
‘నా ఇంటిపై దాడి చేయించినా భయపడను’
టీడీపీ నేతలే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
విజయవాడ: టీడీపీ నేతలే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన ఇంటిపౌ దాడి చేయించినా భయపడేది లేదని స్పష్టం చేశారు. పైరవీలతోనే బుద్దా వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్నారు. వైఎస్ జగన్‌ను విమర్శించే నైతకత వెంకన్నకు లేదన్నారు. విశాఖ భూకబ్జాల్లో చంద్రబాబు, లోకేశ్‌ల పాత్ర ఉందని, చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.