కరాటే రాజు, విశ్వక్‌సేన్, వెంకటేశ్, ప్రశాంతి, మనోజ్‌కుమార్
‘‘ఫలక్‌నుమా దాస్’ టీజర్ చూడగానే కుర్రాళ్లంతా చాలెంజ్‌గా తీసుకుని కష్టపడి చేశారనిపించింది. ఇటీవల యూత్‌కి నచ్చే సినిమాలు రాలేదు. ఈ చిత్రంలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్‌సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి హీరోయిన్లుగా నటించారు. డి. సురేశ్‌బాబు సమర్పణలో కరాటే రాజు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ని వెంకటేశ్ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘విశ్వక్ ప్రతి ఫ్రేమ్‌లో అద్భుతమైన ఎనర్జీతో కనిపించాడు. యాక్టింగ్ స్కిల్స్ బావున్నాయి.
ట్రైలర్ చాలా బావుంది. హైదరాబాద్‌లో ఉన్న రియలిస్టిక్ లొకేషన్స్ అన్నీ కవర్ చేసినట్టున్నారు. డైలాగ్స్ బావున్నాయి. సినిమా పెద్ద హిట్ కొట్టి అందరికీ పెద్ద పేరు తీసుకురావాలి’’ అన్నారు.‘‘టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌కు ఇంకా ఎక్కువ రావాలనుకున్నాను. మొన్నటివరకూ టెన్షన్ ఉంది. సురేశ్‌బాబు సర్ సినిమా చూసి మెచ్చుకుని, సమర్పిస్తున్నారు. వెంకటేశ్‌గారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషం. రెండ్రోజుల్లో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’’ అన్నారు విష్వక్‌సేన్. ‘‘హైదరాబాద్‌లో ఎవరికీ తెలియనటువంటి 118 లొకేషన్స్‌లో ఈ సినిమా షూట్ చేశాం. 20–25 సంవత్సరాలున్న 40 మంది కుర్రాళ్లు కష్టపడి ఈ సినిమా చేశారు’’ అన్నారు నిర్మాత కరాటే రాజు. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన టీమ్ అందరికీ థాంక్స్’’ అన్నారు ప్రశాంతి.
Comments
Please login to add a commentAdd a comment