ఫుడ్‌కోర్టు తొలగింపు యత్నం.. వివాదం | Municipal staff trying to destroy Food court over IndiraGandhi Stadium in Vijayawada | Sakshi
Sakshi News home page

ఫుడ్‌కోర్టు తొలగింపు యత్నం.. వివాదం

Published Mon, Oct 10 2016 9:03 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

Municipal staff trying to destroy Food court over IndiraGandhi Stadium in Vijayawada

విజయవాడ: ఫుడ్‌కోర్టు తొలగింపు వ్యవహారం వివాదానికి దారితీసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్వహిస్తున్న ఫుడ్‌కోర్టును ఆదివారం అర్థరాత్రి సమయంలో మున్సిపల్‌ సిబ్బంది తొలగించే యత్నం చేసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ సిబ్బందికి వ్యాపారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అయితే వ్యాపారులకు మద్దతుగా మున్సిపల్‌ కమిషనర్‌ ఇంటి ముందు టీడీపీ నేతలు ధర్నాకు దిగారు.

ఈ ధర్నాకు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్‌, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఫుడ్‌కోర్టు తొలిగించే నిర్ణయాన్ని మార్చుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. చివరకు జిల్లా కలెక్టర్‌ జోక్యంతో ఫుడ్‌కోర్టు తొలగింపు వివాదం కాస్తా సద్దుమనిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement