
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో రూ.20 వేలు లోపు డిపాజిట్ చేసిన డిపాజిట్‌దారులు తమ వివరాలను గ్రామ/వార్డు వలంటీర్ల వద్ద నమోదు చేసుకునేందుకు గడువును సీఐడీ విభాగం రెండు రోజులు పొడిగించింది. డిపాజిట్‌దారులు శుక్ర, శనివారాల్లో కూడా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ నెల 6న మొదలైన వివరాల నమోదు ప్రక్రియ గురువారం వరకు కొనసాగుతుందని సీఐడీ విభాగం ముందు ప్రకటించింది.
అగ్రిగోల్డ్ బాధితుల నుంచి వస్తున్న వినతులపై సానుకూలంగా స్పందించిన అధికారులు డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు మరో రెండు రోజులు గడువు పొడిగించారు. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు agrigolddata.in వెబ్‌సైట్‌లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూడవచ్చు. ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సివస్తే ఎంపీడీవో ఆఫీస్ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించనట్లు అధికారులు తెలిపారు. సందేహాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని అధికారులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment