వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫోన్ సంభాషణతో ఆ పార్టీలో కలవరం
వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫోన్ సంభాషణతో ఆ పార్టీలో కలవరం.. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓడిపోతాడు
ఆత్మకూరులో ‘ఆనం’కు పదివేలతో ఓటమి ఖాయం
వైఎస్సార్‌సీపీని వీడిపోవడం నాకిష్టం లేదు
ఎన్నికల్లో విజయం సాధించకుంటే క్విట్ అవుతాం
కలకలం రేపుతున్న టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలు
ఆడియో విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రసన్న సోదరుడు
ఎవరూలేక వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ అభ్యర్థుల్ని దిగుమతి చేసుకుంది : విజయసాయిరెడ్డి
నా సోదరుడికి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించాం: నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోదరుడు రాజేంద్రనాథ్‌రెడ్డితో జరిపిన ఫోన్ సంభాషణ రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిసి రాజేంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఆ ఆడియో సంభాషణను విలేకరుల సమావేశంలో బహిర్గతం చేశారు. ఈ ఆడియో తనది కాదని ప్రశాంతిరెడ్డి కామాక్షమ్మ అమ్మవారి సాక్షిగా చెప్పగలరా అని రాజేంద్రనాథ్‌రెడ్డి సవాల్ విసిరారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి వారి కుటుంబంతో తమకు అనుబంధం ఉందన్నారు. నేటికీ జగన్‌మోహన్‌రెడ్డితో ఆ అనుబంధం కొనసాగుతోందని ఆయన స్పష్టంచేశారు.
ఓడితే ముఖం చాటేస్తారు: విజయసాయిరెడ్డి
వైఎస్సార్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పెద్దలపట్ల అగౌరవంగా మాట్లాడడం, ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలగుతాం అని చెప్పడం చూస్తే వారి వ్యవహారం ప్రజలకు బాగా అర్థమవుతుందన్నారు. ఓడిపోతే విదేశాల్లో వ్యాపారాలు, లావాదేవీలు చేసుకుంటూ ప్రజా జీవితంలోకి రారని వారి మాటల బట్టి తెలుస్తోందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు కావాలో ఓడిపోతే ముఖం చాటేసే టీడీపీ అభ్యర్థులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ఎవరూలేకే టీడీపీ వైఎస్సార్సీపీ నుంచి అభ్యర్థులను దిగుమతి చేసుకుందన్నారు.
నా సోదరుడికి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చారు: ప్రసన్నకుమార్‌రెడ్డి
ఇక తన సోదరుడు రాజేంద్రకు ప్రశాంతిరెడ్డి రూ.3 కోట్లు ఆఫర్ ఇచ్చి పార్టీలోకి ఆహా్వనించినా వారి ప్రలోభాలకు తలొగ్గలేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని వాడు అని సం¿ోదించడం చూస్తే ఎంత అహంకారంతో మాట్లాడుతోందో అర్థమవుతోందన్నారు.
ఆడియో సంభాషణ ఇలా..
రాజేంద్ర: హలో ప్రశాంతక్కా.. బావున్నావక్కా..
ప్రశాంతి: ఎక్కడున్నావ్?
రాజేంద్ర: అక్కా బెంగళూరులో ఉన్నా. అక్కా ఇక్కడ రెండు పీజీలు ఏర్పాటుచేశాను
ప్రశాంతి: నీవు ఇక్కడ లేవా?
రాజేంద్ర: పీజీలు ఏర్పాటుచేసి ఇక్కడే ఉన్నాను. వచ్చిపోతుంటాను అక్కా.
ప్రశాంతి: నేనెందుకు చేశానంటే.. ఇప్పుడే నీవు చెప్పొద్దు.. కోవూరు నుంచి పోటీచేయమని అడుగుతున్నారు వాళ్లు.. సర్వేపల్లి నుంచి పోటీచేయమని అడిగారు.. ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాదు కదా అని వద్దన్నాను. కోవూరు తీసుకోమన్నారు.. ఫస్ట్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అల్లుడు కోసం ఉంచారు.. ఆయన పార్టీలోకి రాకపోవడంతో నన్నే చేయమంటున్నారు.
రాజేంద్ర: అక్కా.. అక్కా..
ప్రశాంతి: ఇంకా వాళ్లు (వైఎస్సార్‌సీపీ) మా వెంటçపడే ఉన్నారు. నాక్కూడా పార్టీ మారడం ఇష్టంలేదు, ఫస్ట్ నుంచి ఈ పార్టీ అంటే ఇష్టం నాకు.. మరీ వాళ్లు ఈ మాదిరి చేసేసరికి అన్నను కని్వన్స్ చేయలేకపోయా. నాకు ఇంత అవమానం జరిగితే ఇంకా వెంటపడతావా అన్నారు. నాది చేతగానితనం అనుకుంటావా. నాకు రాజకీయం అవసరంలేదు. నేను పోటీచేస్తా.. గెలిస్తే గెలుస్తా.. లేకుంటే ఓడిపోతా. ఆ తర్వాత క్విట్ అయిపోతా.. పోటీచేయకుండా ఉండనన్నాడు..
రాజేంద్ర: అక్కా.. అక్కా..
ప్రశాంతి: వీళ్లందరూ నన్ను ఉండమంటున్నారు. లేదులే మేం ఎంపీ ఎలక్షన్ చేసుకుంటాం అన్నాను.. లేదులే అన్నాను. కోవూరు అయితే ఆదాల అల్లుడు అనుకున్నారు. కావలిలో కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు. కోవూరే తీసుకోమంటున్నారు.
రాజేంద్ర: అవును కదక్కా అందరం ఇంట్లో వారం కదా.
ప్రశాంతి: ఇంట్లో వారమే కానీ వాళ్లు పోటీచేయమంటున్నారు.. అన్న కూడా పార్టీ వీడుతున్నారు కాబట్టి వైఎస్సార్‌సీపీ నుంచి ప్రెజెర్స్ ఉంటాయి.. ఆత్మకూరు అయితే పదివేలతో ఆనం రామనారాయణరెడ్డి ఓడిపోతాడు.. అయితే, విక్రమ్ బాగా చేస్తున్నాడు.. రామనారాయణరెడ్డి పోయినా కూడా ప్రాబ్లమ్ అవుతుంది..
రాజేంద్ర: అక్కా.. నేను మధ్యస్తంగా ఏమి చెప్పలేను.. నాకు ఇద్దరు కావాలక్కా.. ఈ మ«ధ్య అన్నకు దూరంగా ఉన్నా.
ప్రశాంతి: మీడియాకు వీడియోలు పెడుతున్నావు కదా.. ప్రతి ఎలక్షన్‌కు అన్నదమ్ముల మధ్య మామూలే కదా..
రాజేంద్ర: కానీ, మా మధ్య ఏమీలేవక్కా.. అన్న గెలుపు కోసం గట్టిగా కృషిచేసేవాళ్లం.
ప్రశాంతి: ఎక్కడా చెప్పకు రాజేంద్ర.. మేమైతే ఇంకా ఓకే చెప్పలేదు రాజేంద్ర. అంతా బంధువులు కదా.. సర్వేపల్లి గురించి చెప్పినా నేను ఒప్పుకోలేదు. నీవు సర్వేపల్లిలో అయితే గెలుస్తావన్నారు.. గెలవనని కాదు. నాకు ఇష్టంలేదు అని చెప్పా.. మరీ ఆయనకు (సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి) టికెట్ ఇవ్వమనే చెప్పారు.. నేను వద్దని చెప్పాను.. ఎవరు ముందుకు రాకపోతే ఆయనకే టికెట్ ఇస్తారు కదా పాపం..
Comments
Please login to add a commentAdd a comment