తాడేపల్లి: మంత్రిని మర్డర్ చేస్తానంటే చట్టం చూస్తూ ఊరుకోదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్టుపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు నాని సమాధానమిచ్చారు. తాడేపల్లిలోని మీడియా పాయింట్ నుంచి విలేకర్లతో మాట్లాడిన కొడాలి నాని.. బుద్ధా వెంకన్న నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జూదశాలలు నడిచాయి. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ దురదృష్టం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చంద్రబాబు చరిత్ర రోడ్డు మీద పెడతా. నా మంత్రి పదవి ఊడగొట్టేయాలని వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. గుడివాడలో ఏదో జరిగింది అని పనికిమాలిన మాటలు చెప్తున్నారు. నా కే కన్వెన్షన్ లో కాసినో జరిగిందని నిరూపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పా. ఆ మాట అనగానే కే కన్వెన్షన్ సమీపంలో అంటారు. మళ్లీ గుడివాడలో అంటారు. వీళ్ళ 420 వెబ్ సైట్‌లో పెట్టిన దాన్ని ఆధారాలు అంటారు. వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ మీకెలా వచ్చాయి...మీరే బుక్ చేశారా...?, 420లతో నిజ నిర్ధారణకు వస్తే ఎలా రానిస్తారు’ అని కొడాని నాని ప్రశ్నించారు.
బెల్లీ డ్యాన్సులు, లుంగీ డ్యాన్సులు టీడీపీ నేతలకే బాగా తెలుసు. ట్విట్టర్ బాబు.. లోకేష్ గురించి నా దగ్గర మాట్లాడొద్దు. ట్విట్టర్ బాబు గురించి నేనేం చెప్పగలను, ఆడో సన్నాసి. కెమెరాతో నిజ నిర్ధారణకు చంద్రబాబు ఇంట్లోకి అనుమతి ఇస్తారా. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చూస్తూ ఊరుకోదు. బుద్ధా వెంకన్న నోరు అదుపులోకి పెట్టుకోవాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి. 2024లో కూడా టీడీపీ రాజకీయ సమాధి అవుతుంది’ అని నాని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment