వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని మంగళవారం సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఎనిమిది గంటల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారణ జరిపారు. విచారణ పూర్తయిన అనంతరం భూమన మీడియాతో మాట్లాడుతూ తుని ఘటనకు సంబంధించి తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడేది లేదన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావడానికి తాను సిద్ధమన్నారు. కాపు ఉద‍్యమానికి తాను నైతిక మద్దతు మాత్రమే ఇచ్చానని, తుని ఘటనతో తనకు రవ్వంత కూడా సంబంధం లేదన్నారు.