Prashanthi
-
టీటీడీ.. మాకే కావాలి! పట్టుబడుతున్న టీడీపీ, జనసేన
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు ఆ పదవి కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామకృష్ణరాజు రేసులో నిలవగా.. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ పారీ్టకి చెందిన సీనియర్ నేత ఎవరికైనా ఆ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అశోక్ గజపతిరాజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె అదితికి అవకాశం కలి్పంచి.. తాను పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆయనకే ఈ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పూర్తికాలం ఆ పదవి కోసం సమయం కేటాయించకపోవచ్చని, అలాగే అందరికీ అందుబాటులో ఉండడం కష్టమనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొంది.ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం.. స్పీకర్ పదవి ఆశించినా అదీ రాకపోవడంతో ఆయన తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా రేసులో ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డామని.. తమకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. నాగబాబు కోసం ఒత్తిడి! టీడీపీలోనే టీటీడీ చైర్మన్ పదవి కోసం ఎంతో మంది ఆశలు పెట్టుకోగా.. దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు జనసేన పార్టీ పావులు కదుపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకు ఆ పదవి ఇవ్వాల్సిందేనని జనసేన పార్టీ చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయమైనట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం ఆ ప్రచారాన్ని ఖండించిన నాగబాబు.. అధికారిక ప్రకటన వస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలన్నారు. దీంతో నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవిపై ఆశ ఉన్నట్లు బయటపడింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైన నాగబాబు.. సర్దుబాటులో భాగంగా ఆ సీటును వదులుకున్నారు. దీంతో అన్నకు ఏదైనా మంచి పదవి ఇప్పించాలనే ఉద్దేశంలో పవన్‌కళ్యాణ్ ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే టీటీడీ చైర్మన్ పదవిని అడుగుతున్నట్లు సమాచారం. నెల రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉన్నా కూడా ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత.. పోటీ నేపథ్యంలో చంద్రబాబు ఏమీ తేల్చట్లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీటీడీ బోర్డులో కూడా తమ పారీ్టకి చెందిన వారిని సగం మందిని నియమించాలని జనసేన కోరుతున్నట్లు తెలిసింది. బీజేపీ కూడా మూడుకు తగ్గకుండా తమ వారిని బోర్డులో సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేస్తోందని సమాచారం. -
కోవూరులో బెడిసికొడుతున్న టీడీపీ వ్యూహాలు
డబ్బుతో ఏమైనా చేసేయొచ్చనే కొందరి అంచనాలు తారుమారవుతున్నాయి. నగదును వెదజల్లి తద్వారా గెలవొచ్చనే టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అంచనాలు ప్రజాక్షేత్రంలో తలకిందులవుతున్నాయి. తన విజయం అంత సులభం కాదనే విషయం బోధపడటం.. పైగా వ్యూహాలు బెడిసికొడుతుండటంతో ఏమి చేయాలో పాలుపోక తలపట్టుకోవడం ఆమె వంతవుతోంది. కోవూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కోవూరు నియోజకవర్గంలో టీడీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. నగదు ప్రలోభాలతో నేతలను టీడీపీలో చేర్చుకోవడం.. దురాయి పేరుతో మత్స్యకార గ్రామాలు.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్యాకేజీలను వేమిరెడ్డి దంపతులు ప్రకటించడం.. ఈ విషయాలు బయటకు పొక్కడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎక్కడికెళ్లినా సమస్యల స్వాగతం ప్రచారంలో భాగంగా ప్రశాంతిరెడ్డి ఎక్కడికెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఓ వైపు వర్గపోరు.. మరోవైపు నేతల మధ్య సమన్వయం కొరవడటంతో ఆమె చేతులెత్తేశారు. ఆత్మీయ సమావేశాలు.. ప్రచారాలు.. పార్టీ కార్యాలయాల ప్రారంభం.. ఇలా సందర్భమేదైనా గొడవలు మాత్రం కామన్‌గా మారుతున్నాయి. కోవూరు టీడీపీ సీటును ఆశించి భంగపడిన పోలంరెడ్డి దినేష్‌రెడ్డి.. ప్రశాంతిరెడ్డి విజయానికి పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఇందులో ఎంత వాస్తవమో అర్థం కాని పరిస్థితి. టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్న కుమ్ములాటలకు వెన్నుపోటు రాజకీయాలే కారణమనే ప్రచారం జరుగుతోంది. అడుగడుగునా ప్రతికూలతలే.. క్షేత్రస్థాయిలో టీడీపీకి అనుకూల వాతావరణం లేదు. చంద్రబాబు గత పాలనను ప్రజలు నేటికీ మర్చిపోలేదు. రుణ మాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళల ను గతంలో ఆయన మోసగించారు. తాజాగా టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ఎవరూ నమ్మడం లేదు. మరోవైపు వలంటీర్ల సేవలను ఎన్నికల కమిషన్ ద్వారా చంద్రబాబు అడ్డుకోవడం బూమరాంగ్ అయింది. చంద్రబాబు వ్యూహాలు, గత పాలన టీడీపీ అభ్యర్థులకు శాపంగా మారాయి. ఆడియో కలకలం కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌రెడ్డితో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల ఫోన్లో మాట్లాడిన సంభాషణ ఆడియో బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. తాము గెలిస్తే ప్రజల్లో ఉంటామని.. ఓటమిపాలైతే వ్యాపారాలు చూసుకుంటామని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. నిత్యం వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే వేమిరెడ్డి దంపతులు గెలిచినా.. ఓడినా ప్రజల్లో ఉండరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆడియో దుమారంతో వీరిపై నమ్మకం మరింత సన్నగిల్లింది. -
టీడీపీలో ‘ఆడియో’ దుమారం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌రెడ్డితో జరిపిన ఫోన్ సంభాషణ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఆ ఆడియో సంభాషణను విలేకరుల సమావేశంలో బహిర్గతం చేశారు. ఈ ఆడియో తనది కాదని ప్రశాంతిరెడ్డి కామాక్షమ్మ అమ్మవారి సాక్షిగా చెప్పగలరా అని రాజేంద్రనాథ్‌రెడ్డి సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి వారి కుటుంబంతో తమకు అనుబంధం ఉందన్నారు. నేటికీ జగన్మోహన్రెడ్డితో ఆ అనుబంధం కొనసాగుతోందని ఆయన స్పష్టంచేశారు. ఓడితే ముఖం చాటేస్తారు: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పెద్దలపట్ల అగౌరవంగా మాట్లాడడం, ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలగుతాం అని చెప్పడం చూస్తే వారి వ్యవహారం ప్రజలకు బాగా అర్థమవుతుందన్నారు. ఓడిపోతే విదేశాల్లో వ్యాపారాలు, లావాదేవీలు చేసుకుంటూ ప్రజా జీవితంలోకి రారని వారి మాటల బట్టి తెలుస్తోందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైఎస్సార్సీపీ అభ్యర్థులు కావాలో ఓడిపోతే ముఖం చాటేసే టీడీపీ అభ్యర్థులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఎవరూలేకే టీడీపీ వైఎస్సార్సీపీ నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకుందన్నారు. నా సోదరుడికి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చారు: ప్రసన్నకుమార్‌రెడ్డి ఇక తన సోదరుడు రాజేంద్రకు ప్రశాంతిరెడ్డి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చి పార్టీలోకి ఆహా్వనించినా వారి ప్రలోభాలకు తలొగ్గలేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని వాడు అని సం¿ోదించడం చూస్తే ఎంత అహంకారంతో మాట్లాడుతోందో అర్థమవుతోందన్నారు. ఆడియో సంభాషణ ఇలా.. రాజేంద్ర: హలో ప్రశాంతక్కా.. బావున్నావక్కా.. ప్రశాంతి: ఎక్కడున్నావ్? రాజేంద్ర: అక్కా బెంగళూరులో ఉన్నా. అక్కా ఇక్కడ రెండు పీజీలు ఏర్పాటుచేశాను ప్రశాంతి: నీవు ఇక్కడ లేవా? రాజేంద్ర: పీజీలు ఏర్పాటుచేసి ఇక్కడే ఉన్నాను. వచ్చిపోతుంటాను అక్కా. ప్రశాంతి: నేనెందుకు చేశానంటే.. ఇప్పుడే నీవు చెప్పొద్దు.. కోవూరు నుంచి పోటీచేయమని అడుగుతున్నారు వాళ్లు.. సర్వేపల్లి నుంచి పోటీచేయమని అడిగారు.. ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాదు కదా అని వద్దన్నాను. కోవూరు తీసుకోమన్నారు.. ఫస్ట్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అల్లుడు కోసం ఉంచారు.. ఆయన పార్టీలోకి రాకపోవడంతో నన్నే చేయమంటున్నారు. రాజేంద్ర: అక్కా.. అక్కా.. ప్రశాంతి: ఇంకా వాళ్లు (వైఎస్సార్సీపీ) మా వెంటçపడే ఉన్నారు. నాక్కూడా పార్టీ మారడం ఇష్టంలేదు, ఫస్ట్ నుంచి ఈ పార్టీ అంటే ఇష్టం నాకు.. మరీ వాళ్లు ఈ మాదిరి చేసేసరికి అన్నను కని్వన్స్ చేయలేకపోయా. నాకు ఇంత అవమానం జరిగితే ఇంకా వెంటపడతావా అన్నారు. నాది చేతగానితనం అనుకుంటావా. నాకు రాజకీయం అవసరంలేదు. నేను పోటీచేస్తా.. గెలిస్తే గెలుస్తా.. లేకుంటే ఓడిపోతా. ఆ తర్వాత క్విట్ అయిపోతా.. పోటీచేయకుండా ఉండనన్నాడు.. రాజేంద్ర: అక్కా.. అక్కా.. ప్రశాంతి: వీళ్లందరూ నన్ను ఉండమంటున్నారు. లేదులే మేం ఎంపీ ఎలక్షన్ చేసుకుంటాం అన్నాను.. లేదులే అన్నాను. కోవూరు అయితే ఆదాల అల్లుడు అనుకున్నారు. కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు. కోవూరే తీసుకోమంటున్నారు. రాజేంద్ర: అవును కదక్కా అందరం ఇంట్లో వారం కదా. ప్రశాంతి: ఇంట్లో వారమే కానీ వాళ్లు పోటీచేయమంటున్నారు.. అన్న కూడా పార్టీ వీడుతున్నారు కాబట్టి వైఎస్సార్సీపీ నుంచి ప్రెజెర్స్ ఉంటాయి.. ఆత్మకూరు అయితే పదివేలతో ఆనం రామనారాయణరెడ్డి ఓడిపోతాడు.. అయితే, విక్రమ్ బాగా చేస్తున్నాడు.. రామనారాయణరెడ్డి పోయినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది.. రాజేంద్ర: అక్కా.. నేను మధ్యస్తంగా ఏమి చెప్పలేను.. నాకు ఇద్దరు కావాలక్కా.. ఈ మ«ధ్య అన్నకు దూరంగా ఉన్నా. ప్రశాంతి: మీడియాకు వీడియోలు పెడుతున్నావు కదా.. ప్రతి ఎలక్షన్‌కు అన్నదమ్ముల మధ్య మామూలే కదా.. రాజేంద్ర: కానీ, మా మధ్య ఏమీలేవక్కా.. అన్న గెలుపు కోసం గట్టిగా కృషిచేసేవాళ్లం. ప్రశాంతి: ఎక్కడా చెప్పకు రాజేంద్ర.. మేమైతే ఇంకా ఓకే చెప్పలేదు రాజేంద్ర. అంతా బంధువులు కదా.. సర్వేపల్లి గురించి చెప్పినా నేను ఒప్పుకోలేదు. నీవు సర్వేపల్లిలో అయితే గెలుస్తావన్నారు.. గెలవనని కాదు. నాకు ఇష్టంలేదు అని చెప్పా.. మరీ ఆయనకు (సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి) టికెట్ ఇవ్వమనే చెప్పారు.. నేను వద్దని చెప్పాను.. ఎవరు ముందుకు రాకపోతే ఆయనకే టికెట్ ఇస్తారు కదా పాపం.. -
AP: ఈ నెల 31న భీమవరంలో ఎమ్మెల్సీల సదస్సు
సాక్షి, పశ్చిమగోదావరి: రాష్ట్రంలోని శాసనమండలి సభ్యుల సదస్సుకు పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం వేదిక కానుంది. ఈ నెల 31న జరిగే ఎమ్మెల్సీల సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ యు.రవిప్రకాష్‌తో సమీక్షించారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 58 మంది ఎమ్మెల్సీలు సదస్సుకు హాజరవుతారని అంచనా. రాష్ట్రస్థాయి సదస్సు నేపథ్యంలో పట్టణంలో బందోబస్తు, పారిశుద్ధ్య నిర్వహణ, అతిథులకు ఆహ్వానం స్థానికంగా ఉన్న చర్చి, మసీదు, ఆలయాల సందర్శన తదితర అంశాల్లో లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని చైర్మన్ మోషేన్‌రాజు అధికారులకు ఆదేశాలిచ్చారు. మండలి విధివిధానాలు, క్వశ్చన్ అవర్, షార్ట్ డిస్కషన్న్, సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన నిబంధనలు, సూచనలు తదితర అంశాలపై సదస్సులో సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు. చాలా ఏళ్ల కిందట రాష్ట్రస్థాయి సదస్సు జరగ్గా, తాజాగా తమ మండలిలో భీమవరంలో సదస్సు నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అందుకోసం బీవీ రాజు కళాశాల ఆవరణను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పి.పి.కె.రామాచార్యులు, జాయింట్ సెక్రటరీ విజయ రాజు, సహాయ కార్యదర్శులు శ్రీనివాసరావు, విశ్వనాథ్, పశ్చిమగోదావరి డీఆర్వో బి.శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ప్రజలకు ఏం మేలు చేశావని నీకోసం వస్తారు? -
యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘తెలుగింటి సంస్కృతి’
‘పెళ్లాం ఊరెళితే’, ‘ఇంద్ర’ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రశాంతి హారతి. ఆమె కూతురు తాన్య హారతి ప్రధాన పాత్రలో నటించిన మ్యూజిక్ వీడియో ‘తెలుగించి సంస్కృతి’. వీఎస్ ఆదిత్య కాన్సెప్ట్ అందించిన ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. 1 మిలియన్ వ్యూస్ సాధించిన సందర్భంగా ఇటీవల టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. తమ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవడం సంతోషంగా ఉందన్నారు. ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అయిన గోపాల్ పొనంగి గారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు బృందం తమ ప్రగాఢమైన అభినందనలను తెలియజేసారు.ఈ ప్రాజెక్ట్‌ను ఘన విజయంతో ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన అద్భుతమైన 1M+ వీక్షకులకు బృందం వారి ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆల్బమ్‌కి ప్రశాంతి హారతి కొరియోగ్రఫీ అందించడంతో పాటు కీలక పాత్ర పోషించారు. -
పింఛన్ వల్లేనని మీకు చెప్పిందా రామోజీ?
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిత్యం బురదజల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మరోమారు తన నైజాన్ని చాటుకున్నారు. దివ్యాంగురాలు అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటే దానిని ఈ ప్రభుత్వానికి అంటగడుతూ ‘పింఛన్ పోరాటంలో ఉరితాడే దిక్కైంది..’ అంటూ ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తూ విషం చిమ్మారు. పింఛన్‌కు అర్హురాలిగా నిరూపించుకొనేందుకు, సర్కారుపై పోరు సల్పే సత్తువలేక ఉరి వేసుకొని చనిపోయిన ఓ దివ్యాంగురాలి దీనగాథ అంటూ అడ్గగోలు రాతలు రాశారు. వాస్తవానికి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని 43వ డివిజన్ ఊర్మిళానగర్‌లో ఇరువూరి ప్రశాంతికుమారి (38), తన తల్లి వెంకట నర్సమ్మతో కలిసి నివసిస్తోంది. వెంకటనర్సమ్మ స్కిల్‌డెవలప్‌మెంట్‌లో ఆయాగా పొరుగు సేవల ఉద్యోగినిగా పని చేస్తోంది. తండ్రి వెంకటేశ్వరరెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ప్రశాంతి కుమారి చిన్నతనం నుంచి కాళ్లు పనిచేయక పోవడంతో వీల్ ఛైర్ ఆధారంగా జీవనం సాగిస్తోంది. ఆమె గతంలో దివ్యాంగ పింఛన్ పొందేది. అయితే ఇటీవల విచారణ సమయంలో 2,705.12 చదరపు అడుగులు గల మూడు బిల్డింగులు ఉన్నట్లు ఆన్లైన్లో వ చ్చింది. అసెస్మెంట్ నంబర్ 1073034342కు సంబంధించిన భవనం 866.65 చదరపు అడుగులు, అసెస్మెంట్ నంబర్ 1073034343లో 489.94 చదరపు అడుగులు, అసెస్మెంట్ నంబరు 1073032643లో 1348.53 చదరపు అడుగులు, మొత్తం 2,705.12 చదరపు అడుగుల అర్బన్ ప్రాపర్టీ ఉందని విచారణలో తేలింది. తల్లి వెంకట నరసమ్మకు సీఎఫ్ఎంసీ ఐడీ క్రియేట్ అయినందున సిక్స్ స్టెప్ వెరిఫికేషన్‌లో, ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించినట్లు నమోదు కావడంతో ఆన్లైన్ వెరిఫికేషన్‌లో పింఛన్ రద్దయింది. ఆమె పింఛన్‌ను ఉద్దేశ పూర్వకంగా ఎవరూ తొలగించలేదు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది.. స్థానిక రెవెన్యూ పోలీసు విచారణలో ప్రశాంతి కుమారికి కుటంబ సభ్యులతో వివాదాలు ఉన్నాయని, అనారోగ్యంతో చికిత్స పొందుతోందని తేలింది. తల్లి వెంకట నరసమ్మ సైతం పోలీసులకు ఇ చ్చిన ఫిర్యాదులో తీవ్రమైన తలనొప్పి, అనారోగ్యంతో చికిత్స పొందుతూ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. ప్రశాంతి కుమారి ఇంట్లోనే ఉరి వేసుకొని మరణించడంతో భవానీపురం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ విషయాలన్నింటినీ దాచిన ఈనాడు పనిగట్టుకుని ప్రభుత్వంపై విషం చిమ్మింది. కట్టుకథ ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా కుట్ర పన్నడం దారుణం. సదరు మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు మీకేమైనా ఫోన్ చేసిందా రామోజీ? -
వద్దన్నందుకు చంపేశాడు.. బ్యూటీషియన్ దుర్గ మృతిలో వీడిన మిస్టరీ
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో సంచలనం సృష్టించిన బ్యూటీషియన్ దుర్గాప్రశాంతి మృతి కేసులో మిస్టరీ వీడింది. దుర్గాప్రశాంతిది హత్యగా పోలీసులు తేల్చారు. ప్రాణాపాయ స్థితిలో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడు చక్రవర్తి నోరు విప్పడంతో అసలు విషయం బయటపడింది. కొద్దిరోజులుగా తనను పక్కకు పెట్టడం, పెళ్లి విషయాన్ని వాయిదా వేస్తూ రావడంతోనే దుర్గాప్రశాంతిని చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ఇక్కడ ఆస్పత్రిలో కోలుకున్న చక్రవర్తి ప్రస్తుతం పోలీసుల పహారా మధ్య తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మోచేతితో గొంతుబిగించి.. చిత్తూరుకు చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమార్తె దుర్గాప్రశాంతికి, తెలంగాణలోని కొత్తగూడేనికి చెందిన చక్రవర్తికి ఫేస్బుక్ ద్వారా రెండేళ్లుగా పరిచయం ఉంది. దుర్గాప్రశాంతిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో చక్రవర్తి భద్రాచలంలో ఉన్న తన తల్లిని తీసుకుని చిత్తూరు వచ్చి దుకాణం తెరచి ఇక్కడే ఉంటున్నాడు. ఇటీవల పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తనకు కాస్త సమయం కావాలని దుర్గాప్రశాంతి కోరేది. వారం రోజులుగా వారి మధ్య విభేదాలొచ్చా యి. తనకు ఫోన్ చేయవద్దని, పెళ్లి ఇప్పుడే వ ద్దని ఆమె స్పష్టం చేసింది. ఈ మాటలను పట్టించుకోని చక్రవర్తి నిత్యం ఫోన్లు చేస్తుండటంతో తన మొబైల్ చాట్స్ అన్నీ డిలీట్ చేయాలని చక్రవర్తికి చెప్పి అతడి మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేసింది. తనను ఎందుకు పక్కకు పెట్టావని ప్రశ్నిస్తూ, పెళ్లి చేసుకోమని కోరుతూ చక్రవర్తి మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన మెయిల్ నుంచి దుర్గాప్రశాంతికి ఎని మిది పేజీల లేఖ రాశాడు. దీనికి ఆమె సమాధానం ఇవ్వలేదు. మధ్యాహ్నం ఆమె బ్యూటీపార్లర్‌లో ఉంటుందని తెలిసిన చక్రవర్తి 12.30 గంటల ప్రాంతంలో పార్లర్‌లోకి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినా దుర్గాప్రశాంతి అంగీకరించలేదు. దీంతో ఓ బ్లేడ్ తీసుకుని చేయి కోసుకున్నాడు. భయపడిన దుర్గ పార్లర్ నుంచి బయటకు పరుగెత్తేందుకు ప్రయత్నించింది. వెంటనే తన మోచేతితో దుర్గ గొంతును ఊపిరి ఆడకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆరడుగుల పొడవు, బలిష్టమైన శరీరంతో ఉన్న చక్రవర్తి పట్టు నుంచి దుర్గాప్రశాంతి తప్పించుకోలేక.. ఊపిరాడక క్షణాల్లో ప్రాణాలొదిలింది. దీంతో భయపడిన నిందితుడు తాను కూడా చనిపోవాలని బ్లేడుతో గొంతు, చేయి, శరీరంపై కోసుకుని తీవ్ర రక్తస్రావంతో పడిపోయాడు. దిశ పోలీసుల దర్యాప్తు ఈ కేసును చిత్తూరు దిశ పోలీసులకు అప్పగిస్తూ ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వన్‌టౌన్ పోలీసుల వద్ద ఉన్న సమాచా రాన్ని దిశ స్టేషన్ డీఎస్పీ బాబుప్రసాద్ తీసుకున్నారు. దిశ సీఐ బాలయ్యతో కలిసి వైద్యులచే దుర్గాప్రశాంతి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి, కుటుంబసభ్యులకు అప్పగించారు. నిందితుడు చక్రవర్తిపై హత్య, అట్రాసిటీ, ఆత్మహత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
ఉత్తరాదిలో శ్రీవారికి మరింత శోభ
సాక్షి, న్యూఢిల్లీ/తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయటానికి, కొత్తగా నిర్మించే ఆలయాల పర్యవేక్షణకు ఢిల్లీ స్థానిక సలహామండలి సమర్థంగా పనిచేయనుందని తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న సనాతన ధర్మప్రచార కార్యక్రమాలతో ఉత్తర భారతదేశంలో శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ కమిటీ కృషిచేస్తుందన్నారు. ఢిల్లీలోని టీటీడీ ఆలయ స్థానిక సలహామండలి చైర్‌పర్సన్‌గా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జమ్మూలో చేపట్టిన ఆలయ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించినట్లు తెలిపారు. అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ కేటాయించే స్థలాన్ని బట్టి శ్రీవారి ఆలయంగానీ, భజన మందిరంగానీ నిర్మిస్తామని చెప్పారు. గో సంపద పరిరక్షణ ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆలయాలకు ఆవును, దూడను ఇచ్చే కార్యక్రమం చేపట్టామని, ఇప్పటికే వంద ఆలయాలకు ఇచ్చామని తెలిపారు. గోఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఏపీ రైతు సాధికార సంస్థతో ఎంవోయూ చేసుకున్నట్లు చెప్పారు. గోఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలను రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి టీటీడీ కొనుగోలు చేస్తుందన్నారు. శ్రీవారి ప్రసాదాలు, నిత్యాన్నదానంతో పాటు టీటీడీ అవసరాలకు గో ఆధారిత ఉత్పత్తులను సేకరిస్తామన్నారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఢిల్లీతో పాటు ఉత్తరాదిలో శ్రీవారి వైభవాన్ని తెలియజెప్పే కార్యక్రమాలను చేపట్టడమేకాకుండా, భక్తులకు సౌకర్యాల కోసం కృషిచేస్తానని చెప్పారు. అనంతరం గోపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి చైర్మన్ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్‌పర్స్‌న్‌గా ప్రశాంతి ప్రమాణం
-
టీటీడీ ఢిల్లీ సలహా మండలి చైర్ పర్సన్ గా ప్రశాంతి రెడ్డి ప్రమాణం..
న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహామండలికి చైర్‌పర్సన్‌గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉత్తర భారతదేశంలో టీటీడీ ఆలయాల అభివృద్ధి దిశగా చర్యలు చేపడతామని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాంలో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ఆలయాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఆలయ గర్భగుడిని అలాగే ఉంచి.. మిగిలిన ప్రాంతాన్ని పునర్నిర్మిస్తామని పేర్కొన్నారు. అయోధ్యలో టీటీడీ ఆలయంలో గానీ, భజన మండలి నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలోని 29 పీఠాధిపతులతో తిరుమలలో గోమహా సమ్మేళనం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అన్నారు. దేశంలోని ఏ గుడిలో నైనా.. గోవును అడిగితే ఉచితంగా అందజేస్తామని తెలిపారు. దేశంలో అనేక చోట్ల గోవులకు సరైన పోషణ ఉండటం లేదని ఆవేదన సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు. గోసంరక్షణ కోసం అవసరమైన నిధులను కూడా.. టీటీడీ కేటాయిస్తుందని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. -
ప్రశాంతి అందరిలా ఆలోచించలేదు..
చాలా మందికి తమ చుట్టూ ఉన్న సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనుంటుంది. కానీ వివిధ కారణాల రీత్యా, నగరాలలో ఉండే యాంత్రిక జీవన ప్రభావం వల్ల ఏమీ చేయలేక పోయామని బాధపడుతుంటారు. అయితే ప్రశాంతి అందరిలా ఆలోచించలేదు.. ఏదైనా చేయాలని గట్టిగా సంకల్పించింది. తాను అనుకున్న దానిని ఆచరణలో పెట్టింది. తన ‘గుడ్‌విల్’తో అందరి ఆదరాభిమానాలనూ చూరగొంది. తన సేవలను మరింత విస్తృతంగా చేయాలంటే ప్రభుత్వాధికారిగా ఉండాలనుకుంది. కష్టపడి ప్రయత్నించింది. ఉన్నతాధికారిగా ఉద్యోగాన్ని సాధించింది. తన కలలను సాకారం చేసుకుంది. ఇంతకీ ఎవరీ ప్రశాంతి... ఆమె సమాజానికి చేసింది ఏమిటో తెలుసుకుందాం... ప్రశాంతి స్వస్థలం మహబూబ్ నగర్. ఎంబీబీఎస్ చేయాలనే లక్ష్యంతో ఎంసెట్‌లో ఓయూ పరిధిలో 2100 ర్యాంకు సాధించారు. కానీ, వైద్యకళాశాలలో సీటు రాకపోవడంతో ఎల్ఎల్బీ చేసి, ఆ విద్యా సంవత్సరపు టాపర్‌గా నిలిచారు. అనంతరం అరోరా బిజినెస్ స్కూల్ ఆంధ్రా మహిళా సభలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఇలా తన ఇంటిని, తన వాళ్లను చూసుకుంటూ, ఇటు ఉద్యోగం చేసుకుంటూ.. తనకున్న సమయంలో సమాజంలోని పేదవారికి ఏదైనా చేయాలని ఆలోచించేవారు. ఒకసారి ఆమెకు వీధి చివరన ఒక బాలుడు చెత్త కుండీ నుంచి ఆహారాన్ని తీసుకుంటూ, అందులో పారేసిన గుడ్డపీలికలను వెతికి ఆచ్చాదనగా చుట్టుకుంటున్న దృశ్యం కంట పడింది. ఆ దృశ్యం ఆ క్షణాన ఆమె కళ్ల ముందు నుంచి తొలగింది కానీ, చాలాకాలం పాటు మనసును వెంటాడుతూనే ఉంది. దాంతో అలాంటి వారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న తన సోదరి తో పంచుకుంది. అప్పుడామె ఇంట్లో తాము ఉపయోగించని వస్తువులు, ఫర్నీచర్, దుస్తులు వగైరా ఇతరులు ఉపయోగించుకునేందుకు వీలుగా ‘గుడ్ విల్ స్టోర్స్’ అమెరికాలో ఉంటాయని, వీలయితే నువ్వు కూడా అలాంటి స్టోర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించమని సలహా ఇచ్చింది. ప్రశాంతిపై ఆమె మాటలు బాగానే ప్రభావం చూపాయి. వెంటనే ఆమె తన ఇంట్లో వాడకుండా ఉన్న దుస్తులు, ఫర్నిచర్ వంటి వాటిని తీసుకొని తను ఉంటున్న వీధి చివరన ఒక స్టోర్‌ను ఏర్పాటు చేసి, అక్కడ గోడకు పెయింటింగ్ వేసి ఆ బట్టలు, వస్తువులు పెట్టేసి వచ్చింది. ఈ గుడ్ విల్ స్టోర్ గురించి తన మిత్రులకు, అపార్ట్మెంట్ చుట్టుపక్కల ఉంటున్న వారికి కూడా అవగాహన కల్పించింది. ఆమె చేసిన ఈ పనులను స్థానికులు మొదట్లో వింతగా చూసినప్పటికీ క్రమంగా ఆమె ఆలోచనకు, చేస్తున్న ప్రయత్నానికి ఆదరణ పెరిగింది. దీంతో ప్రస్తుతం అక్కడ చాలామంది వారికి కావాల్సిన వస్తువులను తీసుకోగల్గుతున్నారు. అప్పటికి కానీ ప్రశాంతి మనసుకు ప్రశాంతత లభించలేదు. స్టోర్ కోసం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం తనకున్న పరిధిలోనే ఇంత చేయగలిగితే, ఒకవేళ ప్రభుత్వ సర్వీసులో ఉంటే ఇంకా ఎక్కువే చేయచ్చు కదా అనుకుంది. ఉన్నతమైన ఆశయాలున్న ప్రశాంతిని ఆమె ఆలోచనలు గ్రూప్–1 ఉద్యోగం వైపునకు నడిపించాయి. భర్త, ఇతర కుటుంబ సభ్యులు అందుకు సహకరించారు. దీంతో తను రాసిన పరీక్షలో ఓవరాల్ గా 9వ ర్యాంకు, మహిళల విభాగంలో 3వ ర్యాంకు సాధించారు. 2016–17 గ్రూప్–1 నోటిఫికేషన్లో మున్సిపల్ శాఖలో డిప్యూటీ కమిషనర్ ఉద్యోగాన్ని సాధించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో తొలి పోస్టింగ్ వచ్చింది. ఉద్యోగంలో చేరిన వెంటనే అక్కడ కూడా ప్రశాంతి గుడ్ విల్ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా సంగారెడ్డిలోనూ చేశారు. అలా ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లు ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఒక గుడ్ విల్ స్టోర్‌ను ఏర్పాటు చేస్తూనే ఉన్నారామె. కొన్ని ఎన్జీవో సంస్థలు కూడా ముందుకు వచ్చి, స్టోర్ ముందు అన్నదానాలు, ముఖ్యదినోత్సవాలను పురస్కరించుకొని పేదలకు దుప్పట్లు వగైరా పంచి పెట్టేవారు. ఇప్పుడు ఆమె మూసాపేట్ పరిధిలో కూడా తన గుడ్ విల్ స్టోర్‌ను తోటి ఉద్యోగుల సహకారంతో ఏర్పాటు చేశారు అంతేకాదు, ఉద్యోగంలో భాగంగా తన శాఖ పరిధిలో ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను ప్రజలకు చేరేలా సహకారం అందిస్తూ.. ఇటు కుటుంబ బాధ్యతలు.. అటు ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు. కూకట్పల్లి సర్కిల్ ప్రాంతంలో ఆమె ఏర్పాటు చేసిన గుడ్‌విల్ స్టోర్‌ను చూసిన కె. చంద్రశేఖర్ రెడ్డి అనే వైద్యాధికారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. తాను కూడా ఈ మంచి పనిలో తనవంతుగా ఏదైనా చేయాలనుకున్నారు. వెంటనే కూకట్పల్లి సమీపంలోని హుడా ట్రక్‌పార్క్ సమీపంలో శిథిలావస్థలో ఉన్న ఒక గదిని తన సొంత ఖర్చులతో శుభ్రం చేయించి, మరమ్మతులు చేయించి, రంగులు వేయించి, గుడ్‌విల్ స్టోర్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి వారు కూడా ఈ స్టోర్ పట్ల అవగాహనతో తమ వద్ద నిరుపయోగంగా ఉన్న కొన్ని వస్తువులు, దుస్తులను తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. అవసరం ఉన్న వారు వాటిని తీసుకెళుతున్నారు. గుడ్‌విల్‌తో ప్రశాంతి చేసిన ఈ మంచి పనిని చూసి అయినా అవసరంలో ఉన్న వారికి అంతో ఇంతో ఉపయోగపడాలనే ఆలోచన కొందరిలో అయినా వస్తే చాలా మంచిది. గుడ్‌విల్ స్టోర్ నా మానస పుత్రిక నాకు కేవలం 18 సంవత్సరాల సర్వీసు మాత్రమే ఉంది. చాలా ఆలస్యంగా ఈ ఉద్యోగంలో చేరానని బాధపడుతూ ఉంటాను. ప్రతిక్షణం ప్రజలకు ఇంకా ఏం చేయగలనో ఆలోచిస్తుంటాను. అంతేకాదు, ఎన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతున్నా ప్రభుత్వ ఫలాలను ప్రజలకు చేర్చడంలో నేను రాజీ పడను. ఇది ప్రజలతో మమేకమై, వారికి సేవచేయడానికి నాకిచ్చిన సువర్ణావకాశంగా భావిస్తున్నాను. గుడ్‌విల్ స్టోర్ నా మానస పుత్రిక. – ప్రశాంతి, గుడ్‌విల్ స్టోర్ వ్యవస్థాపకురాలు, డిప్యూటీ కమిషనర్, జీహెచ్ఎంసీ, కూకట్పల్లి – ఇనామ్దార్ పరేష్ సాక్షి, హైదరాబాద్ -
‘నగరపాలక’ కమిషనర్‌గా ప్రశాంతి బాధ్యతల స్వీకరణ
అనంతపురం సెంట్రల్: నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రశాంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతేడాది నవంబర్‌లో ఆమె దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మున్సిపల్ ఆర్డీ హలీమ్ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన బదిలీ కావడంతో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చెన్నుడుకు, ఆతర్వాత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్రకు కేటాయించారు. బుధవారం రెగ్యులర్ కమిషనర్ ప్రశాంతి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నగరంలో వివిధ ప్రాంతాల్లో కరోనా కేసులు నమోదైన రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. -
భక్తురాలికి శ్రీవారి సేవల భాగ్యం
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలిలో సభ్యురాలిగా ఇటీవలే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నియమితులయ్యారు. నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే ప్రశాంతి ఇప్పుడు ఆధ్యాత్మిక సేవలోనూ అవిశ్రాంతంగా మారిపోయారు. నాలుగేళ్ల క్రితం నెల్లూరు నగరంలో మొదటిసారిగా శ్రీవారి వైభవోత్సవాలను వీపీఆర్ ఫౌండేషన్ నేతృత్వంలో తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించారు. తిరుమలలో స్వామివారికి చేసే ప్రతి సేవను ఆ వైభవోత్సవాల్లో నిర్వహించారు.సుప్రభాతసేవ మొదలుకుని ఏకాంతసేవ వరకు అన్ని సేవలకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ‘‘అప్పుడే స్వామివారికి మరింతసేవ చేయాలి, స్వామిసేవలో తరించాలనుకున్నాను. నా సంకల్పాన్నిఆ దేవదేవుడే నెరవేర్చాడని ప్రగాఢంగాఅనుకుంటున్నాను’’ అని ప్రశాంతి అన్నారు. ప్రశాంతి బాల్యమంతా తిరుపతిలోనే గడిచింది. టీటీడీ స్కూల్, టీటీడీ మహిళా కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ‘‘నిత్యం స్వామివారి పేరును తలుచుకుంటూ ఏడుకొండలను చూస్తూ పెరిగిన నాకు మాధవసేవ కూడా స్వామివారి ద్వారానే లభించడం భాగ్యంగా భావిస్తున్నాను. టీటీడీ బోర్డు సభ్యురాలిగా సామాన్యులకు స్వామివారి సేవ దక్కేలా కష్టపడతాను. కొత్త ప్రభుత్వంలో అనేక మార్పులు, ప్రత్యేక కేటగిరీ దర్శనాలు రద్దు ద్వారా రోజుకు 7,500 నుంచి 9,000 మంది వరకు అదనంగా స్వామివారిని దర్శించుకోనున్నారు’’ అన్నారామె. మహిళగా కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతూనే తమ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, తాగునీరు, యువజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, ఇతర సేవా కార్యక్రమాలకు కో చైర్పర్సన్ గా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. సంకల్పమే నడిపిస్తోంది ‘‘సంపాదించే అవకాశం దేవుడు మనకు ఇచ్చినప్పుడు అందులోంచి ఎక్కువ భాగం మానవసేవకు వినియోగించాలనేది మా సంకల్పం. ఆ సంకల్పమే మమ్మల్ని బలంగా ముందుకు నడిపిస్తోంది. 2015లో వీపీఆర్ ఫౌండేషన్ ను ప్రారంభించాం. నాటి నుంచీ స్కూల్, కళాశాలలో ఉచిత విద్యతోపాటు, విద్యార్థులకు భోజనం, పుస్తకాలు, యూనిఫామ్, వైద్యం, బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నాం. జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేయడంతోపాటు నిర్వహణ బాధ్యతలు కూడా మా ఫౌండేషన్ ద్వారా చేస్తూ ప్రజలకు రక్షిత మంచినీరు అందిస్తున్నాం. ఈ ఏడాది మరిన్ని వాటర్ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కనపర్తిపాడులోనే స్కూల్ ప్రాంగణంలోనే పది పడకల ఆస్పత్రిని ప్రారంభించి అన్నిరకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. అలాగే కొత్తగా ‘హెల్త్ ఆన్ వీల్స్’ పేరుతో గ్రామాలకే మొబైల్ వాహనాలు వెళ్లి అన్నిరకాల వైద్యసేవలతోపాటు పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని తెలిపారు ప్రశాంతి. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను బోర్డు సభ్యురాలిగా ఎంపికైనప్పుడు నా భర్త ప్రభాకర్‌రెడ్డి చెప్పిన మాట ఒక్కటే. ‘‘బాధ్యత పెరిగింది. సీఎం వైఎస్ జగన్ మనల్ని నమ్మి ప్రపంచ ఖ్యాతి గాంచిన తిరుమల దేవస్థానం బోర్డులో చోటు కల్పించారు. మరింత ఆధ్యాత్మిక చింతనతో మానవసేవతోపాటు మాధవసేవ కొనసాగించాలి’’ అని. సీఎం జగన్ నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను.– వి. ప్రశాంతి రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యురాలు నిజపాదుకలు తీసుకొచ్చాం ‘వీపీఆర్ ఆధ్యాత్మికం’ పేరుతో ఈ దంపతులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలకు వితరణ ఇవ్వడంతోపాటు నెల్లూరు నగరంలో ఏటా లక్షదీపోత్సవం ఘనంగా జరుపుతున్నారు. ‘‘గతేడాది షిర్డీ సాయిబాబా నిజపాదుకలను నగరానికి తీసుకువచ్చాం. భక్తులు సంతోషంగా దర్శించుకున్నారు. ఈ ఏడాది కార్తీకమాసంలో నిర్వహించే లక్షదీపోత్సవంలో భీమశంకరుడు, కంచి అత్తివరదరాజ స్వామి నమూనా దేవాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. ఆ దేవాలయాలు సందర్శించలేని భక్తులు వీటిని దర్శించుకుంటారు’’ అని చెప్పారు ప్రశాంతి. గత నెల 21వ తేదీన టీటీడీ బోర్డు సభ్యురాలిగా స్వామివారి సన్నిధిలో ప్రమాణం చేసి బాధ్యతలు తీసుకున్నారు ఆమె. ‘‘మొదటి బోర్డు సమావేశంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పైనే చర్చించాం. నెల్లూరులో టీటీడీ కల్యాణమండపం ప్రాంగణంలో స్వామివారి దేవాలయ నిర్మాణానికి, చిన్న దేవాలయాలకు, ధూపదీప నైవేద్యాలకు ఇబ్బందులుండే దేవాలయాలకు టీటీడీ ద్వారా సహకారం అందించేందుకు కృషి చేస్తాను’’ అని చెప్పారు ప్రశాంతిరెడ్డి.– కాట్రపాటి కిశోర్, సాక్షి, నెల్లూరు ఫొటోలు: ఆవుల కమలాకర్ -
‘ఫలక్ నుమా దాస్’ మూవీ ట్రైలర్ లాంచ్
-
ఫలక్‌నుమా దాస్ హిట్టవ్వాలి
‘‘ఫలక్‌నుమా దాస్’ టీజర్ చూడగానే కుర్రాళ్లంతా చాలెంజ్‌గా తీసుకుని కష్టపడి చేశారనిపించింది. ఇటీవల యూత్‌కి నచ్చే సినిమాలు రాలేదు. ఈ చిత్రంలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి హీరోయిన్లుగా నటించారు. డి. సురేశ్‌బాబు సమర్పణలో కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని వెంకటేశ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘విశ్వక్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతమైన ఎనర్జీతో కనిపించాడు. యాక్టింగ్ స్కిల్స్ బావున్నాయి. ట్రైలర్ చాలా బావుంది. హైదరాబాద్‌లో ఉన్న రియలిస్టిక్ లొకేషన్స్ అన్నీ కవర్ చేసినట్టున్నారు. డైలాగ్స్ బావున్నాయి. సినిమా పెద్ద హిట్ కొట్టి అందరికీ పెద్ద పేరు తీసుకురావాలి’’ అన్నారు.‘‘టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌కు ఇంకా ఎక్కువ రావాలనుకున్నాను. మొన్నటివరకూ టెన్షన్ ఉంది. సురేశ్‌బాబు సర్ సినిమా చూసి మెచ్చుకుని, సమర్పిస్తున్నారు. వెంకటేశ్గారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషం. రెండ్రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు విష్వక్సేన్. ‘‘హైదరాబాద్‌లో ఎవరికీ తెలియనటువంటి 118 లొకేషన్స్‌లో ఈ సినిమా షూట్ చేశాం. 20–25 సంవత్సరాలున్న 40 మంది కుర్రాళ్లు కష్టపడి ఈ సినిమా చేశారు’’ అన్నారు నిర్మాత కరాటే రాజు. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన టీమ్ అందరికీ థాంక్స్’’ అన్నారు ప్రశాంతి. -
సేవాలాల్ చూపిన మార్గంలో నడవాలి
సాక్షి, నిర్మల్అర్బన్: బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి అన్నారు. జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం సంత్ సేవాలాల్ 280వ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపించిన మార్గం ఆదర్శనీయమన్నారు. ఆయన బోధనలను అందరూ ఆచరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్పీ శశిధర్‌రాజు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి వెంకటేశ్వర్లు, డీటీడబ్ల్యూవో శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీవో శ్యాంనాయక్, ఆల్ ఇండియా బంజారా లీగల్ సెల్ అధ్యక్షుడు అమర్‌సింగ్ తిలావత్, జెడ్పీటీసీ విమలాబాయి, సుజాత, పీఆర్‌డీఈఈ తుకారాం, మున్సిపల్ డీఈఈ సంతోష్, నాయకులు రాజేష్‌బాబు, రామునాయక్, నరేష్ జాదవ్, బలరాం నాయక్, రామారావు మహారాజ్, తదితరులున్నారు. సభా వేదికపై అతిథులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా బంజారాలు సంప్రదాయ పద్ధతిన జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహించారు. నృత్యాలతో అలరించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్, ఎమ్మె ల్యే రేఖానాయక్, మహిళా ప్రజా ప్రతినిధులు నృత్యాలు చేసి ఉత్సాహపరిచారు. కల్యాణలక్ష్మీ చెక్కులు అందించాలి మహారాష్ట్ర నుంచి ఇక్కడ అనేక ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికి కుల సర్టిఫికెట్లు జారీ చేయాలని కలెక్టర్‌ను కోరారు. చాలా మందికి కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో కల్యాణలక్ష్మీ చెక్కులు అందడం లేదన్నారు. అలాగే ఆర్వోఆర్ పత్రాలను అందజేసి రైతుబంధు, రైతు బీమా పథకాలను వర్తింపజేయాలని కోరారు. – విఠల్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి ప్రభుత్వం జిల్లా కేంద్రంలో బంజారా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు స్థలం కేటాయించలేదని పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని కోరారు. ఏటా సంత్ సేవాలాల్ జయంతి సందర్భం గా ఒక చోట చేరుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. – రేఖా శ్యాంనాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే రూ.5కోట్ల నిధులు విడుదల చేయాలి సేవాలాల్ జయంతికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు విడుదల చేయాలన్నారు. ఏటా నిర్వహించే జయంతి కార్యక్రమాల్లో సీఎంలు హాజరు కావాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సేవాలాల్ చిత్రపటాలను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటు చేసి బంజారాల సమస్యలు పరిష్కరించాలన్నారు. – అమర్‌సింగ్ తిలావత్, ఆల్ ఇండియా బంజారా లీగల్ సెల్ అధ్యక్షుడు వేడుకలకు హాజరైన బంజారాలు -
అమ్మ పోయాక నాన్న కుంగిపోయారు
‘‘నాన్న జీవితం ఎంతో ఆదర్శం. కష్టడినవాళ్లకు ప్రతిఫలం దక్కుతుందనడానికి ఆయన ఓ ఉదాహరణ’’ అన్నారు రాఘవ కుమార్తె ప్రశాంతి. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారామె. ► రాఘవగారు ఇంత సడన్ గా దూరమవుతారని ఎవరూ ఊహించలేదు? నాన్న శారీరకంగా బాగానే ఉన్నప్పటికీ అమ్మ చనిపోయాక మానసికంగా కుంగిపోయారు. మొన్న మార్చి 23న అమ్మ చనిపోయారు. అమ్మానాన్నలది 60 ఏళ్ల అనుబంధం. ‘హంసా’ (రాఘవ సతీమణి) అని పిలిచేవారు. ‘నా హంసాకి ఏమీ జరగదు. నేనున్నంత వరకూ నాతోనే ఉంటుంది’ అనే ఫీలింగ్‌తో ఉండేవారు. ► జీవితంలో చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తి రాఘ వగారు. భార్యాపిల్లలను బాగా చూసుకునేవారా? నన్ను, అన్నయ్యను బాగా పెంచారు. నా వయసిప్పుడు 43. నా లైఫ్‌లో మా అమ్మ రెండు సార్లు మాత్రమే ఏడవడం చూశాను. మమ్మల్ని నాన్న అంత బాగా చూసుకున్నారు. ► 105ఏళ్ల రాఘవగారి ఆరోగ్య రహస్యం ఏంటి? అమ్మ వంటే కారణం. ► చివరి రోజుల్లో మీ నాన్నగారు ఎలా ఉండేవారు? అమ్మ పిలుస్తున్నట్లు నాన్నకు అనిపించిందని నా ఫీలింగ్. ఆయన బయటకు వెళ్లడానికి ప్రయత్నం చేసినా మేం వదల్లేదు. కాపలా కాసేవాళ్లం. అయితే మొన్నా మధ్య తెల్లవారుజాము 4.30 గంటలకు బయటకు వెళ్లారు. కింద పడిపోయారు. తలకు దెబ్బ తగిలింది. ఆస్పత్రిలో చేర్చాం. ఆ గాయంకన్నా కూడా షుగర్ లెవల్స్ కంట్రోల్ కాలేదు. ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. నాన్న లేని లోటు మాకు ఎప్పటికీ ఉంటుంది. -
శాల్యూట్ టూ ప్రశాంతి
పశ్చిమగోదావరి:‘ పేదరికంలో పుడితే.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే.. ఉద్యోగాలు రావనే అపోహ విడనాడండి. కష్టపడే తత్వం, పట్టుదల, నిరంతరం లక్ష్యం కోసం శ్రమించడం వంటి లక్షణాలు అలవరచుకొంటే సాధించలేనిది ఏదీ లేదు. అందుకే నేనే ఉదాహరణ.’ అంటున్నారు పెంటపాడు గ్రామానికి చెందిన మరపట్ల ప్రశాంతి. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. మాది పెంటపాడు గ్రామం. మా తండ్రి నిరక్ష్యరాస్యుడు. వృత్తిపరంగా వ్యాన్ డ్రైవర్. తల్లి జయలక్ష్మి. ఇంటర్ చదివారు. మేము ఇద్దరం ఆడపిల్లలం. నా అక్క పేరు సింధు. ఆమె ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ చేసింది. విశాఖపట్నంలోని రెడ్డిల్యాబ్‌లో పనిచేస్తోంది. నేను పెంటపాడు ప్రభుత్వ పాఠశాలలో వి«ధ్యాభ్యాసం చేశాను. 2009–12లో స్థానిక డీఆర్ గోయంకా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ పూర్తిచేసి కళాశాల టాపర్‌గా నిలిచాను. ఇంట్లో తండ్రి పడుతున్న కష్టాలు చూశాను. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొన్నాను. అప్పుడే పేదలకు సేవా చేయాలనే తలంపుతో ఎన్సీసీలో చేరాను. అప్పటి ఎన్సీసీ అధికారి నతానియేలు సూచన మేరకు ఎస్సై కావాలనే లక్ష్యం ఉండేది. ఎస్సై ఉద్యోగానికి దేహదారుఢ్యం అవసరమని గుర్తించాను. కళాశాలలోనే ఉదయం రన్నింగ్, లాంగ్‌జంప్, లాంటి వ్యాయామాలు చేశాను. ఎప్పటికైనాసివిల్ సర్వీస్ సాధించాలని.. ఎస్సై కావాలనే లక్ష్యం అలా ఉండగానే, 2012–13లో పెదతాడేపల్లి వాసవి జీఎంఆర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాను. గూడెం ఏయూ క్యాంపస్‌లో ఎంఏ పూర్తి చేశాను. కరెంట్ ఎఫైర్స్ కోసం వార్తా పత్రికలు నిత్యం చదివేదాన్ని. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలో మెంబర్‌గా ఉండి పలుసార్లు రక్తదానం చేశాను. తిరుపతిలో జరిగిన జాతీయ సమైక్యతా శిబిరంలో పాల్గొని నృత్యంలో రెండో బహుమతి సాధించాను. కాగా ఎన్సీసీలో తీసుకొన్న నిర్ణయం మేరకు పోలీస్‌శాఖలో నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలు రాశాను. ఎస్సైగా ఎంపికయ్యాను. ప్రస్తుతం అనంతపురంలో ఎస్సై శిక్షణ పొందుతున్నాను. మరో మూడు నెలల్లో ఈ శిక్షణ పూర్తవుతుంది. మేనమామ ఏలూరి జగదీష్, పెద్దమ్మ మరపట్ల బాలకృష్ణ ప్రోత్సాహం, సహకారం కారణంగా పోలీస్ శాఖలో ఎస్సై అయ్యాను. అయినా ఈ లక్ష్యం కాక మరో టార్గెట్ ఉంది. ఎప్పటికైనా సివిల్ సర్వీస్ పరీక్షల్లో విజయం సాధించి సమాజ శ్రేయస్సుకు, పేద ప్రజలకు సహాయం చేయాలనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితేనేమి? పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉద్యోగాలు రావనే అపోహ విడనాడాలి. కష్టపడే తత్వం, పట్టుదల, నిరంతరం లక్ష్యం కోసం శ్రమించడం వంటి లక్షణాలు అలవరచుకొంటే సాధించలేనిది లేదు. నాతోటి యువతులు కూడా ఈ విధంగా ఆలోచించాలి. చదువు మధ్యలోనే ఆపకుండా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. పేదరికంలో ఉన్నా, ఉన్నతస్థితిలో ఉన్నా సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదు. -
పౌర సరఫరాల్లో పారదర్శకతకే ‘ఈ–పాస్’
నిర్మల్‌టౌన్: అక్రమాలకు తావు లేకుండా నిత్యావసర సరుకులను పారదర్శకంగా లబ్ధిదారులకు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంఎస్ ఫంక్షన్ హాలులో శుక్రవారం చౌకధరల దుకాణాల డీలర్లకు ఈ పాస్ యంత్రాల వినియోగంపై నిర్వహించిన శిక్షణ, అవగాహన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఖానాపూర్, కడెం, దస్తూరాబాద్, పెంబి, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్మల్‌రూరల్, నిర్మల్అర్బన్, సోన్, లక్ష్మణచాంద, మామడ మండలాలకు సంబంధించిన రేషన్ డీలర్లకు ఈ పాస్‌పై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులను పంపిణీ చేసేందుకు ఈ–పాస్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు సౌలభ్యంగా, పారదర్శకంగా నిత్యావసర సరకులను పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ పాస్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీనివల్ల రేషన్ సరుకులు పక్కదోవ పట్టకుండా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. రేషన్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈపాస్‌ను ప్రవేశపెట్టిందన్నారు. రేషన్ డీలర్లకు అర్థమయ్యేలా ఈ పాస్ యంత్రాల పనితీరుపై ఆమె వివరించారు. అనంతరం ఈపాస్ బయోమెట్రిక్ మిషన్లను రేషన్ డీలర్లకు పంపిణీ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఈపాస్ యంత్రాలతో 48 లక్షల లావాదేవీలు నిర్వహించినట్లు తెలిపారు. వచ్చే నెల 18 నుంచి... ఈ నెలలో కొత్తగూడెం, గద్వాల్, ఖమ్మం, నాగర్‌కర్నూల్, వనపర్తి, యాదాద్రి బోనగిరి జిల్లాల్లో ఈపాస్ యంత్రాలపై శిక్షణ కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. శనివారం నుంచి నల్గొండ, సూర్యాపేట్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పాస్ మిషన్ల ద్వారా ఆన్లైన్ బయోమెట్రిక్ విధానంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్డీవో ప్రసూనాంబా, జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి వాజీద్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ శ్రీకళ, ప్రాజెక్టు మేనేజర్ రఘునందన్, అసోసియేట్ మేనేజర్ శ్రావణ్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజేందర్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
బతుకు... బతికించు
నాన్నకు కాసింత జ్వరం వస్తే ఆ కన్న కూతురు తట్టుకోలేదు. దగ్గరుండి మాత్రలు వేసి, తల్లిలా గోరుముద్దలు తినిపిస్తేనే గానీ ఆమెకు శాంతి లభించదు. అదే కూతురు ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంటే ఆ తండ్రి ఎంత క్షోభ అనుభవిస్తాడు? ‘అమ్మా... నాకు ఉద్యోగం వచ్చేసిందిగా... మరేం ఫర్వాలేదు. మన జీవితాలు మారిపోతాయి. నీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటానమ్మా...’అని ప్రేమగా చేతిలో చేయి వేసి చెప్పిన కొడుకు ఒత్తిడి తట్టుకోలేక ప్రాణం తీసుకుంటే ఆ తల్లిపేగు ఎంతగా బాధపడుతుంది? ‘ఇంకొంచెం కష్టపడితే చాలురా... ఉద్యోగం వచ్చేస్తుంది. ఆ తర్వాత ఫ్యామిలీని బాగా చూసుకుంటా’ అని చెప్పిన మిత్రుడు తెల్లారితే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపిస్తే స్నేహితులు ఎంత నరకం అనుభవిస్తారు? జీవితంలో అన్ని ప్రశ్నలకూ ఆత్మహత్యలో సమాధానం వెతుక్కునే వారు ఆఖరుకు తమ వారికి ఇలాంటి ప్రశ్నలనే మిగిల్చి వెళుతున్నారు. జిల్లాలోనూ ఆత్మహత్యల ఘటనలు ఎక్కువైపోతున్నాయి. విజయనగరం క్రైం: కాలేజ్‌లో లెక్చరర్ తిట్టారని ఒక విద్యార్థిని, భర్త వేధింపులు తాళలేక మరో వి వాహిత, ఉద్యోగం రాలేదని ఓ యువకుడు... ఇలా కారణాలేవైనా నిండు ప్రాణా లు బలి తీసుకుంటున్నారు. సమస్యలతో పోరాడలేక జీవితాన్ని బల వంతంగా ముగించేస్తున్నారు. క్షణికావేశంలో కొం దరు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అయినవారి గుండెల్లో ఆరని మంట రగులుస్తున్నాయి. తీరని వేదన మిగులుస్తున్నాయి. కష్టాలు ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్య వల్ల సమస్యలు వస్తాయి గానీ సమసిపోవని నిపుణులు చెబుతున్నారు. ఇంకా... ముందుగా తెలియజేస్తారు... ఆత్మహత్యకు మొదటి కారణం ఒత్తిడి. తమకు ఆత్మహత్య ఆలోచన వస్తున్నప్పుడు ఆ ప్రయత్నాలను సీరియస్‌గా చేయాలకున్న వ్య క్తులు వివిధ రకాల సిగ్నల్స్‌తో తమ వారిని తెలియజేస్తారు. తమకు ఇష్టమైన వస్తువులను ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలని చూడవచ్చు. ఉత్తరాలూ రాయవచ్చు. ఆత్మహత్య చేసుకుంటాడు అన్న అనుమానం ఉన్న వారిని ఒంటరిగా ఉండనీయకూడదు. తమ విలువ కుటుంబంలో ఎంత ఉందో తెలుసుకోవాలని కొందరు సరదాగా ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు. కాని ఒక్కోసారి సీరియస్ అవ్వవచ్చు. తరచూ ఆ మాటలు అనే వారిని వీలైనంత ఆదరణ, అత్మీయత, ప్రేమను కలుగుజేయాలి. కొందరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలని తమ మాటల్లోనే నెగ్గాలని భావిస్తారు. వారిది హిస్టిరికల్ పర్సనాలిటీ. ఇలాంటి వారికి లొంగుతూ వెళ్తే వారు అలాగే కొనసాగుతారు. అసూయ, ఓర్వలేని తనం తన మాట నెగ్గకపోతే నానా హైరానా చేసే వారు అందరి దృష్టి తమవైపు తిప్పుకోవడం కోసం ఏ పనైనా చేస్తారు. తాము ఎవరిని ఆకర్షించాలని అనుకుంటున్నారో వారి సమక్షంలోనే చేయాలనుకుంటారు. డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకునే వారికి వీరు పూర్తి వ్యతిరేకం. ప్రస్తుతం దేశంలో ప్రతి ఆరు నిమిషాలకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే..? మీకు తెలిసిన వారికి ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే మొదట అత్మీయులకు బాధను చెప్పుకోవాలి. అలా చెప్పుకోనేలా ఆత్మీయులు వారిని ప్రోత్సహించాలి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండనీయరాదు. ఏ మాత్రం అనుమానం వచ్చిన సైకాలజిస్ట్‌ను కలవడం ఉత్తమం. డిప్రెషన్లో ఉన్నప్పుడు... ఆత్మహత్యలు ఒత్తిడిలో ఉన్నప్పుడు చేసుకుంటారు. అలాంటి వారిని ముందుగానే గుర్తించవచ్చు. ప్రత్యేక పరిస్థితులను బట్టి ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న వారు ముందుగానే ఇండికేషన్ ఇస్తారు. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రపంచంలో గుండె జబ్బు తర్వాత రెండో వ్యాధిగా మానసిక వ్యాధిని గుర్తించారు. ప్రతి ఆరు నిముషాలకు ఒక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకోకుండా డిప్రెషన్లో ఉన్నవారిని ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా మార్చవచ్చును. - డాక్టర్ ఎస్.వి.రమణ, సైకాలజిస్ట్ ప్రశాంతి మానసిక వ్యాధుల కౌన్సిలింగ్ కేంద్రం