వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. తుని ఘటనకు సంబంధించి ఆయనను ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశించింది. ఎల్లుండి గుంటూరు సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.