టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న అలియాస్ వెంకన్న పై కేసు కొట్టివేస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం
విజయవాడ లీగల్ : టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న అలియాస్ వెంకన్న పై కేసు కొట్టివేస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 2014 మార్చి 28న 26వ డివిజన్ ఏరియాలో టీడీపీ, కాంగ్రెస్ వర్గీయులు ఘర్షణపడ్డారు.
దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలో బుద్దా వెంకన్న వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించినట్లుగా కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కాకపోవడంతో న్యాయమూర్తి కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.