tuni issue
-
ఫోన్ సంభాషణ: యనమలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సోదరుడు కృష్ణుడు
-
టీడీపీ నేత యనమల సోదరుల మధ్య విభేదాలు
సాక్షి, కాకినాడ: టీడీపీ నేత యనమల సోదరుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. తుని సీటు విషయంలో ఇద్దరి మధ్య పంచాయితీ ముదిరింది. తుని నుంచి తన కూమార్తెను బరిలోకి దింపనున్నట్లు యనమల రామకృష్ణుడు సంకేతాలిచ్చారు. దీనిపై ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఈ విషయంపై తొండంగి పార్టీ నేతతో యనమల సోదరుడు కృష్ణుడు మాట్లాడిన ఫోన్ సంభాషణ వైరల్గా మారింది. గ్రామానికి 40 మంది చొప్పున వెళ్లి యనమల రామకృష్ణుడిని ప్రశ్నించండి అంటూ ఆయన పిలుపునివ్వడం ఫోన్ సంభాషణలో స్పష్టంగా ఉంది. కృష్ణుడు లేకపోతే తునిలో టీడీపీ ఉండదని గట్టిగా చెప్పండి అంటూ అల్టిమేటం ఇచ్చారు యనమల కృష్ణుడు. దీంతో తుని టీడీపీలో రచ్చ మొదలైంది. ఇదీ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది? -
‘తప్పు చేయలేదు, ఎలాంటి భయంలేదు’
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని మంగళవారం సీఐడీ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. సుమారు ఎనిమిది గంటల పాటు ఆయనను సీఐడీ అధికారులు విచారణ జరిపారు. విచారణ పూర్తయిన అనంతరం భూమన మీడియాతో మాట్లాడుతూ తుని ఘటనకు సంబంధించి తాను ఏ తప్పు చేయలేదని, ఎవరికీ భయపడేది లేదన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావడానికి తాను సిద్ధమన్నారు. కాపు ఉద్యమానికి తాను నైతిక మద్దతు మాత్రమే ఇచ్చానని, తుని ఘటనతో తనకు రవ్వంత కూడా సంబంధం లేదన్నారు. ఇక ఈ కేసులో ముందుగా చంద్రబాబు నాయుడుకు నోటీసులు ఇచ్చి, ఆయన్ని విచారణ జరపాలన్నారు. చంద్రబాబు చెప్పడం వల్లే ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో తనను విచారణకు పిలిచారని భూమన వ్యాఖ్యానించారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే తుని కేసులో వైఎస్ఆర్ సీపీ నేతలను ఇరికించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్, జడల నాగరాజు తరహాలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని భూమన వ్యాఖ్యానించారు. పరిటాల రవి హత్య అనంతరం జరిగిన పరిణామాలతో కూడా చంద్రబాబుకు సంబంధం ఉందన్నారు. కాగా తుని ఘటనపై ఇప్పటికే భూమన మూడుసార్లు విచారణకు హాజరయ్యారు. -
’తప్పు చేయలేదు, ఎలాంటి భయంలేదు’
-
భూమనకు మరోసారి సీఐడీ నోటీసులు
-
భూమనకు మరోసారి సీఐడీ నోటీసులు
తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. తుని ఘటనకు సంబంధించి ఆయనను ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. ఎల్లుండి గుంటూరు సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 6,7 తేదీల్లో భూమనను సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ సమావేశాల ముందు విచారణ పేరుతో ఆయనను రెండు రోజుల పాటు దాదాపు 16గంటలకు పైగా విచారణ జరిపారు. కాగా ఈ ఏడాది జనవరి 31న ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో తునిలో కాపు ఐక్యగర్జన సభ నిర్వహించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ముద్రగడ.. సీబీఐ విచారణ వద్దంటున్నారు: చినరాజప్ప
తుని ఘటనపై సీబీఐ విచారణకు ముద్రగడ పద్మనాభం అంగీకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిరంజీవి మాత్రం దీనిపై సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము పోలీసుల ద్వారా ముద్రగడ వద్దకు పంపితే, ఆయన వద్దన్నారని చినరాజప్ప తెలిపారు. ఈ విషయంపై ప్రజలే ఆలోచించాలని ఆయన అన్నారు. ముద్రగడకు వైద్యసేవలు చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయనే అంగీకరించడం లేదని చెప్పారు. ఆయన చేస్తున్న డిమాండ్లు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. తుని ఘటనలో అరెస్టులు ఆపాలని, ఇప్పటికే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారని.. అయితే ఆ విషయం కోర్టు పరిధిలో ఉన్నందువల్ల తాము ఏమీ చేయలేమని హోం మంత్రి అన్నారు. సీబీఐ విచారణ జరుగుతుందో లేదో త్వరలోనే తేలుతుందని ఆయన చెప్పారు. -
ముద్రగడ డిమాండ్లకు తలొగ్గేది లేదు: చినరాజప్ప
రాజమండ్రి: తుని ఘటనలో అరెస్ట్ చేసినవారిపై ముద్రగడ పద్మనాభం చెప్పినంత మాత్రాన కేసులు ఉపసంహరించుకునేది లేదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ముద్రగడ డిమాండ్లకు తలొగ్గేది లేదని, ఇంకా అరెస్టులు జరుగుతున్నాయన్నారు. కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించే అధికారం ప్రభుత్వానికి లేదని ఆయన పేర్కొన్నారు. అరెస్ట్ అయిన ఏడుగురు రౌడీషీటర్లేనని, ప్రత్యక్ష నేరచరిత్ర ఉన్నవారినే అరెస్ట్ చేసినట్లు చినరాజప్ప తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉందని తేలితే ముద్రగడ మీద కూడా కేసు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా గడువులోగా కాపులను బీసీల్లోకి చేర్చుతామన్నారు. కాగా తుని సంఘటనలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు అరెస్టులు ప్రారంభించడంతో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం లోగా కేసులు ఉపసంహరించుకోకపోతే ఈనెల 9 నుంచి దీక్షకు ఉపక్రమిస్తానని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే గురువారం ఉదయం 9 గంటలకు కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.