దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం | Special Darshan For Handicapped in Tirumala | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం

Published Mon, Jan 8 2018 1:44 AM | Last Updated on Mon, Jan 8 2018 1:44 AM

Special Darshan For Handicapped in Tirumala

సాక్షి, తిరుమల : వయో వృద్ధులు, దివ్యాంగులు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలతో వచ్చిన తల్లిదండ్రులకు సులభంగా శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టీటీడీ ప్రతినెలా రెండు సాధారణ రోజుల్లో ప్రత్యేక దర్శనాల ను కల్పిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 9, 29 తేదీల్లో వయోవృద్ధులు (65 సంవత్సరాలు పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. 5 సంవత్సరా లలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను ఈనెల 10, 30 తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement