26 మంది టూరిస్టుల ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్,పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి నుంచి వరుస కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్‌ను భారత్ దెబ్బకు దెబ్బ తీస్తోంది. ముందుగా సరిహద్దు దాటిన ఉగ్రవాదం అని పేర్కొంటూ సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ జాతీయుల అన్ని వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత గగనతలంలో పాక్ విమానాలపై నిషేధం విధించింది. భారత్‌లో పాక్ దేశ మీడియా,సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్ విధించింది. ఇప్పుడు పాకిస్తాన్‌పై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్న కేంద్రం పేర్కొంది. -
యుద్ధ భయంతో పాకిస్థాన్ లో హై అలర్ట్
-
భారత్ ను నిలువరించాలని అరబ్ దేశాలకు పాక్ విజ్ఞప్తి
-
మోదీ.. నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్‌పై దాడి చేస్తా: కర్ణాటక మంత్రి
బెంగళూరు: పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేసేందుకు తనకొక సూసైడ్ బాంబ్ (Suicide Bomb) ఇవ్వాలన్నారు. తాను ఆ బాంబును పాకిస్తాన్‌పై వేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బీజడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక ప్రజలపై జరిగిన అమానవీయ చర్య ఇది. పాకిస్తాన్ (Pakistan) ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి. బాంబ్ ఇస్తే దానిని తీసుకుని పాక్‌పై దాడి చేస్తాను. ఇలాంటి సమయంలో ప్రతీ భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Karnataka Minister BZ Zameer Ahmed Khan says, "...We are Indians, we are Hindustanis. Pakistan never had any relations with us. Pakistan has always been our enemy...If Modi, Amit Shah and the Central government let me, I am ready to go to battle. (02.05.2025) pic.twitter.com/HdYiZcYBIC— ANI (@ANI) May 3, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్ సైనిక విన్యాసాలకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్‌తో పాటు సుఖోయ్–30, ఎంకేఐ, మిరాజ్–2000, మిగ్–29, జాగ్వార్, సీ–130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్‌స్టిప్‌పై ల్యాండింగ్, టేకాఫ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది.📍Shahjahanpur: The Indian Air Force (IAF) is conducting take-off and landing exercises on the Ganga Expressway in Uttar Pradesh — even at night #GangaExpressway #aircraft #AirForce #IndiaPakistan #ind pic.twitter.com/nN8EyzpNQl— Geopolitics news (@rat92553) May 3, 2025పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వేలో జలాలాబాద్ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్టిప్‌పై శుక్రవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్జెట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే గా ఈ మార్గం నిలిచింది. అందుకు క్యాట్–2 ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్ సాధ్యమయ్యేలా ఎక్స్‌ప్రెస్ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్‌ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్‌నూ పరీక్షించారు.उत्तर प्रदेश: शाहजहांपुर (Indian Air Force)शाहजहांपुर Ganga Expressway पर भारत वायु सेना की Exercise जारी है।यहाँ राफेल जैसे युद्धक विमानों की भीड़ है। pic.twitter.com/khEHUDrCzD— Shubhangi Pandit (@Babymishra_) May 3, 2025 -
Magazine Story: పాకిస్తాన్ ని పాతరేస్తేనే ఉగ్రభూతం ముప్పు తొలిగేది!
-
భారత్ దెబ్బకు వణుకుతున్న పాక్
-
పాక్‌పై భారత్ దాడికి సాక్ష్యం ఏది?.. కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి తరుణంలో 2016లో పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ విషయమై కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి రుజువు చూపించాలని అడగటం తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతకు మరోసారి బీజేపీ కౌంటరిచ్చింది.వివరాల ప్రకారం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం తర్వాత పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్ సింగ్ చన్నీ మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడి తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం. దాడి వెనుక ఉన్న వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ హస్తం ఉంటే వారికి తగిన బుద్ది చెప్పాలని కోరుతున్నాం. కానీ, 2016లో పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్, 2019 బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి మాత్రం మాకు అనుమానాలు ఉన్నాయి. ఈ దాడుల విషయంలో గందరగోళం కనిపిస్తోంది. మన దేశంపై బాంబు వేస్తే మనకు తెలియదా?. పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించామని వారు అంటున్నారు. కానీ, అక్కడ ఇలాంటిదేమీ జరగలేదు. ఎవరూ దీని గురించి మాట్లాడలేదు. సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. దీనిపై నేను మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాను. మన దేశ ప్రజలకు అన్ని విషయాలు తెలియాలి’ అని కామెంట్స్ చేశారు.SICK!Rahul Gandhi's Congress continues to defend Pakistani terror!Now Charanjeet Singh Channi questions our forces.Why is Congress demoralising our forces at this critical time.Congress is taking orders directly from Pakistan!#PehalgamTerroristAttack pic.twitter.com/b2MIexdAQA— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) May 2, 2025ఇక, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తూ కౌంటరిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు మన దేశ సాయుధ దళాల పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలపై ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా స్పందిస్తూ..‘కాంగ్రెస్ మళ్లీ మన దేశ సైన్యాన్ని మరియు వైమానిక దళాన్ని ప్రశ్నించింది. సర్జికల్ స్ట్రైక్ జరిగిందని తాను నమ్మడం లేదని.. తనకు రుజువు కావాలని చన్నీ అన్నారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉందో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. వారు భారత సైన్యం, వైమానిక దళం అబద్ధాలు చెబుతున్నారని, పాకిస్తాన్ నిజం చెబుతోందని పదే పదే ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ స్వయంగా సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందని చెప్పినప్పటికీ వీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. సర్జికల్ స్ట్రైక్‌పై మీకు నిజంగా రుజువు కావాలంటే.. రాహుల్ గాంధీతో కలిసి చన్నీ.. పాకిస్తాన్ సందర్శించి దాడి ఎక్కడ జరిగిందో తనిఖీ చేయండి అంటూ కౌంటరిచ్చారు.మరోవైపు.. సదరు కాంగ్రెస్ ఎంపీ చన్నీకి బీజేపీ నుంచి కౌంటర్ రావడంతో ఆయన మాట మార్చారు. తాను సర్జికల్ దాడుల గురించి ఆధారాలు అడగలేదని మాట మార్చారు. అనంతరం, పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతు ఇస్తానని ప్రకటించారు. అయితే, ఆయన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. -
వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో
-
వణుకుతున్న దాయాది
ఇస్లామాబాద్/వాషింగ్టన్/శ్రీనగర్/న్యూఢిల్లీ: భార త ‘పహల్గాం ప్రతీకార’ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్ తదితర దేశాలకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శుక్రవారం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. పహల్గాం దాడితో పాక్‌కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటే పాడారు.పాక్‌లో చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్‌తో కూడా షహబాజ్ భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తమ పూర్తి మద్దతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ స్పష్టం చేశారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయమై నిర్ణాయక వ్యాఖ్యలు చేశారు. పాక్ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెదికి పట్టుకోవడంలో భారత్‌కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు.‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అవి రెండు అణుదేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే మా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం’’అని గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి సమయంలో వాన్స్ కుటుంబంతో పాటు భారత్‌లోనే ఉండటం తెలిసిందే. దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని బ్రిటన్ ఆకాంక్షించింది. పహల్గాం దాడిని హౌస్ ఆఫ్ లార్డ్స్ తీవ్రంగా ఖండించినట్టు పేర్కొంది. వాటిని నిరసిస్తూ బ్రిటన్‌లో కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్న వైనం కూడా సభలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. అదేమీ రహస్యం కాదు: బిలావల్ పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్పర్సన్ బిలావల్ భుట్టో కూడా అంగీకరించారు. మూడు దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించడం తెలిసిందే. దీనిపై స్కై న్యూస్ ఇంటర్వ్యూలో బిలావల్ ఈ మేరకు స్పందించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా, ‘అది పెద్ద రహస్యమేమీ కాదు. పాక్‌ది ఉగ్రవాద గతమే’’అంటూ పాక్ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు.‘‘ఉగ్రవాదం పాక్‌కే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పెనుబెడదగా పరిణమించింది. పాక్ దశలవారీగా ఉగ్రవాదానికి మద్దతిస్తూ వచ్చింది. మా సమాజం ఇస్లామీకరణ, సైనికీకరణ దశల గుండా సాగింది. వీటన్నింటివల్లా మేం నష్టపోతూ వచ్చాం. అయితే వాటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. సింధూ పరివాహక నదులకు భారత్ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన ఉద్దేశం అది కాదని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ‘‘నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మా ప్రభుత్వమే చెప్పింది. యుద్ధం జరిగితే పారేది రక్తమేగా. అదే నేనూ చెప్పా’’అన్నారు. మరోవైపు సింధూ జల ఒప్పందం నిలుపుదలను నిరసిస్తూ భారత్‌కు దౌత్య నోటీసులివ్వాలని పాక్ యోచిస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. హాకింగ్‌కు విఫలయత్నాలు పాక్ ప్రేరేపిత హాకర్ గ్రూపులు భారత వెబ్సైట్లపై శుక్రవారం మరోసారి భారీగా సైబర్ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హాక్ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్ గ్రూప్ హోక్స్1337, నేçషనల్ సైబర్ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘పాక్‌తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు, ఇండొనేసియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం’’అని తెలిపాయి. పహల్గాం దాడి నుంచీ ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్ హైబ్రిడ్ యుద్ధతంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు. ఐదు సెక్ట్టర్లలో కాల్పులుపాక్ వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్లో ఐదు జిల్లాల వెంబడి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖూ్నర్ ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే పాక్ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘తొలుత ఉత్తర కశ్మీర్లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదలైన కాల్పులు జమ్మూ ప్రాంతంలోని పూంచ్, అఖ్నూర్ సెక్టర్లకు విస్తరించాయి.అనంతరం నౌషేరాలోని సుందర్బనీ, జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పర్గ్వాల్ సెక్టర్లోనూ కాల్పులకు తెగబడ్డాయి. వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది’’అని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షితంగా తలదాచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కమ్యూనిటీ, వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.కథువా, సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఇంకా పంటకోతలు జరగాల్సి ఉంది. పాక్‌తో భారత్ 3,323 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 2,400 కి.మీ. మేరకు అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుంచి జమ్మూ దాకా విస్తరించింది. 740 కి.మీ. నియంత్రణ రేఖ, యాక్చ్యువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (ఏజీపీఎల్)తో పాటు మరో 110 కి.మీ. సియాచిన్ ప్రాంతంలో విస్తరించి ఉంది. -
పాక్‌పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి డజన్లకొద్దీ ముష్కరులను అంతమొందించిన భారత ఇప్పుడు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. అందులోభాగంగా విదేశీ నిధులను పాక్ సర్కార్ ఉగ్ర కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇతర చీకటి పనులను కేటాయిస్తోందని నిరూపించడం ద్వారా విదేశీ సాయం నిలిచిపోయేలా చేయాలని భారత్ యోచిస్తోంది.ఇందుకోసం ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)పై భారత్ తీవ్ర స్థాయిలో ఒత్తిడిచేయనుంది. ఈ టాస్‌్కఫోర్స్‌కు చెందిన ‘గ్రే’జాబితాలోకి చేరితే ఆయా దేశాలకు అంతర్జాతీయ సాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. దీనికితోడు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ద్వారా పాకిస్తాన్‌కు రాబోయే వందల కోట్ల విలువైన నిధులను అడ్డుకుని పాక్‌ను ఆర్థిక కష్టాల కడలిలో ముంచాలని మోదీ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో పాక్‌పై గ్రే లిస్ట్ కొరడా విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధికి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్ర సంబంధ కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్‌ను 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ తన గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాక్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్రకార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్‌చేసింది.దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్‌లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్‌కు విముక్తి లభించింది. ఇప్పుడు సైతం ఇలాగే పాకిస్తాన్‌ను గ్రే జాబితాలోకి చేర్చేలా ఎఫ్‌ఏటీఎఫ్‌పై మోదీ సర్కార్ ఒత్తిడిని పెంచింది. ఎఫ్ఏటీఎఫ్లో 40 సభ్యదేశాలున్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో జరుగుతాయి. ఈ జూన్ సెషన్లో ఈ మేరకు మద్దతు కూడగట్టేందుకు మిత్రదేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలెట్టినట్లు వార్తలొచ్చాయి. ఐఎంఎఫ్పైనా కేంద్రం ఒత్తిడిస్వదేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, తగ్గిపోయిన విదేశీ పెట్టుబడులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్తాన్ దేశ పాలన కోసం తరచూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థపై ఆధారపడుతోంది. దీంతో వచ్చే మూడేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. ఈ నిధులొస్తే పాక్ వాటిని ఉగ్రకార్యకలాపాలకు దుర్వినియోగం చేయనుందని భారత్ ఐఎంఎఫ్ ఎదుట ఆందోళన వ్యక్తంచేయనుంది. భారత వాదన నెగ్గితే ఈ నిధులు ఆగిపోవడమో, తగ్గిపోవడమో జరగొచ్చు. నిధుల విస్తరణపై మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, పాక్ ఉన్నతాధికారుల మధ్య తొలి సమీక్ష సమావేశం జరగనుంది.పాకిస్తాన్‌కు నిధుల మంజూరుపై పునరాలోచన చేస్తే మంచిదని ఇతర అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు, సంఘాలను సైతం భారత్ కోరబోతోంది. ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకు గాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్ణయించింది. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. -
Pahalgam : ఒక్కడి కుట్ర సంక్షోభంలోకి పాకిస్తాన్
-
పాక్ ప్రధాని యూట్యూబ్ ఛానల్ బ్యాన్
జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఘోరమైన ఉగ్రవాద దాడిపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ప్రధాన మంత్రి 'షెహబాజ్ షరీఫ్' యూట్యూబ్ ఛానెల్‌ను శుక్రవారం భారతదేశంలో బ్లాక్ చేశారు.కొన్ని రోజుల క్రితం భారత ప్రభుత్వం 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించిన తర్వాత ఈ ఖాతాలను బ్లాక్ చేశారు. వీటిలో డాన్ న్యూస్, సమా టీవీ, ఏఆర్వై న్యూస్ వంటి ప్రముఖ మీడియా సంస్థలు ఉన్నాయి. రెచ్చగొట్టే.. మతపరంగా సున్నితమైన కంటెంట్, తప్పుదారి పట్టించే కథనాలు మాత్రమే కాకుండా భారతదేశానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం ప్రసారం చేసినందుకు ఈ ఛానెల్‌లను నిషేధించారు.'షెహబాజ్ షరీఫ్' యూట్యూబ్ ఛానెల్‌ను బ్లాక్ చేయడంతో పాటు.. గాయకుడు అతిఫ్ అస్లాం, క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, బాబర్ ఆజం, నటుడు ఫవాద్ ఖాన్, హనియా అమీర్, మహిరా ఖాన్‌లతో సహా అనేక మంది పాకిస్తాన్ ప్రముఖుల ఇన్స్టాగ్రామ్ ఖాతాలు కూడా సస్పెండ్ చేశారు.పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగిన తరువాత.. భారత ప్రభుత్వం సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం మాత్రమే కాకుండా, అటారీ-వాఘా సరిహద్దును కూడా పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ గగనం తలంలో పాక్ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. -
పాక్ వెళ్లిపోవాలన్న కేంద్రం ఆదేశాలపై ఓ కుటుంబానికి సుప్రీంలో ఊరట
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితుల్లో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్ తారిక్ బట్ కుటుంబం కూడా తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. అయితే, వారు వేసిన పిటిషన్‌పై శుక్రవారం.. వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం.. ఆ కుటుంబానికి తాత్కాలిక ఊరటనిచ్చింది. వీసా గడువు ముగిసినా వీరు ఇంకా భారత్‌లోనే ఉన్నట్లు తేలింది. ఆ కుటుంబం కశ్మీర్లో ఉండగా.. కుమారుడు బెంగళూరు యాక్సెంచర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తాము భారత జాతీయులమేనని అయినా మమ్మల్ని అరెస్టు చేశారంటూ వాదనలు వినిపించారు. తమ వద్ద అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ ఉన్నాయని కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఈ కుటుంబంలో ఒకరు పాకిస్థాన్‌లో జన్మించినా.. ఆ తర్వాత భారత్‌కు వలసవచ్చి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఈ అంశంలో ధ్రువీకరించాల్సిన అంశాలున్నాయని.. ఈ పిటిషన్ దాఖలు చేయడంలోనే లోపాలున్నాయని పేర్కొంది. దీని మెరిట్‌పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా పిటిషన్‌ను కొట్టేస్తున్నామన్న ధర్మాసనం.. అధికారులకు ఓ సూచన చేసింది. ఏ నిర్ణయం తీసుకోబోయే ముందైనా.. వారు చూపుతున్న పత్రాలను ధ్రువీకరించాలని.. ఈ కేసులో ఉన్న కొన్ని విచిత్ర పరిస్థితుల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకొనేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల చర్యలతో సంతృప్తి లేకపోతే పిటిషనర్లు జమ్మూకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించవచ్చంటూ కూడా ధర్మాసనం సూచించింది. -
ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది స్వదేశంలో (సెప్టెంబర్) జరగాల్సిన ఆసియా కప్‌ను రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ టోర్నీలో పాకిస్తాన్ పాల్గొనాల్సి ఉండటంతో ఈ మేరకు నిర్ణయించినట్లు ఓ ప్రముఖ వార్త సంస్థ తెలిపింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.🚨 LIKELY NO ASIA CUP 2025 🚨- Asia Cup 2025 remains under a cloud because of the terror attack in Pahalgam. (Sahil Malhotra/TOI). pic.twitter.com/dji5zdwc5T— Tanuj (@ImTanujSingh) May 2, 2025కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్, పాక్ సహా 8 జట్లు పాల్గొనాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగుతుందని ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) నిర్ణయించింది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగాల్సి ఉంది. ఈ టోర్నీకి భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. హాంగ్‌కాంగ్, ఒమన్, యూఏఈ 2024 ఏసీసీ ప్రీమియర్ కప్ ద్వారా క్వాలిఫై అయ్యాయి.🚨 NO INDIA-BANGLADESH SERIES 🚨- Team India Unlikely to tour Bangladesh for the White ball series in August due to cross border tension. (Sahil Malhotra/TOI). pic.twitter.com/qsBdZO7ccE— Tanuj (@ImTanujSingh) May 2, 2025బంగ్లాదేశ్ పర్యటన కూడా రద్దు..?అక్రమ చోరబాట్లు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ బంగ్లాదేశ్ పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకోనుందని సమాచారం. ఎఫ్టీపీ ప్రకారం ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ పర్యటన రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.షెడ్యూల్ ప్రకారం టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనలో 3 వన్డేలు, 3 టీ20లు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనలో తొలుత వన్డే సిరీస్ జరుగనుంది. ఆగస్ట్ 17న తొలి వన్డే, 20న రెండో వన్డే ఢాకా వేదికగా జరగాల్సి ఉంది. ఆతర్వాత ఆగస్ట్ 23న మూడో వన్డే, 26న తొలి టీ20 చట్టోగ్రామ్‌లో జరగాల్సి ఉన్నాయి. చివరి రెండు టీ20లు ఆగస్ట్ 29, 31 తేదీలోల ఢాకాలో జరగాల్సి ఉన్నాయి.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో భారత్ పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. పాక్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ల రద్దును కొనసాగించింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను బ్యాన్ చేసింది. పాక్‌కు అప్పు ఇవ్వొద్దని ఐఎంఎఫ్‌కు సూచించింది. -
పాకిస్తాన్ అండతోనే ఉగ్రదాడి నిజం ఒప్పుకున్న సానుభూతిపరుడు
-
పహల్గాం ఉగ్రదాడులకు పాకిస్థాన్ లోనే ట్రైనింగ్.. సాక్ష్యాలు ఇవే!
-
కమ్ముకున్న యుద్ధ మేఘాలు.. పాక్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో భారత్ ఫైటర్ జెట్లు
లక్నో: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్‌కు కేవలం వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఫైటర్ జెట్లు విన్యాసాలు చేయడం చర్చాంశనీయంగా మారింది.ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నయుద్ధ విమానాల్లో రాఫెల్, మిగ్-29, మిరాజ్ 2000 ఉన్నాయి. ఈ యుద్ధ విమానాల్ని రాత్రి వేళ్లల్లో ల్యాండ్ చేసేలా అందుబాటులోకి తెచ్చిన యూపీ షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించిన నైట్ ల్యాండింగ్ స్ట్రిప్‌పై విన్యాసాలు ప్రదర్శిస్తున్నాయి. 3.5 కిలోమీటర్ల పొడవు గల ఈ ఎయిర్‌స్ట్రిప్ రాత్రి సమయంలో ఫైటర్ జెట్లు ల్యాండింగ్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ జెట్లు 24 గంటలూ ఆపరేషన్లకు వీలు కల్పించడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రత్యామ్నాయ రన్‌వేగా ఉపయోగించగల సామర్థ్యాన్ని అంచనా వేయడంలో సహాయపడుతుంది.దీంతో, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం నాలుగు ఎక్స్‌ప్రెస్‌వే ల్యాండింగ్ స్ట్రిప్‌లు అందుబాటులో ఉండగా.. షాజహాన్పూర్లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండింగ్ స్ట్రిప్ మాత్రమే రాత్రివేళల్లో ఫైటర్ జెట్లను ల్యాండ్ చేసుకోవచ్చు. ఈ ఆధునిక ఎయిర్‌స్ట్రిప్ ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించబడిన భారత్‌లో తొలి రన్‌వేగా నిలిచింది. ఇది రాత్రింబవళ్ళూ మిలిటరీ ఆపరేషన్లకు అనుకూలంగా రూపొందించింది. భద్రతను నిర్ధారించేందుకు రన్‌వే ఇరుప్రక్కల 250 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. Indian Air Force jets are carrying out a flypast on the Ganga Expressway airstrip.3.5 kms long airstrip is India’s first night landing airstrip on an expressway - night landing trials scheduled today evening. pic.twitter.com/AaJt9RoTEv— The Uttar Pradesh Index (@theupindex) May 2, 2025గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఎయిర్‌స్ట్రిప్‌పై ల్యాండింగ్ చేసే ఇండియన్ ఎయిర్స్ యుద్ధ విమానాల ప్రత్యేకతలు రాఫెల్: ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, లాంగ్-రేంజ్ మీటియర్ క్షిపణులతో నిండి ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా సరే 100 కిలో మీటర్ల నుంచి 150 కిలోమీటర్ల శత్రు స్థావరాల్ని నేలమట్టం చేయడంలో దిట్టఎస్‌యు-30 ఎంకేఐ: ఇండియా-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ట్విన్-సీటర్ యుద్ధవిమానం. ఈ ఎస్‌యూ-30 ఎంకేఐ దూరంలో ఉన్న లక్ష్యాల్ని దాడులు చేయగలిగే సామర్థ్యంతో పాటు బ్రహ్మోస్ వంటి క్షిపణులను మోసుకెళ్లగలదు.మిరాజ్ 2000: ఫ్రెంచ్ మూలాలున్న, హై-స్పీడ్ డీప్ స్ట్రైక్ మిషన్స్‌కు అనువైన యుద్ధవిమానం, ఇది అణ్వాయుధ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఫిబ్రవరి 2019లో జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను వినియోగించింది.మిగ్-29: వేగం, ఎత్తు పరంగా అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రాడార్ల కళ్లుగప్పి శుత్రు స్థావరాల్ని నాశనం చేస్తుంది. జాగ్వార్: గ్రౌండ్ అటాక్, యాంటీ-షిప్ మిషన్ల కోసం రూపొందించబడిన ప్రిసిషన్ స్ట్రైక్ ఎయిర్‌క్రాఫ్ట్. దీని ప్రత్యేకతలు.. శత్రు నౌకలను గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, నాశనం చేస్తుంది. ఈ యాంటీ-షిప్ మిషన్లు సాధారణంగా విమానాలు, జలాంతర్గాములు, ఉపరితల నౌకలు లేదా నావికా ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తారు. సి-130 జె సూపర్ హెర్కులిస్: హెవీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, స్పెషల్ ఫోర్స్ మిషన్లు, విపత్తు సహాయం, రక్షణ కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తుంది.ఏఎన్-32: ఎత్తైన ప్రాంతాల్లో సైనికులు, సరఫరాలు తరలించేందుకు అనుకూలమైన ట్రాన్స్పోర్ట్ విమానం.ఎంఐ-17 వి5 హెలికాప్టర్: సెర్చ్ అండ్ రిస్క్యూ, మెడికల్ ఎవాక్యుయేషన్, మానవతా సహాయం వంటి బహుళ పనుల కోసం ఉపయోగించే హెలికాప్టర్. -
నిప్పుతో చెలగాటం
-
పహల్గాం ఉగ్రదాడిపై విస్తుపోయే వాస్తవాలు.. NIA చేతికి చిక్కిన కీలక ఆధారాలు
ఢిల్లీ : జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పహల్గాం ఉగ్రదాడి ఆర్మీ, లష్కరే తోయిబా కన్నుసన్నల్లో జరిగినట్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) నిర్ధారించింది. పహల్గాం ఉగ్రదాడిలో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాక్ ఐఎస్ఐ,ఉగ్రసంస్థ లష్కరే తోయిబాలు కలిసి ఈ కిరాతక దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ తేల్చింది. పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా ఆఫీస్‌లో పహల్గాం ఉగ్రదాడికి కుట్ర జరిగినట్లు ప్రాథమిక నివేదికల్లో పేర్కొంది.ఇక పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల్ని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. షమీమ్ మూసా అలియాస్ అస్మీన్ మూసా,అలీబాయ్ అలియాస్ తల్హా నేరుగా ఉగ్రదాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఎన్ఐఏ దర్యాప్తు.. శాటిలైట్ ఫోన్ల వినియోగంపాకిస్తాన్ పౌరులైన ఆ ఇద్దరు ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి కొన్ని వారాల ముందు భారత్ భూభాగంలోకి ప్రవేశించినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. వారికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWs) సహాయం చేసినట్లు నిర్ధారించింది. అదే సమయంలో పహల్గాంలో కాల్పులు జరిగిన ప్రాంతంలో ఎన్ఐఏ ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ డేటా సేకరించింది. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న 40కి పైగా తుపాకుల బాలిస్టిక్, కెమికల్ టెస్టులు జరిపేందుకు ల్యాబ్‌కు పంపింది. 3డీ మ్యాపింగ్ సాయంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ తీరును గుర్తించేందుకు లేజర్ స్కానర్ల సాయంతో త్రీడీ మ్యాపింగ్ చేసింది. ఈ 3డీ మ్యాపింగ్ సాయంతో కాల్పుల జరిగే సమయంలో ఉగ్రవాదులు పొజీషన్‌తో పాటు టూరిస్టులు ఎలా కుప్పకూలారు. బ్లడ్ శాంపిల్స్, కాల్పులు జరిగినప్పుడు బుల్లెట్ల నుంచి వెలువడ్డ రసాయనాలు వంటి వాటిని సేకరించారు. లోయ చుట్టూ ఉన్న మొబైల్ టవర్ల నుండి డంప్ డేటాను కలెక్ట్ చేశారు. ఈ డేటా ఆధారంగా ఉగ్రదాడి ముందు రోజుల్లో కాల్పులకు తెగ బడ్డ ప్రదేశం నుంచి శాటిలైట్ ఫోన్లను వినియోగించారని, ముఖ్యంగా బైసరీన్, దాని చుట్టు పక్కల ప్రదేశాల్లో కనీసం మూడు శాటిలైట్ ఫోన్లను నిందితులు వినియోగించగా.. రెండు శాటిలైట్ ఫోన్ల సిగ్నల్స్‌ను గుర్తించారు. 2,800 మందిని విచారించి ఉగ్రదాడిపై మొత్తం 2,800 మందికి పైగా ఎన్ఐఏ, భద్రతా సంస్థలు ప్రశ్నించాయి. మే2 నాటికి మరో 150 మందిని విచారించేందుకు కస్టడీలోకి తీసుకున్నాయి. వీరిలో అనుమానిత ఓజీడబ్ల్యూ, జమాత్-ఇ-ఇస్లామి వంటి నిషేధిత గ్రూపులు, హురియత్ కాన్ఫరెన్స్‌లోని వివిధ వర్గాలతో సంబంధాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు.ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఉగ్రవాద సంస్థలు, తిరుగుబాటు గ్రూపులకు సాయుధ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనకుండా లాజిస్టికల్, ఆర్థిక సమాచార సహాయాన్ని అందించే వ్యక్తులను ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (OGWలు) అంటారు.కార్ట్రిడ్జ్ అంటేకాల్పులు జరిపిన తరువాత మిగిలి ఉన్న మందుగుండు సామాగ్రి భాగాన్ని కార్ట్రిడ్జ్ అంటారు. వాటిల్లో బుల్లెట్లు,మందుగుండు సామగ్రిలో చేర్చే షెల్, గన్ పౌడర్, గన్‌లో ఉండే బులెట్లను మండించే ప్రైమర్ల అనే భాగాలున్నాయి. -
Pahalgam tragedy ఐక్యంగా నిలబడటం మనకు తెలుసు
సిసలైన ఉద్వేగాలు సాటి మనుషులకు అర్థమవుతాయి. ఉద్వేగాలలోని నిజాయితీ ఉద్దేశాలలో ఉండదు. ‘పహల్గామ్’ ఘటన తరువాత ఏర్పడిన ఉద్వేగాలనూ, ఉద్దేశాలనూ కాస్త ముందు వెనుకలుగా వేరు చేసి మనమంతా ఒక్కటిగా శత్రువును ఎదుర్కొందాం అనే సందేశాన్ని ఇవ్వడంలో దేశవాసులు దాదాపు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అయితే అదంత సులువు కాలేదు. ఉద్దేశాలున్నవారు వాట్సప్‌లలో మునివేళ్లను కదిలించినంత వేగంగా ఉద్వేగాలున్నవారు కదిలించలేకపోయారు. అయినప్పటికీ వేగంగా మేలుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారన్న వార్త వినగానే ముందు మనిషిగా, తర్వాత ముస్లింగా ఎంతో బాధను, ఆందోళనను అనుభవించాను. దేశంలోని కోట్ల ముస్లింలు ఇటువంటి పాశవిక దాడికి తీవ్రంగా నాలాగే బాధ పడ్డారు. మతం అడిగి ఇలాంటి దాడి చేశారన్న వార్త వారిని వేదనలో, విషాదంలో ముంచెత్తింది. ఈ తీవ్ర ఘటన తాలూకు విషాదాన్ని అనుభవించాలా, లేకుంటే తమకు ఏ సంబంధమూ లేకపోయినా జరిగే విద్వేష ప్రచారానికి కలత పడాలా అనే ఆందోళనలో వారు తల్లడిల్లారు. అయితే ఎవరైతే చావు నోటి వరకూ వెళ్లి వచ్చారో వారే ఈ పరిస్థితిని కుదుట పరచగలిగారు. మానవీయత ఉన్న కశ్మీరీలు తమ ప్రాణాలకు వారి ప్రాణాలను ఎలా అడ్డు పెట్టి కాపాడారో చెప్పిన కథనాలు దేశ ప్రజలకూ, ముఖ్యంగా ముస్లింలకూ ఊరటనిచ్చాయి. కశ్మీర్ విషయంలో భారత్–పాకిస్తాన్లల మధ్య చాలాకాలంగా సాగుతున్న వైరం లెక్కలేనంత మందిని బలిదీసుకున్నా గత దాడులన్నీ సైన్యంపై జరిగితే, ఈసారి పర్యాటకులపై హిందూ మతం పేరిట జరిగింది. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, కశ్మీర్‌ను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ఈ ఉగ్రచర్యకు పాల్పడినవారు, వారికి ఆర్థిక సాయం అందింనవారు, స్పాన్సర్లు... పహల్గామ్ అమాయకుల ప్రాణాలను బలిదీసుకోవడంలో పాత్ర పోషింనవారే. వారందరినీ ఈ దాడికి జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి. మతం అడగడం సిగ్గుచేటుప్రపంచంలోని ఏ మతగ్రంథం కూడా ప్రజలను చంపమని చెప్పలేదు. ఈ ఉగ్రదాడిలో బాధితుడి మతాన్ని అడగడం, అతను హిందువా, ముస్లిమా అని గుర్తించడానికి కల్మా పఠించమనడం సిగ్గుచేటు. శాంతిని కోరే భారతీయ ముస్లింలు ఇలాంటి నీచత్వాన్ని ఏ మాత్రం హర్షించరు. నిజమైన మానవుడంటే ప్రాణాలను కాపాడేవాడే కానీ ప్రాణాలను తీసేవాడు కాదు. ఖురాన్‌లోని సూరహ్ అల్–మాయిదా వచనం 5:32 ‘ఒక అమాయకుడిని చంపేవాడు మొత్తం మానవాళిని చంపినట్లే’ అని చెబుతుంది. ఈ సూర కరుణ, సానుభూతి, బలహీనుల రక్షణను ప్రోత్సహిస్తుంది. తాను ముస్లిం అని చెప్పుకొనే వ్యక్తి ఈ భూమిపై ఏ మానవుడినీ చంపడు.భారతదేశ ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు కాదు. భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల శరణార్థులను స్వీకరించిందే తప్ప, ఈ దేశం నుండి ఏ వ్యక్తిని ఇతర ప్రాంతాలకు శరణార్థిగా పంపలేదు. అదే ఈ దేశానికున్న ఘనత. ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రేమగల దేశం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న ముస్లింలతో పోలిస్తే భారతదేశంలో ముస్లింలకు అత్యున్నత గౌరవం, రక్షణ దొరుకుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇక్కడి ముస్లింల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మతాన్నీ కలవరపెట్టకుండా, ద్వేషించకుండా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రసంగాలు, మీడియా వ్యాఖ్యలను ఒక తటస్థ స్థితికి తేవాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు, ముస్లిం, హిందూ మతాధికారులు, అన్ని మత పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం కావాలి. అన్ని మతాలను ప్రేమించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి విలువలను తీసుకురావాలి. ప్రభుత్వాన్నో, ఫలానా రాజకీయ పార్టీనో విమర్శించి చేతులు దులుపుకోకుండా ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత.చదవండి: అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మీడియా దేశంలోని భిన్నవర్గాలను బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ పార్టీలు, మతాల పేరుతో వర్గాలను విభజించకూడదు. ముస్లింల వల్లే తాము బతికి ఉన్నామని చెప్పిన బాధితుల కుటుంబాల మాటలను మీడియా కూడా ప్లే చేయాలి. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదు. పౌర హక్కులు, మానవ హక్కుల కార్యకర్తల్లాగే ఇప్పుడు మతస్వేచ్ఛ కార్యకర్తలు అవసరం. మత విద్వేషాన్ని ఆపేందుకు వారి తోడ్పాటు కావాలి. ఇదీ చదవండి: ముద్దుల మూట, మనసెలా వచ్చింది : వైద్యురాలి వీడియో వైరల్భారత్–పాక్ అణుశక్తిని కలిగి ఉన్న దేశాలు. ఒకసారి యుద్ధం మొదలైందంటే ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అందుకే యుద్ధకాంక్షను ఆపి, శాంతి వైపు చర్చలు జరపాలి. స్నేహపూర్వక దేశాలతో కూర్చుని ఈ సమస్యను పరిష్కరించాలి. యుద్ధమనేది అంతిమ పరిష్కారం. ఉగ్రదాడిలో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరులకు వందనం చేద్దాం. భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవుల మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు. బయట శత్రువు కన్నెత్తి చూస్తే ఈ దేశంలోని అన్ని మతాల వారు ఐక్యమై సింహాల్లా గర్జించగలరని చాటడమే ఇప్పుడు కావలసింది. జై భారత్. జై హింద్.భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవులు మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు.-జహారా బేగంవ్యాసకర్త సామాజిక కార్యకర్త, యూఎస్ఏ -
భారత్ వీడే పాక్ పౌరులకు నిబంధనలు సడలింపు
-
Air India: పాక్ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం
ఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాం భూతల స్వర్గం.. ఆ ప్రదేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్‌లోని ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో పాక్ సైతం భారత్‌పై పలు ఆంక్షలు విధించింది. పాక్ గగన తలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.ఆ నిర్ణయంతో ఎయిరిండియా సుమారు 600 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేదం కారణంగా విమానాల దారి మళ్లింపు, పెరిగిన ప్రయాణ దూరం, అదనపు ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ ఏడాది తమ సంస్థకు 591 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. గగనం తలంపై పాక్ తీసుకున్న నిర్ణయంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదని టాటా గ్రూప్‌కు చెందిన ఇతర విమానాల సర్వీసులపై ప్రభావం పడనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.ఉదాహరణకు ఇండిగో గురువారం న్యూఢిల్లీ-బాకు (అజర్బైజాన్లో) విమానం ఐదు గంటల 43 నిమిషాలు ప్రయాణించింది. పాక్ గగన తలం నుంచి కాకుండా దారి మళ్లించిన కారణంగా 38 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయానికి అదనంగా ఇంధనం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందించే ఇతర సర్వీసుల్లో సైతం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే, మిగితా విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా పలు ప్రపంచ దేశాలకు విమానాల రాకపోకలన్నీ పాకిస్తాన్ గగన తలం నుంచే నిర్వహిస్తుంది. పాక్ తాజా నిర్ణయం ఎయిరిండియాపై కాస్త ప్రతికూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ఢిల్లీ-మిడిల్ ఈస్ట్ విమానాలు ఇప్పుడు కనీసం ఒక గంట అదనంగా ప్రయాణించవలసి వస్తుంది, దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది.ఎయిరిండియా దాని బడ్జెట్ సర్వీస్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోలు గత నెలలో పదిహేను రోజుల్లో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని గమ్యస్థానాలకు 1,200 విమానాలు బయలుదేరాయని అంచనా. -
నిప్పుతో చెలగాటం.. పాక్ కు కుక్క చావే
-
భారత్ వీడే పాక్ పౌరులకు మరింత గడువు
న్యూఢిల్లీ: భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులకు కొంచెం ఉపశమనం కలిగింది. దేశం వీడేందుకు ఇచ్చిన గడువును కేంద్రం గురువారం సడలించింది. ఏప్రిల్ 30న సరిహద్దును మూసివేస్తామని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు వాఘా–అటారీ సరిహద్దు గుండా తిరిగి వెళ్లేందుకు అనుమతించింది. ‘ఈ ఉత్తర్వులను సమీక్షించాం.తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పాక్ పౌరులు అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ నుంచి భారత్ విడిచి పాకిస్తాన్‌కు వెళ్లొచ్చు’అని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కేంద్రం ఆదేశించిన ఆరు రోజుల్లో 55 మంది దౌత్యవేత్తలు, వారి సహాయక సిబ్బంది సహా 911 మంది పాకిస్తానీయులు అటారీ–వాఘా సరిహద్దు పోస్ట్ ద్వారా భారత్‌ను వీడారు. ఇక పాకిస్తాన్ నుంచి 1,617 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. వీరిలో దీర్ఘకాలం వీసా కలిగిన 224 మంది ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరికొందరు విమానాశ్రయాల ద్వారా మూడో దేశం గుండా పాక్ వెళ్లిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. -
ఉద్రిక్తతలు ఆగిపోవాల్సిందే
న్యూయార్క్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇరు దేశాల మధ్య సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం రాత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్తాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్‌లతో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ మేలు చేయదని అన్నారు.ఘర్షణ వాతావరణం సమసిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్.జైశంకర్‌తో మార్కో రూబియో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారత్‌కు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం అంతం కావాలని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించుకొనే విషయంలో భారత్, పాక్ కలిసి పనిచేయాలని, పూర్తిస్థాయిలో సంయమనం పాటించాలని కోరారు. దక్షిణాసియాలో శాంతిభద్రతల పరిరక్షణకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్.జైశంకర్ స్పందిస్తూ.. పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరులను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను చట్టంముందు నిలబెట్టి, శిక్షించక తప్పదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్‌కు పాక్ సహకరించాలి పహల్గాం ఉగ్రదాడిపై జరుగుతున్న దర్యాప్తుకు పాకిస్తాన్ ప్రభుత్వం సహకరించాల్సిందేనని మార్కో రూబియో తేల్చిచెప్పారు. ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడుతూ ఈ సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఉద్రిక్తతలు సడలిపోయేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పహల్గాంలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులకు సరైన శిక్ష పడేలా భారత్‌కు సహకారం అందించాలని చెప్పారు. పాకిస్తాన్ నుంచి నిర్మాణాత్మక చర్యలను కోరుకుంటున్నామని రూబియో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి పట్ల తమ వైఖరిని షెహబాజ్ షరీఫ్ అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఉగ్రవాదంపై పోరాటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశమేనని, 90 వేల మందికిపైగా ప్రజలు ఉగ్రదాడుల్లో మరణించారని తెలిపారు. ఉగ్రవాదం వల్ల తమకు 192 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇండియాను కట్టడి చేయాలని రూబియోను కోరారు. సింధూనది జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడాన్ని షెహబాజ్ షరీఫ్ తప్పుపట్టారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చెల్లదని అన్నారు. భారత్ హక్కుకు మద్దతిస్తున్నాంతమను తాము రక్షించుకొనే హక్కు భారత్‌కు ఉందని, ఆ హక్కుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ సహకారం కచ్చితంగా ఉంటుందన్నారు. ఆయన గురువారం భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ధూర్త దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని తాము ఎంతమాత్రం సహించడం లేదని హెగ్సెత్ బదులిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి సంతాపం ప్రకటించారు. -
ఇంట్లోకి చొరబడండి!
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించి, అక్కడే బైఠాయించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పీఓకేను స్వాదీనం చేసుకోవాలని కోరారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక సైనిక, వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత సైన్యం దాడులు చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ సైనికాధికారులు విదేశాలకు పారిపోతుండడంపై స్పందించారు. అది చాలా మంచి పరిణామం అని చెప్పారు.పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి చొరబడి, అక్కడే మకాం వేయడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. ఈ అవకాశం వదులుకోవద్దని స్పష్టంచేశారు. ఉగ్రవాదుల ఇళ్లలోకి ప్రవేశించి మరీ దాడులు చేస్తామంటూ ప్రధాని మోదీ గతంలో హెచ్చరించారని, ఇప్పుడు ఆ పని చేసి చూపించాలని అన్నారు. పీఓకేను మన అ«దీనంలోకి తెచ్చుకోవాల్సిందేనని అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు. పీఓకే భారత్‌కే చెందుతుందంటూ పార్లమెంట్లో ఇప్పటికే ఒక తీర్మానం ఆమోదించినట్లు గుర్తుచేశారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ మద్దతు ఉంది కాబట్టి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదన్నారు. ఉగ్రదాడులకు చరమగీతం పాడాలి హైదరాబాద్‌లో లుంబినీ పార్కులో, దిల్‌సుఖ్‌నగర్‌లో ఉగ్రవాద దాడులు జరిగాయని అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావించారు. ఉగ్రవాదులు ముంబైలో భీకర దాడులకు పాల్పడ్డారని, 2019లో పుల్వామాలో మన జవాన్లను ముష్కరులు బలి తీసుకున్నారని చెప్పారు. ముంబైలో వీటీ స్టేషన్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ఓ తెలుగు పండితుడు నవ వధువు అయిన తన కుమార్తెను పోగొట్టుకున్నాడని తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన ఆ నవ వధువు చేతికి గోరింటాకు ఉందన్నారు. గత ఏడాది వైష్ణోదేవి ఆలయం వద్ద జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు పర్యాటకులు మరణించారని వెల్లడించారు. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలు తరచుగా కోరుతూనే ఉన్నాయని చెప్పారు. ‘‘అధికారంలో మీ చేతుల్లోనే ఉంది, ఇలాంటి దాడులకు చరమగీతం పాడండి’’ అని కేంద్ర ప్రభుత్వానికి ఒవైసీ విజ్ఞప్తి చేశారు. -
ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం
పహల్గామ్ ఊచకోత పట్ల భారత ప్రభుత్వం ఎంతో పరిపక్వత ప్రదర్శించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్నారు. తక్షణం కశ్మీర్ వెళ్లి పరిస్థితి ఏమిటో స్వయంగా తెలుసుకోవాలని హోంమంత్రిని ఆదేశించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌పై అప్పటికప్పుడు ఏయే చర్యలు చేపట్టాలో గుర్తించారు. వీసాలు రద్దు చేశారు. అటారీ చెక్ పోస్టు మూసేశారు. పాక్ హైకమిషన్ కీలక అధికారులను దేశం నుంచి బహిష్కరించారు. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేశారు. ఉగ్రదాడి సూత్రధారులకు తగిన గుణపాఠం చెప్పేందుకు వ్యూహ రచనా జరుగుతోంది. ‘‘భారత రిపబ్లిక్‌తోనే ఆటలాడతారా, మీ అంతు చూస్తాం, ఖబడ్దార్!’’ అంటూ ఇండియా పంపిన హెచ్చరిక ఇప్పటికే టెర్రరిస్టులకు అందేవుంటుంది. అత్యంత శక్తిమంతమైన రష్యా, అమెరికాల నుంచి, సౌదీ అరేబియా సహా మనకు విస్పష్టమైన మద్దతు లభించింది. ఇది ఈ సందేశానికి మరింత బలం చేకూర్చింది. సాధారణ పరిస్థితుల్లో ఎన్ని భేదాభిప్రాయాలున్నా, కష్టకాలంలో అన్నీ మరచి ఒక్క తాటి మీద నిలవటం భారత ప్రజల విశిష్టత. ప్రస్తుత బాధకర సమయంలోనూ కోపంతో రగిలిపోతూ అందరం ఒక్కటయ్యాం. ఒక్కుమ్మడిగా మన ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించాం. భౌతికంగానూ బయటికొచ్చాం. మనం భాగ్యవంతులం కాకపోవచ్చు, కాని ఆపదలో అండగా నిలిచే సహజగుణ సంపన్నులం. కేంద్ర ప్రభుత్వం, జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఈ తరుణంలో ఏ చర్యలు తీసుకున్నా ఇండియా యావత్తూ వాటికి వెన్నుదన్నుగా నిలిచి ఉంటుంది. ఇండియా జాతీయ భద్రతకు పౌర సమాజం ఎప్పుడూ చేయూత ఇస్తుంది. ఇది కాలపరీక్షలో నిగ్గుదేలిన వాస్తవం.యుద్ధం వస్తే సిద్ధమే!రెండు దేశాల నడుమ యుద్ధం వస్తుందా? పహల్గామ్లో పాక్ అంతటి దుస్సాహసానికి పాల్పడితే మనం చేతులు ముడుచుకుని కూర్చోలేం. కానీ ఇవి మాత్రమే యుద్ధానికి దారి తీసే కారణాలు కావు. పాకిస్తాన్ మనకు వ్యతిరేకంగా అల్లుతున్న కథనాలు కూడా ఇందుకు పురిగొల్పుతున్నాయి. పహల్గామ్లో ఉగ్రదాడి పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెల్లుబికిన తర్వాత పాకిస్తాన్ తన ఆత్మరక్షణ కోసం ఎంతటి దుందుడుకు విమర్శలకూ వెనుకాడటం లేదు. ఇండియా సైనికపరంగా ఎలాంటి చర్య తీసుకున్నా, యుద్ధానికి ‘మ్యాచ్’ అయ్యే ప్రతిచర్యలు ఎదురవుతాయి. పరిస్థితి అంతదాకా వస్తే, ‘‘అయితే సరే, అయితే సరే. మేం కూడా ఆ ‘మ్యాచ్’ను ఎదుర్కుంటాం. ఘోర కృత్యాలకు తెగబడుతున్న ఉగ్రవాదాన్ని మా దేశంలో ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించం’’ అని మనం చెప్పి తీరాలి.ఈ సన్నద్ధతలో మనం గుర్తు పెట్టుకోవలసిన అంశం: యుద్ధానికి సిద్ధంగా ఉండటం వేరు, యుద్ధం కోసం ఉవ్విళ్లూరడం వేరు. యుద్ధం తాలూకు నిర్బంధాలు, ఫలితాలు ఎప్పుడూ బాధాకరంగానే ఉంటాయి. అదీ అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం అంటే, దాని పరిణామాలు ప్రళయ సమానంగా ఉండగలవు. అణ్వస్త్రాలపై ఇండియా విధానాలు వివేకంతో కూడుకుని ఉంటాయి. అణ్వస్త్ర నిగ్రహం మన విధానం. పాకిస్తాన్ ఇదే బాటలో పయనిస్తోందా? అది అణ్వస్త్రం సమకూర్చుకున్న చరిత్రే దాని ఉద్దేశాలను వెల్లడిస్తుంది.‘ఒక్క దేశం’గా నిలబడదాం!ఇండియా తన సైనిక వ్యూహాలను విజ్ఞతతో బేరీజు వేసుకుని ఏది సరైన మార్గమో నిర్ణయించుకోగలదు. మనం ప్రభుత్వాన్ని సంపూర్ణంగా, బేషరతుగా విశ్వాసంలోకి తీసుకోవాలి. ఇక, దేశంలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేవారు కొందరు ఉంటారు. వారికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి మనం సహకరించాలి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి మనం ఇలా చెప్పాలి: ‘‘ద్విజాతి సిద్ధాంతం ప్రతిపాదించి మీరు వేరే దేశాన్ని సాధించుకున్నారు. మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టి మా ‘వన్ నేషన్’ను విభజించాలని చేసే ప్రయత్నాలు మేం సహించేది లేదు. హిందువులు, ముస్లిములు, సిక్కులు... వీరందరికీ మా ‘వన్ నేషన్’ మాతృభూమి. ‘ఇండియా దటీజ్ భారత్’ విలువలకు నిలయం. మీ క్రూరాతి క్రూరమైన వక్రబుద్ధికి ఇవి అర్థం కావు.’’1948 జనవరి 30న ‘తీస్ జనవరి మార్గ్’లో మంచు కప్పిన గడ్డి మీద రక్తం చిందినట్లే, ఈ ఏప్రిల్ 22న పహల్గామ్ అందమైన కొండ లోయల మీద చిందిన రక్తం... మానవత్వం మీద బుల్లెట్ల దౌష్ట్యానికి నిదర్శనం. అయినప్పటికీ మానవత్వం మీద మన విశ్వాసాన్ని అది చాటి చెబుతోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా తీసుకురావాలని చూస్తున్న ‘ఉగ్రవాదపు రెండో దశ’ను నిరోధించి, మన మన మధ్య ఒక్క నెత్తుటి బొట్టు చిందనీయకుండా సాయుధ బలగాలకు పౌరదళాలుగా మన సమైక్య సంఘీభావం ప్రకటించాలి. టెర్రరిస్టులకు, టెర్రరిజానికి పురిటిగడ్డ అయున పాకిస్తాన్‌లోనూ హింసాద్వేషాలను వ్యతిరేకించే విజ్ఞులు ఉన్నారు. పహల్గామ్ ఘటన పట్ల కలత చెందినవారు, మేధావులు అక్కడ కొద్దిమంది కాదు... ఎక్కువగానే ఉంటారు. వారెవరో మనకు తెలియాల్సినంతగా తెలియడం లేదు. అలాంటివారు ఈ సమయంలో మతతత్వ గుంపులను, వ్యక్తులను గట్టిగా వ్యతిరేకిస్తారని ఆశిద్దాం. గొప్ప భారతీయుడైన లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన పిలుపును గుర్తు చేసుకుంటూ, భారత దేశం ఈ సవాలును విజయవంతంగా తిప్పికొట్టాలని ఆశిద్దాం. ఆయన ఇచ్చిన ‘జై జవాన్, జై కిసాన్’ నినాదానికి ‘జై ఇన్సాన్’ (ఇన్సాన్ అంటే మానవ్) కూడా చేర్చుదాం. మన మతం మానవత్వం అనీ, దుష్టత్వం కాదనీ పహల్గామ్ సాయుధ దుండగులకు చెప్పి తీరాలి. ‘‘ఖబడ్దార్, ఇండియాతో, ఇండియా మానవత్వంతో ఆటలొద్దు’’ అని మరోసారి చెబుదాం!గోపాలకృష్ణ గాంధీవ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
భారత్ యుద్ధానికి దిగితే.. మీరు వెళ్లకండి: వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే భారత తన బలగాలను సిద్ధం చేసి పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొడుతోంది. ఒకవేళ పాకిస్తాన్ హద్దు మీరితే భారత్ సైన్యం ఇప్పటికే రెడీగా ఉంది. అటు నావీ, ఇటు ఎయిర్స్ ఫోర్స్, మిలటరీ దళాలు తమ తమ ఏర్పాట్లలో ఉన్నారు.ఈ క్రమంలోనే ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాది గుర్ పత్వాంత్ సింగ్ పన్నూ.. భారత సైన్యంలో ఉన్న సిక్కు మతస్తులను ఉద్దేశించి ఒక వీడియో రీలీజ్ చేశారు. ఒకవేళ పాకిస్తాన్ తో భారత్ సైన్యం యుద్ధానికి దిగితే ఇండియన్ ఆర్మీలో ఉన్న సిక్కు మతస్తులు ఎవ్వరూ ఆ యుద్ధం పాల్గొనవద్దంటూ వివాదాస్పద వీడియో రిలీజ్ చేశారు. యుద్ధానికి రంగం సిద్ధమైతే భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి మీరు నో చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పాకిస్తాన్ మనకు స్నేహ పూర్వక దేశమని, శత్రుదేశం కాదని పొగడ్తలు కురిపించారు. ఖలిస్తాన్ కు, సిక్కు మతస్తులకు పాకిస్తాన్ అనేది ఒక మిత్ర దేశమంటూ చెప్పుకొచ్చారు. ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. -
భారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరుల వీసాలను భారత్ రద్దు చేయడం.. ఆసక్తికర కథనాలను కళ్ల ముందు ఉంచుతోంది. పదిహేడేళ్లుగా భారత్‌లో ఉంటూ ఇక్కడి ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తి తిరిగి అక్కడికి వెళ్లిపోవడం లాంటివి మీడియాకు ఎక్కాయి. అయితే భారత జవాన్‌ను వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకున్న ఓ పాకిస్థానీ మహిళకు హోంశాఖ ఝలక్ ఇవ్వగా.. బార్డర్ దాటే చివరి నిమిషంలో కోర్టు నుంచి ఊరటతో ఆమె ఆగిపోవాల్సి వచ్చింది.పీటీఐ కథనం ప్రకారం.. పాక్ పంజాబ్‌కు చెందిన మినాల్ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్లైన్లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.ఆమె లాయర్ అంకూర్ శర్మ కోర్టు నుంచి స్టే ఆదేశాలతో అక్కడికి చేరుకున్నారు. తన వీసాను పొడిగించాలని ఆమె కేంద్ర హోం శాఖ వద్ద విజ్ఞప్తి చేసుకుందని.. అది ఇంకా పెండింగ్ లోనే ఉందని.. కాబట్టి కోర్టు ఈఅంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెను తరలించడంపై నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆమె బస్సు దిగి వెనక్కి వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె తరఫున వాదించిన అంకూర్ శర్మ బీజేపీ అధికార ప్రతినిధిగా గ్రేటర్ కశ్మీర్ ఓ కథనం ఇచ్చింది. అంతేకాదు ప్రధాని మోదీకి మినాల్ చేసిన విజ్ఞప్తిని కూడా ప్రముఖంగా ప్రచురించింది.‘‘మేం రూల్స్ అన్నీ ఫాలో అయ్యాం. సుదీర్ఘ వీసా కోసం నేను ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా. అది త్వరలోనే వస్తుందని అధికారులు మాకు చెప్పారు కూడా. ఆలోపు దాడి జరిగింది. నా భర్త నుంచి నన్ను విడదీసే ప్రయత్నం జరిగింది. నాలాగే.. ఎంతో మంది తమ తల్లులు, తండ్రుల నుంచి విడిపోవాల్సిన పరిస్థితి. ఇది మానవత్వం అనిపించుకోదు. ప్రధాని మోదీకి మేం చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మాలాంటి వాళ్లకు న్యాయం చేయమని అని ఆమె గ్రేటర్ కశ్మీర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.మినాల్‌పై అనుమానాలు?ఇదిలా ఉంటే.. మినాల్ ఖాన్ ఎపిసోడ్ సోషల్ మీడియాకు ఎక్కడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒక జవాన్‌ను పాకిస్థాన్ మహిళను, అదీ ఆన్లైన్లో పరిచయంతో వివాహం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ వీసా ముగిసిన తర్వాత కూడా నెలపైనే ఆమె ఎక్కడ నివసించగలిగిందని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇది ట్రాప్ అయి ఉండొచ్చని.. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. మినాల్‌కు మద్దతుగానూ పలువురు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరులను వెనక్కి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు తొలుత ఏప్రిల్ 29వ తేదీని గడువుగా ప్రకటించి.. ఆ తర్వాత మరొక రోజు పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీతో అట్టారీ వాఘా సరిహద్దును మూసేశారు. గత ఆరో రోజులుగా 786 మంది పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోగా, అందులో 55 మంది దౌత్యవేత్తలు, సహాయ సిబ్బంది ఉన్నారు. అలాగే.. పాకిస్థాన్ నుంచి 1,465 భారతీయులు తిరిగి వచ్చారని కేంద్రం ప్రకటించింది. -
బంగ్లాదేశ్ సాయంతో.. భారత్‌లో కుట్రకు పాకిస్తాన్ తెర
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాం దాడిపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్.. పాక్ బుద్ధి చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు,భద్రతా బలగాలు హైఅలెర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అందుకు పాక్ కుట్రలే కారణమని భద్రతా ఏజెన్సీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.గూఢాచార సంస్థలు (Intelligence agencies) సమాచారం మేరకు..ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు, పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ సైనికులు మొహరించినట్లు గుర్తించాయి. కాబట్టే బంగ్లాదేశ్ సరిహద్దులో మరింత అప్రమత్త అవసరమని భద్రతా ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.సైనిక చర్యతో పాటు బంగ్లాదేశ్‌తో పాటు ఆ దేశ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్‌లతో పాక్ సన్నిహిత సంబంధాల్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తద్వారా భారత్‌లో అల్లర్లు సృష్టించే దిశగా కుట్రకు తెరతీసినట్లు సమాచారం. అలా భారత్‌లో వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలకు సిద్ధమైనట్లు పలు ఆధారాల్ని సేకరించాయి. ఇటీవల బంగ్లాదేశ్‌కు సరిహద్దు ప్రాంతమైన పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ జిల్లాల్లో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ అల్లర్లలో ముగ్గురు పౌరులు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ అలజడులు జరిగే అవకాశముందని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ విధించాయి. గూఢచార సంస్థలు అందుకు తగ్గ ఆధారాల్ని కేంద్రానికి సమర్పించాయి. ఈ భారత్‌లో మళ్లీ అలజడులు జరిగే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో సరిహద్దులుగా ఉన్న భారత్ భూభాగంగా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భయంతో వణుకుతున్న పాక్
-
ఇండియా Vs పాక్ రంగంలోకి అమెరికా
-
భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తత
-
పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత.. నెక్ట్స్ జరిగేది ఇదేనా?
ఢిల్లీ: పాకిస్తాన్‌ను మరింత ఇబ్బంది పెట్టేలా భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ గగనం తలంలో పాక్ విమాన ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో పాకిస్థాన్ నుంచి భారత్ మీద నుంచి కాకుండా ఇతర దేశాల గగనం తలం నుంచి గమ్య స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, భారత విమానాలకు పాకిస్తాన్ గగనతల మూసివేయడంతో ప్రతి చర్యగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఆంక్షలు మే 24 వరకు కొనసాగనున్నాయి. అయితే ఈ గడువు మున్ముందు పరిస్థితులపై ఆధారపడి ఉండనుంది. భారత గగన తలంపై పాక్ విమానాల నిషేధం విధిస్తూ.. కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ‘భారత్ గగనం తలంపై పాక్ విమానాలు నిషేదం. వాటిల్లో పాక్ రిజిస్టర్డ్ విమానాలు, అలాగే పాక్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, లేదంటే లీజుకు తీసుకున్న విమానాలకు భారత గగనతల ప్రవేశం లేదు. ఇందులో సైనిక విమానాలూ ఉన్నాయి’ అని కేంద్రం విడుదల చేసిన నోట్లో పేర్కొంది. మరోవైపు భారత్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పాక్‌కు చెందిన విమానాలు భారత్ గగనతలం మీద నుంచి ప్రయాణించకూడదన్న ఆదేశాలు అమల్లో ఉండగా.. ఇప్పుడు అధికారికంగా గగనతలాన్ని మూసివేస్తూ భారత్ ప్రకటన చేయడంపై దాయాది దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ చర్య వల్ల దక్షిణ ఆసియా, ఓషియానియా ప్రాంతాలకు వెళ్లే పాక్ విమానాలు భారత గగన తలం మీద నుంచి పొరుగు దేశాల మీద నుంచి తిరిగి ప్రయాణించాల్సి వస్తుంది. ఆ ఫలితం పాక్ విమానయాన రంగంపై పడనుంది. విమానం ప్రయాణ సమయం పెరగడం, ఫ్లైట్ ఛార్జీలు పెరగడం, విమాన ఇంధన ధరలు పెరగడం, విమానాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గడం వంటి ప్రతికూల ప్రభావం పడనుంది. వెరసీ పాక్ మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోంది. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయిన పాకిస్తాన్ విమానయాన సంస్థలకు తాజా భారత నిర్ణయంతో అదనపు భారం పడనుంది. -
భారత్-పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత
జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్ఓసీ)తోపాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎల్వోసీ దగ్గర వరుసగా ఏడోరోజూ(గురువారం) పాక్ కాల్పులు జరిపింది. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారతసెన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎల్ఓసీ వెంబడి పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా ఏడోరోజు కావడం గమనార్హం.మరో వైపు అరేబియా సముద్రంలో యుద్ధవాతావరణం నెలకొంది. భారత్, పాకిస్థాన్‌లు యుద్ధనౌకలను మోహరించాయి. గుజరాత్ పోరుబందర్ వద్ద భారత్ యుద్ధనౌకలు.. సైనిక సన్నద్ధతలో భాగంగా విన్యాసాలు చేస్తున్నాయి. నిన్న(బుధవారం) సైతం ఎల్ఓసీలో పాక్ కాల్పులు కొనసాగగా... భారత జవాన్లు ప్రభావవంతంగా బదులిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో నాలుగు సరిహద్దు జిల్లాల్లో కవ్వింపు చర్యలు కొనసాగాయి. చిన్నపాటి ఆయుధాలతో కాల్పులు జరుపుతుండడంతో ప్రాణనష్టం జరగడం లేదని అధికారులు పేర్కొన్నారు.పహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్‌పై భారత ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. సింధూనది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దాంతో పాక్ సైన్యం ఆగ్రహంతో రగిలిపోతోంది. సరిహద్దులో భారత సైన్యమే లక్ష్యంగా నిత్యం కాల్పులకు దిగుతోంది. భారత జవాన్లు దీటుగా తిప్పికొడుతున్నారు. ప్రధానంగా జమ్మూ, రాజౌరి, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో ఈ కాల్పులు జరుగుతున్నాయి. భారత్–పాక్ మధ్య 3,323 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. -
భయపెట్టిన భారత్.. పాక్ సైన్యంలో పెను మార్పులు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో పాక్ సైన్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌ను ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ)గా నియమిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. 2024 సెప్టెంబర్ నుంచి ఐఎస్ఐ చీఫ్‌గా వ్యవహరిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్‌కు ఎన్ఎస్ఏగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడితో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేలా భారత్ సామ, ధాన ,బేధ దండోపాయలను ఉపయోగిస్తోంది. వరుస కఠిన నిర్ణయాలతో అంతకంత దెబ్బతీస్తూనే ఉంది. ఈ క్రమంలో భారత ప్రధాని మోదీ బీహార్ వేదికగా బహిరంగంగా ఉగ్రమూకలకు హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషిస్తున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. సప్త సముద్రాల అవతల దాక్కున్నా సరే వెలికి తీసి మట్టిలో కలిపేస్తామన్నారు. అందుకు ఊతం ఇచ్చేలా ప్రధాని మోదీ నివాసంలో రక్షణశాఖ, భారత సైన్యంలో త్రివిధ దళాలతో జరిపిన కీలక సమావేశంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఉగ్రవాదం అణచివేతలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు వెల్లడించారు. దీంతో పాక్ సైన్యంలో ఆందోళన మొదలైంది. భారత్.. తమపై ఏ క్షణంలోనైనా దాడి చేయొచ్చని పాక్ మంత్రులు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. దీనికి తోడు ఆ దేశ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ ఆచూకీ గల్లంతైంది. భారత్ దెబ్బకు దెబ్బ తీయొచ్చనే ఊహాగానాల నడుమ మునీర్ దేశం విడిచి భార్య పిల్లలతో పరాయి దేశంలో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం కొనసాగుతున్న వరుసర పరిణామలు, యుద్ధ భయాలతో పాక్ సైన్యంలో సైతం భయాందోళనలు మొదలయ్యాయి. బతికుంటే బలుసాకు తిని బతుకొచ్చు.. భారత్‌తో తలపడలేమనే సంకేతాలిస్తూ రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులకు రాజీనామ చేశారు. ఈ క్రమంలో రక్షణ పరంగా పాక్ ప్రధాని,రాష్ట్రపతులకు సలహాలు, పాక్ సైన్యం, ఇతర దర్యాప్తు, ఇంటెలిజెన్స్ సంస్థల్ని సమన్వయం చేసేలా అసిమ్ మాలిక్‌కు పాక్ ప్రభుత్వం ఎన్ఎస్ఏ అడ్వైజర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడం గమనార్హం. -
భారత్-పాకిస్తాన్.. ఎవరి బలమెంత?
సాక్షి, నేషనల్ డెస్క్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధాన్ని తలపిస్తున్న నేపథ్యంలో వాటి సైనిక పాటవం గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. సైనిక బలాబలాల విషయంలో భారత్ ముందు పాక్ ఏ మాత్రమూ తూగే పరిస్థితి లేదు. పైగా ఆర్థికంగా దాదాపుగా దివాలా తీసిన నేపథ్యంలో యుద్ధ భారాన్ని తట్టుకునే పరిస్థితుల్లో అసలే లేదు. కాకపోతే భారత్ నిర్ణాయక రీతిలో దాడికి దిగితే పరువు ప్రతిష్టల కోసమైనా పాక్ ఏదో రకంగా ప్రతిచర్యలకు దిగక తప్పకపోవచ్చు! ఈ నేపథ్యంలో ఇరుదేశాల సాయుధ పాటవాన్ని ఓసారి చూస్తే.. -
లాహోర్ నడిబొడ్డున సయీద్ అడ్డా!
హఫీజ్ సయీద్.. కరడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది. లష్కరే తోయిబా అధినేతగా భారత్‌లో రక్తపుటేరులు పారిస్తున్నాడు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గతవారం జరిగిన ఉగ్రదాడికి కర్త, కర్మ, క్రియ అతడేనని నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల (రూ.84.58 కోట్లు) రివార్డు ప్రకటించింది. ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్‌మైండ్‌గా వ్యవహరించిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. పాక్ ప్రభుత్వం ఈగ కూడా వాలనివ్వడం లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా నిర్భయంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. పాకిస్తాన్లో రెండో పెద్దనగరమైన లాహోర్‌లో ఓ ఖరీదైన ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ఇంటి శాటిలైట్ చిత్రాలను, వీడియోలను ‘ఇండియా టుడే’ వార్తాసంస్థ తాజాగా బహిర్గతం చేసింది. లాహోర్‌లో జోహర్ టౌన్ అనే ప్రాంతంలో ఉన్న ఈ భవనం సాధారణంగా ఉగ్రవాద నేతల ఇళ్ల కంటే భిన్నంగా కనిపిస్తోంది. శత్రువులు దాడి చేయకుండా ఎత్తుగడ అంతర్జాతీయ ఉగ్రవాదులైన అల్–ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్, జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ సాధారణ జనావాసాలకు దూరంగా నివసించారు. ఒంటరి ఇళ్లలోనే వారు మకాం వేశారు. పాకిస్తాన్‌లోని అబోతాబాద్ ఇంటిపై అమెరికా సేనలు దాడి చేసి, లాడెన్‌ను అంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలమే ఉండడం అమెరికా జవాన్లకు బాగా కలిసొచ్చిoది. 2019లో పుల్వామా దాడికి కారకుడైన మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్ పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని బహల్వపూర్‌లో ఓ ఒంటరి ఇంట్లో నివసిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రధాన రహదారి పక్కనే ఈ ఇల్లు ఉంది కానీ చుట్టూ జనావాసాలేవీ లేవు. సామాన్య ప్రజలకు దూరంగా రహస్య ప్రాంతాల్లో ఉండడానికి ఉగ్రవాదులు ఇష్టపడుతుండగా, హఫీజ్ సయీద్ వ్యూహం మరోలా ఉండడం గమనార్హం. లాహోర్ నడిబొడ్డున అత్యంత రద్దీగా ఉండే చోట తన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు. శత్రువులు దాడి చేయకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాన్య ప్రజల నివాసాలు ఉన్నచోట దాడులు చేస్తే ప్రాణనష్టం అధికంగా జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు రావొచ్చు. అందువల్ల ప్రత్యర్థులు దాడులు చేయడానికి వెనుకాడవచ్చు. లాహోర్‌లో హఫీజ్ సయీద్ ఇల్లు శత్రుదుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇదొక కాంపౌండ్ అని చెప్పొచ్చు. ఈ ప్రాంగణంలోనే ఒక పాత భవనంతోపాటు మరికొన్ని ఇళ్లు, మసీదు, మదర్సా(హఫీజ్ సయీద్ కార్యాలయం), ఒక ప్రైవేట్ పార్కు ఉన్నాయి. హఫీజ్ కుటుంబం కూడా ఇక్కడే ఉంటోంది. అతడికి పాకిస్తాన్ సైన్యంతోపాటు సొంత ప్రైవేట్ సైన్యం పటిష్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ఇక్కడి మసీదులోనే హఫీజ్ సయీద్ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. విద్యార్థుల ముసుగులో అతడి అనుచరులు సైతం ఇందులోనే ఆశ్రయం పొందుతున్నారు. ఇంటి కింద బంకర్ లాహోర్‌లోని అల్–ఖద్సియా మసీదు గతంలో హఫీజ్ సయీద్ కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం బాలాకోట్‌లో భారత సైన్యం సర్జికల్ స్రైక్ చేయడంతో అతడిలో భయం మొదలైంది. అల్–ఖద్సియా మసీదులో ఉండడం సురక్షితం కాదని ఇప్పుడున్న కాంపౌండ్‌కు మకాం మార్చాడు. 2021లో ఈ ఇంటికి సమీపంలో కారుబాంబు పేలుడు సంభవించింది. ముగ్గురు మరణించారు. దాంతో హఫీజ్ సయీద్ భద్రతను మరింత పటిష్టం చేశారు. ఈ కాంపౌండ్ లోపల, బయట గట్టి నిఘా ఉంటుంది. సాయుధులు రోజంతా నిర్విరామంగా పహారా కాస్తుంటారు. స్థానికులను కాంపౌండ్ సమీపంలోకి కూడా అనుమతించరు. అనుమతి ఉన్న వ్యక్తులు రావాలంటే రకరకాల తనిఖీలు ఉంటాయి. అంతేకాదు ఇక్కడ డ్రోన్లు ఎగురవేయడం నిషేధించారు. ఫొటోలు, వీడియోలు చిత్రీకరించడం కుదరదు. హఫీజ్ సయీద్ నివాసం కింద ఉక్కు కోట లాంటి బంకర్ ఉన్నట్లు తెలుస్తోంది. జైల్లో ఉన్నాడంటూ కల్లబొల్లి కబుర్లు ఉగ్రవాద కార్యాకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో హఫీజ్ సయీద్‌కు 31 ఏళ్ల జైలుశిక్ష పడిందని, జైల్లో పెట్టామని పాకిస్తాన్ పైకి నమ్మబలుకుతోంది. కానీ, అందులో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టమతోంది. సయీద్‌ను ఐక్యరాజ్యసమితి, అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాయి. అతడిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించాయి. అయినప్పటికీ ఫలితం శూన్యం. స్వయంగా పాక్ సైన్యమే అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి పాల్పడింది తామేనని లష్కరే తోయిబా ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్) స్వయంగా ప్రకటించింది. ఈ దాడి వెనుక అసలు సూత్రదారి హఫీజ్ సయీద్ అని భారత దర్యాప్తు సంస్థలు ఇప్పటికే తేల్చాయి. ముష్కరుడి కోసం కోసం వేట మొదలుపెట్టినట్లు సమాచారం. ఒకవేళ లాహోర్‌లోని అతడి ఇంటిపై దాడి చేయాలన్నా అది సులభం కాదని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టిక్.. టిక్... టిక్
న్యూఢిల్లీ: ఓవైపు పాశవిక దాడి పట్ల దేశ ప్రజల ఆక్రోశం. నానాటికీ పెరిగిపోతున్న ఆగ్రహావేశాలు. అంతకంతా బదులు తీర్చుకోవాల్సిందేనంటూ నానాటికీ పెరుగుతున్న డిమాండ్లు. మరోవైపు ఒక్కో రోజూ గడుస్తున్న కొద్దీ భయంతో వణికిపోతున్న దాయాది. కసితో రగిలిపోతున్న భారత్ ఈసారి ఎలాంటి దెబ్బ కొట్టనుందో పాలుపోక బెంబేలు. ఏ క్షణమైనా తమపై యుద్ధానికి దిగడం ఖాయమని పాక్ మంత్రుల ముచ్చెమట వ్యాఖ్యలు. వ్యూహాత్మక మౌనంతో పాక్‌ను చెప్పలేనంతగా భయపెడుతున్న మోదీ సర్కారు పూర్తి యాక్షన్ మోడ్‌లోకి దిగింది. ప్రతీకారం విషయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూ మంగళవారం నిర్ణయం తీసుకోగా బుధవారం మరిన్ని నిర్ణయాత్మక అడుగులు వేసింది. ఆ దిశగా రోజంతా కీలక పరిణామాలు జరిగాయి. ప్రధాని సారథ్యంలో వరుసగా అత్యున్నత స్థాయి సమావేశాలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై ఉదయం భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో మంత్రివర్గ సహచరులతో మోదీ సమీక్షించారు. అనంతరం సూపర్ కేబినెట్‌గా పిలిచే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సమావేశమై పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపింది. తర్వాత ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా జరిగింది. అనంతరం సాయంత్రం మోదీ సారథ్యంలో పూర్తిస్థాయి కేబినెట్ సమావేశం జరిగింది. ఉగ్రవాదులకు, దాయాదికి మర్చిపోలేని గుణపాఠం నేర్పేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశాల్లో లోతుగా చర్చించడమే గాక పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం బుధవారం రాత్రి ప్రధాని తన అధికార నివాసంలో అతి కీలకమైన ‘సైనిక సమీక్ష’ జరపడం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ తదితరులతో రాత్రి పొద్దుపోయేదాకా భేటీ కొనసాగింది. ప్రతీకార చర్యల వ్యూహానికి ఈ సందర్భంగా స్పష్టమైన తుదిరూపు ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో సర్వ త్రా ఉత్కంఠ తారస్థాయికి చేరింది. మోదీ రష్యా పర్యటన రద్దు మే 8న రష్యా పర్యటనను మోదీ రద్దు చేసుకున్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు రష్యా ‘విక్టరీ డే’ పరేడ్‌లో మోదీ పాల్గొనాల్సి ఉంది. ప్రధానికి బదులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ వాటిలో పాల్గొంటారని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. పహల్గాం ఉద్రిక్తతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విపక్షాల పూర్తి మద్దతు: రాహుల్ పహల్గాం ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని విపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. వారికి, దాయాదికి గుణపాఠం చెప్పేందుకు కేంద్రం తీసుకునే ఏ నిర్ణయానికైనా విపక్షాల పూర్తి మద్దతుంటుందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో మోదీ స్పష్టంగా, సమర్థంగా వ్యవహరించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.మన గగనతలం మూత పాక్ పౌర, సైనిక విమానాలకు భారత గగనతలాన్ని పూర్తిగా మూసేస్తూ కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫై చేసింది. ఇది మే 23 దాకా అమల్లో ఉంటుందని పేర్కొంది. దీని ప్రభావం పాక్ విమానయాన సంస్థలపై తీవ్రంగా ఉండనుంది. భారత్‌కు పాక్ ఇప్పటికే తన గగనతలాన్ని మూసేయడం తెలిసిందే.సూపర్ కేబినెట్ భేటీయే కీలకం!ప్రధాని అధికార నివాసంలో బుధవారం ఉదయం తొలుత సీసీఎస్ భేటీ జరిగింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ అందులో పాల్గొన్నట్టు సమాచారం. భేటీ ఎజెండా, చర్చల వివరాలు తదితరాలను గోప్యంగా ఉంచారు. పహల్గాం దాడి అనంతరం ఈ వారం రోజుల్లోనే సీసీఎస్ సమావేశమవడం ఇది రెండోసారి కావడం విశేషం. అయితే అనంతరం జరిగిన సీసీపీఏ సమావేశమే బుధవారం నాటి భేటీల్లో అతి కీలకమని భావిస్తున్నారు. ప్రధాని, రక్షణ, హోం, ఆర్థిక, విదేశాంగ, వాణిజ్య, ఉపరితల రవాణా మంత్రులతో కూడిన ఈ కమిటీ అత్యంత కీలకమైన రాజకీయ, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. సీసీపీఏ సమావేశమవడం దాదాపు ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి! చివరిసారి 2019లో ఈ కమిటీ భేటీ అయింది. అప్పుడు కూడా పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల పాశవిక ఆత్మాహుతి దాడి నేపథ్యంలోనే కావడం గమనార్హం. ఆ వెంటనే పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్ర స్థావరాలను వైమానిక దాడులతో నేలమట్టం చేయడమే గాక కనీసం 300 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పహల్గాం దాడికి ప్రతీకారం చేపట్టాల్సిన చర్యలపై సీసీపీఏ కీలక నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వాటి రాజకీయ, ఆర్థిక పర్యవసానాలను మంత్రివర్గ సహచరులతో మోదీ కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. -
పదునైన వ్యూహంతో...
ప్రతీకారం దిశగా ఒక్కో అడుగే పడుతోంది. పహల్గాం సమీపంలో వారం రోజుల క్రితం 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల వేటకు రంగం సిద్ధమవుతోంది. దాడి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరగాలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను త్రివిధ దళాధిపతులకు ఇస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం తీసుకున్న నిర్ణయం అసాధారణమైనది. దాంతోపాటు జాతీయ భద్రతా సలహా బోర్డు(ఎన్ఎస్ఏబీ)ను బుధవారం పునర్వ్యవస్థీకరించటం కూడా కీలక పరిణామం. ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషి సారథ్యంలో ఏర్పాటైన ఈ బోర్డు జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌కు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తుందంటు న్నారు. పదునైన వ్యూహం, పక్కా ప్రణాళిక, మెరికల్లాంటి దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించటం వగైరాలన్నీ ఇలాంటి సమయాల్లో అత్యంత అవసరం. ఇప్పటికే పహల్గాం మారణకాండను తక్కువ చేసి చూపటానికి పాకిస్తాన్ చేయాల్సిందంతా చేస్తోంది. దాదాపు 45 యేళ్లుగా దాని వ్యూహం ఇదే. ఒకపక్క ఎల్ఓసీలో వరసగా కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, సరిహద్దుల్లో నిఘా రాడార్లు, యుద్ధ సామగ్రి తరలిస్తూ మరోపక్క అమెరికా తదితర దేశాలముందు తన అమాయ కత్వాన్ని చాటుకోవటానికి ప్రయత్నిస్తోంది. మారణకాండ గురించి ‘నమ్మదగ్గ సమాచారం’ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పటం ఇప్పటి షెహబాజ్ సర్కార్‌కి మాత్రమే కాదు... కుట్రపూరితంగానో, ఎన్నికల మాటున సైన్యం ప్రాపకంతోనో అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్న పాక్ అధినేతలందరికీ అలవాటైన విద్య. దీనికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడటం తప్పనిసరి. అందుకే ప్రభుత్వ తాజా నిర్ణయం అన్నివిధాలా ఆహ్వానించదగ్గది. మన సహనాన్ని చేతగానితనంగా, మన సుహృద్భావాన్ని అశక్తతగా భావించటం పాకిస్తాన్‌కు అలవాటైంది. మొన్న జరిగిన మారణకాండ అనంతరం దేశవ్యాప్తంగా ప్రజలందరూ ప్రతీకారేచ్ఛతో రగులుతున్నారు. కేవలం దాన్ని సంతృప్తిపరచటమే అంతిమ లక్ష్యం కారాదు. తాజా దాడిలో పాకి స్తాన్ సైన్యంలో పారా కమాండోగా పనిచేసిన హషీం మూసా అనే ఉగ్రవాది పాల్గొనటాన్నిబట్టి చూస్తే ఐఎస్ఐ పాత్రవుందని అర్థమవుతోంది. ఇలాంటివి నివారించాలంటే సరిహద్దుల్లో పటిష్టమైన నిఘావుండాలి. దాంతోపాటు వేర్వేరు సమయాల్లో జరిగిన దాడుల స్వభావాన్ని అధ్యయనం చేయాలి. నిరుడు అక్టోబర్‌లో మధ్య కశ్మీర్లో ఏడుగురు కార్మికులను పొట్టనబెట్టుకున్నది మొదలు మొన్నటి పహల్గాం మారణకాండ వరకూ జరిగిన నాలుగు ఉదంతాల్లో కీలకపాత్ర పోషించింది మూసాయే అంటున్నారు. అదే నిజమైతే మన నిఘా వ్యవస్థ సక్రమంగా లేదని భావించాలి. మొన్న విపక్షాలతో జరిగిన సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిఘా వైఫల్యం ఉన్నదని అంగీకరించింది. కనుక పాకిస్తాన్ ప్రాపకంతో చెలరేగుతున్న ఉగ్రవాదులను గురిచూసి కొట్టటానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టే మన నిఘా వ్యవస్థను కూడా మరింత పటిష్టం చేయాలి. జవాబుదారీ తనాన్ని నిర్ధారించాలి. ఉగ్రవాదులు మన లోటుపాట్లేమున్నాయో చూసుకునే దాడులకు దిగుతారు. ఆ పని మన నిఘా వర్గాలు చేయగలిగితే ఉగ్రవాదుల్ని నిరోధించటంతోపాటు వారిని చాకచక్యంగా పట్టి బంధించటానికి కూడా వీలవుతుంది. అప్రమత్తత లోపించటంవల్ల నిరాయుధ పౌరుల ప్రాణాలు మాత్రమేకాదు... స్థానికుల జీవిక కూడా దెబ్బతింటుంది. తాజాగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కశ్మీర్‌లోని 50కి పైగా పర్యాటక స్థలాలను మూసివేసినట్టు అధికారులు ప్రకటిస్తున్నారు. అంటే కొన్ని వేల కుటుంబాల ఉపాధి దెబ్బతింటుంది. మున్ముందు తెరిచినా అటువైపు వెళ్లేందుకు పర్యాటకులు జంకుతారు గనుక ఆ రంగం కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. అన్నిటికన్నా మన నేతలు మాటలూ, చేతలూ అదుపులో పెట్టుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. రెండు పక్షాలు పరస్పరం తలపడుతున్నప్పుడు ఎవరి బలం ఎక్కువన్న దాన్నిబట్టి ఫలితం ఆధారపడి వుండదు. ఎవరు కలిసికట్టుగా ఉన్నారో, ఎవరు మెరుగైన వ్యూహం పన్ను తున్నారో, ఎవరి ఎత్తుగడలు సరైనవో వారినే విజయం వరిస్తుంది. జరిగిన భద్రతాలోపాలకు బాధ్యులెవరో నిర్ణయించాలని అనటం, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరటం వరకూ ఎవరికీ అభ్యంతరం ఉండదు. నిర్మాణాత్మకమైన విమర్శలూ ఆహ్వానించదగ్గవే. కానీ ప్రధాని చిత్రాన్ని ఒక పార్టీ తప్పుడుగా చిత్రిస్తే, మరొకరు దానికి జవాబుగా విపక్షనేత వెన్నుపోటుకు సిద్ధంగా వున్నట్టు మరో చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాంగ్రెస్ నేతల్ని పాకిస్తాన్ పొమ్మంటూ ఉచిత సలహా ఇచ్చారు. 26 మంది అమాయకుల ఉసురు తీసిన ఉగ్రవాదులను ఏరిపారేయటానికి ఏం చేయాలన్న అంశంలో మన భద్రతా వ్యవస్థ తలమునకలై వుంది. ఈ పరిస్థితుల్లో ఐక్యతను చాటి ఆదర్శంగా వుండాల్సిన నాయకులు దిగజారుడు పోస్టులతో అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా దేశభక్తి అనే భ్రమలో వీరు కాలక్షేపం చేస్తున్నారు. వీరిని చూసి అనుచరగణాలు మరింత రెచ్చిపోతున్నాయి. మతం పేరిట, ప్రాంతం పేరిట విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఫలితంగా వేర్వేరు ప్రాంతాల్లోని కశ్మీరీ చిరువ్యాపారుల పైనా, విద్యార్థుల పైనా దాడులు జరుగుతున్నాయి. ఇదంతా మనపై మనమే యుద్ధం చేసుకోవటం. శత్రువుపై సమష్టిగా పోరాడాల్సిన సమయంలో బాధ్యత మరిచి అంతర్గత కలహాలకు దారితీసేలా ప్రవర్తించటం, పైస్థాయి నేతల ప్రాపకానికి వెంపర్లాడటం అత్యంత హీనం. పాపం. సక్రమంగా మాట్లాడటంరాని నేతలు కొన్నాళ్లయినా నోరుమూసుకోవటం ఉత్తమం. -
హిందీ భాష మూలాలు ఏమిటి?
ఇండియా అనే పేరు వెనుక చాలా చరిత్ర ఉంది. ఈ పదం ఇండస్ నుంచి వచ్చింది. ప్రాచీన పర్షియన్ పదం అయిన హిందుష్ నుంచి ఇండస్ ఆవిర్భవించింది. ఇది సంస్కృత పదం సింధుకు రూపాంతరం. అయితే, ప్రాచీన గ్రీకులు ఇండియన్స్‌ను ఇండోయి అని వ్యవహరించేవారు. ఇండోయి అంటే వారి భాషలో ఇండస్ ప్రజలు అని అర్థం. ఇండస్ రివర్ అంటే స్థానికులు ఎప్పటి నుంచో పిలుచుకునే సింధూ నదే. మన దేశానికి భారత్ అనేది రాజ్యాంగ గుర్తింపు పొందిన అధికారిక నామం. ఈ భౌగోళిక పదం అనేక భారతీయ భాషల్లో కొద్ది మార్పులు చేర్పులతో వ్యవహారంలో ఉంది. హిందూ ధర్మ గ్రంథాలు చెప్పే పౌరాణిక చక్రవర్తి భరతుడి పేరు నుంచి భారత్ వచ్చింది.అధికార భాషగా పర్షియన్హిందుస్థాన్ వాస్తవంగా పర్షియన్ పదం. అంటే ‘హిందువుల భూమి’ అని అర్థం. 1947 వరకూ ఉత్తర భారతం, పాకిస్తాన్ వ్యాపించి ఉన్న ప్రాంతాన్ని ఈ పేరుతో పిలిచేవారు. ఇండియా మొత్తాన్నీ కలిపి చెప్పేందుకు కూడా అప్పుడప్పుడూ ఈ పదం ఇప్పటికీ వాడతారు.ఢిల్లీ సుల్తానుల, మొఘలుల సామ్రాజ్యాల్లో, వారి వారసత్వపు రాజ్యాల్లో పర్షియన్ అధికారిక భాషగా ఉండేది. కవిత్వం, సాహిత్యం కూడా ఈ భాషలోనే ఉండేవి. చాలా మంది సుల్తానులు, నాటి కులీనులు పర్షియన్ ప్రభావిత తురుష్కులే. మధ్య ఆసియా నుంచి వచ్చిన వీరి మాతృభాషలు తురుష్క భాషలు. మొఘలులు కూడా పర్షియన్ ప్రభావిత మధ్య ఆసియా నుంచే వచ్చారు. కాకుంటే వీరు తొలినాళ్లలో ప్రధానంగా చగతాయి తురుష్క భాష మాట్లాడేవారు. తర్వాత్తర్వాత పర్షియన్‌కు పరివర్తనం చెందారు.నార్త్ ఇండియాలోని ముస్లిం ఉన్నత వర్గాలకు పర్షియన్ ప్రాధాన్య భాష అయ్యింది. మొఘల్, ఇండో–పర్షియన్ చరిత్ర కారుడైన ప్రముఖ పండితుడు ముజఫర్ ఆలమ్ చెప్పే ప్రకారం, ఈ పర్షియన్ భాష అక్బర్ సామ్రాజ్యంలో సామాన్యుల భాషగా మారింది. ఎందుకంటే, అన్ని మతాల వారు దీన్ని మాట్లాడేవారు. భాష సరళంగా ఉండేది. దీంతో, పలు రాజకీయ సామాజిక ప్రయోజనాలు ఆశించి అక్బర్ దీన్ని విశేషంగా అభివృద్ధి చేశాడు. పరాయి భాషల భారతీయ అపభ్రంశాల కలయికతో నాడు ఏర్పడిన ఒక మాండలికమే ఇవ్వాళ్టి ఉర్దూ, హిందీ, హిందుస్థానీ భాషలకు మూలం. బ్రిటిష్ వారి రాకతో...మొఘలుల కాలం నుంచి బ్రిటిష్ పాలన వరకు పర్షియన్ భాష మనుగడలో ఉంది. ‘గొప్ప మొఘలుల’లో చిట్టచివరి వాడుగా చరిత్రకారులు భావించే ఔరంగజేబ్ చక్రవర్తి 1707లో చనిపోయే వరకు కూడా ఈ ప్రాభవం కొనసాగింది. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. 1739లో ఢిల్లీపై నాదిర్ షా దండ యాత్ర చేయడం, దక్షిణ ఆసియాలో క్రమేపీ యూరప్ పట్టు బిగియటం... ఈ పరిణామాల నేపథ్యంలో పర్షియన్ భాష,సంస్కృతి క్షీణదశలోకి ప్రవేశించాయి. ఏమైనప్పటికీ, ఆ తర్వాత కూడా సిక్కు మహారాజా రంజిత్ సింగ్ (పాలనా కాలం 1799– 1837) సహా దక్షిణ ఆసియాలోని అనేక మంది పాలకుల ప్రాంతీయ ‘సామ్రాజ్యాల్లో’ దీనికి రాజాదరణ లభించింది. చిట్టచివరకు, 1839లో ఈ భాషకు మృత్యు ఘంటికలు మోగాయి. బ్రిటిష్ పాలకులు పర్షియన్ భాషను పరిపాలన, విద్యా బోధన వ్యవస్థల నుంచి తొలగించారు. నామమాత్రపు చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్‌ను బ్రిటిష్ వారు అధికారపీఠం నుంచి కూలదోశారు.మూలాలు ఏవైనప్పటికీ ఆర్య ద్రావిడ కలయిక నుంచి పుట్టిన సంస్కృతం స్థానాన్ని అలా పర్షియన్ ఆక్రమించింది. ఇక్కడ విశేష మేమిటంటే, లేత వర్ణ చర్మం (లైట్ స్కిన్) కలిగిన ఒక ఉన్నత వర్గం భాషను మరో ‘లైట్ స్కిన్’ ఉన్నత వర్గం భాష తోసి రాజంది. ఉత్తర భారత దేశంలో ఈ కులీన భాషలు చివరకు ప్రాంతీయ మాండలీ కాలతో కలిసిపోయి హిందావి లేదా ఉర్దూ అనే ఒక సామాజిక భాషగా రూపొందాయి. నిజానికి విభిన్న భాషలేనా?హిందీ, ఉర్దూలు రెండు విభిన్న భాషలు అన్న భావనకు 19వ శతాబ్దపు ప్రథమార్ధంలో ఫోర్ట్ విలియం కాలేజ్ అధ్యయనాల్లో స్పష్టత వచ్చిందని ‘ఇండియాలో భాష గురించిన సత్యం’ (ట్రూత్ అబౌట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా) అనే వ్యాసం (ఈపీడబ్ల్యూ, డిసెంబర్ 14, 2002)లో సంతోష్ కుమార్ ఖారే పేర్కొన్నారు. పర్షియన్/అరబిక్ నుంచి ఉర్దూ... సంస్కృతం నుంచి హిందీ తమ భాషా సాహిత్యాలను అరువు తెచ్చుకున్నాయని హిందీ పుట్టుక గురించి వివరించారు. కొత్తగా పుట్టుకొచ్చిన మధ్యతరగతి పట్టణ హిందూ, ముస్లిం/కాయస్థ వర్గాల సంకుచిత ప్రయోజనాల పోటీని అవి ప్రతిబింబించాయి. అసలైన బాధాకరమైన విషయం వ్యాసం ముగింపులో ఉంటుంది. అదేమిటంటే, ‘‘ఆధునిక హిందీ (లేదా ప్రామాణిక భాష) అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ సృష్టి. ఉర్దూ వ్యాకరణం,శైలిని పరిరక్షిస్తూనే దాన్ని విదేశీ పదాల నుంచి, గ్రామ్యాల నుంచి ప్రక్షాళన చేసి, వాటి స్థానంలో సంస్కృత సమానార్థకాలను చేర్చింది.’’హిందీకి ప్రధాన ప్రచారకర్త పాత్ర పోషిస్తున్న ఆర్ఎస్ఎస్ నేడు ఇండియాలో ఇంగ్లిష్ మాట్లాడేవారిని ‘మెకాలే పిల్లలు’ అంటూ ఎగతాళి చేసి ఆనందం పొందుతోంది. ఇదొక విషాదం!మోహన్ గురుస్వామి వ్యాసకర్త విధాన నిర్ణయాల విశ్లేషకుడు, రచయితmohanguru@gmail.com -
పాక్‌కు భారత్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Terrorist attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్, భారత్‌కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ హాట్లైన్లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించిన భారత్.. దాయాది దేశాన్ని హెచ్చరించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏయే రోజు ఎక్కడెక్కడ పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించిన భారత సైనిక అధికారులు.. ఇకపై కొనసాగిస్తే చర్యలు తప్పవని.. దీటుగా బదులిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. యుద్ధ వాతావరణం నెలకొనడంతో సరిహద్దు ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ (Pakistan) కూడా భద్రతాపరంగా పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్, స్కర్దు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) రద్దు చేసింది. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ కూడా గగనతలాన్ని నిఘాను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే లాహోర్, కరాచీ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని స్కర్దు, గిల్గిత్‌కు నడిచే విమాన సర్వీసులను పీఐఏ నిలిపివేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. -
పహల్గామ్ ఉగ్రదాడి.. ఇదే సరైన సమయమన్న మెగా కోడలు!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై అగ్ర సినీతారలంతా పెద్దఎత్తున స్పందించారు. ఈ దాడిని ఖండిస్తూ మెగాస్టార్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సైతం ట్వీట్ చేశారు. ఈ మారణకాండ దేశవ్యాప్తంగా పెద్దఎత్తను పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పలు నగరాల్లో రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అంటించి తొక్కుకుంటూ వెళ్లారు.అలా హిమాచల్ ప్రదేశ్‌లోనూ రోడ్లపై పాక్ జాతీయ జెండాలను అతికించారు. అందరూ వాటిపై నడుచుకుంటూ వెళ్తంటే ఓ యువతి మాత్రం పాక్ జెండాలను తీసేందుకు యత్నించింది. ఇది చూసిన కొందరు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి కాస్తా ఘాటుగా స్పందించింది.మన సైనికులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతుంటే.. కొందరు మాత్రం మనదేశంలోనే ఉంటూ దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడం చూస్తుంటే చాలా బాధగా ఉందని రాసుకొచ్చింది. ఇలాంటి సమయంలో శత్రుదేశంపై దాడి చేయడం మాత్రమే కాదు.. మనదేశం లోపల నుంచి కూడా శుద్ధి చేయాల్సిన సమయం కూడా వచ్చిందని లావణ్య ట్విటర్లో పోస్ట్ చేసింది. While our soldiers protect the nation with their lives, it’s disheartening to see some supporting those who harm it.It’s time to cleanse the country from within. https://t.co/Tl98IkwgRB— Lavanyaa konidela tripathhi (@Itslavanya) April 29, 2025 -
పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సాహసోపేత నిర్ణయం
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసారన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌పై చాలా సీరియస్‌గా ఉంది. ఏ క్షణంలోనైనా భారత బలగాలు పాకిస్తాన్‌పై దాడులు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది.పాక్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్టు ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్లో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు ఒప్పుకుంది. ఈ సిరీస్ మే 25 నుంచి జూన్ 3 వరకు జరుగుతుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం (FTP) ప్రకారం పాక్ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉండింది. అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరుగనుండటంతో ఇరు జట్ల బోర్డులు మూడు వన్డేల సిరీస్‌కు బదులు అదనంగా రెండు టీ20లు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాయి.ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించింది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు ఫైసలాబాద్, లాహోర్ నగరాల్లో జరుగనున్నాయి. మే 25, 27న తొలి రెండు టీ20లు ఫైసలాబాద్‌లో జరుగనుండగా.. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మిగిలిన మూడు టీ20లు మే 30, జూన్ 1, జూన్ 3 తేదీల్లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మే 21న పాకిస్తాన్‌కు చేరుకుంటుంది. ఫైసలాబాద్‌లో ఆ జట్టు మే 22-24వ తేదీ వరకు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది.ఇదిలా ఉంటే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది. తాజాగా పాక్‌కు అప్పు ఇవ్వొద్దని IMFకు సూచించింది. -
అప్పు ఇవ్వొద్దు.. పాక్‌పై భారత్ ఆర్థిక యుద్ధం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్ .. పాకిస్తాన్‌ను ఆర్ధికంగా మరింత ఇబ్బందే పెట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దాయాది దేశంపై భారత్ ఆర్థిక యుద్ధం ప్రకటించింది.పాకిస్తాన్‌కు అప్పు ఇవ్వొద్దంటూ భారత్ అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund - IMF) పై ఒత్తిడి చేస్తోంది. ఆ మేరకు అభ్యంతరం తెలిపింది. గతేడాదిలో ప్రకటించిన పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ విషయంలో సమీక్షించాలని కోరింది. పాక్‌కు నిధులు ఇస్తే ఉగ్రవాదులకు మళ్ళిస్తోందని ఐఏఎఫ్ మెంబర్స్‌కు భారత్ వివరిస్తోంది.మే 9న పాకిస్తాన్‌కు అప్పు ఇచ్చే అంశంపై ఐఎంఎఫ్ బోర్డు చర్చించనుంది. ఈ తరుణంలో పాక్‌కు ఎట్టి పరిస్థితుల్లో అప్పు ఇవ్వొదని భారత్ వాదిస్తోంది. ఇదే అంశంపై భద్రతామండలి నాన్ పర్మినెంట్ మెంబర్స్‌తో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరుపుతున్నారు. పాకిస్తాన్‌కు ఏడు బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీని సమీక్షించాలని కోరనున్నారుIndia can voice opposition to Pakistan’s $1.3 billion IMF loan, but its 2.63% voting share limits its influence. The IMF typically approves loans by consensus, and a formal vote only needs a simple majority, not an 85% supermajority. To block the loan, India would need to build…— Grok (@grok) April 29, 2025 -
పాక్ కపట నాటకం.. వరుసగా రోజు భారత సైన్యంపై పాక్ సైన్యం కాల్పులు
జమ్మూ : భారత్ ఓ వైపు సైనిక చర్యకు సిద్ధమైందని, ఆ పని చేయొద్దంటూ ఐక్య రాజ్య సమితిని పాకిస్తాన్ బతిమలాడుతోంది. అదే సమయంలో భారత్‌ను రెచ్చగొట్టేలా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి యధేశ్చగా కాల్పులకు తెగబడుతుంది. తాజాగా, మంగళవారం రాత్రి జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్, పరగ్వాల్ సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ సైన్యం భారీ కాల్పులు జరిపింది. పాక్ కాల్పులపై భారత సైన్యం స్పందించింది. జమ్మూ ప్రాంతంలోని మూడు ప్రధాన సెక్టార్లలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది. వరుసగా ఆరో రోజు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అంతే ధీటుగా భారత సైన్యం బదులిస్తోందని భద్రతా బలగాలు తెలిపాయి. BREAKING news :What kind of Pakistani army is this that is hell-bent on breaking its own country into 5 pieces?Pakistan indulges in ceasefire violation along the International Border (IB) in Jammu’s Akhnoor Sector, Pargwal. This is not LoC but IB making it a serious… pic.twitter.com/Z5VWPu4MVL— श्रवण बिश्नोई (किसान) (@SharwanKumarBi7) April 29, 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో ఉగ్రవాదులు 26మంది టూరిస్టుల ప్రాణాలు తీశారు. నాటి నుంచి భారత్-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సైనిక దుస్తులు ధరించిన అమాయకుల ప్రాణాల్ని తీయడంపై భారత్.. పాక్‌ను అన్నీ అంశాల్లో దెబ్బకు దెబ్బతీయాలనే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.ఇందులో భాగంగా ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 27 నుండి పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలన్నీ రద్దు చేసింది. అటారీ బోర్డర్‌ను తక్షణమే మూసివేసింది. -
Magazine Story: డెవిల్స్ డెన్ మేడ్ ఇన్ పాకిస్తాన్
-
పాక్ విమానాలకు నో ఎంట్రీ
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌పై మరిన్ని కఠిన ఆంక్షలను భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. తమ గగన తలం గుండా పాకిస్తానీ ఎయిర్‌లైన్స్ విమానాలు ప్రయాణించకుండా నిషేధం విధించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. భారత గగనతలాన్ని మూసివేస్తే పాకిస్తాన్ విమానాలకు ప్రయాణం మరింత భారమవుతుంది. సింగపూర్, మలేషియా వంటి ఆగ్నేయ ఆసియా దేశాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి చైనా లేదా శ్రీలంక మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది.మరోవైపు పాకిస్తాన్ నౌకలపైనా ఆంక్షలు అమల్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. భారత ఓడరేవుల్లో పాకిస్తాన్ నౌకలకు ఎలాంటి అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశానికి సైతం అనుమతి ఉండబోదు. ఇండియా విమానాలు ప్రయాణించకుండా తమ గగనతలాన్ని పాక్ ప్రభుత్వం గత వారం మూసి వేసిన సంగతి తెలిసిందే.పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగు తున్నాయి. ఇరుదేశాలు పరస్పరం ఆంక్షలు విధి స్తున్నాయి. ప్రధానంగా సింధూనది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేయడం సంచలనాత్మకంగా మారింది. ఇది తమపై ముమ్మాటికీ ప్రకటనేనని పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. -
పాక్‌కు భారత ఫార్మా ఉత్పత్తులు బంద్!
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నానాటికీ క్షీణిస్తున్నాయి. భారత్ నుంచి పాకిస్తాన్‌ను ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేయకుండా నిషేధం విధించే సంకేతాలు కనిపిస్తున్నాయి. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఫార్మా ఉత్పత్తుల వివరాలు ఇవ్వాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ పరిధిలోని డిపార్టుమెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్(డీఓపీ) కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖకు చెందిన ఎగుమతుల సంస్థ ‘ఫార్మెక్సిల్’ను ఆదేశించింది.ఇక్కడి నుంచి పాకిస్తాన్‌కు వెళ్లే ఔషధాలు, ఫార్మా స్యూటికల్స్ జాబితా రూపొందించాలని పేర్కొంది. ఈ వివరాలు చాలా అత్యవసరమని స్పష్టంచేసింది. ఇండియా నుంచి ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా దేశాలు ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఇందులో పాకిస్తాన్ 38వ స్థానంలో ఉంది. ప్రధానంగా ఇండియా నుంచి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్(ఏపీఐ) పాకిస్తాన్ దిగుమతి చేసుకుంటోంది. భారత్‌నుంచి దిగుమతులు ఆగిపోతే ఔషధాల ధరలు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. -
‘ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్‌నే’
జమ్మూ: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారం పాక్ టెర్రరిస్టులు.. టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డట్లు తేలింది.జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరీన్ వ్యాలీలో ఉగ్రవాదులు పర్యాటకులపై ఏ విధంగా కాల్పులకు తెగబడింది. ప్రాణాలు తీసింది. టూరిస్టులు తప్పించుకోకుండా టెర్రరిస్టులు ఎలా కాపలా కాసారో ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ను కేంద్ర దర్యాప్తు సంస్థ రికార్డ్ చేశారు. వాటి ఆధారంగా ఎగ్జిట్, ఎంట్రన్స్ గేటులో ఉగ్రవాదులు కాపలాప్రకృతి అందాల్ని ఆస్వాధిస్తున్న పర్యాటకులు తప్పించుకునేందుకు వీలు లేకుండా బైసరీన్ వ్యాలీలో ఎంట్రీ గేటు వద్ద ఇద్దరు ఉగ్రవాదులు కాపలా, ఎగ్జిట్ గేటు వద్ద ఒక ఉగ్రవాది కాపలా ఉండగా.. ఆ ఇద్దరికి సమాచారం అందించేందుకు బైసరీన్ వ్యాలీ బయట అడవిలో ఉన్నట్లు తేలింది. ముందుగా టెర్రరిస్టులు ఎంట్రీ గేటు దగ్గర పర్యాటకులపై కాల్పులు జరిపారు. కాల్పులు మోతతో ఒక్కసారిగా భయపడ్డ టూరిస్టులు ప్రాణ భయంతో ఎగ్జిట్ వైపు పరిగెత్తారు. అయితే, అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకుల్ని అడ్డుకున్నారు. తమవద్ద ఉన్న మెషీన్ గన్లతో పర్యాటకుల్ని బెదిరించారు. Grief beyond words. Can’t forget, can’t forgive. Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the Pahalgam terror attackThe couple got married on April 16. pic.twitter.com/GJXjG368i7— Anjana Om Kashyap (@anjanaomkashyap) April 23, 2025 ఉగ్రవాదుల తొలి ప్రాణం తీసింది లెఫ్టినెంట్ వినయ్ నార్వల్నేఎంట్రీ గేటు వద్ద టూరిస్టులను ఒక చోటకు చేర్చారు. అనంతరం మహిళలు, పురుషులు వేరు కావాలని ఆదేశించారు. అయితే, టూరిస్టులు టెర్రరిస్టుల మాటల్ని పట్టించుకోలేదు.దీంతో కోపంతో ఊగిపోయిన టెర్రరిస్టులు హిందువులు, ముస్లింలు వేర్వేరుగా నిలబడాలని సూచించారు. అయినా టూరిస్టులు పట్టించుకోలేదు.ఆ తరువాత, ఉగ్రవాదులు తాము ఇస్లాం మతం స్వీకరిస్తున్నామని అంగీకరిస్తూ ‘కల్మా’ఉచ్ఛరించమని పర్యాటకులను ఆదేశించారు. పర్యాటకులు కల్మా అనడం పూర్తయిన తర్వాత ఉగ్రవాదులు..అమాయకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకున్నారు. ఈ సమయంలో ఎంట్రీ గేటు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన మొట్టమొదటి వ్యక్తి భారత నేవీ అధికారి, లెఫ్టినెంట్ వినయ్ నార్వల్ అని తెలుస్తోంది.ఈ మరణాలు ఎక్కువగా టీ స్టాల్, భేల్ పూరి స్టాల్ సమీపంలో సంభవించాయి.ఈ రెండు ప్రాంతాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల భారీ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. -
త్రివిధ దళాలకు ప్రధాని మోదీ ఫ్రీ హ్యాండ్.. సైన్యమే స్థలం,టైం చూసి..
ఢిల్లీ: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో వరుస కీలక సమావేశాలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన త్రివిధ దళాదిపతులు సమావేశంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేలా త్రివిధ దళాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత దళాలపై పూర్తిగా నమ్మకం ఉంది. ఉగ్రవాదాన్ని అంత చేస్తాం. పహల్గాం దాడికి ధీటైన సమాధానం ఇస్తాం. సైన్యమే స్థలం,టైం చూసి జవాబు ఇస్తుంది’ అంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన రక్షణ శాఖ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనీల్ చౌహాన్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో గత బుధవారం భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి. భద్రతా బలగాల మొహరింపు వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రలో పాక్ కవ్వింపులు చర్యలకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పాక్ కవ్వింపులకు పాల్పడితే రక్షణ పరంగా ఎలా తిప్పికొట్టాలి. ఓ వైపు రక్షణ పరంగా దెబ్బకొడుతూనే.. దౌత్య పరంగా ప్రపంచ దేశాల ఎదుట పాకిస్తాన్‌ను ఇరుకున పెట్టేలా ఎలా దెబ్బకు దెబ్బ తీయాలనే తదితర అంశాలపై ప్రముఖంగా చర్చించారు. PM Modi chairs a meeting with Defence Minister, NSA, CDS and chiefs of all the Armed Forces. pic.twitter.com/fr9y5eVbet— ANI (@ANI) April 29, 2025 -
భారత్‌లో పాక్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత
ఢిల్లీ: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం నిలిపివేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్ముకశ్మీర్ పై పాక్ మంత్రి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఎక్స్ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాలను కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ, పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి భారత్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది.భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడమరోవైపు, భారత సైన్యం కదలికలపై పాక్ ఐఎస్ఐ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్థాన్ ఐఎస్ఐ ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు.. భారతీయ సైనిక్ స్కూల్ ఉద్యోగులమంటూ ఐఎస్ఐ ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలని.. తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది.కాగా, పహల్గాం దాడి తర్వాత పాక్ రక్షణ మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఇంకెంత దిగజారుతారు.. కార్గిల్‌లో ఓడించినా బుద్ధి రాలేదా.. అఫ్రిది వ్యాఖ్యలకు ధవన్ కౌంటర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది చేసిన అనుచిత వ్యాఖ్యలకు టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ గట్టి కౌంటరిచ్చాడు. అఫ్రిదిని ట్యాగ్ చేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చాడు. కార్గిల్‌లో ఓడించినా ఇంకా బుద్ధి రాలేదా..? ఇప్పటికే చాలా దిగజారారు. ఇంకెంత దిగజారుతారు. ఇలాంటి అర్ధరహిత వ్యాఖ్యలు చేసే బదులు మీ దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మాకు ఇండియన్ ఆర్మీ పట్ల చాలా గర్వంగా ఉంది. భారత్ మాతా కి జై. జై హింద్ అంటూ ట్వీట్ చేశాడు. Kargil mein bhi haraya tha, already itna gire hue ho aur kitna giroge, bewajah comments pass karne se acha hai apne desh ki taraqqi mai dimag lagao @SAfridiOfficial. Humein hamari Indian Army par bohot garv hai. Bharat Mata Ki Jai! Jai Hind!https://t.co/5PVA34CNSe— Shikhar Dhawan (@SDhawan25) April 28, 2025అఫ్రిదికి చురకలంటిస్తూ ధవన్ చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో వైరలవుతుంది. పాకీలకు ఈసారి మాటలతో బుద్ధి చెప్పినా ఉపయోగం లేదు. వారి అంతు చూడాల్సిందే అంటూ చాలా మంది భారతీయులు ధవన్ ట్వీట్‌కు రీట్వీట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అఫ్రిది వ్యాఖ్యలపై ధవన్ స్పందించిన వైనాన్ని మెచ్చుకుంటున్నారు.కాగా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అఫ్రిది ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని అన్నాడు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్ విసిరాడు.అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపాయి. అఫ్రిదిపై చాలామంది భారతీయులు సోషల్‌మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. భారత సైన్యంపై నోరు పారేసుకున్న ఆఫ్రిదిపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనదైన స్టయిల్లో కౌంటరిచ్చాడు. అఫ్రిది ఓ జోకర్, పనికిరాని వాడంటూ విమర్శించారు. పనికిరాని వాళ్ల వ్యాఖ్యలపై స్పందించడం అనవసరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రదాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు తగు రీతిలో బుద్ధి చెబుతుంది. సింధు జలాల ఒప్పందం సహా చాలా విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బలు కొట్టింది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను, ఆ దేశ జర్నలిస్ట్‌లను కూడా బ్యాన్ చేసింది. -
ప్రస్తుతం మన దగ్గర ఉన్నవి ఇవే సార్! క్షిపణుల బదులు 130 ఇవే బిగించాం!
-
ఉగ్రదాడి కేసులో బిగ్ అప్డేట్ NIA చేతిలో కీలక వీడియో
-
కశ్మీర్ ఉగ్రదాడి ఘటనపై పాక్ ప్రజలు ఏమనుకుంటున్నారు?
-
పాకిస్తాన్‌ను వదిలే ప్రసక్తే లేదు.. ఐరాసలో భారత్ హెచ్చరిక
న్యూయార్క్: అంతర్జాతీయ వేదికపై దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ హింసకు పాల్పడుతున్న పాకిస్తాన్ కుట్రలను ఐక్యరాజ్యసమితిలో భారత్ ఎండగట్టింది. పాకిస్తాన్ ఇకపై ఏం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించింది.తాజాగా ఐక్యరాజ్యసమితిలో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని భారత్ లేవనెత్తింది. న్యూయార్క్‌లో ‘ఉగ్రవాద అనుబంధ నెట్వర్క్ బాధితుల’ కార్యక్రమంలో ఐరాసకు భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధిగా ఉన్న యోజన పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నామని స్వయంగా పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బయటపెట్టారు. ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు ఏకంగా రక్షణ మంత్రి ఇటీవల అంగీకరించడాన్ని ప్రపంచం మొత్తం విన్నది. ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా పాకిస్తాన్‌ను ఎందుకు క్షమించాలి. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకొని చూస్తూ ఉండదు. భారత్‌పై నిరాధార ఆరోపణలు చేయడానికి ఈ అంతర్జాతీయ వేదికను పాక్ దుర్వినియోగం చేస్తోంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.VIDEO | Speaking at launch of Victims of Terrorism Associations Network, Deputy Permanent Representative of India in UN, Yojna Patel, said: "It is unfortunate that one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless… pic.twitter.com/I0tMhjjcmW— Press Trust of India (@PTI_News) April 29, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్, భారత్ మధ్య సంబంధాలు తెగిపోయి యుద్దం మేఘాలు కమ్ముకుంటున్న క్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో, ఉగ్రవాద గ్రూపులకు నిధులు, మద్దతునివ్వడంతో పాకిస్తాన్ పాత్ర ఉందని అంగీకరించారు. సుమారు మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాలకోసం ఈ నీచమైన పని చేశామంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, సోవియట్ యూనియన్ యుద్ధం, భారత్‌లో జరిగిన 9/11 దాడుల్లో పాల్గొనకపోయి ఉంటే పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మరోలా ఉండేది. భారత్ నుంచి దాడి జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే మేము మా బలగాలను పటిష్టం చేశాం. ఈ పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది, ఆ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పుకొచ్చారు. -
భారత్‌తో జాగ్రత్త.. పాక్ ప్రధానికి నవాజ్ షరీఫ్ హెచ్చరిక
లాహోర్: పహల్గాం అమానవీయ ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల సమసిపోవాలంటే దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని తమ్ముడు, పాక్ ప్రధాని షెహబాజ్‌కు నవాజ్ సలహా ఇచ్చారు.పాకిస్తాన్ స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్‌లో నవాజ్ షరీఫ్‌తో షహబాజ్ ఆదివారం భేటీ అయ్యారు. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తన ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయనకు వివరించారు. సింధూ నదీజలాల ఒప్పందం నుంచి భారత్ వైదొలిగిన విషయాలను వెల్లడించారు. భారత్ తీరు వల్లే ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నవాజ్ షరీఫ్ స్పందించి.. దూకుడుగా వ్యవహరించకుండా, భారత్‌తో శాంతి పునరుద్ధరణ కోసం అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను వినియోగించుకోవాలని తన తమ్ముడికి సూచించినట్టు చెప్పుకొచ్చింది. మరోవైపు.. షరీఫ్ కుమార్తె, పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మర్యమ్ సైతం ఇంతవరకు ఉగ్రదాడి ఘటనను ఖండిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్(Pakistan) రక్షణశాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతీకార దాడి జరగనున్న విషయం కాబట్టి.. మా బలగాలను అప్రమత్తం చేశాం. దాడుల జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నామని అన్నారు. అయితే, తన అంచనాలకు దారి తీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని తెలిపారు. ఈ విషయమై పాక్ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉందని భావిస్తే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని పేర్కొన్నారు. -
పాక్ పాచికల్ని పారనీయొద్దు!
పహల్గామ్లో 26 మంది నిండు ప్రాణాలను బలితీసుకున్న ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న అభిప్రాయం రోజురోజుకూ దేశంలో బలపడుతుండగా పాకిస్తాన్ మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతోంది. మొదటి నాలుగు రోజులూ ఉలకని, పలకని ఆ దేశం అటుతర్వాత ‘తటస్థ దర్యాప్తు’ రాగం అందుకుంది. ఆ మర్నాడే అణు బెదిరింపులకు దిగింది. మరోపక్క భద్రతా మండలిలో చడీచప్పుడూ లేకుండా లాబీయింగ్ సాగించి తన పాచిక పారేలా చూసుకుంది. ఇక్కడే మన లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ‘తీవ్రంగా’ ఖండిస్తు న్నట్టు తీర్మానం చెబుతున్నా అందులో దాడికి కారణమైన ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) సంస్థ పేరు ప్రస్తావనే లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. చైనా ఎప్పటిలాగే పాకిస్తాన్ వాదనతో శ్రుతి కలిపింది. కానీ మన కు చాలా సన్నిహితుడనుకున్న డోనాల్డ్ ట్రంప్ ఏలుబడి అమెరికాలో మొదలైనా పాక్‌తో ఆ దేశం అంటకాగుతున్న వైనం దిగ్భ్రాంతికరం కాదా? ఈమధ్యకాలంలో బలూచిస్తాన్‌లో రైలును దారిమళ్లించి అనేకుల్ని హతమార్చిన ఉదంతంలో భద్రతామండలి అందుకు కారణమైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పేరు ప్రస్తావించింది. 2019లో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి ఉదంతంలో సైతం జైషే మొహమ్మద్ (జేఈఎం) ప్రమేయాన్ని మండలి తీర్మానం ఎత్తి చూపింది. కానీ ఇప్పుడేమైంది? ఇక్కడికొచ్చేసరికి ఈ నీళ్ల నములుడు దేనికి? అమెరికా రూపొందించిన తీర్మానంలో తొలుత ప్రస్తావనకొచ్చిన టీఆర్ఎఫ్ పేరు ఎందుకు ఎగిరిపోయింది? ఏ సంస్థనూ మాటమాత్రంగానైనా ఖండించటానికి ముందుకురాని తీర్మానం ‘అంతర్జాతీయ శాంతికీ, భద్రతకూ విఘాతం కలిగించే ఉగ్ర ఘాతుకాలపై అన్నివిధాలుగా పోరాడతాం’ అని బడాయి పోవటం చిత్రం కాదా! ఆ ఘనకార్యం మేమే చేశామని విర్రవీగిన సంస్థ పేరెత్తటానికి మండలికున్న అభ్యంతర మేమిటి? అఫ్గాన్‌లో సోవియెట్ సైన్యాన్ని ఎదుర్కొనటానికి అమెరికా ఆశీస్సులతో ఉగ్రవాద శిబిరాలు నడిపిన పాపిష్టి చరిత్ర తమకుందని ఈమధ్యే పాక్ రక్షణమంత్రి అంగీకరించాడు. తాజా పరిణామాల నేపథ్యంలో అలాంటి లాలూచీ ఇంకా కొన సాగుతున్నదనుకోవాలా? ప్రధాని నరేంద్ర మోదీ మొన్న బిహార్‌లో కావొచ్చు... తాజాగా ‘మన్ కీ బాత్’లో కావొచ్చు, పహల్గామ్ ఉదంతంలో బాధితులకు సరైన న్యాయం దక్కేలా చేస్తామని స్పష్టం చేశారు. పాత్ర ధారుల్ని, సూత్రధారుల్ని తీవ్రాతితీవ్రంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. మంచిదే. అయితే ఈ కృషి బహుముఖాలుగా వుండాలి. ఉగ్రవాదుల్ని పట్టి బంధించటానికి ప్రయత్నించటంతో పాటు అంతర్జా తీయంగా పాక్‌ను ఏకాకిని చేయటానికి కృషి చేయాలి. ఉగ్రసంస్థల్ని కిరాయి ముఠాలుగా వాడుకుంటున్న దాని నైజాన్ని అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టాలి. పాకిస్తాన్ తెరవెనకుండి భద్రతామండలి తీర్మానంలో చేయించిన మార్పులు చిన్నవేమీ కాదు. ఉగ్ర సంస్థ టీఆర్ఎఫ్తో పాక్ సర్కారు ఎంతగా చెట్టపట్టాలు వేసుకున్నదో మండలిలో జరిగిన పరిణామాలే తేటతెల్లం చేస్తున్నాయి. తీర్మానంలో టీఆర్ఎఫ్ ప్రస్తావన లేకుండా చేసిన క్షణాల్లోనే ఆ ఉగ్ర సంస్థ తన పాత ప్రకటన ‘అధికారికమైనది’ కాదంటూ స్వరం మార్చటం గమనించదగ్గది. దాడి జరిగిన వెంటనే తామే అందుకు కారకులమని చెప్పిన ఆ సంస్థ మండలిలో పాక్ వాదనకు అనుగుణంగా ఆ ప్రకటన తమది కాదనటమే కాదు... నింద మోపటం కోసం భారత సైన్యం కావాలని చేసిన పనిగా ఆ ఉదంతాన్ని వక్రీకరించే ప్రయత్నం చేసింది. లష్కరే తోయిబా విషపుత్రిక అయిన టీఆర్ఎఫ్ 2020 నుంచీ జమ్మూకశ్మీర్‌లో అనేక దాడులకు పాల్పడుతోంది. ఆ సంస్థను మన దేశం నిషేధించింది కూడా! ఏదో విధంగా మన దేశాన్ని ఇబ్బందులపాలు చేయటం కోసం ఏళ్ల తరబడి స్వయంగా నిర్మించిన ఉగ్రవాద సాలెగూటిలో తానే చిక్కుకుని పాకిస్తాన్ తరచు విలవిలలాడుతోంది. 2015లో పెషా వర్ కంటోన్మెంట్ ప్రాంతంలోని పాఠశాలపై ఉగ్రవాదులు ఒక్కుమ్మడిగా విరుచుకుపడి 140 మంది బాలబాలికల్ని కాల్చిచంపారు. ఆ మరుసటి ఏడాది క్వెట్టాలో పోలీసు శిక్షణ కేంద్రం ఆవరణలోకి ప్రవేశించి 60 మందిని హతమార్చారు. ఒక యూనివర్సిటీపై దాడికి దిగి ప్రొఫెసర్‌తోపాటు 20 మంది విద్యార్థుల ప్రాణాలు తీశారు. ఈ మాదిరి ఉదంతాలు ఎన్నెన్నో. అయినా పాకిస్తాన్ వైఖరిలో ఆవగింజంతైనా మార్పు లేదు. పశ్చాత్తాపం అసలే లేదు. పహల్గామ్ దాడిని ఖండించకుండా పర్యాటకులు ప్రాణాలు కోల్పోవటం విచారకరమంటూ ప్రకటన చేసి చేతులు దులుపుకుంది.పాకిస్తాన్ తీరు మారదని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దబాయింపు చూస్తే తెలుస్తుంది. ఉగ్రదాడిపై ఆయనగారికి ‘తటస్థ, పారదర్శక, విశ్వసనీయ’ దర్యాప్తు కావాలట! అసలు తన ఎన్నికే సంశయాస్పదమైంది. పాక్ సైన్యం అండదండలతో అందలమెక్కిన చరిత్ర షెహబాజ్‌ది. 2016నాటి పఠాన్‌కోట్ ఉగ్రదాడి తర్వాత జరిగిన ఇరు దేశాల సంయుక్త దర్యాప్తును నీరు గార్చిందెవరు? పాక్ ప్రతినిధులు మన దేశం వచ్చి దర్యాప్తులో పాల్గొని వెళ్లగా, మన ప్రతినిధి బృందాన్ని మాత్రం పాక్ గడ్డపైకి అనుమతించని వైనం, తాము సేకరించిన సాక్ష్యాలను భారత్‌తో పంచుకోని తీరు షెహబాజ్ మరిచారా? 2008 నాటి ముంబై పేలుళ్ల ఉదంతంలో ఇచ్చిన సాక్ష్యాధారాలకు ఏ గతి పట్టించారో గుర్తులేదా? అణ్వాయుధ దాడికి సిద్ధమంటూ బెదిరింపులకు దిగుతున్న పాక్ దుష్ట పన్నాగాలను ప్రపంచ దేశాలకు తెలియజెప్పాలి. అందుకు దౌత్యపరంగా మరింత కృషి చేయాలి. దాంతోపాటు అన్నివిధాలా సంసిద్ధతలు పెంపొందించుకోవాలి. సామాజిక మీడియాలో కశ్మీరీలపై విద్వేషాన్ని కక్కే అవాంఛనీయ శక్తుల ఆటకట్టించాలి. ఇది కలసికట్టుగా నిలబడాల్సిన కాలమని చాటాలి. -
‘ఛీ’నా రాజకీయం...
అవకాశం దొరికింది కదాని ఇండియాను పాకిస్థాన్ భుజాల మీదుగా కాల్చాలని ప్రయత్నిస్తోంది కుటిల చైనా. ఆ దిశగానే బీజింగ్-ఇస్లామాబాద్ రక్షణ భాగస్వామ్యం బలపడుతోంది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్న తరుణంలో... గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల తమ అత్యాధునిక పీఎల్-15 క్షిపణులను పాక్ వైమానిక దళానికి చైనా అందించింది.బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) పీఎల్-15 క్షిపణులను మోసుకెళుతున్న తమ జేఎఫ్-17 బ్లాక్ 3 యుద్ధ విమానాల ఫొటోలను పాక్ వైమానిక దళం (పీఏఎఫ్) ఇటీవల విడుదల చేయడం గమనార్హం. ‘పీఏఎఫ్’కు చైనా సరఫరా చేసినవి ఎగుమతులకు ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ రకం క్షిపణులు అనుకుంటే పొరపాటు! తమ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్)కు చెందిన సొంత పీఎల్-15 క్షిపణులను చైనా నేరుగా పాక్ కు అందజేసినట్టు ‘యూరేషియన్ టైమ్స్’ ఓ కథనం ప్రచురించింది.భారత్, పాక్ నడుమ వైరం ముదురుతున్న అత్యంత కీలక తరుణంలో ఆగమేఘాలపై ఆయుధాలను సరఫరా చేయడానికి చైనా ఈ మార్గం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరింత ఎక్కువ దూరం నుంచి భారత్ విమానాలను లక్ష్యంగా చేసుకోగల సామర్థ్యాన్ని పీఎల్-15 క్షిపణులు పాక్ యుద్ధ విమానాల పైలట్లకు కల్పిస్తాయి. అలా శత్రువుపై గెలుపును సునాయాసం చేస్తాయి.ఏమిటీ పీఎల్-15 మిసైల్?పీఎల్-15 క్షిపణి ఆధునిక వైమానిక యుద్ధరంగంలో చైనాకు ఓ ప్రధానాస్త్రం. ఇది ప్రభుత్వ ఏరోస్పేస్ సంస్థయిన ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (ఏవీఐసీ) అభివృద్ధి చేసిన రాడార్ గైడెడ్ దూరశ్రేణి క్షిపణి. ధ్వని వేగానికి ఐదు రెట్లు (మ్యాక్ 5) మించిన వేగంతో గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించదగ్గ ఈ మిసైల్ 200-300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.విదేశాలకు ఎగుమతి చేయడానికి ఉద్దేశించిన ‘పీఎల్-15ఈ’ వెర్షన్ మిసైల్ 145 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే ఛేదించగలదు. జే-10సి, జే11-బి, జే-15, జే-16, జేఎఫ్-17 బ్లాక్ 3, జే-20 విమానాలకు పీఎల్-15 క్షిపణిని అమర్చవచ్చు. 160 కిలోమీటర్ల రేంజితో, శబ్ద వేగానికి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణించగల అమెరికాకు చెందిన ఏఐఎం-120డి అమ్రామ్ క్షిపణితో పోలిస్తే రేంజి, వేగం పరంగా మెరుగైన ఈ పీఎల్-15 మిసైల్ 2018 నుంచి చైనా వైమానిక దళానికి సేవలు అందిస్తోంది.పీఎల్-15 వర్సెస్ మీటియర్... యూరోపియన్ ఎంబీడీఎం మీటియర్ క్షిపణితో పీఎల్-15ను పోల్చవచ్చు. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగల మీటియర్, ఎంఐసీఏ దూరశ్రేణి క్షిపణులను ప్రస్తుతం భారత్ చెంత ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలకు అమర్చవచ్చు. లాంచ్ ప్లాట్ ఫాం, ఎత్తు, లక్ష్యపు చలనశీలత అంశాలపై ఆధారపడి మీటియర్ మిసైల్ పరిధి 100-200 కిలోమీటర్లు ఉంటుంది. ధ్వని వేగానికి నాలుగు రెట్లు మించిన వేగాన్ని అది అందుకోగలదు. సామర్థ్యం పరంగా పీఎల్-15ఈ (ఎగుమతి రకం)తో మీటియర్ క్షిపణిని పోల్చవచ్చు. కానీ పీఎల్-15 స్టాండర్డ్ వెర్షన్ (పాక్ కు చైనా సరఫరా చేసిన ప్రామాణిక రకం) మాత్రం మీటియర్ కంటే అధిక వేగం, దూరశ్రేణి గల క్షిపణి. రాంజెట్ ఇంజిన్ సాయంతో మీటియర్ క్షిపణి ప్రయాణమంతటా స్థిర వేగంతో దూసుకెళుతుంది.ఇందుకు భిన్నంగా పీఎల్-15 మిసైల్ డ్యూయల్ పల్స్ ఘన ఇంధన రాకెట్ మోటార్ సాయంతో ప్రయాణిస్తుంది. ఇందులోని ఘన ఇంధనం కొద్దిసేపు మాత్రమే జ్వలించినప్పటికీ రాంజెట్ ఇంజిన్ గల మీటియర్ కంటే ఎక్కువ వేగం అందిస్తుంది. అయితే ధ్వనికి ఐదు రెట్లు పైబడిన స్పీడ్ అందుకున్నా ప్రయాణం పొడవునా అదే వేగాన్ని పీఎల్-15 మిసైల్ కొనసాగించలేదు! క్షిపణుల బయటివైపు చిన్న రెక్కల్లాంటి భాగాలు (ఫిన్స్) ఉంటాయి. వాటిని మడవగలిగితే మరిన్ని క్షిపణులను యుద్ధవిమానాలకు అమర్చవచ్చు. ఈ బుల్లి రెక్కల్ని మడిచిన పీఎల్-15 క్షిపణి నమూనాను చైనా నిరుడు జూహాయ్ ఎయిర్ షోలో ప్రదర్శించింది. దీంతో జే-20 లాంటి యుద్ధవిమానాలు నాలుగు బదులుగా ఆరు పీఎల్-15 మిసైళ్లను మోసుకెళ్లే వీలు కలిగింది.రష్యన్ ‘ఆర్-37ఎం’ వైపు భారత్ చూపు?పాక్ మోహరించిన పీఎల్-15 మిసైళ్లతో భారత వైమానిక దళానికి తలనొప్పి తప్పేలా లేదు. వాటిపై పైచేయి సాధించే ఆప్షన్ ఇండియాకు లేకపోలేదు. అది... రష్యాకు చెందిన అత్యాధునిక ఆర్-37ఎం దూరశ్రేణి క్షిపణి! అతిధ్వానిక వేగాన్ని (మ్యాక్ 6) అందుకోగల ఈ హైపర్ సానిక్ మిసైల్ 300-400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను తుత్తునియలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా దీన్ని విస్తృతంగా వినియోగించింది. ఉక్రెయిన్ వైమానిక దళానికి ఆర్-37ఎం క్షిపణి నుంచే ప్రధాన ముప్పు ఎదురైందంటే అతిశయోక్తి కాదు.ఆర్-37ఎంను అమర్చిన మిగ్-31 విమానాలు పలు ఉక్రెయిన్ యుద్ధ విమానాలను కూల్చివేశాయి. ఉక్రెయిన్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని సైతం ఈ మిసైల్ సాయంతో రష్యా కూల్చివేసినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. విశేషం ఏమిటంటే సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 యుద్ధ విమానాలపై ఆర్-37ఎం క్షిపణులను మోహరించవచ్చు. భారత్ వద్ద ‘సుఖోయ్ ఎస్యు-30’ శ్రేణికి కొదవ లేదు. ప్రస్తుతం మనకు 260కి పైగా సుఖోయ్ ఎస్యు-30ఎంకెఐ యుద్ధ విమానాలు ఉన్నాయి.వాటిని సుఖోయ్ ఎస్యు-30ఎస్ఎం2 వేరియంట్లుగా ఉన్నతీకరించే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. ఎస్యు-30ఎంకెఐ విమానాలకే ఆర్-37ఎం క్షిపణులను అమర్చాలంటే పెద్ద సాంకేతిక ప్రక్రియ ఉంది. దాదాపు 84 ఎస్యు-30ఎంకెఐ విమానాలను ఎస్ఎం2 వేరియంట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయడానికి రూ.63 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఆర్-37ఎం క్షిపణులను ఇండియాకు విక్రయించడానికి రష్యా కూడా ఆసక్తి కనబరుస్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలపై ఈ క్షిపణులను మోహరించే అంశంలోనూ చర్చలు సాగుతున్నాయి. 2019లో బాలాకోట్ దాడుల సందర్భంగా ఇండియాకు చెందిన మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని పాక్ తన ఎఫ్-16 విమానం-అమ్రామ్ క్షిపణితో కూల్చివేసింది. నాడు ఇండియా చెంత దూరశ్రేణి క్షిపణులు లేకపోవడం పెద్ద లోటు. ఆ తర్వాత మీటియర్ క్షిపణులను అమర్చిన రాఫెల్ విమానాలను భారత్ మోహరించింది. - జమ్ముల శ్రీకాంత్ -
Pahalgam Incident: పాకిస్థాన్‌కు అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్
-
విశాఖలో పాకిస్తాన్ దేశస్తులను గుర్తించిన పోలీసులు
-
అమాయకులను పొట్టనబెట్టుకున్నారు: వాళ్ల పాపానికి మేం మూల్యం చెల్లిస్తున్నాం!
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో పౌరులు, పర్యాటకులు సహా 26 మంది మరణించిన ఘటనలో కేంద్రం పాక్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయులు భారతదేశం నుండి వెళ్లి పోతున్నారు. ఈ సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురవుతున్నారు. ఎవరో చేసిన పాపానికి తాము శిక్ష అనుభవిస్తున్నామంటూ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం నివేదికల ప్రకారం గురువారం నుండి దాదాపు 700 మంది అట్టారి-వాఘా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశాన్ని వీడారు. వీరిలో పర్యాటకులు , వైద్య చికిత్స కోసం భారతదేశానికి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది తమకు వేరే మార్గం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. అంతేకానీ ఈ పరిస్థితిని ప్రశ్నిస్తున్నారు.అట్టారి-వాఘా సరిహద్దును దాటే ముందు తాను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ను సందర్శించడానికి వచ్చానని ఒక మహిళ తెలిపింది. కానీ వేరెవరోపాపానికి తాను 'శిక్ష అనుభవిస్తున్నానని' ఆమె వాపోయింది. పహల్గామ్లో జరిగింది తప్పు... అమాయకులను వారు పొట్టన బెట్టుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.#WATCH | Punjab | A Pakistani national returning to Pakistan via Attari Border says, "... We came to visit Nagpur and since our visa expired, we are going back... Someone else is being punished for someone else's deeds... Whatever happened in Pahalgam was wrong and innocents… pic.twitter.com/OBbf1wkYXW— ANI (@ANI) April 28, 2025పాకిస్తాన్‌లోని అమర్‌కోట్ నివాసి అయిన మరో వ్యక్తి మాట్లాడుతూ జనవరి నుండి పంజాబ్‌లోని బంధువుతో ఉంటున్నాననీ, దీర్ఘకాలిక వీసా లేనందున, భారత్ ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి వెళ్లిపోతున్నామని తెలిపారు. పహల్గామ్లో జరిగినది తప్పు.. కానీ దానికి మనం మూల్యం చెల్లిస్తున్నాం."అంటూ విచారం వ్యక్తంచేశారు. ఈ విషయంలో "రెండు దేశాలు కలిసి పనిచేస్తే మంచిది," అని ఆయన అన్నారు. కాల్పులు, బాంబులు, ఉగ్రవాద దాడుల కంటే శాంతి, సామరస్యం ,వాణిజ్య మార్పిడి ద్వారా వారికి మంచి ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.కాగా ఏప్రిల్ 22 దాడి తర్వాత భారతదేశం పాక్ జాతీయులకు వీసాలను నిలిపివేసింది. ఆదివారం ఆ సస్పెన్షన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం భారతదేశంలో కొనసాగే ఏ పాక్ జాతీయుడైనా గడువు లోపు వెళ్లకపోతే, మూడేళ్ల జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా విధించవచ్చు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వారి వారి అధికార పరిధిలో నివసిస్తున్న లేదా ఉంటున్న పాక్ జాతీయులను గుర్తించి వెనక్కి పంపించివేయాలని ఆదేశించింది. మరోవైప పహల్గామ్ ఉగ్ర వాద దాడి తర్వాత, జమ్మూ కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా దళాలు ఎంపిక చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నాయి. ఇప్పటివరకు దాదాపు 10 ఇళ్లను ఇలా కూల్చివేసినట్టు సమాచారం. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! -
Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం!
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam) ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పటికే సంబంధాలు దెబ్బతిన్నాయి. ‘మినీ స్విట్జర్లాండ్’ లాంటి పహల్గామ్లో ఏప్రిల్ 22న 26 మందిని దారుణంగా కాల్చి చంపిన ఘటన తరువాత కేంద్రం చాలా సీరియస్‌గా స్పందిస్తోంది. ముఖ్యంగా అట్టారి-వాఘా సరిహద్దు మూసివేత, పాకిస్తానీల వీసాల రద్దుతో సహా అనేక ఆంక్షలను భారత ప్రభుత్వం విధించింది. దాదాపు అన్ని రకాల వీసాలను రద్దు చేసి 72 గంటల్లోగా స్వదేశానికి వెళ్లిపోవాలంటూ గడువు విధించింది. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు దేశాన్ని వీడకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భారతదేశం విడిచి వెళ్లని పాకిస్తానీ జాతీయులను అరెస్టు చేసి, విచారణకు ఆదేశించవచ్చు ,మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ.3 లక్షల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (SAARC) వీసాలు కలిగి ఉన్నవారు భారతదేశం విడిచి వెళ్లడానికి చివరి తేదీ ఏప్రిల్ 26. వైద్య వీసాలు కలిగి ఉన్నవారికి, చివరి తేదీ ఏప్రిల్ 29.ఆదివారం నాటికి భారతదేశం విడిచి వెళ్లాల్సిన 12 కేటగిరీల వీసాలు- వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు మరియు గ్రూప్ యాత్రికులు. ఏప్రిల్ 27 నాటికి భారతదేశం నుండి వెళ్లిపోవాల్సిన 12 రకాల వీసాదారులు : వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, సందర్శకులు, గ్రూప్ టూరిస్ట్, యాత్రికులు మరియు గ్రూప్ యాత్రికులు.పహల్గామ్ దాడి తర్వాత ఏప్రిల్ 23న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన క్యాబినెట్ భద్రతా కమిటీ (CCS) సమావేశంలో కేబినెట్ కమిటీ సిఫార్సుల మేరకు, పాక్ పౌరులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేస్తూ భారత ప్రభుత్వంనిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.కాగా తాజా ఆంక్షల నేపథ్యంలో అట్టారి-వాఘా సరిహద్దు పాయింట్ ద్వారా 272 మంది పాకిస్తానీ జాతీయులు భారతదేశం నుండి బయలుదేరారు .మరికొన్ని వందల మంది ఏప్రిల్ 27, 2025 ఆదివారం నాడు పొరుగు దేశానికి చెందిన 12 కేటగిరీల స్వల్పకాలిక వీసాదారుల గడువు ముగిసే సమయానికి నిష్క్రమించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ దాడిలో తమకు ఎలాంటి సంబంధం లేదని పాకిస్తాన్ ఖండించింది. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ప్రారంభంలో పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. ఆ తరువాత ఈ దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించింది. -
ఉగ్రదాడిలో బిగ్ ట్విస్ట్.. సీన్ లోకి చైనా
-
పాక్ కు చెందిన యూట్యూబ్ ఛానళ్లపై భారత్ లో నిషేధం
-
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌పై ఎంపీ అసదుద్దీన్ ఆగ్రహం
ఢిల్లీ: మీరు మా కంటే (భారత్) అరగంట వెనకబడలేదు.. అర్థ శతాబ్ధం వెనకబడ్డారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. అదే సమయంలో భారత్‌లో పలు టీవీ ఛానెళ్ల యాంకర్లపై మండిపడ్డారు. కాశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఆదివారం మహారాష్ట్ర పర్భానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై దాడి చేసేందుకు తాము అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్ నాయకుల హెచ్చరికలపై ఆయన స్పందించారు. ‘తమ వద్ద అణు బాంబులు, అణు బాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం ఎందుకు మౌనంగా ఉంటుంది. అందుకు గట్టిగానే బదులిస్తోంది.మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారుఅభివృద్ధిలో మా దేశానికి, మీ దేశానికి పోలిక ఎక్కడా? అభివృద్ధిలో మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదు’ అని గుర్తు చేశారు. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ (అరబ్ భాషలో తీవ్రవాదులు) కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్ఐఎస్ వారసులని చూపిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.Parbhani, Maharashtra: AIMIM Chief Asaduddin Owaisi says, "Pakistan always talks about being a nuclear power; they need to remember if they enter a country and kill innocent people, that country will not sit quietly. No matter the government, by killing our people on our land,… pic.twitter.com/zB80FJcY8G— ANI (@ANI) April 27, 2025 ప్రధాని మోదీకి ఎంపీ అసదుద్దీన్ డిమాండ్అంతేకాదు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి, హ్యాకర్లను ఉపయోగించి ఆ దేశంలో ఇంటర్నెట్ను హ్యాక్ చేసేందుకు భారత్‌కు అనుమతి ఉందని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలహీన పరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.షేమ్పలు టీవీ ఛానెళ్లలో పనిచేసే యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షేమ్. కశ్మీర్ మన అంతర్భాగం. కాశ్మీరీలు కూడా మనదేశంలో అంతర్భాగమే. అలాంటి వారిని మనం ఎలా అనుమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించింది ఓ కాశ్మీరీనే. గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచింది కూడా ఓ కాశ్మీరీనే అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎత్తి చూపారు. -
కుటుంబంతో పాటుగా దేశాన్ని విడిచి పారిపోయిన పాక్ ఆర్మీ చీఫ్
-
ఎల్ వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులు
-
పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన భారత్.. వాటిపై నిషేధం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం మరో షాకిచ్చింది. పాకిస్తాన్ యూట్యూబ్ ఛానళ్ల(Ban on Youtube Channels)పై భారత్ ఉక్కుపాదం మోపింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై భారత్‌లో నిషేధం విధించారు. ఇక, నిషేధం విధించిన వాటిలో మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానల్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్ ట్విట్టర్, సినిమాలపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీబీసీ చానల్స్‌కు సైతం భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించిన బీబీసీకి ప్రభుత్వం నోటీసులు అందజేసింది.భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్ న్యూస్, జియో న్యూస్, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది.🚨 BIG BREAKING Modi govt BANS 16 #Pakistani #YouTube channels, including Dawn, Samaa TV, ARY, Geo News etc for spreading provocative content and false narratives against India, Army, and security forces after the Pahalgam terror attack.— Shoaib Akhtar’s channel also BLOCKED pic.twitter.com/DOzHwxgp4N— HIND KE SITARA ✨ (@ChanakyaRashtra) April 28, 2025ఇందులో భాగంగా.. ఈ ఛానళ్లను తెరవగానే.. కంటెంట్ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని కనిపిస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
130 అణు క్షిపణులు భారత్ కోసమే.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. దాయాదితో టచ్‌లోకి చైనా
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి ఘటన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను పెంచింది. ఇందులో భాగంగా పాకిస్తాన్ విషయంలో భారత్ పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పొరుగు దేశం చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారత్- పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలని చైనా భావిస్తోంది అంటూ ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి చెప్పుకొచ్చారు.తాజాగా చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఈ క్రమంలో వాంగ్ యీ మాట్లాడుతూ..‘పాకిస్తాన్, భారత్ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాలు సంయమనం పాటించాలని బీజింగ్ భావిస్తోంది. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోంది’ అని చెప్పినట్లు చైనా మీడియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనాలు జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ‘ఈ ఘటన దర్యాప్తు విషయంలో రష్యా, చైనా లేదా పశ్చిమ దేశాలు సానుకూల పాత్ర పోషించగలవు. భారత్, మోదీ అబద్ధం చెబుతున్నారా? లేదా.. పాకిస్తాన్ నిజం చెబుతుందా? అనేది వెలికితీసేందుకు దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు’ అని కథనాలు వెలువడ్డాయి.China breaks its silence on the ongoing tensions between India and Pakistan.Chinese Foreign Minister Wang Yi spoke with Pakistan’s Deputy PM Ishaq Dar today and said that China supports Pakistan in safeguarding its sovereignty and security interests. pic.twitter.com/wIUt1Yz0UJ— Salt News (@SaltNews_) April 27, 2025మరోవైపు.. పహల్గాంలో ఉగ్ర దాడిని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ఖండించారు. ఈ విషయంలో భారత్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి ప్రపంచం ఎదుర్కొంటున్న బెదిరింపులను ఈ దాడి గుర్తు చేసిందని పేర్కొన్నారు. దాడి అనంతరం భద్రతా దళాలు స్పందించిన తీరును ప్రశంసించారు. ‘కశ్మీర్లో ఇటీవల జరిగిన దాడిలో మరణించిన వారికి ఎఫ్‌బీఐ సంతాపం తెలుపుతోంది. భారత్ ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.పహల్గాం ఉగ్ర దాడిని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఖండించారు. ఉగ్రవాదాన్ని అడ్డుకోవడానికి ప్రాంతీయ సమన్వయం అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి తాను ఫోన్ చేసి దాడిని ఖండించినట్లు ఆయన ప్రకటించారు. పహల్గాం దుర్ఘటనలను ఈ ప్రాంతంలోని దేశాలు ఉమ్మడి బాధ్యతగా తీసుకుని స్పందించాలని సూచించారు. ఇరాన్లో పర్యటించాలని ప్రధాని మోదీకి ఆయన ఆహ్వానం పలికారు. -
LoC వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. దీటుగా బదులిచ్చిన భారత్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. కుప్వారా, పూంచ్‌లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌పై అంతే దీటుగా బదులిచ్చింది. మరోవైపు, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ స్పందించింది. భారత్ - పాకిస్తాన్ మధ్య జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని సరిహద్దును వేరు చేసే సైనిక నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద పాక్ వరుసగా నాలుగు రోజుల నుంచి సీజ్ ఫైర్ నిబంధల్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది. ఏప్రిల్ 27,28వ తేదీలలో కుప్వారా,పూంచ్ జిల్లాలో ఎల్వోసీ వద్ద పాక్ సైన్యం భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అదే రీతిలో వేగంగా బదులిచ్చింది’ అని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు 26మంది టూరిస్టులపై కాల్పులు జరిపి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. ఈ దాడి జరిపింది పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థకు లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని తేలింది. అందుకు తగ్గ ఆధారాల్ని సైతం భారత దర్యాప్తు సంస్థలు సేకరించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎలోవోసీ వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం వెల్లడించింది. -
పాక్ వెళ్లేందుకు ముగిసిన గడువు
చండీగఢ్/న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో దేశం వీడేందుకు పాకిస్తానీలకు భారత్ నిర్దేశించిన గడువు ఆదివారంతో ముగిసింది. వారికి అన్ని రకాల వీసాలనూ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. దాంతో గత నాలుగు రోజుల్లో అటారీ–వాఘా సరిహద్దు గుండా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్‌కు తిరిగి వచ్చినట్టు పేర్కొన్నారు. కొందరు పాకిస్తానీలు తిరిగి వెళ్లేందుకు వాయుమార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృంద పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీలకు మంజూరుచేసిన 12 రకాల వీసాల గడువును భారత్ రద్దుచేయడం తెల్సిందే. దాంతో కొద్ది రోజులుగా పాకిస్తానీలు అటారీ–వాఘా బోర్డర్ వద్ద వందలాదిగా బారులు తీరుతున్నారు. ఆ దారంతా వాహనాలు కని్పంచాయి. వారిని సాగనంపేందుకు వచ్చిన భారత బంధువులు ఉద్వేగంతో వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు కనిపించాయి. మెడికల్ వీసాపై వచ్చిన వారికి మాత్రం భారత్ వీడేందుకు మంగళవారం దాకా గడువుంది. కాగా, గడువు తీరిన నేపథ్యంలో ఇంకా భారత్‌లోనే ఉన్న పాకిస్తానీలను అరెస్టు చేస్తామని కేంద్రం తెలిపింది. వారికి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తారు. ఈ నెల 4న అమల్లోకి వచ్చిన వలసలు, విదేశీయుల చట్టం ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం పేర్కొంది. ఢిల్లీలో 5,000 మంది ఢిల్లీలో 5,000 మంది పాకిస్తానీలున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ఆ జాబితాను పోలీసులకు అందజేసింది. అక్రమంగా ఉంటున్న పాకిస్తానీలను గుర్తించి సమాచారమివ్వాలని ఢిల్లీ హోం మంత్రి ఆశిష్ సూద్ ప్రజలను కోరారు. వారిని తిప్పి పంపేలా కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచించారు. దీర్ఘకాల వీసాలతో వచ్చిన పాకిస్తానీలు మహారాష్ట్రలోనూ 5,050 దాకా ఉంటారని అధికారులు తెలిపారు. తమ రాష్ట్రంలోని పాకిస్తానీలంతా వెళ్లిపోయారని బిహార్ ప్రకటించింది. కేరళలో 104 మంది ఉన్నట్లు గణాంకాల వెల్లడిస్తున్నాయి. తమ రాష్ట్రం నుంచి 228 మంది వెళ్లిపోయారని మధ్యప్రదేశ్ సర్కార్ తెలిపింది. -
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
బెంగళూరు: పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని. భారత్ శాంతిప్రియ దేశం. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీని విమర్శించారు. సిద్ధరామయ్య.మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’దీనిపై కర్ణాటక బీజేపీ తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్ లో , పాకిస్తాన్ బోర్డర్ లో సిద్ధరామయ్య పేరు మారుమ్రోగుతోంది. ‘ మీరు పాకిస్తాన్ రత్న’ కర్ణాటక బీజేపీ ధ్వజమెత్తింది. మన దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించిన బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రన్... పాకిస్తాన్ కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై సంతకం చేసినప్పుడు పాకిస్తాన్ చాలా సంతోషం ఉంది. కాబట్టే అప్పుడు రావల్పిండి వీధ/ల్లో నెహ్రూను ఓపెన్ జీప్ లో తీసుకెళ్లారు. పాకిస్తాన్ లో ఓపెన్ జీప్ లో తిప్పబడే భారత దేశ తదుపరి రాజకీయ నేత మీరు అవుతారా సిద్ధరామయ్య అవుతారా? అని ప్రశ్నించారు బీజేపీ చీఫ్‌ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప విమర్శించారు. ‘ మనదేశం అంతా ఒక్కటిగా ఉండాల్సిన సమయంలో ఈ తరహ మాటాలేమిటి.. అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్ధం చేసుకోవాలి. మీకు సీఎంగా ఇచ్చే ఫేర్ వెల్ పార్టీ కాదు ఇది. మీ వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు యడ్యురప్ప. -
ఎనీటైమ్.. ఎనీవేర్..: ఇండియన్ నేవీ
న్యూఢిల్లీ: ఎనీటైమ్(ఎప్పుడైనా).. ఎనీవేర్(ఎక్కడైనా).. ఎనీహౌ(ఏమైనా సరే) సందేశం పంపింది ఇండియన్ నేవీ. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై కఠినమైన ఆంక్షలకు సిద్ధమైన భారత్.. ఆ మేరకు చర్యలను వేగవంతం చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత ఆర్మీని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఎల్ఓసీ(నియంత్రణ రేఖ) వెంబడి పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఈ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొడుతూ పాకిస్తాన్ దుశ్చర్యలపై ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇంకా ఏమైనా హద్దు మీరితే గట్టిగానే బదులివ్వడానికి భారత్ సిద్ధమైంది. దీనిలో భాగంగా భారత యుద్ధనౌకలు అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలను ఆరంభించాయి. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న క్రమంలో నేవీ సిద్ధమైంది. లాంగ్ రేంజ్ కచ్చితమైన దాడులకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు నేవీ స్నష్టం చేసింది. దేశ ప్రయోజనాలను కాపాడటానికి తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇండియన్ నేవీ.. పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపింది. ఎనీటైమ్.. ఎనీవేర్.. ఎనీహౌ అంటూ నేవీ తన ‘ ఎక్స్’ ద్వారా ఒక మెస్సేజ్ ను పంపింది.గత మంగళవారం(ఏప్రిల్ 22వ తేదీ) పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో టూరిస్టులు 26మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ సహకారంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని పసిగట్టిన భారత్.. అందుకు అనుగుణంగా స్ట్రాంగ్ మెస్సేజ్ పంపింది. సింధూ జలాలను నిలిపివేతతో పాటు పాకిస్తాన్ జాతీయులు దేశం నుంచి విడిచి వెళ్లిపోవాలని ఆంక్షలు విధించింది. #IndianNavy Ships undertook successful multiple anti-ship firings to revalidate and demonstrate readiness of platforms, systems and crew for long range precision offensive strike.#IndianNavy stands #CombatReady #Credible and #FutureReady in safeguarding the nation’s maritime… pic.twitter.com/NWwSITBzKK— SpokespersonNavy (@indiannavy) April 27, 2025 -
ఆ ఒక్క నిర్ణయంతో మూడో ప్రపంచ యుద్ధం!
-
పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్‌లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్‌లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు. -
ద్విజాతి సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్
-
భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్ 130కి పైగా అణు ఆయుధాలతో పాటు ఘోరి, షాహీన్, ఘజ్నవి మిసైళ్ళను సిద్ధం చేసినట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచిన పహల్గాం ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ తన చర్యల ద్వారా దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధూ నదీ జలాల నిలిపివేత, పాకిస్తాన్ జాతీయుల వీసాలు రద్దు, ఇతర వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక దీనంగా చూస్తోంది.ఈ క్రమంలో హనీఫ్ అబ్బాసీ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేశారు. భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తే యుద్ధానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. యుద్ధం చేసేందుకు తాము సన్నంద్ధంగా ఉన్నామని, దేశ వ్యాప్తంగా అణు ఆయుధాల్ని సిద్ధం చేశామన్నారు. ఆ అణు ఆయుధాలు ప్రదర్శన కోసం కాదని, భారత్‌పై దాడి చేసేందుకేనని చెప్పారు. "Pakistan's nuclear missiles are not for decoration. They have been made for India," threatens Railway Minister Muhammad Hanif Abbasi pic.twitter.com/UqCCRmpXx6— Shashank Mattoo (@MattooShashank) April 27, 2025 స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నీటి సరఫరాను ఆపితే మనతో యుద్ధం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. మన వద్ద ఉన్న సైనిక పరికరాలు, మిసైళ్ళు ప్రదర్శన కోసం కాదు. మన అణు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేను మళ్లీ చెబుతున్నాను, ఈ బాలిస్టిక్ మిసైళ్ళు, అవన్నీ భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించిందని ఒప్పుకున్నారు. దాని ఫలితమే ఈ దుర్భర పరిస్థితులకు కారణమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. -
భారతీయుడి రక్తం మరిగిపోతుంది.. వారికి ఊహించని శిక్ష ఖాయం: మోదీ
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన.. వారు ఊహించని శిక్ష పడుతుందని హెచ్చరించారు. అలాగే, కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే ఉగ్రవాద సూత్రదారులు దాడులు చేశారని మోదీ ఆరోపించారు.ప్రధాని మోదీ ఈరోజు మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘కశ్మీర్‌ను నాశనం చేసేందుకే ఉగ్రవాదుల దాడి జరిగింది. కశ్మీర్లో అభివృద్ధి వేగం పెరిగింది, టూరిస్టులు సంఖ్య పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. దీన్ని ఓర్వలేక దాడులు చేస్తున్నారు. ఈ దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రపంచం భారతదేశం పక్షాన నిలుస్తోంది. ప్రపంచం మొత్తం 140 కోట్ల భారతీయులతో కలిసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటానికి మద్దతుగా ఉంది.Our Hon PM Thiru @narendramodi avl, in the 121st episode of Mann Ki Baat, reaffirmed that the victims of the Pahalgam terrorist attack will definitely get justice and the perpetrators & conspirators of this terrorist attack will face the harshest response! pic.twitter.com/ISq01DYpS5— K.Annamalai (@annamalai_k) April 27, 2025బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన, వారు ఊహించని శిక్ష పడుతుంది. భారత్‌లోని ప్రజల ఆగ్రహం ప్రపంచం మొత్తంలో ప్రతిఫలిస్తోంది. ప్రపంచ నాయకులు ఫోన్ చేసి, లేఖలు రాసి, సందేశాలు పంపి తమ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని గట్టిగా ఖండించారు. మనం సంకల్పాన్ని బలపర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మన సంకల్పాన్ని బలోపేతం చేయాలి.దేశం ఇప్పుడు ఏకతాటిపై మాట్లాడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఏకతా శక్తి అవసరం. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న శక్తులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నాయి. దేశం ఐకమత్యమే మన విజయానికి ఆధారం. పహల్గాంలో జరిగిన దాడి ఉగ్రవాదుల మూర్ఖత్వాన్ని, నిస్సహాయతను చూపిస్తుంది. 22 ఏప్రిల్ పహల్గాం ఉగ్రదాడి ప్రతీ భారతీయుడి మనసును కలచివేసింది. ప్రతీ రాష్ట్రం, ప్రతీ భాషకు చెందిన వారు బాధిత కుటుంబాల కష్టాన్ని తలచుకుంటున్నారు. ప్రతీ భారతీయుడి గుండె ఉగ్ర దాడి దృశ్యాలను చూసి రగులుతోంది అంటూ చెప్పుకొచ్చారు. -
భారత్‌తో పెట్టుకుంటే అంతే సంగతి.. పాకిస్తాన్లో ఔషధ ఎమర్జెన్సీ!
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల ప్రజలు తమ స్వదేశాలకు చేరుకుంటున్నారు. ఇక, ఉగ్రదాడి కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం సైతం దెబ్బతింది. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంతో రెచ్చిపోయిన పాక్ ఆవేశంతో భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. దీంతో, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితిని తెచ్చుకుంది.భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకున్న పాకిస్తాన్‌కు ఔషధాల పరంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఔషధ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. తాజాగా ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని సంబంధిత విభాగాలకు పాక్ వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ప్రస్తుతం భారత్ నుంచి పాకిస్థాన్.. 30-40 శాతం ఔషధ ముడి సరకు, ఔషధంలో వాడే ప్రధాన పదార్థం, చికిత్స ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయని పాకిస్థాన్ ఔషధ నియంత్రణ సంస్థ (డీఆర్ఏపీ) శనివారం వెల్లడించింది.అనంతరం, డీఆర్ఏపీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. చైనా, రష్యా, ఐరోపా దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు . రేబిస్ టీకా, పాము కాటు మందు, క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన ఔషధాలను, మోనోక్లోనల్ యాంటీబాడీస్ తదితరాలను అత్యవసరంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని వివరించారు. తగు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే, ఔషధాల ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్తాన్లో బ్లాక్ మార్కెట్ దందా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. దీనిపై తగు చర్యలు తీసుకునేందు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భారత ఫార్మానే పాక్‌కు కీలకం..ప్రస్తుతం, పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాలలో భారత్‌పై ఆధారపడుతోంది. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (API), వివిధ అధునాతన చికిత్సా ఉత్పత్తులు ఉన్నాయి. ముఖ్యంగా, క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, వ్యాక్సిన్లు, సెరా, యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ మరియు యాంటీ-స్నేక్ వెనమ్‌ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక, చాలా వరకు భారత్ చెందిన మందులు.. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్లోకి అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి మందులు తరలిస్తున్నారు.🚨 Crisis Brews in Pakistan's HealthcareAfter suspending trade with India over the Pahalgam attack fallout, Pakistan faces a looming pharmaceutical shortage.Authorities scramble to secure vital drug supplies from China, Russia, and Europe, as 30%-40% of raw materials were… pic.twitter.com/Gz9HCEiLXt— Instant News 247 (@instant_news247) April 26, 2025భారత్‌తో పెట్టుకుంటే పాతళానికి పాక్..ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ.. దివాళా అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమా అని కొద్దిగా కోలుకుంటోంది. కానీ, ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో భారత్‌తో స్వల్పకాల యుద్ధం చేసినా పాక్ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 50 ఏళ్ల కిందట పాకిస్థాన్.. దక్షిణాసియాలో ధనిక దేశం. స్వాతంత్య్రం వచ్చాక ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని కనబరచింది. ముఖ్యంగా 1960, 1970లలో ధనిక దేశంగా వెలుగొందింది. బలమైన ఆర్థిక నిర్వహణ, భారీగా విదేశీ సాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి.అనంతర కాలంలో.. దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి చేయడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అందుకే.. నేడు దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో పాక్ ఒకటిగా మారింది. కోవిడ్ మహమ్మారితో కుదేలైన పాక్ ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. పాక్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే.. టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తోందని.. అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ కోరారు. దీంతో, ఎంతటి దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల పాక్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో సైనిక ఘర్షణ, యుద్ధం వంటి పరిస్థితులు వస్తే.. అది పాకిస్తాన్‌ను మరింత దెబ్బతీస్తుంది. -
ఎట్టకేలకు.. నగరాన్ని వీడిన ఓ పాకిస్థానీ
సాక్షి,హైదరాబాద్: పాకిస్థాన్ నుంచి షార్ట్ టర్మ్ వీసాపై (ఎస్టీవీ) నగరానికి వచ్చిన నలుగురు పౌరుల్లో ఒకరు శనివారం వెళ్లిపోయారు. సిటీ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురూ ఆదివారం వెళ్లిపోయే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర దేశంలో ఉన్న పాకిస్థానీయుల వీసాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతానికి ఎస్టీవీ కేటగిరీకి చెందిన వారిని ఆదివారం లోపు పంపాలంటూ కేంద్రం ఆదేశించింది. దీంతో నగర పోలీసులు శనివారం ఆ నలుగురికీ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ పురుషుడు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పురుషుడు, ఓ మహిళ వేర్వేరుగా సిటీకి రాగా... తన చిన్నారితో మరో మహిళ వచ్చారు. శనివారం పురుషుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. నగరంలో ఉన్న 199 మంది పాకిస్థానీల్లో ఈ నలుగురే ఎస్టీవీతో వచ్చారు. సైబరాబాద్‌లో ఉంటున్న 11 మంది లాంగ్ టర్మ్ వీసా (ఎల్టీవీ)తోనే ఉంటుండటంతో వారికి ప్రస్తుతం నోటీసులు జారీ చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన అన్నదమ్ముల్ని వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు లాంగ్ టర్మ్ వీసాపై ఉంటున్నారు. వీరి వీసా గడువు సెపె్టంబర్ వరకు ఉండటంతో పాటు కేటగిరీ వేరు కావడంతో వీరిని పంపే ఆస్కారం లేదని తెలుస్తోంది. ఇక్కడి యువకుడు దుబాయ్‌లో ఉండగా అతడిని ప్రేమ వివాహం చేసుకున్న మరో పాకిస్థానీ ప్రస్తుతం భర్తతో కలిసి వాసవీ కాలనీలో నివసిస్తున్నారు. ఈమె లాంగ్‌టర్మ్ వీసా గడువు గతంలోనే ముగిసిపోయింది. భర్తతో కలిసి జీవిస్తున్న తనకు వీసా పొడిగించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఈ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఆమె విషయంలోనూ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిఘా విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కేంద్రం నుంచి కేవలం షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారికే నోటీసులు జారీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్న వారికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే తదుపరి ఆదేశాలను బట్టి వీరిపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. -
పాక్ కాల్పుల పోరు.. బదులిచ్చిన భారత బలగాలు.
-
పాక్‌ను వీడుతున్న భారతీయులు.. ఎంత మంది వచ్చారంటే?
లాహోర్: పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు.. పాకిస్తాన్ నుంచి స్వదేశం చేరుకుంటున్నారు. మూడు రోజుల్లో 450 మందికి పైగా భారతీయులు పాక్‌ను వీడారు. వాఘా సరి హద్దు గుండా వారంతా భారత్‌కు చేరుకున్నారు. శనివారం పాక్‌ను వీడిన వారిలో పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) 2025 ప్రసార సంస్థలో భాగమైన 23 మంది భారతీయులు ఉన్నారని పాక్ అధికారులు తెలిపారు. శుక్రవారం 300 మంది, గురువారం 100 మంది భారతీయులు ఇదే మార్గంలో స్వదేశానికి తిరిగి వెళ్లారని వెల్లడించారు. ఇక 200 మంది పాకిస్తానీయులు భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. పాకిస్తాన్లో దీర్ఘకాలిక వీసాలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), ‘రిటర్న్ టు ఇండియా’ స్టాంపులు ఉన్నవారు సరిహద్దు దాటడానికి అధికారులు నిరాకరించారు.మరోవైపు సిక్కు కుటుంబాలతో సహా కొందరు భారత సంతతి కి చెందిన విదేశీయులను భారత ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు పాకిస్తాన్లోకి ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. లాహోర్‌కు 80 కిలోమీ టర్ల దూరంలోని నాన్కానా సాహిబ్‌లో నివసి స్తున్న భారత సంతతికి చెందిన కెనడియన్ సిక్కు కుటుంబం వాఘా సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించడాన్ని అడ్డుకున్నారు. దుబాయ్ మీదుగా విమాన మార్గం గుండా ప్రయాణించాలని సూచించారు.అటారీ–వాఘా సరిహద్దు మూసివేత.. ఆగిపోయిన బ్యాండ్, బాజా, బరాత్..!భారత్, పాకిస్తాన్ల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు.. సరిహద్దుల మూసివేత సామాన్యులకు ఎన్నో అవస్థలు తెచ్చిపెట్టాయి. రాజస్తాన్‌లోని బర్మేర్‌కు చెందిన షైతాన్ సింగ్ అనే యువకుడికి పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన కేసర్ కన్వర్‌తో నాలుగేళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. వరుడికి, అతడి కుటుంబీలకు వీసా దొరక్క పెళ్లి ఇప్పటిదాకా జరగలేదు. ఫిబ్రవరి 28న వీసాలు మంజూరయ్యాయి. ఈ నెల 30వ తేదీన సింధ్ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్‌లో వధువు ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దులకు రెండువైపులా ఉన్న కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో బుధవారం అట్టారీ–వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. విషయం తెలియని షైతాన్ సింగ్ కుటుంబం ఊరేగింపుగా అటారీ–వాఘా బోర్డర్ పాయింట్‌కు చేరుకుంది. అక్కడ ఆర్మీ అధికారులు అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు.‘ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇలా జరిగింది’అంటూ షైతాన్ సింగ్ ఆవేదన చెందారు. ‘మమ్మల్ని ఆహ్వానించేందుకు బోర్డర్ పోస్ట్ వద్దకు చేరుకున్న మా బంధువులు చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు’అని అతడి సోదరుడు చెప్పారు. ఉగ్రదాడుల కారణంగా తమ బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే, ఈ కుటుంబానికి మరో చిన్న ఆశ మిగులుంది. అదేంటంటే, వీరి వీసాల గడువు మే 12వ తేదీ వరకు ఉండటం. అప్పటికల్లా తిరిగి సరిహద్దులు తెరుచుకుంటాయని, పెళ్లి జరుగుతుందని ఆశతో వీరున్నారు. కాగా, భారత, పాకిస్తాన్ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్న సోధా రాజ్పుట్ వర్గం ప్రజల మధ్య వివాహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. -
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
‘నేను పాకిస్తాన్ కుమార్తెను, కానీ ఇప్పుడు నేను భారతదేశ కోడలిని. నాకు పాకిస్తాన్‌కు వెళ్లడం ఇష్టం లేదు. నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నన్ను భారతదేశంలో ఉండడానికి అనుమతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిలకు విజ్ఞప్తి చేస్తున్నాను’ఇది పాకిస్తాన్ పౌరురాలైన... ప్రస్తుతం యూపీలో ఉంటున్న సీమా హైదర్ చేసిన విజ్ఞప్తి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. తనను కూడా పంపించేస్తారేమోనన్న ఆందోళనతో సీమ చేసిన వీడియో విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎవరీ సీమా హైదర్. పాకిస్తాన్ పౌరురాలు యూపీ కోడలు ఎలా అయ్యింది? సీమా హైదర్... పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ. 2019లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా ఆమెకు యూపీకి చెందిన సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే సీమాకు పెళ్లయ్యింది. భర్త గులాం హైదర్‌తో ఆమెకు నలుగురు పిల్లలు కూడా. అయితే సచిన్ మీద ప్రేమతో.. నలుగురు పిల్లలను తీసుకుని ఆమె భారత్‌కు వచ్చేసింది. నేపాల్ మీదుగా సరిహద్దు నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. యూపీలోని సచిన్‌ను పెళ్లి చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని రబుపుర ప్రాంతంలో నివసిస్తోంది. వీరి విషయం 2023 జూలైలో బయటకు వచ్చింది. అక్రమంగా ప్రవేశించినందుకు సీమాను, ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఇద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె కేసును ఏటీఎస్ విచారిస్తోంది. పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. నిబంధనల ప్రకారం సీమా సైతం భారత్‌ను వీడి వెళ్లాలి. కాని తాను పాక్‌కు వెళ్లనని, ఇక్కడే ఉంటానని, అందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీమా విజ్ఞప్తి చేస్తోంది. తానిప్పుడు సీమా హైదర్‌ను కాదని, సీమా మీనానని, సచిన్‌ను పెళ్లి చేసుకున్నా తరువాత హిందూ మతాన్ని స్వీకరించానని చెబుతోంది. అయితే ఆమె భారత్‌లో నివసించడానికి అర్హురాలని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ సైతం వాదిస్తున్నారు. సచిన్ మీనాతో పెళ్లి తరువాత ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారి ఇప్పుడు భారతీయురాలు. అంతర్జాతీయ న్యాయస్థానం, సంరక్షణ చట్టాల ప్రకారం చిన్నారి సంరక్షణ బాధ్యత తల్లిది. తల్లి సీమా మీనా భారత్‌ను వీడితే.. చిన్నారిని కూడా వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది. భారతీయ పౌరురాలిని పాక్‌కు ఎలా పంపిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులందరూ దేశం విడిచి వెళ్లాలనే ఆదేశం నుంచి ఆమెకు మినహాయింపు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. సీమ కేసు భిన్నమైనదని, ఈ విషయమై రాష్ట్రపతి దగ్గర పిటిషన్ కూడా ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. బెయిల్‌పై ఉన్న సీమను అత్తమామల ఇల్లు తప్ప రబుపురా దాటరాదని జెవార్ కోర్టు ఆదేశాలు కూడా ఉన్నందున.. వీసా రద్దు ఉత్తర్వులు ఆమెకు వర్తించవని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇండియా, దట్ ఈజ్ భారత్!
ఎట్టకేలకు పాకిస్తాన్ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.భారత్‌పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్‌కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్ బయటపడలేదు. పది రోజుల కిందటి పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్ మునీర్ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.కశ్మీర్ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్గామ్ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!పాకిస్తాన్ ప్రస్థానానికి భిన్నంగా భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లేదా భారత్ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్ భారత్’ అనే అంబేడ్కర్ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్.వి. కామత్ ఒక్కరే తొలుత ‘హింద్’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్’గా భావిస్తారు.కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్ సైన్యాలు కశ్మీర్ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్ హుస్సేన్ సజీవ కశ్మీరియత్‌కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్‌కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్ ఆర్మీ చీఫ్. సిసలైన పాక్ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్‌తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్‌కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్‌లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్‌లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్‌లోని లద్దాఖ్, పాక్ ఆక్రమిత గిల్గిట్‌లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్ భూభాగం, పాక్ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. అందులో కాబూల్ నది, గిల్గిట్ నది, హూంజా నది, స్వాట్ నది ముఖ్యమైనవి. కానీ భారత్ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్‌కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్ నదీ జలాలపై మాత్రమే భారత్‌కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.సింధు నది బేసిన్లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్‌ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్), 6 శతుద్రి (సట్లెజ్), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్‌సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
లీవ్ ఇండియా పేరుతో నోటీసులు: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ‘సాక్షి’ తో మాట్లాడిన డీజీపీ జితేందర్.. తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు ఉన్నారు. వీరిలో 199 మంది లాంగ్ టర్న్ వీసాలు కలిగి ఉన్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు. మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి. ఈ షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నాము.లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చాము. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు టైం ఉంది. మిగిలిన వారు రేపు తిరిగి వెళ్ళిపోవాలి. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండి వెళ్ళిపోవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్ళిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి కో ఆర్డినేషన్ లో జాయింట్ ఆపరేషన్ చేస్తాము. కర్రెగుట్టలో తెలంగాణా పోలీస్ శాఖ నుండి ఎలాంటి ఆపరేషన్ లేదు. మా బలగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల వద్ద ఎలాంటి బలగాలు మోహరించలేదు. ములుగులో కూంబింగ్ కి తెలంగాణ పోలీసులకు సంబంధం లేదు’ అని డీజీపీ జితేందర్ తెలిపారు. -
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
పెహల్గావ్లో మూష్కరమూకల మారణహోమం తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. ఉగ్రవాదులతో రాక్షస కాండకు అండగా నిలిచిందన్న అనుమానంతో పొరుగుదేశంతో అన్ని సంబంధాలను భారత్ తెంచుకుంది. సింధూ నది ఒప్పందం నిలిపివేత, పాకిస్థానీయులకు వీసాల రద్దుతో పలు కఠిన చర్యలు చేపట్టింది. అమాయక పర్యాటకులను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షిస్తామని భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో సొంత దేశంపైనే పాకిస్తానీయులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారని ఎన్డీటీవీ తెలిపింది.పెహల్గావ్ (pahalgam) దాడితో భారత దేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు తన పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇండియాకు దీటుగా బదులిచ్చేందుకు తంటాలు పడుతున్న పొరుగు దేశానికి సొంత పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదురవడం తలనొప్పిగా మారుతోంది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో స్వయంగా పాకిస్తానీయులే సెటైర్లు పేలుస్తున్నారు. ఇంటా బయటా సవాళ్లు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ నాయకత్వంపై తమ వ్యతిరేకతను మీమ్స్, వ్యంగ్య చిత్రాల ద్వారా బయటపెడుతున్నారు. తమ ప్రభుత్వం ఎలా విఫలమైందో సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడిస్తున్నారు.రాత్రి 9 తర్వాత వార్ వద్దుభారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తానీయులు తమ ప్రభుత్వంపైనే వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. తమ కనీస అవసరాలు తీర్చడంలో పాలకులు ఎలా విఫలమయ్యారో ఎత్తిచూపారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇండియాతో యుద్ధం వస్తే తట్టుకోగలదా అని తమను తామే ప్రశ్నించుకున్నారు. ఒకవేళ తమతో యుద్ధం చేయాల్సివస్తే రాత్రి 9 గంటలకు ముగించాలని ఓ పాకిస్తానీయుడు వేడుకున్నాడు. ఎందుకంటే రాత్రి తొమ్మిది తర్వాత గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని చావు కబురు చల్లగా చెప్పాడు. "వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి" అంటూ మరో యూజర్ తమ దేశార్థిక దారుణావస్థను బయటపెట్టారు.ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో?పాకిస్తాన్‌పై భారతదేశం బాంబు దాడి చేయబోతోందా అని ఒకరు ప్రశ్నించగా, "భారతీయులు తెలివి తక్కువవారు కాదు" అని మరొకరు సమాధానం ఇచ్చారు. మన బాధల కంటే బాంబు దాడే బెటర్ బ్రో అంటూ ఇంకొకరు స్పందించగా.. ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో అంటూ మరో యూజర్ నిట్టూర్చారు. తమ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ పాకిస్తానీ యూజర్ షేర్ చేసిన మీమ్ ఫన్నీగా ఉంది. పేపర్‌బోర్డ్‌తో తయారు చేసిన ఫైటర్ జెట్ లాంటి నిర్మాణంతో మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తిని చూపించే మీమ్‌ను (Meme) అతను షేర్ చేశాడు.చదవండి: దేనికైనా రెడీ.. పాకిస్తాన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలుమా ప్రభుత్వమే చంపుతోంది..సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్‌కు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేస్తామని ఇండియా ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ యూజర్లు స్పందిస్తూ.. ఇప్పటికే తమ దేశంలో తీవ్ర నీటి కొరత ఉందని చెప్పుకొచ్చారు. "నీటిని ఆపాలనుకుంటున్నారా? మీకు ఆ అవసరం లేదు. ఇప్పటికే నీళ్లులేక అల్లాడుతున్నాం. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ను తీసుకుంటారా? మీరు అరగంటలోపు దాన్ని మాకే తిరిగి ఇస్తారు'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
నువ్వాదరిని... నేనీదరిని... ఉగ్రవాది విడగొట్టె ఇద్దరినీ..!
భారత్-పాక్ సరిహద్దులో గందరగోళం రాజ్యమేలుతోంది. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడితో అమల్లోకొచ్చిన భారత ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామంతో ఇరు దేశాలకు చెందిన కొందరు దంపతులు చిక్కుల్లో పడ్డారు. కొందరు భారతీయ భర్తలు, పాకిస్థానీ భార్యలు, అలాగే మరికొందరు పాక్ భర్తలు, భారతీయ భార్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వ ఆదేశానుసారం పాక్ జాతీయులందరూ ఇండియాను వదిలి ఈ నెల 27లోగా తమ స్వదేశం వెళ్లిపోవాల్సివుంది. దీంతో పాక్ నుంచి కోడళ్లుగా వచ్చి మెట్టినిల్లు ఇండియాలో ‘అక్రమంగా’ స్థిరపడిన కొందరిలో భయం మొదలైంది. భారత్-పాక్ సరిహద్దుల్లో మరికొందరు రకరకాల కారణాలతో ఆందోళనలు చేపడుతున్నారు. భారతీయ ప్రేమికుడు సచిన్ మీనాను వివాహమాడటానికి 2023లో పాక్ నుంచి నేపాల్ గుండా తన నలుగురు పిల్లలతో కలసి (అంతక్రితమే సింధ్ ప్రావిన్సులో ఈమెకు పెళ్లయింది) అక్రమంగా భారత్ వచ్చిన తన గతేమిటని సీమా హైదర్ నేడు ప్రశ్నిస్తోంది. లెక్కయితే ఇప్పుడు ఆమె కూడా స్వదేశానికి తరలిపోవాలి. ఆమె, సచిన్ ప్రస్తుతం గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్)లో నివసిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ‘నేను అప్పుడు పాక్ కూతురిని. ఇప్పుడు భారత్ కోడలిని. మీనాతో పెళ్లి అనంతరం నేను హిందూ మతం స్వీకరించాను. నాకు పాక్ వెళ్లాలని లేదు’ అని సీమా అంటోంది. సచిన్ మీనాతో కాపురం చేసి ఆమె ఓ కుమార్తె (పేరు భారతీ మీనా)కు జన్మనిచ్చింది. సీమా ఇక ఎంతమాత్రమూ పాక్ జాతీయురాలు కాదని, సీమా పౌరసత్వం భర్తతో ముడిపడివుంది కనుక భారత ప్రభుత్వ తాజా ఆదేశం ఆమెకు వర్తించదని ఆమె తరఫు న్యాయవాది చెబుతున్నారు. సీమా మాదిరిగా అక్రమ దారుల్లో ఇండియాలో ప్రవేశించిన పాకిస్థానీలు ప్రస్తుతం దేశ బహిష్కరణ (డిపోర్టేషన్) ముప్పు ఎదుర్కొంటున్నారు. ఇక రాజస్థానీ మహిళ బాజిదా ఖాన్ గోడు చూద్దాం. ఆమెకు పాక్ జాతీయుడితో పెళ్లయింది. కొంత సమయం పుట్టినింటి వారితో గడుపుదామని తన ఇద్దరు మైనర్ కుమారులను వెంటబెట్టుకుని ఆమె ఇండియాకు వచ్చింది. పిల్లలిద్దరికి పాక్ పాస్‌పోర్టులు ఉన్నాయి. ఇంకొన్నాళ్లు ఇండియాలోనే ఉందామని బాజిదా ఖాన్ భావించినా ఇక్కడి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 27లోగా ఆమె ఇండియా వీడి పాక్ వెళ్లక తప్పని పరిస్థితి. దీంతో ఆమె పాక్ వెళ్లడానికి శుక్రవారం వాఘా-అటారీ సరిహద్దును చేరుకుంది. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. పాక్ పాస్‌పోర్టులున్నాయి కనుక ఆమె ఇద్దరు కుమారులు పాక్ భూభాగంలో ప్రవేశించవచ్చని, భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నందున బాజిదాకు ఆ అవకాశం లేదని తేలింది. దీంతో ఆమె హతాశురాలైంది. ఐదేళ్ల కొడుకును చంకనెత్తుకుని పాకిస్థాన్‌లోని అత్తారింటికి బయల్దేరి సరిహద్దుకు చేరుకున్న రషీదా ఖాన్ కూడా అదే అనుభవాన్ని చవిచూసింది. ఆమెకు పాక్ జాతీయుడితో వివాహమైంది. పంజాబ్ (ఇండియా)లో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు ఆమె ఇక్కడికొచ్చింది. తిరిగి పాక్ వెళ్లిపోదామని సరిహద్దుకు చేరుకుంటే భారతీయ పాస్‌పోర్ట్ ఉందన్న కారణంతో ఆమెను నిలిపివేశారు. ఆమె కుమారుడికి మాత్రం పాక్ పాస్‌పోర్టు ఉంది. ఓ వితంతువు మరో దీనగాథ చెప్పుకుంది. తాను 20 ఏళ్లుగా పాక్ లో నివసిస్తున్నప్పటికీ ఆ దేశ పౌరసత్వం లేదని, తన ఇద్దరు టీనేజి కుమార్తెలతో కలసి ఇప్పుడు పాక్ వెళ్లడానికి అనుమతించాలని ఆమె అభ్యర్థిస్తోంది. తన వివాహ పత్రాలు, భర్త మరణ ధృవీకరణ పత్రం, పాక్ పౌరసత్వం కోసం సమర్పించిన దరఖాస్తు తాలూకు ఆధారాలు సైతం ఉన్నాయంటూ ఆమె బావురుమంటోంది. పాక్ వెళ్ళేందుకు అనుమతించాలని ఆమె భారత సర్కారును అభ్యర్థిస్తోంది. మరోవైపు బులంద్ షహర్ (ఉత్తరప్రదేశ్)లో కుటుంబాలను కలిగిన నలుగురు మహిళలను భారత ప్రభుత్వం పాక్ కు తిప్పి పంపింది. “మా పిల్లలు, కుటుంబాలు ఇండియాలో ఉన్నాయి. మేం అక్కడికి ఎలా వెళ్లి జీవిస్తాం?” అని వారిలో ఓ మహిళ లబోదిబోమంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పాక్ జాతీయులకు సంబంధించి మెడికల్ వీసాలు ఈ నెల 29 వరకు చెల్లుబాటవుతాయని, ఇతర అన్ని వీసాలు నెల 27 నుంచి రద్దవుతాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. - జమ్ముల శ్రీకాంత్ -
రక్తం పారిస్తావా.. సింధు జలాల్లో ఒక్కసారి దూకి చూడు!
న్యూఢిల్లీ: సింధు జలాలను ఆపితే అందులో పారిదే రక్తమే అంటూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చీఫ్ బిలావాల్ భుట్టో జర్దారీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ భుట్టో స్టేట్ మెంట్ విన్నాను. ఒకసారి సింధు జలాల్లో దూకి చూడు. నీళ్లు ఉన్నాయో లేవో తెలుస్తుంది’’ అంటూ హర్ దీప్ సింగ్ బదులిచ్చారు. ఒక విషయం పబ్లిక్ లో మాట్లాడేముందు ముందు వెనుక చూసుకుని మాట్లాడితే మంచిదని చురకలంటించారు. భుట్టో వ్యాఖ్యల్లో ఎటువంటి గౌరవం లేదని ఆయన మండిపడ్డారు.‘పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి కచ్చితంగా పాకిస్తాన్ వైపు నుంచే జరిగింది. మన పొరుగు దేశంగా ఉన్న పాకిస్తాన్ సహకారంతో అది జరిగింది. దానికి ఆ దేశం పూర్తి బాధ్యత వహించాలి. అంతేగానీ దీన్ని ఇంకా పెద్దది చేసుకుని ఏవో ప్రయోజనం వస్తుందని భావించకండి. పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పాలనే చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అంతకుముందు పాకిస్తాన్ కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఉగ్రదాడులతో మానవ హక్కుల్ని కాల రాస్తారా?, దీనికి యావత్ ప్రపంచం ఎంతమాత్రం ఒప్పుకోదు. ;పాకిస్తాన్ అనేది ఒక చెత్త దేశమే కాదు.. క్షీణదశకు వచ్చేసిన దేశం’ అంటూ కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ తెలిపారు.సుక్కర్ సింధ్ ప్రొవిన్స్ లో భుట్టో జర్దారీ బహిరంగం ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ సింధు జలాలు మావి. అవి ఎప్పటికైనా మావే. ఒకవేళ అందులో నీళ్లు పారకపోతే.. వారి రక్తం పారుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
High Tension: కాశ్మీర్లో ఉగ్రవేట
-
సీమా హైదర్ పాక్ వెళ్లిపోవాల్సిందేనా?రాఖీ సావంత్ సంచలన వీడియో
జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లోని పహెల్గామ్ (Pehalgam) ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించింది. ముఖ్యంగా 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్తానీలకు వీసాలను రద్దు చేసింది ఈ నేపథ్యంలో 2023లో నేపాల్ ద్వారా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి భారతదేశానికి చెందిన ప్రేమికుడు సచిన్ మీనాను యువకుడ్ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన సీమా హైదర్ మరోసారి చర్చల్లో నిలిచింది. సీమా హైదర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. సీమా హైదర్ కూడా పాకిస్తాన్ కు తిరిగి వెళ్తారా ఎక్స్‌లో చర్చకు దారి తీసింది. అయితే అనూహ్యంగా ఆమెకు మద్దతుగా వివాదాస్పద నటి రాఖీ సావంత్ స్పందించడం మరింత సంచలనంగా మారింది.పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సీమా హైదర్ (Seema Haider)ను పాకిస్తాన్‌కు పంపొద్దు అంటూ రాఖీ సావంత్ (Rakhi Sawant) భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ దాడిలో సీమకు ఏమీ సంబంధంలేదనీ, ఆమె నిర్దోషి అని వ్యాఖ్యానించింది. ఆమె'హిందూస్తాన్ కీ బహు హై' సచిన్‌కీ బీవీ, అంతేకాదు యూపీకి బహు అంటూ ఇలా వాపోయింది. ‘‘ఇప్పటికే నలుగురు పిల్లలను కన్న సీమాకు సచిన్‌తో ఒక అమ్మాయి కూడా ఉంది, ఆమెకు వారు భారతి మీనా అని పేరు పెట్టుకున్నారు. సీమా ఒక తల్లి, సచిన్ భార్య, అతని బిడ్డకు తల్లి అని రాఖీ చెప్పింది. సీమా భారతదేశానికి కోడలు కాబట్టి ఆమెకు అన్యాయం జరగ కూడదని,ఆమెను గౌరవించాలి అంటూ వాదించింది. సార్క్ వీసా మినహాయింపు సర్వీస్ కింద ఇచ్చిన వీసాలను రద్దు చేయాలని భారతదేశం నిర్ణయం, పాకిస్తానీ ప్రజలు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని కఠినమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాఖీ ఆమెకు సపోర్ట్‌గా ఇన్‌స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు పలు రకాలు వ్యాఖ్యానించారు.చదవండి: సింహాల వయసుని ఎలా లెక్కిస్తారు? మీకు తెలుసా? View this post on Instagram A post shared by Rakhi Sawant (@rakhisawant2511)మరోవైపు తాజా నివేదికల ప్రకారం, సీమాకు భారతదేశంలో నివసించడానికి అనుమతి లభిస్తుందని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ భావిన్నారు, ఎందుకంటే, అతని వాదనల ప్రకారం, సీమ పాకిస్తాన్ పౌరురాలు కాదు.,గ్రేటర్ నోయిడా నివాసి సచిన్ మీనాను వివాహం చేసుకుంది , ఇటీవల ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది, అలాగే ఆమె పౌరసత్వం భారతీయ భర్తతో ముడిపడి ఉంది కాబట్టి, కేంద్రం ఆదేశాలు ఆమెకు వర్తించే అవకాశాలు లేవని ఆయన వాదిస్తున్నారు.ప్రస్తుతం, సీమా హైదర్ పౌరసత్వం మరియు అక్రమ వలస కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.కాగా 2023లో నలుగురు బిడ్డల తల్లి అయిన 32 ఏళ్ల సీమా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి గ్రేటర్ నోయిడాలోని రబుపురాలో నివసించే 24 ఏళ్ల సచిన్ మీనాను వివాహం చేసుకుంది. తన మొదటి భర్త గులాం హైదర్ వేధింపుల కారణంగానే పాకిస్తాన్‌ను విడిచిపెట్టానని పేర్కొన్న సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: మూడు సార్లు ప్రెగ్నెన్సీ అయినా ఓకే కానీ : సానియా మీర్జా భావోద్వేగ జర్నీ -
పహల్గాం ఉగ్రదాడి నిరసనకారులకు పాక్ బెదిరింపులు
-
'ఇక్కడి వారికి హృదయం ఉంది'.. అందుకే..! పాక్ తండ్రి కంటతడి
అప్పటిదాక భారత్ పాక్‌ల మధ్య చక్కటి సానుకూల వాతావరణంతో ఆహ్లాదంగా ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఏవో కొద్దిపాటి ఘర్షణలు ఉన్నా..శాంతియుత జీవన విధానానికే పెద్దపీట వేస్తూ..ఇన్నాళ్లు భారత్ సంయమనం పాటిస్తూ వచ్చింది. ఆ ఒక్క ఘటన.. భారత్ ఆగ్రహం కట్టలు తెంచుకునేందుకు కారణమైంది. ఆ దెబ్బతో సరిహద్దులు, ఒప్పందాలు..అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఆ అమానుష ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడమే గాక పాక్‌ని కళ్లర్రజేసే పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ దేశం పెంచి పోషించిన ఉగ్రవాదమే కష్టాలు తెచ్చిపెట్టింది. పైగా ప్రపంచం ముందు దోషిలా నిలబెట్టింది. కానీ ఈ చర్యలతో అల్లాడుతున్న అమాయక జనం వెతలు చూస్తే..కడుపుతరుక్కుపోతోంది. అందుకే పెద్దలు అంటుంటారు..ఏ పనిచేసినా.. ముందు ఒక్క క్షణం ఆలోచించు..లేదంటే దాని పర్యవసానం ఏ పరిస్థితికి తీసుకొస్తుందో ఊహకందదని." ఇప్పుడు ఆ స్థితినే పాక్ ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు.ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ వచ్చినా..ఇబ్బంది పడేది సామాన్య ప్రజలే అనేది జగమెరిగిన సత్యం. అదే మూడు రోజులక్రితం జరిగిన పహల్గామ్ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఆ ఘటనతో భారత్ పాక్‌ల మధ్య సార్క్ వీసా హక్కులు రద్దు అయ్యాయి. అలాగే వాఘా సరిహద్దులు మూసేయడం జరిగింది. దీంతో పిల్లల చికిత్స కోసం వచ్చిన పాకిస్తాన్ తల్లిదండ్రుల బాధలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది. తమ కంటిపాపల కోసం భారత్‌కు వస్తే.. హఠాత్తుగా ఉన్నపళంగా వెనక్కి వెళ్లిపోమని దేశాల నుంచి ఆదేశాలు వస్తుంటే.. ఏం పాలుపోక దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్న ఆ దృశ్యాలు ఎవ్వరినైనా కంటతడిపెట్టిస్తాయి. వారి గాథలు ఎలా ఉన్నాయంటే..ఒక పాకిస్తానీ తండ్రికి ఇద్దరు పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్నారు. "ఇక్కడైతే ఆధునాతన వైద్య చికిత్స ఉంటుందని డిల్లీకి వచ్చాడు. మరో వారం రోజుల్లో ఆపరేషన్ జరగనుంది. అందుకు అక్కడ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు సహకరిస్తున్నారు. కానీ ఈ అనూహ్య పరిణామం కారణంగా షాక్‌కి గురయ్యాం. ఇక్కడ ఉండటానికి..చికిత్సకు చాలా ఖర్చు అయ్యిందంటూ వేదనగా ఓ పాక్ తండ్రి చెబుతున్నాడు. మరొక పాకిస్తానీ వ్యక్తి తన కొడుకు గుండె ఆపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చామని, రెండు రోజుల్లో సర్జరీ అని కన్నీటిపర్యంతమయ్యాడు. ఒక్కొక్కరిది ఒక్కే విధమైన వేదన. అయితే వారంతా ఇక్కడ వారికి హృదయం ఉంది, ఎలాగైనా ఇరుదేశాలను అభ్యర్థిస్తాం తమ పిలల్లకు సర్జరీ అయ్యేంతవరకు ఉండనివ్వమని అని ధీనంగా చెబుతున్నారు. అయితే వారందర్నీ భారత పోలీస్ యంత్రాంగం, విదేశాంగ కార్యాలయం వెంటనే భారత్ నుంచి బయలుదేరాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా, పాకిస్తాన్లో ఉన్న 100 మందికి పైగా భారతీయ పౌరులు గురువారం భారతదేశానికి తిరిగి రాగా, భారత్‌లో ఉన్న 28 మంది పాకిస్తానీయులు వాఘా సరిహద్దు మూసేయడంతో తిరిగి భారత్‌లోకే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏదీఏమైనా..ఒక్క దుశ్చర్య ఎంతమందిని బాధల్లోకి నెట్టేసిందనేందుకు ఈ ఉదంతమే ఉదహరణ.(చదవండి: సలుపుతున్న రాచపుండు! చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు) -
పాకిస్తాన్‌కు భారీ షాక్!.. ఈసారి ఆహ్వానం లేదు!
కరాచీ: సుప్రసిద్ధ హాకీ టోర్నమెంట్ ‘అజ్లాన్ షా కప్’లో పాకిస్తాన్ జట్టు ఈసారి పోటీపడే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నీ నిర్వాహకులకు పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పీహెచ్ఎఫ్) బకాయి పడటంతో.. మలేసియా హాకీ సమాఖ్య (ఎమ్హెచ్ఎఫ్) ఆహ్వానాన్ని నిలిపివేసింది. రెండేళ్ల క్రితం 2023లో జరిగిన టోర్నీకి సంబంధించిన రూ. 8, 83, 582 (10,349 అమెరికా డాలర్లు) బకాయిల్ని జోహర్ హాకీ సంఘం (జేహెచ్ఏ)కు ఇంకా చెల్లించలేదు.అందుకే ఈసారి పాకిస్తాన్‌కు ఆహ్వానాన్ని పంపడంలేదని నిర్వాహకులు తెలిపారు. జేహెచ్ఏ నిబంధనల ప్రకారం ఆ టోర్నీలో పాల్గొనే జట్ల సభ్యులకు మాత్రం ఆతిథ్య ఏర్పాట్లు చేస్తారు. అంతేగాని వారి వెంట వచ్చే కుటుంబసభ్యులు, హాకీ సమాఖ్య ఉన్నతాధికారులు వస్తే బస, స్థానిక రవాణా, ఇతరాత్ర ఖర్చుల్ని వారే భరించాల్సివుంటుంది. 2023 అక్టోబర్‌లో జరిగిన టోర్నీకి సంబంధించి ఆటగాళ్ల కుటుంబసభ్యులు, హాకీ అధికారులకు అయిన ఖర్చుల్ని చెల్లించలేదు.ఇందుకు సంబంధించి ఇదివరకే మలేసియా హాకీ, జేహెచ్ఏ వర్గాలు పాకిస్తాన్ సమాఖ్యకు లేఖ రాసినప్పటికీ చెల్లింపులు మాత్రం చేయలేదు. కుటుంబసభ్యులు, సమాఖ్య అధికారులు ఆటగాళ్లకు బస కల్పించిన లగ్జరీ హోటల్స్‌లోనే గడిపారు. దీనిపై జోహర్ సంఘం మలేసియా సమాఖ్యకు తెలపడంతో బకాయిలు రాబట్టేందుకు పీహెచ్ఎఫ్తో సంప్రదింపులు జరుపుతోంది.ఇదీ చదవండి: మూడు విభాగాల్లోనూ శ్రీజ పరాజయంట్యూనిస్: వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) ట్యూనిస్ కంటెండర్ టోర్నమెంట్లో భారత రెండో ర్యాంకర్, తెలంగాణ క్రీడాకారిణి ఆకుల శ్రీజ పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తొలి రౌండ్లోనే ఓటమి పాలైన శ్రీజ... మిక్స్డ్ డబుల్స్‌లో భారత్‌కే చెందిన సత్యన్ జ్ఞానశేఖరన్‌తో కలిసి క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 35వ ర్యాంకర్ శ్రీజ 6–11, 9–11, 8–11తో ప్రపంచ 76వ ర్యాంకర్ క్రిస్టినా కాల్‌బెర్గ్ (స్వీడన్) చేతిలో ఓడిపోయింది.23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజ తన సర్వీస్‌లో 12 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 11 పాయింట్లు సాధించింది. భారత నంబర్‌వన్, ప్రపంచ 30వ ర్యాంకర్ మనిక బత్రా కూడా అనూహ్యంగా తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. భారత్‌కే చెందిన దియా చిటాలె 12–10, 5–11, 9–11, 11–4, 11–4తో మనిక బత్రాను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన దియా 38 నిమిషాల్లో మనికను ఓడించింది.తన సర్వీస్ 29 పాయింట్లు సాధించిన దియా ప్రత్యర్థి సర్వీస్‌లో 19 పాయింట్లు సొంతం చేసుకుంది. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ యశస్విని ఘోర్పడే తొలి రౌండ్లో 7–11, 6–11, 9–11తో అనె యుసెవా (జపాన్) చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–సుతీర్థ ముఖర్జీ (భారత్) ద్వయం 11–7, 8–11, 8–11, 10–12తో జు కిహు–యాంగ్ హుజి (చైనా) జంట చేతిలో పరాజయం పాలైంది.మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో శ్రీజ–సత్యన్ జ్ఞానశేఖరన్ ద్వయం 11–6, 11–9, 11–9తో దిమిత్రి లెవాజెక్– ఇజబెలా (సెర్బియా) జోడీపై గెలిచింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో శ్రీజ–సత్యన్ 6–11, 11–2, 18–16, 2–11, 4–11తో భారత్‌కే చెందిన మనుష్ షా–దియా చిటాలె చేతిలో ఓడిపోయారు. హర్మీత్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో భారత ప్లేయర్ హర్మీత్ దేశాయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... మానవ్ ఠక్కర్, సత్యన్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. హర్మీత్ 11–6, 11–8, 11–7తో వు యిఫె (చైనా)పై గెలుపొందాడు. మానవ్ 11–8, 6–11, 7–11, 8–11తో మటియాస్ ఫాల్క్ (స్వీడన్) చేతిలో, సత్యన్ 6–11, 5–11, 11–6, 11–9, 9–11తో నవీద్ షమ్స్ (ఇరాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. -
HYD: నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నివాసం ఉంటున్న పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు అందజేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ను విడిచి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 213 మంది పాకిస్తానీలు నివాసం ఉంటున్నారు. వీరిలో నలుగురు షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు (LTV) ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సదరు నలుగురు వ్యక్తులు రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తానీయులు వీసా రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కు చెందిన వారు వెంటనే తమ రాష్ట్రాలను వీడి స్వదేశానికి వెళ్లిపోవాల్సిందేనని ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్.. రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీయులు వెంటనే స్వదేశీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలి. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవు. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉంది. పాకిస్తానీలు తమ దేశానికి అటారి బార్డర్ నుండి వెళ్లొచ్చు. ఈనెల 30 వరకు అటారి బార్డర్ తెరుచుకుని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాలి. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు.కాగా, భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. -
పాక్ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)
లండన్: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా పలు దేశాల్లో భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయులపై పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగుతున్నారు పాకిస్తానీలు. తాజాగా యూకేలో(Pakistan High Commission in London) ప్రవాస భారతీయులను ఉద్దేశించి.. పాక్ చెందిన ఓ అధికారి ఓవరాక్షన్‌కు దిగాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్(Colonel Taimur Rahat) నిరసనలు తెలుపుతున్న ప్రదేశానికి వచ్చారు. అందరూ చూస్తుండగాకల్నల్ తైమూర్ రహత్.. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ ఫ్లెక్సీని భారతీయులకు చూపిస్తూ.. పీక కోస్తామంటూ సైగలు చేశాడు. ప్రవాస భారయుతీలను ఉద్దేశించి ఇలా ప్రవర్తించాడు. దీంతో, అక్కడున్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.JUST IN: 🇬🇧 Pakistan Army Officer Makes Throat-Slitting Gesture at Indian Protestors in London.Col. Taimur Rahat, Defence Attaché at Pakistan's UK Mission, caught behaving like a street thug — no difference between a uniformed officer and a terrorist.Shameful and cowardly… pic.twitter.com/gy5wY7dH48— Asia Nexus (@Asianexus) April 26, 2025ఇక, పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భారతీయులు నిరసనలు తెలుపుతున్న సమయంలో ఆఫీసులో ఉన్న పాక్ అధికారులు భారీ సౌండ్‌తో మ్యూజిక్ వింటున్న శబ్దాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. నిరసనలు వారికి వినిపించకుండా ఉండేందుకే ఇలా చేసినట్టు సమాచారం. లండన్‌లోని పాక్ హైకమిషన్ వద్ద దాదాపు 500 మంది భారతీయులు నిరసనలు చేపట్టినట్టు సమాచారం. మరోవైపు, పహల్గాం దాడి తర్వాత.. ఢిల్లీలోని పౌక్ దౌత్య కార్యాలయంలో కేక్ తెచ్చుకుని సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీన్ని బట్టి చూస్తే భారతీయుల విషయంలో పాక్ అధికారులు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతోంది. పాక్ అధికారుల తీరుపై అక్కడున్న సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. Pakistan High Commission London Military Attache Commander Muhammad Zeeshan Nabi Sheikh SI(M) Colonel Taimur Rahat Tea is Fantastic pic.twitter.com/7vz68nHTFk— Malik islam Awan (@MalikIslam_1) April 25, 2025 Indians in London were protesting against the Pahalgam attack outside the Pakistani embassyThen Colonel Taimur Rahat, Pakistan's military attache in Britain, came to the embassy balcony and signaled Indians to slit Abhinandan's throat with a photo of AbhinandanNow you think… pic.twitter.com/rbGpK81kj1— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) April 26, 2025సింధూ నదిలో పారేది రక్తమే.. ఇక, అంతకుముందు.. పాక్ మాజీ విదేశాంగ మంత్రి, పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ భిలావల్ భుట్టో (Bilawal Bhutto) జర్దారీ భారత్‌పై నోర పారేసుకున్నారు. సింధూ (Indus Water treaty) నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.కాగా.. అంతకుముందు పాక్ (Pakistan) రక్షణ మంత్రి కూడా ఇదేతరహా ప్రేలాపనలు చేశారు. సింధూ నదిలో ప్రతి చుక్కా తమదేనని, భారత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మరో మంత్రి ఆరోపించారు. ఇక, మన దేశంపై విషం చిమ్ముతూ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధూ నది (Indus River) గురించి మాట్లాడిన వీడియో బయటికొచ్చింది. ‘కశ్మీర్లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్‌కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్‌ను నాశనం చేయాలని, చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే.. నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది’ అని హఫీజ్ అందులో బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. -
బెలూచిస్థాన్ లో పాకిస్థాన్ ఆర్మీపై దాడి
-
అంతా భారత్ ఇష్టమేనా?.. దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ పాక్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు అంటూ కామెంట్స్ చేశారు.జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని, నదుల విషయంలో కూడా నీటిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీష్ స్పందించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు.Prime Minister Shehbaz Sharif has offered India cooperation in an impartial investigation of the Pahalgam incident, stating that there will be no compromise on Pakistan's security and dignity.#ShehbazSharif #Pakistan #India #Pahalgam #PakistanArmy #TOKReports pic.twitter.com/5vh6y1O63T— Times of Karachi (@TOKCityOfLights) April 26, 2025ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాక్ ప్రధాని షరీఫ్ మాట్లాడుతూ..‘మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశం కరెక్ట్ కాదు. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు. చివరగా.. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ చెప్పుకొచ్చారు. పహల్గాం దాడి (Pahalgam)పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు.Pakistan's PM Shehbaz Sharif says the country’s armed forces are "prepared to defend the country’s sovereignty" after Delhi accused Islamabad of being linked to the attack on tourists in Kashmir. #RUKIGAFMUpdates pic.twitter.com/qtJic92uZU— Rukiga F.M (@rukigafm) April 26, 2025 -
భారత్ సైనిక ముందు పాక్ ఎంత..!
-
పాక్ పౌరులకు వీసా సేవలు నిలిపివేత
-
కన్నీటి సుడుల నడమ.. బాధాతృప్త హృదయాలతో వీడుతూ. సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు (చిత్రాలు)
-
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం
-
3 యుద్ధాల్లో చావుదెబ్బ తిన్నా పాకిస్తాన్ కి రాని బుద్ధి
-
బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. ఆ దాడికి మాకు ఏంసంబంధం అండి? ప్రాణాలు రక్షించుకునేందుకు చికిత్స కోసం వచ్చిన మేం. పాక్ వైపు తరలి పోతున్నాం. ఇంతకాలం మాకు స్థానికులు ఇచ్చే అతిథ్యం మా జీవితాల్లో మరిచిపోలేం. కానీ, గత రెండు రోజులుగా వాళ్లు మాతో సరిగ్గా వ్యవరించడంలేదు’’ అని కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘‘ దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. శిక్షించాల్సింది వాళ్లనే. కానీ, ఏం తప్పు చేయని మమ్మల్ని ఎందుకు శిక్షిచడం? అని పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో పుట్టడమే మేం చేసిన నేరమా? అంటూ పలువురు భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి చర్చలకు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పాక్ నుంచి ప్రతీ నెలా వందల మంది చికిత్స కోసం భారత్‌కు ప్రత్యేక వీసా మీద వస్తుంటారు. ఇందులో వివిధ రకాల జబ్బులు, అనారోగ్య కారణాలతో వచ్చేవాళ్లే ఎక్కువ. మరీ ముఖ్యంగా పసిపిల్లల చికిత్స కోసం భారత్ ఎక్కువ వీసాలు మంజూరు చేస్తుంటుంది.ఇప్పటికే పాక్ పౌరులు భారత్‌ను విడిచిపెట్టిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంకు ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీలైనంత త్వరగా వాళ్లను గుర్తించి వెనక్కి పంపించేయాలని ఆదేశించారు.ఇదిలా ఉంటే.. పాక్ భారత్‌ల మధ్య ఉద్రికత్తలను తగ్గించడానికి.. దౌత్యానికి తాము సిద్ధమంటూ ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో.. ఐక్యరాజ్య సమితి కూడా సమయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపు ఇచ్చింది. -
పహల్గాం ఘటన.. పాక్ కపట నాటకం
ఇస్లామాబాద్: పహల్గాం ఘటన(Pahalgam Incident)పై పాకిస్థాన్ స్వరం మార్చింది. ఈ ఘటనపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని చెబుతోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్(Khawaja Asif) చేసిన వ్యాఖ్యలను ది న్యూయార్క్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది.‘‘పహల్గాం ఘటనతో మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భారత్ మమ్మల్ని నిందిస్తోంది. ఈ దాడిపై ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు జరగినట్లు కనిపించడం లేదు. ఒకవేళ దర్యాప్తు జరిగితే సహకరించేందుకు పాక్ సిద్ధంగా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా విచారణ జరగాలని మేం కోరుకుంటున్నాం’’ అని అసిఫ్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.పహల్గాం దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని.. దేశీయ రాజకీయ ప్రయోజనాల కోసం, నీటి ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణంగా భారత్ ఉపయోగించుకుంది. ఎలాంటి ఆధారాలు లేకుండా, దర్యాప్తు జరపకుండానే పాక్‌ను శిక్షించాలని అడుగులు వేస్తోంది. అయితే పరిణామాలు యుద్ధానికి దారి తీయాలని మేం కోరుకోవడం లేదు. ఎందుకంటే.. యుద్ధమంటూ జరిగితే ఈ ప్రాంతమంతా నాశనం అవుతుంది కాబట్టి’’ అని అసిఫ్ వ్యాఖ్యానించారు.ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థ పహల్గాం ఉగ్రదాడికి కారణమని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. అయితే సంస్థ లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థల అనుబంధ విభాగమని, వీటికి పాక్ ప్రభుత్వ అండదండలు.. అక్కడి నిఘా వ్యవస్థల సహకారమూ ఉందని భారత భద్రతా సంస్థలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: అవును.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం!అయితే ఈ వ్యవహారంపై ది న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో అసిఫ్ స్పందించారు. పాక్‌లో లష్కరే తోయిబా నిష్క్రియ(defunct) గా ఉందని అన్నారు. వాళ్లలో (ఉగ్రవాదులు) కొందరు జైళ్లలో ఉన్నారు. మరికొందరు గృహ నిర్బంధాలలో ఉన్నారు. పాక్‌లో వాళ్లకు ఇప్పుడు ఎలాంటి వ్యవస్థ లేదు. కాబట్టి దాడులు జరిపే అవకాశమే లేదని ప్రకటించారాయన.ఇదిలా ఉంటే.. పహల్గాం దాడి వెనుక పాక్ ప్రమేయం ఉందని భారత్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే ఇస్లామాబాద్ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తోంది. అంతకు ముందు.. పహల్గాం దాడి జరిగిన రోజు ఓ స్థానిక మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రక్షణ మంత్రి ఖ్వాజా ముహమ్మద్ అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉండొచ్చని అన్నారు. ఈ దాడిలో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయిందని అన్నారాయన. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ వ్యతిరేకిస్తుందని ప్రకటించారు. పహల్గాం దాడిలో మమ్మల్ని(పాక్‌ను) నిందించొద్దు’’ అంటూ అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. -
ఇక్రమ్.. ఇంకా ఇక్కడే!
సాక్షి,హైదరబాద్: కాశ్మీర్ లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ముష్కర మూకల ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై పోరు కొనసాగుతోంది. ఈ ఘాతుకాన్ని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పాకిస్థానీల వీసాల రద్దు కూడా అందులో ఒకటి. దీంతో వివిధ రకాలైన వీసాలపై నగరంలో ఉన్న 208 మంది పాకిస్థానీల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంలో తెరపైకి వచ్చే అంశమే హైదరాబాద్ డిటెన్షన్ సెంటర్లో బందీగా ఉన్న పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్. సిటీలో నమోదైన కేసుల విషయం తేలినా.. ఇప్పటికీ ఇక్కడే ఉండిపోయాడు. ఢిల్లీ వాసిగా నమ్మించి.. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. 17 ఏళ్ల క్రితం ఆమె బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈమెకు పాకిస్థానీ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించి ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన మహిళ హైదరాబాద్ తిరిగొచ్చేశారు. 2011లో ఇక్రమ్ సైతం నగరానికి వచ్చాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చానంటూ ఆమెతో చెప్పాడు. అయితే వాస్తవానికి దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో వచ్చి అక్కడ నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ.. అక్కడి నుంచి నగరానికి చేరుకున్నాడు. ఆ విషయం బయటపడక.. ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఈ విషయం తెలుసుకున్న మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షగట్టిన అతగాడు ఆమెను వేధించడంతో మహిళా ఠాణాను ఆశ్రయించింది. దీంతో ఇక్రమ్‌పై వేధింపుల కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఇక్రమ్‌ను విచారించి, నోటీసులు జారీ చేశారు. అప్పట్లో తన భర్త పాకిస్థాన్‌కు చెందినవాడని చెప్పకపోవడంతో విషయం బయటకు రాలేదు. పోలీసులు 2018 జూన్‌లో ఇక్రమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సరిహద్దుల నుంచి వెనక్కు.. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నమోదైన కేసు విచారణ, శిక్షా కాలం ముగియడంతో ఇక్రమ్‌ను పాకిస్థాన్‌కు బలవంతంగా తిప్పి పంపాలని (డిపోర్టేషన్) భావించారు. డిపోర్టేషన్‌కు సంబంధించిన పత్రాల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు చెప్పిన పాకిస్థాన్ అధికారులు అతడి రాకను అడ్డుకున్నారు. కాగా.. తనపై నమోదైన కేసును భార్యతో రాజీ చేసుకున్న ఇక్రమ్‌ను దాదాపు రెండేళ్లుగా నగరంలోని సీసీఎస్ అదీనంలో ఉన్న డిపోర్టేషన్ సెంటర్లో ఉంచారు. ఇక్రమ్‌ను పాకిస్థాన్‌కు పంపడానికి అవసరమైన కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా పహల్గాం ఉదంతంతో ఇతడి డిపోర్టేషన్ పక్రియపై సందేహాలు నెలకొన్నాయి. -
పాకిస్తాన్ పౌరులకు 14 కేటగిరీల వీసాలు రద్దు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన 14 కేటగిరీల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం వెల్లడించింది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేసింది. ఇందులో బిజినెస్, కాన్ఫరెన్స్, విజిటర్ వంటి వీసాలు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సమాచారం చేరవేసింది. పాకిస్తాన్ జాతీయులకు జారీ చేసిన లాంగ్‌టర్మ్, దౌత్య, అధికారిక వీసాలకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. సార్క్ వీసాలు కలిగినవారంతా ఈ నెల 26వ తేదీలోగా దేశం విడిచివెళ్లిపోవాలని ఆదేశించింది. బిజినెస్, ఫిలిం, జర్నలిస్టు, ట్రాన్సిట్, స్టూడెంట్, గ్రూప్ టూరిస్టు వంటి వీసాలు పొందినవారు ఈ నెల 27వ తేదీలోగా ఇండియాను వీడాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. పాకిస్తాన్‌లోని మైనార్టీలకు ఇచ్చిన బృంద యాత్రికుల వీసాలను సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక మెడికల్ వీసాలపై ఇండియాకు వచ్చినవారు ఈ నెల 29వ తేదీలోగా స్వదేశానికి వెళ్లిపోవాలని కేంద్ర హోంశాఖ తేల్చిచెప్పింది. -
ఔను, ఉగ్రవాదాన్ని పోషించాం
ఇస్లామాబాద్: ఉగ్రవాదమే తన అసలు ముఖమని పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఉగ్రవాదానికి దశాబ్దాలుగా అడ్డాగా మారినట్టు అంగీకరించింది. ఈ మేరకు సాక్షాత్తూ ఆ దేశ రక్షణ మంత్రే స్పష్టంగా ప్రకటన చేశారు. కనీసం 30 ఏళ్లుగా ఉగ్ర తండాలను పాక్ పెంచి పోషిస్తూ వస్తోందని అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు! దాంతో ఈ విషయమై భారత్ ఇంతకాలంగా చెబుతూ వస్తున్నది అక్షరసత్యమని నిరూపణ అయింది. స్కై న్యూస్ మీడియాకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘ఉగ్రవాద సంస్థలకు దన్నుగా నిలిచిన సుదీర్ఘ చరిత్ర పాక్‌కు ఉంది. దీనిపై మీరేమంటారు?’ అని జర్నలిస్టు యాల్డా హకీం ప్రశ్నించారు. దానికి మంత్రి స్పందిస్తూ, ‘‘అవును. అది నిజమే’’ అంటూ అంగీకరించారు. అయితే, ‘‘అమెరికా, బ్రిటన్, ఇతర పాశ్చాత్య దేశాల కోసమే మేం కనీసం 30 ఏళ్లుగా ఈ చెత్త పని చేస్తూ వస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. తద్వారా ఉగ్ర పాపాన్ని అగ్ర దేశాలకూ అంటించే ప్రయత్నం చేశారు. తాము శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులను అఫ్గాన్‌లో సోవియట్‌పై పోరుకు అమెరికా వాడుకుందని ఖవాజా ఆరోపించారు. ‘‘మేం చేసింది నిజంగా దిద్దుకోలేని పొరపాటే. అందుకు పాక్ భారీ మూల్యమే చెల్లించుకుంది. పూడ్చుకోలేనంతగా నష్టపోయింది. సోవియట్ యూనియన్‌పై పోరులో, 2001 సెప్టెంబర్ 11 అల్‌కాయిదా ఉగ్ర దాడి అనంతర చర్యల్లో అమెరికాతో చేతులు కలపకపోతే పాక్ ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉండేది. మా చరిత్రే వేరుగా ఉండేది’’ అంటూ వాపో యారు. సోవియట్‌తో ప్రచ్ఛన్నయుద్ధంలో, న్యూయార్క్ జంట టవర్లపై ఉగ్ర దాడి తర్వాత అఫ్గానిస్తాన్‌పై ఆక్రమణలో అమెరి కాకు పాక్ దన్నుగా నిలవడం తెలిసిందే.లష్కరే లేనేలేదట!పహల్గాం ఉగ్ర దాడిని భారతే చేయించుకుందంటూ ఖవాజా వాచాలత ప్రదర్శించారు. కశ్మీర్‌తో పాటు పాక్‌లో సంక్షోభం సృష్టించడమే దాని లక్ష్యమంటూ సంధి ప్రేలాపనకు దిగారు. లష్కరే తొయిబా ఉగ్ర సంస్థ అసలు ఉనికిలోనే లేదంటూ బుకాయించారు. పహల్గాం దాడి తమ పనేనని ప్రకటించిన లష్కరే ముసుగు సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరైనా ఎప్పుడూ విన్లేదంటూ అమాయకత్వం ప్రదర్శించారు. పాక్ కూడా దశాబ్దాలుగా ఉగ్రవాద బాధితురాలేనంటూ మొసలి కన్నీరు కార్చారు. 2019 బాలాకోట్ మాదిరిగా భారత్ సైనిక చర్యకు దిగుతుందని భావిస్తున్నారా అని ప్రశ్నించగా, అలా చేస్తే పూర్తిస్థాయి యుద్ధం తప్పదంటూ ఖవాజా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.దురాక్రమణను ఎదుర్కొంటాంపహల్గాం దాడితో పాక్ సంబంధముందన్న భారత్ ఆరోపణలు నిరాధారాలంటూ ఆ దేశ సెనేట్ శుక్రవారం తీర్మానం చేసింది. ‘‘మాపై దురాక్రమణకు దిగితే దీటుగా ఎదుర్కొంటాం. ఆ సామర్థ్యం మాకుంది’’ అని పేర్కొంది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడాన్ని ఖండించింది. -
జలదిగ్బంధం!
దశాబ్దాల నాటి సింధూ నదీజల ఒప్పందాన్ని పక్కన పెడుతూ భారత్ కొట్టిన దెబ్బతో ఆర్థికంగా పాకిస్తాన్ నడ్డి విరిగినట్టేనని చెబుతున్నారు. కొందరు చెబుతున్నట్టుగా దీని ప్రభావం పూర్తిస్థాయిలో కనిపించేందుకు దశాబ్దాలేమీ పట్టదని జల వనరుల నిపుణులు అంటున్నారు. పాక్‌పై తక్షణ ప్రభావం చూపేందుకు పలు మార్గాలున్నాయని వారు చెబుతున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. సింధూ నదిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచనున్నట్టు వెల్లడించాయి. అందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నాయి. జీలం తదితర సింధూ ఉపనదుల విషయంలో కూడా ఇదే వ్యూహం అమలవుతుందని తెలిపాయి. వీటితో పాటు కొత్తగా డ్యాములు తదితరాల నిర్మాణం వంటివి కూడా శరవేగంగా జరిపే యోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చినాబ్ బేసిన్లో పలు డ్యాములు, ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. అవి పూర్తయ్యేందుకు ఐదేళ్ల దాకా పట్టవచ్చని అంచనా. తాజా పరిణామాల నేపథ్యంలో వాటన్నింటినీ శరవేగంగా పూర్తి చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాక్‌కు సమాచారం తొమ్మిదేళ్ల సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం భారత్, పాక్ నడుమ 1960లో సింధూ జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పుకు పారే సట్లెజ్, బియాస్, రావి నదీ జలాలు భారత్‌కు; పశ్చిమానికి ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలు పాక్‌కు చెందాయి. సింధూ జలాల్లో 20 శాతం భారత్‌కు, 80 శాతం పాక్‌కు దక్కేలా అంగీకారం కుదిరింది. ఆ ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్టు పాక్‌కు కేంద్రం లాంఛనంగా వర్తమానమిచ్చింది. కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ మేరకు పాక్ జల వనరుల శాఖ కార్యదర్శికి ఇప్పటికే లేఖ రాశారు. జమ్మూ కశ్మీర్‌ను లక్ష్యం చేసుకుని పాక్ సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతోందని అందులో ఘాటుగా దుయ్యబట్టారు. ‘‘ఏ ఒప్పందానికైనా పరస్పర విశ్వాసమే పునాది. దానికే మీరు తూట్లు పొడుస్తున్నారు. మీ దుశ్చర్యలు సింధూ ఒప్పందం కింద భారత్‌కు దఖలుపడ్డ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. కనుక సింధూ ఒప్పందాన్ని గౌరవించాల్సిన అవసరం భారత్‌కు ఎంతమాత్రమూ లేదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పాక్ అంగీకారంతో నిమిత్తం లేకుండా సింధూ, దాని ఉపనదులపై ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు వాటి జలాలను భారత్ తోచిన రీతిలో వాడుకునే వీలుంది. వాటికి సంబంధించి దాయాదికి ఎలాంటి ముందస్తు సమాచారమూ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. దీనిపై పాక్ తీవ్రంగా ఆక్రోశించడం, నీటిని ఆపే చర్యలను తమపై యుద్ధ ప్రకటనగా భావిస్తామంటూ బీరాలు పలకడం తెలిసిందే. చుక్క కూడా వదిలేది లేదు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ అతి త్వరలో సమగ్ర వ్యూహం ప్రధాని ఆదేశాలిచ్చినట్టు వెల్లడి సింధూ ఒప్పందంపై సమీక్ష అమిత్ షా తదితరుల హాజరు న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చుక్క నీటిని కూడా వదలబోమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు. ‘‘ఆ దిశగా సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే పలు సూచనలు చేశారు. స్పష్టమైన ఆదేశాలిచ్చారు’’ అని వెల్లడించారు. సింధూ జలాల ఒప్పందం సస్పెన్షన్ నేపథ్యంలో ఈ విషయమై చేపట్టాల్సిన తదుపరి చర్యల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పాటిల్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు అందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఆదేశాల అమలుకు చేపట్టాల్సిన చర్యలపైనే భేటీలో ప్రధానంగా చర్చించినట్టు వివరించారు. అమిత్ షా కూడా పలు సూచనలు చేసినట్టు తెలిపారు. ఈ దిశగా స్వల్ప, దీర్ఘకాలిక చర్యలు చేపడుతూ మూడంచెల వ్యూహంతో కేంద్రం ముందుకు సాగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతర్జాతీయ ప్రయాణం .. మరింత భారం
పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం దాయాదీ దేశం పాకిస్తాన్‌పై భారత్ కఠిన ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ సైతం అదే రీతిలో స్పందిస్తూ తమ గగనతలాన్ని భారతదేశ విమానాలు ఉపయోగించుకోకుండా నిషేధించింది. ఇండియా విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలపై అదనంగా ఆర్థిక భారం పడుతోందని, అతిమంగా ప్రయాణికులే భరించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం నుంచి పాక్ గగనతలం గుండా ప శ్చిమ దేశాలకు ప్రయాణించాల్సిన విమానాలు ఇక చుట్టూ తిరిగి వెళ్లక తప్పదు. దీనివల్ల విమాన చార్జీలు 8 నుంచి 12 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరప్, ఉత్తర అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు వెళ్లేవారు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ రూట్లలో విమాన ప్రయాణాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఇండియాలో రిజిస్టర్ అయిన అన్ని విమానాలతోపాటు భారతీయుల యాజమాన్యంలో ఉన్న విమానాలు పాక్ గగనతలం గుండా ప్రయాణించేందుకు అనుమతి లేదు. ఇక సుదూర ప్రయాణాలే పాక్ ఆంక్షల ప్రభావం ఇప్పటికే మొదలైందని ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి సంస్థలు నిర్ధారించాయి. తమ అంతర్జాతీయ విమానాలను మరో మార్గం గుండా మళ్లించామని తెలిపాయి. తమ ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పాక్ ఆంక్షల విషయంలో తాము చేయగలిగేది ఏమీ లేదని నిస్సహాయత వ్యక్తంచేశాయి. ఇండియా నుంచి యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల రెండు నుంచి రెండున్నర గంటల అదనపు సమయం పడుతోందని ఓ పైలట్ చెప్పారు. ఢిల్లీ, అమృత్సర్, జైపూర్, లక్నో, వారణాసి తదితర నగరాల నుంచి ప్రయాణించేవారు అదనపు సమయం వెచి్చంచడంతోపాటు అదనపు వ్యయం భరించాల్సి వస్తోంది. ఇండియా విమానాలకు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ అత్యంత కీలకం. చాలావరకు విమానాలు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటాయి. ఇన్నాళ్లూ ఎటువంటి ఇబ్బందుల లేకుండా ప్రయాణాలు సాగిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏ విమానానికి ఎంత సమయం అదనంగా అవసరమన్న దానిపై త్వరలో పూర్తి స్పష్టత వస్తుందని సీనియర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఒకరు తెలిపారు. కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం రాబోయే రోజుల్లో అంతర్జాతీయ విమాన ప్రయాణాలు మరింత ఖరీదు కాబోతున్నాయి. విమానాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంధనంతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే స్థాయిలో టికెట్ చార్జీలు పెరగడం తథ్యం. విమానయాన సంస్థలు తమపై పడే అదనపు వ్యయాన్ని ప్రయాణికులకే బదిలీ చేస్తాయి. మరో ఇబ్బంది ఏమిటంటే.. ప్రయాణానికి అదనపు సమయం పట్టడం వల్ల ఇతర దేశాల్లో కనెక్టింగ్ విమానాలు అందుకోవడం కష్టం కావొచ్చు. అందుకే ప్రయాణ ప్రణాళికను రీషెడ్యూల్ చేసుకోవాలి. విదేశాల నుంచి వచ్చేవారు కూడా ఆలస్యంగా స్వదేశానికి చేరుకుంటారు. లాంగ్ జర్నీ వల్ల విమానాల్లో ఇంధనం లోడ్ పెరుగుతుంది. ఎక్కువ ఇంధనాన్ని నింపుకోవాలి. ప్రయాణ సమయానికి అనుగుణంగా భద్రతాపరమైన ప్రమాణాలు కూడా పాటించాలి. పేలోడ్‌ను తగ్గించుకోవాలి. అంటే తక్కువ మంది ప్రయాణికులు, తక్కువ లగేజీతో ప్రయాణించాలి. దీనివల్ల విమానాల్లో సీట్లు లభించడం కష్టమవుతుంది. ఓవర్‌బుకింగ్ వంటి పరిణామాలు ఎదురవుతాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే తప్ప అంతర్జాతీయ విమానాల్లో అప్పటికప్పుడు సీట్లు దొరకవు. భారత విమానాలకు తమ గగనతలాన్ని పాక్ మూసివేయడం ఇదే మొదటిసారి కాదు. 2019 ఫిబ్రవరిలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. భారత సైన్యం చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడుల నేపథ్యంలో తమ గగనతలం గుండా భారత విమానాలు ప్రయాణించకుండా నిషేధించింది. ఈ నిషేధం కొన్ని నెలలపాటు కొనసాగింది. ఇప్పట్లో భారత ప్రయాణికులకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు చేయాల్సిందేమిటి? → పాక్ ఆంక్షల కారణంగా విమానయాన చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవాలి. → విమానాల విషయంలో అప్డేట్స్ కోసం సంబంధిత ఎయిర్‌లైన్స్ వెబ్సైట్ లేదా యాప్‌ను తరచూ చెక్ చేసుకోవాలి. → అంతర్జాతీయ ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించేందుకు సిద్ధపడాలి. తదనుగుణంగా పక్కా ప్లానింగ్ ఉండాలి. → ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికుల లగేజీపై పరిమితి విధించే అవకాశం కనిపిస్తోంది. కనుక తక్కువ లగేజీతోనే ప్రయాణించాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పహల్గాం దాడి అనంతరం భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘స్కై న్యూస్’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దీని మీరు అంగీకరిస్తారా? అంటూ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామంటూ ఖవాజా బదులిచ్చారు.సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేదన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్‌తో కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు. -
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధం జరిపి 26 మందిని పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. అయితే లష్కర్-ఇ-తోయిబా(LeT) తరఫున కరడుగట్టిన టీఆర్ఎఫ్ గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆ సంస్థ కదలికలపై భద్రతా ఏజెన్సీలు ఓ అంచనాకి వచ్చాయి.లష్కరే తోయిబా విష సర్పానికి పుట్టిన పిల్ల పామే.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్). 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్(hafiz saeed) కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్‌గా సైఫుల్లా(హిజ్బుల్ ముహజిదిన్) వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ పాక్ నుంచే ఎల్ఈటీ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే అభియోగాలు ఉండనే ఉన్నాయి. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) టీఆర్ఎఫ్ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి.తొలినాళ్లలో జిహాదీ పేరిట ఆన్లైన్లో The Resistance Front సంస్థ పోస్టులు చేసేది. కశ్మీరీలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా గప్‌చుప్ ప్రచారాలు చేసేది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకునేది. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడింది. ఆ సమయంలో ఈ గ్రూప్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జమ్ము పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. ఆ తర్వాత హిజ్బుల్ ముహజిదిన్, లష్కరే తొయిబా సభ్యులతోనే చాన్నాళ్లు నడిచింది. కానీ, ఆ తర్వాతే ఈ గ్రూపులో విదేశీ ఉగ్రవాదుల చేరిక క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీళ్లకు కశ్మీర్ నుంచి స్థానిక ఉగ్రవాదుల మద్దతు లభిస్తూ వస్తోంది. అలా.. ఈ సంస్థ కశ్మీర్ లోయలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంది. 2023లో కేంద్రం హోం శాఖ ఈ గ్రూప్‌పై విషేధం విధించింది.ఇంతకుముందు.. సోనామార్గ్, బూటా పాత్రి, గందర్బల్ దాడులకు ఈ సంస్థే కారణమని భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్‌లో బూటా పాత్రి ఇద్దరు సైనికులు సహా నలుగురిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అదే నెలలో సోనామార్గ్ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్ చనిపోయారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్ మూసా.. సోనామార్గ్ దాడిలోనూ పాల్గొన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే సోనామార్గ్ ఘటన తర్వాత.. ఎల్ఈటీ ఏఫ్లస్ కేటగిరీ ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్‌ను డిసెంబర్లో దాచిగామ్ వద్ద భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇదే ఎన్కౌంటర్లో గ్రూప్ సభ్యులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.సాధారణంగా దాడులకు పాల్పడ్డాక టీఆర్ఎఫ్ గ్రూప్ సభ్యులు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతారు. దట్టమైన అడవుల్లో తలదాచుకుంటూ.. పాక్ నుంచి గ్రూప్ నేతలు ఆదేశాలు కోసం ఎదురు చూస్తుంటారు. టీఆర్ఎఫ్ను తన కనుసన్నల్లోనే నడిపిస్తున్న హఫీజ్ సయ్యదే.. పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యదే అయి ఉండొచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన.. గురువారం జమ్ము కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్‌లు రిలీజ్ చేశారు. అందులో హషిమ్ మూసా అలియాస్ సులేమాన్, అలీ బాయి అలియస్ తల్హా పాకిస్థానీలుగా జమ్ము పోలీసులు ప్రకటించారు. మిగతా ఇద్దరు అబ్దుల్ హుస్సేన్ తోకర్, అసిఫ్‌లు స్థానికులేనని ప్రకటిచారు. ఈ ఇద్దరూ 2018లో కశ్మీర్‌కు వెళ్లి.. ఎల్ఈటీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎఫ్లో సహాయకులుగా చేరి.. పహల్గాం మారణ హోమంలో భాగం అయ్యారు.ప్లాన్ ప్రకారమే..సైనికుల దుస్తుల్లో వచ్చిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు.. బైసరన్ లోయలోని పిక్నిక్ స్పాట్లో మూడు వేర్వేరు ప్రాంతాలను ఎంచుకుని దాడికి పాల్పడ్డారు. తొలుత పర్యాటకులతో చాలాసేపు వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత పర్యాటకుల్లో ఐదుగురిని ఒక చోట చేర్చి చంపారు. మైదానంలో మరో ఇద్దరిని కాల్చి చంపారు. పారిపోతున్న క్రమంలో.. ఫెన్సింగ్ వద్ద ఇంకొందరిని కాల్చి చంపారు. ఫెన్సింగ్ దూకిన వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారు. -
ఢిల్లీ: అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్
-
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ సింధు నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడం, అందుకు బదులుగా 1972 నాటి సిమ్లా అగ్రిమెంటు అమలును పాక్ సస్పెండ్ చేయడం తెలిసిందే. తాష్కెంట్ ఒప్పందం నుంచి కూడా వైదొలగాలని పాక్ తాజాగా యోచిస్తోంది. 1965లో ఇండియాతో తలెత్తిన యుద్ధానికి ముగింపు పలికేందుకు పాక్ 1966లో తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్) శాంతి ఒప్పందానికి తలూపింది. నాటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో 1966 జనవరి 10న తాష్కెంట్ వేదికగా భారత్, పాక్ మధ్య ఈ చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. నాటి భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ ఖాన్ ఈ డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. నాటి సోవియట్ రాజకీయవేత్త అలెక్సీ కోసిజిన్ ఈ కార్యక్రమానికి సోవియట్ ప్రతినిధిగా హాజరయ్యారు. భారత్, పాక్ ఇరు దేశాలూ తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుని వాటిని యుద్ధానికి ముందు నాటి స్థానాలకు మళ్లించడం, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో రెండో దేశం జోక్యం చేసుకోకుండా నివారించడంతోపాటు దౌత్య, ఆర్ధిక సంబంధాలను పునరుద్ధరించడం వంటివి ఈ డిక్లరేషన్ ప్రధానాంశాలు. అయితే కశ్మీర్ వివాద పరిష్కారంలో తాష్కెంట్ ఒప్పందం విఫలమైంది. 1971లో భారత్, పాక్ నడుమ మరో యుద్ధం సంభవించడం, బంగ్లాదేశ్ అవతరణ పరిణామాలతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. అలా కశ్మీర్లో నియంత్రణ రేఖ ఏర్పాటైంది. అప్పట్నుంచి భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో సిమ్లా అగ్రిమెంటుకు ప్రాధాన్యం పెరగడంతో తాష్కెంట్ ఒప్పందం కొన్ని దశాబ్దాలుగా మరుగునపడింది. సిమ్లా అగ్రిమెంటుకే విలువ ఇవ్వకుండా పక్కకు తప్పుకున్న పాక్ తాజాగా ఆరు దశాబ్దాల నాటి తాష్కెంట్ ఒప్పందం నుంచి వైదొలగాలని యోచించడం పెద్ద విశేషమేమీ కాదు. కాకపొతే పాక్ వైఖరిని గమనించడానికి ఇదొక ఉదాహరణ. చారిత్రకంగా ప్రాధాన్యమున్న శాంతిపరమైన బాధ్యతలను నెరవేర్చకుండా తప్పుకోవడం, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేయాలని చూడటం వంటివి పాక్ వ్యూహాలుగా కనిపిస్తున్నాయి. ఇకపై కశ్మీర్ వివాదం ద్వైపాక్షికం కాదని వాదిస్తూనే, ఆ సమస్య పరిష్కారం కోసం తృతీయ పక్షం లేదా అంతర్జాతీయ జోక్యానికి పిలుపు ఇవ్వాలని పాక్ భావిస్తోంది. ఇందులో భాగమే తాష్కెంట్ ఒప్పందానికి పాక్ చెల్లుచీటీ! - జమ్ముల శ్రీకాంత్. -
పాక్ ఆటగాడికి ఆహ్వానం.. నీరజ్ చోప్రాపై ట్రోలింగ్!.. మా అమ్మ ఏం చేసింది?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్పందించాడు. తనకు తన దేశం, దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశాడు. ఓ అథ్లెట్‌గా మరో అథ్లెట్‌ను తన పేరిట జరిగే ఈవెంట్‌కు రమ్మన్నానే తప్ప.. మరో ఉద్దేశం లేదని పేర్కొన్నాడు.నో చెప్పిన అర్షద్అసలేం జరిగిందంటే.. కాగా మే నెల (24)లో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ‘నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ ఈవెంట్’ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem)ను ఈ టోర్నీలో పాల్గొనాల్సిందిగా నీరజ్ చోప్రా ఆహ్వానించాడు.అయితే, తాను ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ ఈవెంట్‌కు రాలేకపోతున్నానని అర్షద్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పహల్గామ్లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రదాడి జరగగా.. భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఈ పాశవిక చర్యను ఖండించిన విషయం తెలిసిందే.‘‘జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో హృదయం విదారకంగా మారింది. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా’’ అని నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడు. అయితే, కొంతమంది నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. ముఖ్యంగా పాక్‌కు చెందిన అర్షద్ నదీమ్‌ను ఈవెంట్‌కు ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ ద్రోహి అంటూ నీరజ్‌ను నిందించారు. విద్వేష విషం చిమ్ముతున్నారుఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘సాధారణంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అయితే, నాకు తప్పుగా అనిపించిన విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో మాత్రం వెనుకడుగు వేయను. ముఖ్యంగా దేశం పట్ల నా ప్రేమపై సందేహాలు, నా కుటుంబ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితే వస్తే అస్సలు రాజీపడను.అర్షద్ నదీమ్‌ను ఈవెంట్‌కు ఆహ్వానించడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విద్వేష విషం చిమ్ముతున్నారు. అసభ్యంగా తిడుతున్నారు. మా కుటుంబాన్ని కూడా వదలడం లేదు.ఓ అథ్లెట్‌గా మరో అథ్లెట్ అయిన అర్షద్‌కు నేను ఆహ్వానం పంపాను. అంతేగానీ అందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లో భాగంగా అత్యుత్తమ అథ్లెట్లను దేశానికి రప్పించి.. ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశాం.ఇందుకు సంబంధించి సోమవారమే అంటే.. పహల్గామ్ ఘటన కంటే ముందే సదరు అథ్లెట్లకు ఆహ్వానాలు చేరిపోయాయి. ఆ తర్వాత 48 గంటలకు ఘటన జరిగింది. నా వరకు నా దేశం, నా దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యం. అన్నింటికంటే వాటికే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది.మా అమ్మ తప్పేముంది?బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశం మొత్తం వారికి అండగా ఉంటుంది. జరిగిన ఘటనతో నా మనసు ఎంతో బాధపడింది. అంతకంటే ఎక్కువ ఆగ్రహాన్నీ తెప్పించింది. మన దేశం ఇందుకు తగిన సమాధానం చెప్పి.. బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.ఓ క్రీడాకారుడిగా చాలా ఏళ్లుగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా. అందుకు ఎంతో గర్విస్తున్నా కూడా. కానీ దేశం పట్ల నా ప్రేమను సందేహిస్తూ ఇలాంటి కామెంట్లు రావడం మనసును బాధించింది.నన్ను, నా కుటుంబానికి టార్గెట్ చేస్తున్నవాళ్లు.. మాది ఓ సాధారణ కుటుంబం అనే విషయం అర్థం చేసుకోవాలి. నా మీద మీడియాలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నేను స్పందించననే భ్రమలో ఉన్నారేమో.మీరు చేసే అబద్ధపు ప్రచారాలు ఎన్నటికీ నిజం కావు. మా అమ్మను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారో అర్థం కావడం లేదు. దాదాపు ఏడాది క్రితం తను ఓ తల్లిగా స్పందిస్తూ అమాయకంగా, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు.ఆరోజు మా అమ్మను ఎంతో మంది ప్రశంసించారు. మరి ఈరోజు అదే మనుషులు ఎందుకు ఇలా తనను కించపరిచేలా మాట్లాడుతున్నారు. నేను మరింత కఠినంగా శ్రమించి దేశానికి మరింత గొప్ప పేరు తెచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తా. జై హింద్ ’’ అంటూ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. దేశం పట్ల తన ప్రేమను శంకించేవారికి ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.కాగా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్.. ప్యారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక ప్యారిస్‌లో అర్షద్ రికార్డు స్థాయిలో 2.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం అందుకున్నాడు. కాగా నీరజ్- అర్షద్ టోక్యో, ప్యారిస్ విశ్వక్రీడల సమయంలో కలిసి ఫొటోలు దిగుతూ.. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారు.ఇక ప్యారిస్‌లో నీరజ్ తృటిలో స్వర్ణం చేజార్చుకున్నా.. అర్షద్ గెలవడం కూడా తమకు సంతోషాన్నిచ్చిందని నీరజ్ తల్లి పేర్కొన్నారు. అర్షద్ కూడా తన కుమారుడి లాంటి వాడేనని.. అతడిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. అయితే, తాజా ఘటనల నేపథ్యంలో నీరజ్‌తో పాటు అతడి తల్లిని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్ -
Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది!
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య ఉద్రికత్తకి దారి తీసింది. ఈ సంఘటన నేపథ్యంలో భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఐదు అంశాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.ఇందులో అట్టారి-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేయడం. ఈ ఆంక్షల నేపథ్యంలో రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్ కలల వివాహం ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడింది. సరిహద్దులు మూసివేయడంతో నిశ్చితార్థం దాకా వచ్చిన పెళ్లి నిలిచిపోయిందని ఆయన వాపోయాడు.రాజస్థాన్‌కు చెందిన సైతాన్‌సింగ్‌కు అట్టారీ సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో ఉన్న యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లికి ఇరు కుటుంబాలు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. వరుడి బంధువు చాలామంది ఇప్పటికే పాకిస్థాన్‌కు చేరుకున్నారు. ఇంతలోనే ఉగ్రవాదులు పహల్గాంలో మారణహోమం సృష్టించారు. 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించింది. సరిహద్దులను మూసి వేయడంతో వధువు ఇంటికి వెళ్లే అవకాశాలు మూసుకు పోయాయి. దీంతో సైతాన్‌సింగ్ ఏం చేయాలోఅర్థం కావడం లేదంటూANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాపోయారు.#WATCH | Shaitan Singh, a Rajasthan citizen, who was scheduled to cross the Amritsar's Attari border to enter Pakistan for his wedding today, says, " What the terrorists have done is wrong...We are not being allowed to go (to Pakistan) as the border is closed...Let us see what… pic.twitter.com/FEEuf1GxZG— ANI (@ANI) April 24, 2025"ఉగ్రవాదులు చేసింది తప్పు... సరిహద్దు మూసివేతో(పాకిస్తాన్‌కు) వెళ్లడానికి అనుమతించడం లేదు... ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం." అన్నారు. అటు సైతాన్ సింగ్ సోదరుడు సురీందర్ సింగ్ కూడా మీడియాతో మాట్లాడుతూ, "పర్యాటకులపై (పహల్గామ్లో) జరిగిన దాడి చాలా తప్పు. దురదృష్టకర దాడి భారతదేశంలోని అనేక మంది అమాయక పౌరుల జీవితాలతో తమ కుటుంబాన్ని ప్రభావితం చేసిందన్నారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్, లగ్జరీ కారు : ఎవరీ నటుడు కాగా ఈ ఉగ్రదాడి తరువాత ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించిన ఇతర చర్యలలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని రద్దు చేయడం, పాకిస్తాన్ సైనిక సలహాదారులను బహిష్కరించడం , ఇస్లామాబాద్‌లో దౌత్య సిబ్బందిని తగ్గించడం ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ-రాజౌరి-పూంచ్ జాతీయ రహదారిపై సైనిక నిఘా పెరిగింది, చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగుతోంది. -
పాక్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి
న్యూఢిల్లీ, సాక్షి: పాకిస్థాన్ పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శుక్రవారం ఫోన్ చేశారు. పాక్ పౌరుల్ని గుర్తించి తక్షణమే వెనక్కి పంపాలని ఆదేశించినట్లు సమాచారం.పహాల్గం ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీయుల వీసాలు కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారం లోపు దేశం విడిచిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ మరోమారు అప్రమత్తం చేసింది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులపై పోలీసులు నజర్ వేశారు. పాక్ పౌరులకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో 208 మంది పాకిస్తానీయులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 156 మంది.. షార్ట్ టర్మ్ వీసా కలిగిన వారు 13 మంది ఉన్నట్లు తేలింది. వీళ్లను రెండు రోజుల్లో వెళ్లిపోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.నల్లరిబ్బన్లతో నమాజ్‌కు..పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ మక్కా మసీదులో నల్ల రిబ్బన్లతో ముస్లింలు నమాజ్‌కు హాజరయ్యారు. మరోవైపు.. శాస్త్రిపురంలోని ఒక మసీదులో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నమాజ్ కోసం వచ్చిన వాళ్లకు నల్లటి రిబ్బన్ పంపిణీ చేశారు. -
పాక్ కు చైనా అండ బహ్మపుత్ర నీళ్లు అడ్డుకుంటారా
-
పాక్ పాపం పండింది! మోదీ కఠిన నిర్ణయాలు
-
పాకిస్తాన్ ఇక చూపిస్తాం
-
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి వేళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్నిస్వాంతంత్ర్య సమరయోధులని అభివర్ణించారు. పహల్గాంలో ఉగ్రమూఖల దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. పాకిస్తాన్ తీరుపై పరోక్షంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం తెలుపుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ సైతం పహల్గాంలో జరిగిన దాడిని ఖండించినప్పటికీ, తామే ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నారనే ఆరోపణలను కొట్టిపారేసింది. Pakistan Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar calls Pahalgam Islamic terrorists asFreedom fighters'And our liberals have Aman ki Asha with this Terrorist country 😡😡😡 pic.twitter.com/rrWUxWtArJ— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) April 24, 2025అయితే, ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి చేసిన వారు స్వాంతత్య్ర సమరయోధులని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం జిల్లాలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులై ఉండవచ్చు’ అని అన్నారు. "Pakistan Army is ready for any challenge", stated Foreign Minister and Deputy Prime Minister Ishaq Dar in response to India’s actions after the Pahalgam incident. #IshaqDar #Pakistan #India #Pahalgam #TOKReports pic.twitter.com/QYfjFq6vQx— Times of Karachi (@TOKCityOfLights) April 24, 2025భారత్‌కు గట్టి బదులిస్తాంప్రధాని మోదీ పహల్గాం ఉగ్రవాదులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారిని ప్రోత్సహిస్తున్న దుష్టశక్తినీ కఠినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఉహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరుతాం’ అని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇషాక్ దార్ పరోక్షంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాక్ సైన్యం ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉందన్నారు. భారత పౌరులు సురక్షితంగా ఉండరుభారతదేశం ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే గతంలో కంటే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే భారత పౌరులు సురక్షితంగా ఉండరని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.మీ వ్యాఖ్యలు దేశానికే అవమానంపహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆదేశ ప్రభుత్వ పెద్దల తీరును వరుస ట్వీట్లతో ఎండగడుతున్నారు. తాజాగా పహల్గాం దాడికి పాల్పడ్డవారు స్వాంతత్య్ర సమరయోధులంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి,ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన సంచలన వ్యాఖ్యలపై కనేరియా ఎక్స్ వేదికగా స్పందించారు. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు’ అని పిలవడం దేశానికి అవమానకరమే కాదు. తాము ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నామని బహిరంగంగా అంగీకరించడమే అవుతుందని’ అన్నారు. When the Deputy Prime Minister of Pakistan calls terrorists “freedom fighters,” it’s not just a disgrace — it’s an open admission of state-sponsored terrorism. pic.twitter.com/QlS1UDzq20— Danish Kaneria (@DanishKaneria61) April 24, 2025 అలా అయితే ఉగ్రవాదాన్ని పెంచిపోషించేది ప్రభుత్వమే అంతకు ముందు పహల్గాం ముష్కరుల దాడిలో తమదేశ ప్రమేయం లేదంటే పాక్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పహల్గాం దాడిలో పాత్ర లేకపోతే.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదు. దాడి తర్వాత పాక్ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయి’ అని నిలదీశాడు. ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని ఆరోపించారు. ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వ చర్యలకు సిగ్గుపడాల్సిన విషయమని ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025 -
భారత్, పాక్ మధ్య యుద్ధం తప్పదా?.. సంచలన నివేదిక
భారత్, పాక్.. రెండు దేశాలూ ఒకదాని గురించి మరొకటి అంచనాలు వేయడంలో పొరపాట్లు జరిగినా లేదా రెండిట్లో ఏదో ఒక దేశం అకారణంగా అతిగా స్పందించినా... సాధారణ శతృత్వం కాస్తా అణుయుద్ధానికి దారి తీయవచ్చు! 1980, 1990ల నాటి అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ ఉపద్రవాన్నే సూచిస్తున్నాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు బలిగొన్న నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మిన్నంటుతున్నాయి. ఇదే తరుణంలో విడుదలైన అమెరికన్ ఇంటెలిజెన్స్ రహస్య నివేదికలు మరిత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డీక్లాసిఫై అయిన ఇంటెలిజెన్స్ నివేదికల పత్రాలను అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ మంగళవారం (ఈ నెల 22న) బహిర్గతం చేసింది.నివేదికల ప్రకారం భారత్, పాక్ నడుమ యుద్ధం సంభవించే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ పరస్పరం అంచనాలు వేయడంలో ఆయా దేశాలు పొరబడినా లేదా ఉభయ దేశాల్లో ఏదో ఒకటి అహేతుకంగా ప్రతిస్పందించడమో, అసమంజస నిర్ణయాలు తీసుకోవడమో జరిగినా సంప్రదాయ వైరం కాస్తా అణుయుద్ధంగా పరిణమించవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 160 న్యూక్లియర్ వార్ హెడ్లు, పాక్ అమ్ములపొదిలో 165 అణు వార్ హెడ్లు ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా. ఆధునిక క్షిపణి వ్యవస్థలు అణుయుద్ధ ముప్పును ‘వేగవంతం’ చేస్తున్నాయి. పాక్ క్షిపణి ‘షహీన్’ ఏడు నిమిషాల్లో న్యూఢిల్లీని చేరగలదు. అలాగే భారత్ క్షిపణి ‘ప్రళయ్’ ఆరు నిమిషాల లోపే ఇస్లామాబాద్ మీద దాడి చేయగలదు. మరో ముఖ్యాంశం... ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీకి తాము కట్టుబడినట్టు భారత్ గతంలో ప్రకటించింది. ఈ ‘నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్’ ప్రకారం... భారత భూభాగంపైనో, భారత సైనిక దళాలపైనో అణుదాడి జరిగితేనే మన దేశం ప్రతీకార అణుదాడులకు ఉపక్రమిస్తుంది. అంతేతప్ప భారత్ తనంతట తానుగా, ముందుగా అణ్వాయుధాలను ఏ దేశంపైనా ప్రయోగించదు. ‘ఇండియాస్ రియాక్షన్ టు న్యూక్లియర్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్థాన్’ శీర్షికతో ఉన్న 1981 నాటి అమెరికన్ స్పెషల్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ (ఎస్ఎన్ఐఈ) ప్రకారం... తమ భద్రతకు తీవ్రంగా ముప్పు వాటిల్లుతుందని భావిస్తేనే భారత్ ముందస్తుగా పాక్ అణు కేంద్రాలపై దాడులు చేస్తుంది. ఇక ‘నో ఫస్ట్ యూజ్ అణు విధానం లాంటి స్వీయ నియంత్రణ, కట్టుబాట్లు మన పొరుగు దేశానికి లేవు. 2019లో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ వద్ద బాంబులు వేసి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాయి. అలాంటి సాధారణ, సంప్రదాయ దాడి సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాకిస్థాన్ ఒకవేళ అసంబద్ధంగా ప్రవర్తిస్తే జరిగేది... అణుయుద్ధమే!.ఇండియాతో మరో యుద్ధం తలెత్తితే తమ దేశం మొత్తం కాకపోయినా తమ మిలిటరీ నాశనమవుతుందని పాక్ సైనిక నాయకత్వం భయపడినట్టు 1993 నాటి సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య నివేదిక ఒకటి వెల్లడించింది. ‘ఇండియా-పాకిస్థాన్: ప్రాస్పెక్ట్స్ ఫర్ వార్ ఇన్ ద నైంటీస్’ శీర్షికతో ఉన్న ఈ నివేదిక... భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు 20% (ఐదింట ఒక వంతు) ఉన్నట్టు అప్పట్లో అంచనా వేసింది.- జమ్ముల శ్రీకాంత్.Conflict with India could destroy Pak military, if not the entire state : declassified CIA docs.Recently declassified paper predicted a spectacular terror attack could increase chances of conflict, Pak would fear destruction of the state.https://t.co/PfOwuRym9A pic.twitter.com/StP3TDJPZi— Manu Pubby (@manupubby) April 24, 2025పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ప్రధాన చర్చనీయాంశమైంది. భారత్ చర్యలకు ప్రతిగా.. పాక్ కూడా భారత్‌పై పలు ఆంక్షలను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. -
భారత సరిహద్దుల్లో టెన్షన్.. పాక్ ఆర్మీ కాల్పులు
శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది. పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ దుశ్చర్యకు పాల్పడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరపడంతో భారత భద్రతా బలగాలు ప్రతి దాడులు చేస్తున్నాయి. దీంతో, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల్లో అలజడి చోటుచేసుకుంది. పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దుశ్చర్యకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున కాల్పులు జరిపింది. దీంతో, శత్రువుల దాడిని భారత ఆర్మీ సమర్థంగా ఎదుర్కొంటోంది. పాక్ సైన్యం కాల్పులకు దీటుగా బదులిస్తోంది. Small arms firing at some places on the Line of Control were initiated by the Pakistan Army. Effectively responded to by the Indian Army. No casualties. Further details are being ascertained: Indian Army officials pic.twitter.com/SlBSDPSJHA— ANI (@ANI) April 25, 2025మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని బందీపురాలో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బందీపురాలో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో, భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.BREAKINGEncounter breaks out in Bandipora, Jammu & Kashmir as terrorists open fire during a search operation.Security forces retaliate. No casualties reported yet. Updates awaited. pic.twitter.com/7jz8O8x4Ud— 𝕿𝖆𝖗𝖚𝖓 तरुण 卐 🇮🇳 (@fptarun) April 25, 2025 -
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు.. తీవ్రస్థాయికి ఉద్రిక్తతలు
-
శాంతిస్థాపనే లక్ష్యంగా సిమ్లా ఒప్పందం
పహల్గాంలో హేయమైన ఉగ్రదాడి తర్వాత సింధూ నదీజలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించాక అందుకు ప్రతీకార నిర్ణయంగా పాకిస్తాన్ రెచ్చగొట్టే నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో మూడో దేశం జోక్యం చేసుకోవద్దనే ప్రధాన అజెండాగా రూపుదిద్దుకున్న సిమ్లా ఒప్పందం నుంచి పక్కకు జరుగుతున్నట్లు పాక్ ప్రకటించింది. దీంతో దశాబ్దాలుగా రావణకాష్టంగా రగలిపోతున్న కశీ్మర్ అంశంలో ఇకపై అమెరికా వంటి సంపన్న దేశాలు పెద్దమనిషిలా దూరిపోయి అంశాన్ని మరింత జఠిలం చేసే ప్రమాదముందనే సంకేతాలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సిమ్లా ఒప్పందంలో ఏమేం అంశాలు ఉన్నాయి?. వాటి ప్రాధాన్యత ఏమిటి? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. 1972లో సాకారం.. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా విమోచన పొందడంలో భారత ప్రమేయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారత్‌పైకి పాకిస్తాన్ దాడికి తెగించడం తదనంతర పరిణామాలతో 1971 యుద్ధం జరిగింది. 1971లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం ముగిశాక శాంతిస్థాపనే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరుదేశాలు మొగ్గుచూపాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకుని, సాధారణ పరిస్థితులు నెలకొనడమే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరుదేశాలు పచ్చజెండా ఊపాయి. పొరుగుదేశ సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నియంత్రణ రేఖను ఇష్టమొచి్చనట్లు ఏకపక్షంగా మార్చకూడదనే కట్టుబాటుతో ఈ ఒప్పందం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పట్టణంలో 1972 జూలై రెండో తేదీన నాటి భారత ప్రధాని ఇందిరా గాం«దీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జులి్ఫ కర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. యుద్ధం ముగిసిన వెంటనే శాంతిస్థాపనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఇరుదేశాలు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా ఈ ఒప్పందం పేరొందింది. ఇకపై పొరుగుదేశాలుగా పరస్పర సహకారం, సామరస్యంతో మెలుగుతామని ఆనాడు ఇరుదేశాలు ప్రతినబూనాయి. ఒప్పందంలో ఏమేం ఉన్నాయి? భవిష్యత్తులో సరిహద్దుసహా మరే అంశంలోనైనా మనస్పర్థలు తలెత్తినా, వివాదాలు చెలరేగినా మూడో దేశానికి లేదా అంతర్జాతీయ సంఘంలో ఫిర్యాదుచేయకుండా రెండు దేశాలు మాత్రమే కూర్చుని మాట్లాడుకోవాలని సిమ్లా ఒప్పందంలో పేర్కొన్నారు. మూడో దేశం జోక్యాన్ని ఈ ఒప్పందం నివారిస్తోంది. 1971లో యుద్ధం సమయంలో సరిహద్దు దాటి ముందుకు చొచ్చుకురావడం, మరి కొన్ని చోట్ల భూభాగాన్ని కోల్పోవడం వంటి ఘటనలు జరిగాయి. ప్రస్తుతం తమ అ«దీనంలోని భూభాగాలను తమవిగా పేర్కొంటూ, యథాతథ స్థితిని కొనసాగించాలంటూ దానినే నియంత్రణ రేఖగా ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ ని యంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చడానికి వీలులేదు. యుద్ధం వేళ చాలా మంది పాకిస్తానీ సైనికులను భారత బలగాలు బంధించాయి. ఈ ఒప్పందంలో భాగంగా వారందరినీ విడిచిపెట్టారు. పాకిస్తాన్ సైతం బంగ్లాదేశ్ సాధించిన సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించింది. బంగ్లాదేశ్‌తోనూ పర స్పర గౌరవం పాదుకొల్పడమే లక్ష్యంగా ఈ అంశాన్నీ సిమ్లా ఒప్పందంలో చేర్చారు. ఒప్పందం ప్రభావం ఎంత ? ఈ ఒప్పందం కారణంగా తదనంతరకాలంలో ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు వచి్చన ప్రతిసారీ ఈ రెండు దేశాలే సమస్యలను పరిష్కరించుకున్నాయిగానీ మరే ఇతర దేశాన్ని మధ్యవర్తిగా ఆహ్వానించలేదు. చర్చలు రెండు దేశాల మధ్యే పరిమితం కావడంతో వేగంగా సంప్రతింపులు సాధ్యమయ్యాయి. మెరుగైన పరిష్కారం సాధ్యమైంది. కశ్మీర్లో నియంత్రణ రేఖనే వాస్తవా«దీన రేఖగా అప్పటి నుంచి కొనసాగింది. దీంతో ఆనాటి నుంచి ఎలాంటి సరిహద్దు ఆక్రమణ ఘటనలు జరగలేదు. ఇలా ఈ ఒప్పందం భూభాగాల వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించింది. దౌత్యపరంగా సంబంధాల కొనసాగింపునకు ఈ ఒప్పందం సుసాధ్యం చేసింది. ఇరుదేశాల మధ్య విశ్వాసం పెంచే ప్రయత్నాలు ఈ ఒప్పందం కారణంగానే జరిగాయి. అయితే ఇరువైపులా కాల్పుల విరమణ ఒప్పందం వంటివి తరచూ ఉల్లంఘనకు గురవడం ఒక్కటే ఈ ఒప్పందం మనుగడకు సవాల్‌గా నిలిచింది. తాజాగా పాకిస్తాన్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే కశీ్మర్ అంశంపై పాక్ అనుకూల దేశాలు మధ్యవర్తులుగా బయల్దేరే ప్రమాదముంది. అప్పుడు కశీ్మర్ మా ఇద్దరికి మాత్రమే సంబంధించిన అంశం అనే భారత వాదన అంతర్జాతీయ వేదికలపై కాస్తంత బలహీనపడే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైబ్రిడ్ తీవ్రవాదం
ఉగ్రవాద కర్కశ దాడితో పహల్గామ్ ప్రశాంతత భగ్నమైంది. కశ్మీర్ లోయలో శాంతి ఇప్పటికీ దైవాధీనమే! శత్రువుల తుపాకులు ఎంత ప్రమాదకరమైనవో... ఉదాసీనత, తప్పుడు అంచనాలు కూడా అంతే ప్రమాదకరమైనవి. పౌరుల మీద కాదు, ఇండియా విశ్వసనీయత మీద జరిగిన దాడి ఇది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ దేశంలో పర్యటిస్తున్న సందర్భంలో దెబ్బ తీయడాన్ని ఇంకెలా భావించాలి? ఇదొక కొత్త రకం మిలిటెన్సీ. కశ్మీర్ వినూత్న విపత్తును ఎదుర్కొంటోంది. రమారమి 60 మంది విదేశీ ఉగ్రవాదులు కశ్మీర్ లోయలో మాటు వేసి ఉన్నారని నిఘా వర్గాల అంచనా. వీరిలో సగం మంది టీఆర్ఎఫ్ సంబంధీకులే. ఇది లష్కర్–ఎ–తోయిబాకు ముసుగు సంస్థ. ప్రపంచం కళ్లు గప్పేందుకు, స్థానిక సంస్థగా మభ్యపెట్టే పేరుతో వ్యవహారం నడిపిస్తోంది. భౌతిక గస్తీ కీలకంటీఆర్ఎఫ్ తదితర గ్రూపులు హైబ్రిడ్ తీవ్రవాదాన్ని అవలంబిస్తున్నాయి. అందుకే ఇవి మరింత ప్రమాదకరమైనవి. తుపాకుల వంటి మారణాయు ధాలలో శిక్షణ పొంది, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి అధీన రేఖ దాటి వచ్చే దుండగులపై ఈ కొత్త తరహా ఉగ్రసంస్థలు ఆధార పడవు. బదులుగా స్థానికులనే ‘రాడికలైజ్’ చేసి వారిని ఉపయోగించు కుంటాయి. వీరికి పిస్టల్స్ లేదా గ్రనేడ్స్ సమకూరుస్తాయి. వీటితో లక్ష్యాలపై దాడి చేసి వెంటనే జనంలో కలిసిపోతారు. వీరు రెండోసారి మళ్లీ దాడులకు పాల్పడరు. కాబట్టి ఎలాంటి డిజిటల్ ఆధారాలూ ఉండవు. దాడులూ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి. కాబట్టి ‘సెక్యూరిటీ గ్రిడ్స్’ పసి గట్టలేవు. సంప్రదాయ నిఘా, పోలీసు వ్యవస్థలను ముప్పుతిప్పలు పెట్టే రహస్య తీవ్రవాదం ఇది. నిజానికి వాన్స్ వంటి హైప్రొఫైల్ వ్యక్తులు పర్యటనకు వచ్చినప్పడు అన్ని సున్నిత ప్రాంతాలపై నిఘా పకడ్బందీగా ఉండాలి. అలా జరగలేదు. ముప్పు అవకాశాల మదింపు, ముందస్తుగా బలగాల మోహరింపు వంటి చర్యలు తీసుకోవ డంలో మునుపటి క్రియాశీలత్వం కొరవడింది. ప్రాంతాల వారీగా ముమ్మర గస్తీ నిర్వహించే విధానం సడలిపోయింది. మరీ ముఖ్యంగా 24/7 ఎలక్ట్రానిక్ నిఘా కింద లేని ప్రాంతాల్లో ఈ ఉదాసీనత ఆందోళనకరమైన విషయం. డ్రోన్ సమాచారం, జియో ఫెన్సింగ్ ఏర్పాటు పర్వత మార్గాల భద్రతకు చాలవు. పర్వత ప్రాంతాల్లో భౌతిక గస్తీకి ప్రత్యామ్నాయం లేదు. డ్రోన్లు స్కాన్ చేస్తాయి, కెమెరాలు రికార్డు చేస్తాయి, సమాచార నిఘా వ్యవ స్థలు హెచ్చరిస్తా్తయి. కాదనలేం. కానీ క్షేత్రస్థా యిలో భౌతిక ఉనికి, అంతర్దృష్టికి ఇవి ప్రత్యా మ్నాయం కావు.స్థానిక నిఘా వ్యవస్థవిద్రోహ నిరోధక వ్యవస్థను తక్షణం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దుర్ఘటనను ప్రతిఘ టించడం కాకుండా ముందుగానే దాన్ని అరికట్టే దిశగా మార్పు రావాలి. ఇందులో భాగంగా శాశ్వత గస్తీ యూనిట్లు, రొటేషనల్ నిఘా బృందాలు ఏర్పాటు చేయాలి. ఈ సందర్భంగా, చురుకైన కౌంటర్ ఇంటెలిజన్స్ గ్రిడ్ (సీఐ గ్రిడ్) చాలా ముఖ్యమైంది. ఉరి, పుల్వామా దాడుల అనంతరం చురుగ్గా పనిచేసి ప్రశంసలు పొందిన ఈ గ్రిడ్ ఇప్పుడు బలహీనపడినట్లు ఉంది. దీనిపై ఎలాంటి రాజకీయ సంకోచాలూ లేకుండా కఠినమైన సమీక్ష జరగాలి. స్థానికుల సాయంతో నిఘా పెట్టే వ్యవస్థ ఎప్పుడో విచ్ఛిన్నమైంది. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుస్తోంది. హైబ్రిడ్ టెర్రరిస్టులు సంప్రదాయ ఉగ్రవాద నెట్ వర్క్‌ల నుంచి వచ్చిన వారు కారు. వారి నియామకాలు స్వల్పకాలానికి పరిమితమై ఉంటాయి. తరచూ ఆన్లైన్లోనే జరిగిపోతుంటాయి. వారికి వన్ టైమ్ ప్రాతిపదికన విద్రోహ లక్ష్యాలు అప్పగిస్తారు. ఉగ్రవాద స్థావ రాల్లో తల దాచుకోరు. కోడెడ్ ఫోన్ కాల్స్ చేయరు. కాబట్టి, లోతైన రియల్ టైమ్ నిఘా అవసరమ వుతుంది. మొహల్లాలు, స్కూళ్లు, మదర్సాలు, మార్కెట్ల నుంచి గుట్టుగా సమాచారం రాబట్టాలి. టెక్నా లజీకి దాని ప్రాధాన్యం దానికి ఉంటుంది. అయితే, కశ్మీర్ పరోక్ష యుద్ధం (షాడో వార్)లో స్థానికుల నుంచి సమాచారం రాబట్టే నిఘా వ్యవస్థను మరే ఇతర వ్యవస్థా భర్తీ చేయలేదు. స్థానిక ఇన్ఫార్మర్ల విశ్వాసం చూరగొనడం, లోప్రొఫైల్ క్షేత్రస్థాయి ఏజెంట్లను ఉపయోగించడం తప్పనిసరి. ఉగ్రవాద వ్యూహాల ముందస్తు గుర్తింపునకు ఈ వ్యూహం వెన్నెముక లాంటిది.నిర్మొహమాటంగా మాట్లాడుకుందాం. ‘అమన్ కీ ఆశా’ (శాంతి కోసం ఆశ) నినాదం ప్రస్తుతానికి అటకెక్కుతుంది. కశ్మీర్ లోయలో ఇటీవలి సంవత్సరాల్లో పర్యాటకం అద్భుతంగా పుంజుకుంది. దేశీయ, విదేశీయ పర్యాటకులు కలిసి 2023లో రెండు కోట్లు దాటారు. కశ్మీర్ ప్రజల్లో తిరిగి ఆశలు చిగురించాయి. ఇప్పుడవి చెదిరిపోయాయి. పర్యాటకులు బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు. హోటళ్లు, హౌస్ బోట్లలో ఖాళీ రూములు దర్శనమిస్తున్నాయి. కశ్మీరీల ఆర్థిక నష్టం భారీగా ఉంటుంది. అయితే, కౌంటర్ – టెర్రర్ కార్యకలాపాలతో సాధారణ ప్రజల్ని దూరం చేసుకోకూడదు. ఉగ్రవాదంపై పోరాటానికీ, వర్గాలను తూలనాడటానికీ మధ్య ఉండే రేఖను దాటకూడదు. కశ్మీరీలు విదేశీ ప్రేరేపిత ఉగ్రవాదం, రాజకీయ అనిశ్చితి... ఈ రెండింటి బాధితులు.కశ్మీర్లో నాయకత్వం అలంకారప్రాయంగా కాకుండా క్రియాశీలం కావాలి. జాతీయ భద్రత బాధ్య తను ఎవరికైతే అప్పగించారో వారు ఫలితాలు చూపెట్టాలి. లేదా వైదొలిగి సమర్థులకు అవకాశం ఇవ్వాలి. ఈ వేసవి తీవ్రత కశ్మీర్లో ఎక్కువగానే ఉంటుంది. కర్ఫ్యూలు, సోదాలు, ఉద్రిక్తతలు పునరావృతం కావచ్చు. స్థానికుల పట్టువిడుపులకు, భారత ప్రభుత్వ రాజనీతికి ఇది పరీక్ష లాంటిది. ఒకవంక దేశ సరిహద్దులో శత్రువుతో పోరాడుతూ, మరోవంక దేశం లోపల భారతీయత భావనను పరిరక్షించు కోవాలి. ఇండియా అంతర్గత శాంతిని ఎవరూ తుపాకీతో శాసించలేరని రుజువు చేసుకోవడానికి మనం సుదీర్ఘ ప్రయాణమే చేయాలి.మనోజ్ కె. చన్నన్ వ్యాసకర్త భారత సైన్యంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ (రిటైర్డ్) -
క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్
ఇస్లామాబాద్: సరిహద్దు వెంట తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలతో కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్తాన్ పహల్గాం ఉదంతం తర్వాత సైతం తన బుద్ధిని మార్చుకోలేదు. తాజాగా కరాచీ తీరం వెంట క్షిపణి పరీక్షను చేపట్టబోతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ మేరకు తూర్పున ఉన్న కరాచీ తీరంలో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించి క్షిపణిని పరీక్షించనున్నట్లు ఒక నోటీస్‌ను జారీచేసింది. అరేబియా సముద్రంలో తమ పరిధిలోని సముద్రజలాల మీదుగా ఎలాంటి వైమానిక రాకపోకలు లేకుండా నిషేధం అమల్లోకి తెచ్చింది. ఆ ప్రాంతాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించింది. ఆ పరిధిలో నావికులు సంచరించకూడదని హెచ్చరించింది. దాదాపు 480 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మిస్సైల్‌ను పరీక్షంచనుంది. పాక్ తన ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్(ఈఈజెడ్)ప్రాంతంలో ఏప్రిల్ 25వ తేదీన ఈ క్షిపణి పరీక్ష చేపట్టే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పహల్గాం ఉదంతంపై ఆగ్రహంతో భారత్ తమపై ప్రతీకార దాడులకు దిగితే తాము కూడా అందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలియజేప్పేందుకే పాకిస్తాన్ ఇలా క్షిపణి పరీక్షలకు దిగిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. -
వైమానిక దాడికి రెడీనా ?
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి ప్రతీకారంగా, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై భారత వాయుసేన దాడులు చేయొచ్చనే అంచనాలకు బలం చేకూర్చేలా గురువారం కొత్త పరిణామం సంభవించింది. సెంట్రల్ సెక్టార్లో ‘ ఎక్సర్సైజ్ ఆక్రమణ్’ పేరిట భారత వాయుసేన అతిపెద్ద వైమానిక విన్యాసాలు మొదలెట్టింది. సమతల మైదాన ప్రాంతాలతోపాటు దుర్భేద్య పర్వతమయ ప్రాంతాల్లో శత్రుమూకలను ఎలా తుదముట్టించాలి? ఎలా సులువుగా తప్పించుకోవాలి అనే అంశాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు అభ్యాసం చేశాయని రక్షణ రంగంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. విదేశం నుంచి కొనుగోలు చేసుకున్న అత్యంత అధునాతన రఫేల్ యుద్ధ విమానాలు ముందుండి డ్రిల్ చేయగా వాటిని అనుసరిస్తూ సుఖోయ్–30, ఇతర రకాల యుద్ధవిమానాలు ఈ వైమానిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. శత్రుస్థావరాలను ధ్వంసంచేయడం, శత్రువుల దాడుల నుంచి ఒడుపుగా తప్పించుకోవడం, ప్రతిదాడి చేస్తే దీటుగా బదులివ్వడం, సుదూరంలోని లక్ష్యలపై దాడిచేయడం వంటివి మరోసారి అభ్యసనం చేశారు. తూర్పు సెక్టార్‌లోని స్థావరాల్లోని బలగాలు ఈ అభ్యసనంలోని బృందాలకు సాయపడుతున్నాయి. నిజంగా యుద్ధం వస్తే హఠాత్పరిణామాలను ఎదుర్కొనేలా యుద్ధవిమాన పైలెట్లకు దోహదపడేలా ఈ విన్యాసాలకు పథకరచన చేసినట్లు తెలుస్తోంది. భూతలం మీద లక్ష్యాలతోపాటు విద్యుదయస్కాంత సైనిక ఉపకరణాల వినియోగంపైనా మరింత పట్టుచిక్కేలా డ్రిల్ కొనసాగుతున్నట్లు సమా చారం. భారతవాయుసేన పైలట్లలో అత్యంత దూకుడు, నైపుణ్యమున్న ‘టాప్ గన్’ పైలట్లతో ఈ వైమానిక విన్యాసాలు చేయిస్తు న్నారు. దూరంలోని లక్ష్యాలపై బాంబులు జారవిడవడం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. సమరంలో సన్నద్ధత, అత్యంత నైపుణ్యం సాధించడంపై జరుపుతున్న ఈ అభ్యాసా న్ని ఐఏఎఫ్‌లోని సీనియర్ ఉన్నతాధి కారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు పంజాబ్‌లోని అంబాలా స్థావరం నుంచి, పశ్చిమబెంగాల్లోని హషిమరా స్థావరం నుంచి శత్రు భీకర రఫేల్ యుద్ధవిమానాలు బయల్దేరి వెళ్లాయి. -
నీటి మళ్లింపు.. పాక్‌పై యుద్ధ ప్రకటనే
ఇస్లామాబాద్: సింధూ నది జలాల ఒప్పందాన్ని లెక్కచేయకుండా నీటి మళ్లింపు కోసం ఎలాంటి చర్యలు చేపట్టినా అది తమపై యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైతం భారత్‌పై ఆంక్షలు ప్రకటించింది. భారతదేశ విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించడానికి వీల్లేదని పేర్కొంది. ఇండియాతో అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు, ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు కీలకమైన సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో గురువారం నేషనల్ సెక్యూరిటీ కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశం జరిగింది. పలువురు మంత్రులతోపాటు త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలపై చర్చించారు. భారత్‌పైనా అదే తరహా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్ఎస్సీ భేటీ అనంతరం పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. కేవలం సిమ్లా ఒప్పందమే కాకుండా మిగతా ఒప్పందాలనూ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పాక్ ప్రభుత్వ నిర్ణయాలు → ఇండియాతో ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు సిమ్లా ఒప్పందం సైతం నిలిపివేత. → వాఘా బోర్డర్ పోస్టు తక్షణమే మూసివేత. రాకపోకలు పూర్తిగా రద్దు. → ఈ సరిహద్దు గుండా బయటకు వెళ్లినవారు 30లోగా తిరిగిరావాలి. → సార్క్ వీసా మినహాయింపు పథకం(ఎస్‌వీఈఎస్) కింద భారతీయులకు ఇచ్చిన అన్ని రకాల వీసాలు వెంటనే రద్దు. సిక్కు యాత్రికులకు మాత్రం మినహాయింపు. → ఎస్‌వీఈఎస్ పథకం కింద పాకిస్తాన్లో ఉన్న భారతీయులు 48 గంటల్లోకి బయటకు వెళ్లిపోవాలి. → పాక్‌లో ఉన్న భారతీయ త్రివిధ దళాల సభ్యులు ఏప్రిల్ 30 లోగా వెనక్కి వెళ్లిపోవాలి. భారత హైకమిషన్‌లోని ఈ పోస్టులు రద్దు. → భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న భారత సహాయక సిబ్బంది సైతం స్వదేశానికి వెళ్లిపోవాలి. → ఇండియన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తలు, సిబ్బంది సంఖ్య 30కి పరిమితం. ఇది ఈ నెల 30వ తేదీ నుంచి అమల్లోకి. → పాక్ గగనతలంపై ప్రయాణించేందుకు భారత విమానాలు అనుమతి లేదు. ఈ నిర్ణయం ఇది తక్షణమే అమలు. → సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణం. 24 కోట్ల మంది పాక్ పౌరులకు ఈ జలాలు జీవనాధారం. → ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో, ఎక్కడున్నా అంతం చేయాల్సిందే. శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాం. ఒకవేళ పాక్ సార్వ¿ౌమత్వానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన రీతిలో బదులిస్తాం. → రాజకీయ ఎజెండా కోసం పాక్‌పై నిందలు వేయడం భారత్ మానుకోవాలి. ఇలాంటి నిందలు శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించకూడదు. -
యుద్ధమేఘాలు!
సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. తనకు జీవనాడి వంటి సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై పాక్ గంగవెర్రులెత్తిపోయింది. ఇది తమపై నేరుగా యుద్ధ ప్రకటనేనంటూ గగ్గోలు పెట్టింది. ప్రతీకారంగా నామమాత్రపు సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసి అక్కసు తీర్చుకుంది. భారత్‌కు తన గగనతలాన్ని మూసేయడమే గాక వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ బీరాలు పలికింది. ఎడాపెడా క్షిపణి పరీక్షలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సరిహద్దుల వెంబడి సైనిక మోహరింపులను కూడా యుద్ధ ప్రాతిపదికన భారీగా పెంచేస్తోంది. మరోవైపు దాయాది ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో ‘నిర్ణాయక చర్య’లకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గురువారం చోటుచేసుకున్న పలు కీలక పరిణా మా లు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్ మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. గురువారం శ్రీనగర్‌లోని మార్కెట్ ప్రాంతంలో భద్రతా దళాల గస్తీ తాజా పరిస్థితిని వివరించడంతో పాటు పలు ‘ఇతర’ అంశాలపైనా చర్చించినట్టు చెబుతున్నారు. ప్రధాని మోదీ కూడా పహల్గాం ముష్కరులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారికి దన్నుగా నిలిచిన దుష్టశక్తినీ కటినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఊహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకు ని తీరతాం’’ అంటూ ప్రతినబూనారు. తర్వాత కా సేపటికే ‘ఆక్రమణ్’ పేరిట సైన్యం భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించింది. అత్యాధునిక రఫేల్‌తో పాటు సుఖోయ్ తదితర యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. మరోవైపు పాక్‌లో ఉన్న భారతీయులు తక్షణం తిరిగి రావాలంటూ కేంద్రం అడ్వై జరీ జారీ చేసింది. పొరుగు దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఏకాకిని చేయడమే గాక దానిపై తీసుకోబోయే ‘కఠిన’ చర్యలకు జీ20 తదితర దేశాల మద్దతు కూడగడుతోంది. పహల్గాం ఆటవిక దాడి, అందులో పాక్ ముష్కరులు పాల్గొన్న వైనం తదితరాలను జీ20 సభ్య దేశాల రాయబారులకు విదేశాంగ శాఖ పూసగుచ్చినట్టు వివరించింది. భేటీకి హాజరైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆ్రస్టేలియా, యూఏఈ తదితర దేశాల రాయబారులు దాడిని తీవ్రంగా ఖండించాయి. పాక్‌కు కరుడుగట్టిన మద్దతుదారైన చైనా కూడా భేటీలో పాల్గొనడమే గాక భారత్‌కు మద్దతు పలకడం విశేషం. మరోవైపు పహల్గాం దాడి, తదనంతర పరిస్థితులను కాంగ్రెస్ తదితర పార్టీలన్నింటితో కేంద్రం పంచుకుంది. ఉగ్ర తండాలను శాశ్వతంగా నిర్మూలించి తీరాల్సిందేనని పార్టీలన్నీ ముక్త కంఠంతో అభిప్రాయపడ్డాయి. అందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా అండగా నిలుస్తామని అఖిలపక్ష భేటీలో ప్రకటించాయి. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులతో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, దానికి తోడుగా యుద్ధనౌక ఐఎన్ఎస్ సూరత్ పాక్ దిశగా కదులుతున్నట్టు సమాచారం. -
ఐక్యత వర్తమాన అవసరం
ప్రపంచమంతా ఒక రకమైన అనిశ్చితిలో రోజులు వెళ్లదీస్తున్న వర్తమానంలో మరో మారణకాండకు పథకం పన్ని, అమలుచేసి కశ్మీర్ సమస్యను మళ్లీ తెరపైకి తేవాలనుకున్న పాకిస్తాన్‌కు మన దేశం నుంచి గట్టి హెచ్చరికే వెళ్లింది. సింధూ నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేయటంతో సహా తీసుకున్న చర్యలు సహజంగానే పాకిస్తాన్‌ను ఇరకాటంలో పడేశాయి. అటారీ సరిహద్దు మూత, దౌత్యసంబంధాలకు పరిమితుల విధింపు, పాకిస్తాన్ పౌరులకు భారత్‌లో ప్రవేశం నిషేధం వంటి నిర్ణయాలు దీనికి అదనం. నిజానికి సింధూ నదీజలాల ఒప్పందం నిలిపివేతను పాకిస్తాన్ ఊహించలేదు. ఎందుకంటే ఇరు దేశాల మధ్యా యుద్ధం వచ్చిన సందర్భాల్లో... ముంబైపై ఉగ్రదాడి జరిగినప్పుడు లేదా పుల్వామాలో మన జవాన్లను ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నప్పుడు కూడా మన దేశం ఆ ఒప్పందం నిలిపివేత గురించి మాట్లాడలేదు. సింధూ నదీజలాలపై పాకిస్తాన్ సాగురంగం 80 శాతం వరకూ ఆధారపడి వుంటుంది. పైగా ప్రపంచంలో తీవ్రమైన నీటికొరతను ఎదుర్కొనే దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. సింధు, జీలమ్, చీనాబ్, రావి, బియాస్, సత్లెజ్ నదులకు సంబంధించిన సమస్త సమాచారమూ కూడా ఈ ఒప్పందంలో ఇమిడివున్న వేళ మన దేశ నిర్ణయం పాకిస్తాన్‌కు శరాఘాతమే అవుతుంది. భారత్ చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ సైతం చర్యలు తీసుకున్నా అది పరువు కాపాడుకోవటానికి చేసే ప్రయత్నం మాత్రమే. ఎలా చూసినా పాకిస్తాన్ ఒక రకంగా ఒంటరి బతుకు బతుకుతోంది. అమెరికాకు అఫ్గాన్ పెను సమస్యగా కనబడినంత కాలమూ అది పాకిస్తాన్ సాయం తీసుకోక తప్పేది కాదు. అందుకోసం పాక్ తరఫున మాట్లాడటం, అది ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదన్న ఆరోపణలొస్తున్నా అమాయ కత్వం నటించటం అప్పట్లో అమెరికాకు అలవాటు. ఉగ్రవాదులకు అండదండలందిస్తున్నట్టు ఆధారాలున్నా ఏనాడూ పాక్‌కు ఆర్థిక సాయం ఆగకుండా చూసిన ఘనత అమెరికాది. 2021లో అఫ్గాన్ నుంచి బతుకుజీవుడా అనుకుంటూ నిష్క్రమించాక అమెరికాకు పాకిస్తాన్‌పై మునుపటి ప్రేమ, వాత్సల్యాలు తగ్గుముఖం పట్టాయి. పర్యవసానంగా అప్పు దొరక్క పాక్ ఇబ్బంది పడుతోంది. గల్ఫ్ దేశాలు కూడా గతంలో మాదిరి కాసుల వర్షం కురిపించటం లేదు. చైనా సరేసరి. అదెంతో ఆర్భాటంగా తీసుకొచ్చిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) పాకిస్తాన్లో నత్తనడ కన సాగటం, నిర్మాణ పనులకు ఎదురవుతున్న ఆటంకాలు చైనాకు ఆగ్రహం కలిగిస్తున్నాయి. గత కొన్నే ళ్లుగా కశ్మీర్ విషయంలో పాక్‌ను సమర్థించటం మొదలెట్టిన తుర్కియే హఠాత్తుగా గత ఏడాది స్వరం మార్చింది. గల్ఫ్ దేశాలు సైతం పాకిస్తాన్ తీరు మారనంత కాలమూ తాము మద్దతు నీయటం కష్టమేనని భావిస్తున్నాయి. ఆర్థికంగా, రాజకీయంగా ఇలా ఏకాకిగా మారుతున్న సమ యంలో పహల్గామ్లో బరితెగించి ఉన్మాదులను ప్రోత్సహించటం వల్ల మరింతగా నష్టపోతానని పాకిస్తాన్ గ్రహించలేకపోయింది. అంతర్జాతీయంగా ఏర్పడిన ఉద్రిక్తతలు చివరకు యుద్ధానికి దారి తీయొచ్చని చాలామంది జోస్యం చెబుతుండగా నిజంగా ఆ పరిస్థితే వస్తే భౌగోళికంగా తమ అవసరాల కోసమైనా అమెరికా, చైనాలు తన కోసం అర్రులు చాస్తాయన్న అభిప్రాయం పాకిస్తాన్‌కు ఏదోమూల వున్నట్టు కనబడుతోంది. అందుకే పహల్గామ్ దుస్సాహసానికి పూనుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పహల్గామ్కు ప్రతీకారం ఉండి తీరుతుందని ప్రకటిస్తున్నారు. 2016లో ఉరిలో ఉగ్రవాదుల మారణకాండ తర్వాత, 2019లో పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి అనంతరం మన దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రశిబిరాలపై సర్జికల్ దాడులను నిర్వహించాయి. అందు వల్ల వచ్చిన లాభనష్టాలేమిటన్న మాట అలావుంచి ఉగ్రదాడులు తగ్గివుండొచ్చుగానీ ఆగింది లేదు. పౌరుల్లో ఆత్మస్థైర్యం నింపటానికి ప్రతి చర్యలు అవసరమే. అవి కొనసాగవలసిందే. కానీ అక్కడితో అంతా అయిందనుకోవటంలోనే వుంది సమస్యంతా! ఒకప్పుడు కశ్మీర్లో అధికార గణాంకాల ప్రకారం 7,000 మంది ఉగ్రవాదులుండేవారు. కానీ వారి సంఖ్య ప్రస్తుతం 76 మాత్రమేనని గత నెలలో విడుదలైన గణాంకాలు చెబుతున్నాయి. అందులో 59 మంది బయటివారు కాగా, కేవలం 17 మంది మాత్రమే స్థానికులు. ఉగ్రదాడుల్లో మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. కశ్మీర్‌ను గత 35 యేళ్లుగా ఉగ్రవాద భూతం పట్టిపీడిస్తోంది. తొలినాళ్లలో ఏడాదికి ఇంచుమించు వేయిమంది బలయ్యేవారు. 2001 సంవత్సరంలో ఉగ్రవాదులు ఏకంగా 4,011 మందిని పొట్టన బెట్టుకున్నారు. కానీ నిరుడు ఆ సంఖ్య 127. కొందరు ప్రతీకారేచ్ఛను ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక చర్య తీసుకునే ముందు ఎన్నో బేరీజు వేసుకోవాల్సి వుంటుంది. అది యుద్ధంగా మారిన పక్షంలో... మనవైపు గట్టిగా నిలబడే వారెవరు, వ్యూహాత్మకంగా ఎదురయ్యే సమస్యలేమిటి, దళాల సంసిద్ధత, సాంకేతిక సామర్థ్యాల్లో మన స్థానం ఏమిటి అనేవి చూసుకోవాలి. ఇదే అదనుగా కొన్ని రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థులపై దాడులు, బెదిరింపులు మొదలయ్యాయి. మొన్నటికి మొన్న పహల్గామ్లో కశ్మీరీ పౌరులు ప్రాణాలకు తెగించి అనేకమందిని కాపాడిన వైనం ఇలాంటి వారికి తెలిసి వుండక పోవచ్చు. ఉగ్రవాద బెడద తగ్గటంలో స్థానికులు అందిస్తున్న సహకారమేమిటో వారికి అర్థంకాకపోయి వుండొచ్చు. మన పౌరుల్ని మనమే మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో దూరం చేసుకుంటే ఉగ్రవాదుల అభిమతం నెరవేర్చినట్టే అవుతుంది. నిజానికి వారు కోరుకునేది ఈ విద్వేషాన్నే! ఒకపక్క ఉగ్రవాదం అంతానికి దేశమంతా ఒక్కటై నిలబడాలని ప్రధాని పిలుపునిస్తుంటే తద్భిన్నంగా ప్రవర్తించటం విజ్ఞత అనిపించుకోదు. -
పాక్ సైన్యం చేతిలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్
న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో భారత్ తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమైన తరుణంలో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు పాక్ సైన్యం చేతిలో బందీ అయ్యారు. అనుకోకుండా పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్ బోర్డర్ దాటిన క్రమంలో పీకే సింగ్ అనే జవాన్ ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. దీనిపై పాకిస్తాన్ సైన్యంతో భారత్ సైన్యం చర్చలు జరుపుతుంది.పాక్ చేతిలో బందీగా మారిన భారత్ జవాన్ ను సురక్షితంగా విడిచిపెట్టాలని బీఎస్ఎఫ్ అధికారులు.. పాక్ బోర్డర్ సెక్యూరిటీ అధికారిని కోరారు. అది యాధృచ్ఛికంగా జరిగిన ఘటనేనని, సదరు జవాన్ కావాలని పాక్ బోర్డర్ లో అడుగుపెట్టలేదనే విషయాన్ని తెలిపినట్లు భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
Pahalgam Attack: సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్
-
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ విధిస్తున్న దౌత్యపరమైన ఆంక్షలకు పాకిస్తాన్ అల్లలాడిపోతోంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు దిగింది. పాక్ గగనతలం నుంచి వెళ్లే భారత విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గురువారం పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పహల్గాం దాడి తర్వాత పాక్ విషయంలో భారత్ అనుసరిస్తున్న తీరుపై సమీక్ష ఈ భేటీలో సమీక్ష జరిపారు. పాక్ పౌరుల వీసా రద్దు చేయడం, దేశం విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాలను పాక్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే.. కౌంటర్ చర్యలను ప్రకటించింది. భారత్‌లో జరిపే అన్ని వర్తకవ్యాపారాలను(మధ్యవర్తి దేశం ద్వారా జరిపే వ్యాపారలావాదేవీలను సైతం) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు తెలిపింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బందిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ పౌరులకు జారీ చేసే వీసాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడం కిందకే వస్తుందని పేర్కొంది. మరోవైపు సైన్యం సెలవులను రద్దు చేసిన పాక్ ప్రభుత్వం.. భారత్ గనుక యుద్ధానికి దిగితే ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చింది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ భేటీలో కీలక నిర్ణయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే పహల్గాం దాడిని ఖండించిన పాక్.. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ‘‘భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉంటుందని, ఇందులో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని’’ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయింది. పహల్గాం దాడిలో.. మమ్మల్ని నిందించకండి’’ అంటూ ఓ లోకల్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. -
ఇక భారత్ విడిచి వెళ్లాల్సిందే.. పాక్ పౌరులకు హెచ్చరిక
న్యూఢిల్లీ : భారత్‌లోని పాక్ పౌరులకు కేంద్ర మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్‌ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది. జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాల అమలుకు భారత్ వడివడిగా అడుగువేస్తోంది. వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా గురువారం పాక్ పౌరులకు జారీ చేసిన అన్నీ వీసాలను భారత్ రద్దు చేసింది. వాటిలో వైద్య వీసాలు కూడా ఉన్నాయి. పాకిస్తానీలకు వీసా సేవలను నిలిపివేసింది.కొద్ది సేపటిక్రితం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాక్ పౌరులకు చెల్లుబాటయ్యే అన్నీ వీసాలను ఏప్రిల్ 27 రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ దేశ పౌరులకు జారీ చేసిన అన్నీ వైద్య వీసాలు ఏప్రిల్ 29 మంగళవారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. సవరించిన సమయపాలన ఆధారంగా ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని పాకిస్తానీలు వారి వీసాల గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలని పేర్కొంది.