
సాక్షి, ఢిల్లీ: నారా లోకేష్ కోసం ఢిల్లీలో ఏపీ సీఐడీ అధికారుల వెతుకులాట ప్రారంభించారు. లోకేష్ కోసం పలు చోట్లు సీఐడీ అధికారులు వాకబు చేశారు. కావాలనే సీఐడి అధికారుల నుంచి తప్పించుకుంటున్నట్లు అనుమానం.
రింగ్ రోడ్ కేసులో లోకేష్‌కి 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు ఢిల్లీకి వెళ్లారు. నోటీసులు తీసుకుని విచారణలో అధికారులకు సహకరించాలని లోకేష్‌ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అయినా సీఐడీ అధికారులకు అందకుండా లోకేష్ దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇక స్కిల్ స్కాం, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ లోకేష్ వేయగా, ఆయన పిటిషన్‌ను కోర్టులో వ్యతిరేకించాలని సీఐడీ నిర్ణయించింది.
మరోవైపు, మీడియాకు కంటపడకుండా లోకేష్ తిరుగుతున్నారు. కార్లు మారుస్తూ రహస్యంగా మీటింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిన్నటి నుంచి గల్లా జయదేవ్ ఇంటికి రాని లోకేష్.. ఐటీసి మౌర్య నుంచి మరో చోటకు మకాం మార్చినట్లు తెలిసింది. జయదేవ్ కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉన్నారని సమాచారం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో హై కోర్ట్ ఎదురుదెబ్బ తగలడంతో న్యాయవాదులతో లోకేష్ మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.
చదవండి: Fibergrid Scam : శాఖ బాబుది.. సంతకం చినబాబుది
Comments
Please login to add a commentAdd a comment