సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులకు గమనిక. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం ఉదయానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.
వివరాల ప్రకారం.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయంలో పడుతోంది. అలాగే, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక, నిన్న(మంగళవారం) శ్రీవారిని 78,726 మంది భక్తులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో శ్రీవారి హుండీకి రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. 26,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
ఇక, ఈనెల 21న గరుడపంచమి సందర్భంగా గరుడ వాహసనసేవ కార్యక్రమం నిర్వహించనుంది టీటీడీ. రాత్రి ఏడు గంటలకు గరుడ వాహనంపై మలయప్పస్వామి దర్శనం ఇవ్వనున్నారు.
కాగా, తిరుమల వెళ్లే భక్తులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ప్రయాణికుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం రూ.300 టికెట్ల కోటాను 1000కి పెంచారు. 300 కిలోమీటర్ల దూరానికి పైబడిన నగరాల నుంచి వచ్చే బస్సులకు 80 శాతం టికెట్లు కేటాయించగా, 300 కిలోమీటర్ల లోపు నగరాల నుంచి వచ్చే బస్సులకు 20 శాతం కేటాయించారు.
శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శాసన సభ్యులు ,టీటీడీ చైర్మన్ శ్రీభూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం రాత్రి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసి పనుల వేగం పెంచాలని ఆదేశించారు. మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ శ్రీమతి హరిత శ్రీ కరుణాకర్ రెడ్డి వెంట ఉన్నారు pic.twitter.com/qxhml3olNk
— MCT Mayor Dr Sireesha (@mayortpt) August 15, 2023
ప్రయాణంతోపాటు స్వామివారి దర్శనం టికెట్‌ను నెలరోజులు ముందుగానే బుక్ చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈనెల 15వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు ప్రయాణ టికెట్లతోపాటు దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చని వివరించారు. తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నవారు అదనపు కోటా టికెట్లను www.apsrtconline.in వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు.
ఇది కూడా చదవండి: సిగ్నల్ లేకపోయినా క్షణాల్లో సమాచారం
Comments
Please login to add a commentAdd a comment