సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మరోమారు తన నైజాన్ని చాటుకున్నారు. దివ్యాంగురాలు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటే దానిని ఈ ప్రభుత్వానికి అంటగడుతూ ‘పింఛన్ పోరాటంలో ఉరితాడే దిక్కైంది..’ అంటూ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తూ విషం చిమ్మారు. పింఛన్‌కు అర్హురాలిగా నిరూపించుకొనేందుకు, సర్కారుపై పోరు సల్పే సత్తువలేక ఉరి వేసుకొని చనిపోయిన ఓ దివ్యాంగురాలి దీనగాథ అంటూ అడ్గగోలు రాతలు రాశారు.
వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని 43వ డివిజన్ ఊర్మిళానగర్‌లో ఇరువూరి ప్రశాంతికుమారి (38), తన తల్లి వెంకట నర్సమ్మతో కలిసి నివసిస్తోంది. వెంకటనర్సమ్మ స్కిల్‌డెవలప్‌మెంట్‌లో ఆయాగా పొరుగు సేవల ఉద్యోగినిగా పని చేస్తోంది. తండ్రి వెంకటేశ్వరరెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రశాంతి కుమారి చిన్నతనం నుంచి కాళ్లు పనిచేయక పోవడంతో వీల్ ఛైర్ ఆధారంగా జీవనం సాగిస్తోంది.
ఆమె గతంలో దివ్యాంగ పింఛన్ పొందేది. అయితే ఇటీవల విచారణ సమయంలో 2,705.12 చదరపు అడుగులు గల మూడు బిల్డింగులు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో వ చ్చింది. అసెస్‌మెంట్ నంబర్ 1073034342కు సంబంధించిన భవనం 866.65 చదరపు అడుగులు, అసెస్‌మెంట్ నంబర్ 1073034343లో 489.94 చదరపు అడుగులు, అసెస్‌మెంట్ నంబరు 1073032643లో 1348.53 చదరపు అడుగులు, మొత్తం 2,705.12 చదరపు అడుగుల అర్బన్ ప్రాపర్టీ ఉందని విచారణలో తేలింది.
తల్లి వెంకట నరసమ్మకు సీఎఫ్‌ఎంసీ ఐడీ క్రియేట్ అయినందున సిక్స్ స్టెప్ వెరిఫికేషన్‌లో, ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించినట్లు నమోదు కావడంతో ఆన్‌లైన్ వెరిఫికేషన్‌లో పింఛన్ రద్దయింది. ఆమె పింఛన్‌ను ఉద్దేశ పూర్వకంగా ఎవరూ తొలగించలేదు.
అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది..
స్థానిక రెవెన్యూ పోలీసు విచారణలో ప్రశాంతి కుమారికి కుటంబ సభ్యులతో వివాదాలు ఉన్నాయని, అనారోగ్యంతో చికిత్స పొందుతోందని తేలింది. తల్లి వెంకట నరసమ్మ సైతం పోలీసులకు ఇ చ్చిన ఫిర్యాదులో తీవ్రమైన తలనొప్పి, అనారోగ్యంతో చికిత్స పొందుతూ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది.
ప్రశాంతి కుమారి ఇంట్లోనే ఉరి వేసుకొని మరణించడంతో భవానీపురం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ విషయాలన్నింటినీ దాచిన ఈనాడు పనిగట్టుకుని ప్రభుత్వంపై విషం చిమ్మింది. కట్టుకథ ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా కుట్ర పన్నడం దారుణం. సదరు మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మీకేమైనా ఫోన్ చేసిందా రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment