
శ్రీకన్య కూడలి వద్ద స్తంభించిన ట్రాఫిక్
విశాఖపట్నం, నర్సీపట్నం: పట్టణ జనాభా పెరిగింది. వాహనాల వినియోగం అధికమైంది. ప్రధాన రహదారులు అక్రమణకు గురయ్యాయి. వాహనాల రద్దీ పెరిగి ఫలితంగా ప్రధానరోడ్డులో అడుగడుగున వాహనల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను గురించి ఒక్క పోలీసులే కాస్తో కూస్తో పట్టించుకుంటున్నారు. ఇటు పురపాలక సంఘం అటు రోడ్లు భవనాలశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
పెరిగిన వాహన రద్దీ..
పట్టణంలో జనాభా బాగా పెరిగింది. దాంతో పాటు పరిసర మండలాల నుంచి విద్య. వైద్య అవసరాలకు వేలాది మంది వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. పట్టణంలో వివిధ ప్రాంతాలకు వెళ్లటానికి వందలాది ఆటోలు వస్తుంటాయి. పరిసర గ్రామాల నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని ఆటోలు పట్టణానికి క్యూ కడుతున్నారు. నిత్యం ఇటు విశాఖ. తుని, చోడవరం, ఏâలేశ్వరం, చింతపల్లి వైపు బస్సులు, లారీలు, కారులు పట్టణం మీదుగానే వెళుతుంటాయి.
అక్రమణతో ఇరుకుగా..
పట్టణంలోని శ్రీకన్య, పాతబస్టాండ్, అబిద్‌సెంటర్ ప్రధానమైన కూడల్లు. పెదబొడ్డేపల్లి నుంచి ఏరియా ఆసుపత్రికి వెళ్లే వరకు రోడ్లు అక్రమణకు గురయ్యాయి. ఫలితంగా రోడ్లు ఇరుకంగా మారాయి. మరోవైపు ఆటోలు, బస్సులు ఎక్కడబడితే అక్కడ ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం చేస్తున్నారు. ఈ కారణాల వల్ల ప్రధానరోడ్లలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.
అడ్డదిడ్డంగా వాహనాలతో..
ప్రధానరోడ్ల మీద అడ్డదిడ్డంగా ఆటోలు ఆపటం, రోడ్డు అక్రమణకు గురికాటంతో వచ్చే పోయే వాహనాలకు బాగా అంతరాయం కలుగుతోంది. మరోవైపు ప్రధాన కూడళ్లలో ప్రజలు రోడ్డు దాటాలంటే గగనమైపోతోంది. పాదచారులు నడవటానికి రోడ్డు మార్జిన్ స్థలాన్ని పూర్తిగా అక్రమణకు గురికావడంతో ప్రజలు రోడ్డు నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు మీద నడవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.
శాఖల మధ్య సమన్వయం లేక..
ట్రాఫిక్ విధులకు వచ్చే పోలీసులు కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అర్‌అండ్‌బీ రోడ్లు అక్రమణకు గురైనా ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అక్రమణలు తొలగించడానికి ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. పురపాలక సంఘం అధికారులు రోడ్డు మార్జిన్ పాట ద్వారా ఆదాయం కలిసివస్తుందనే ఉద్దేశంతో ప్రధానరోడ్డు స్థలాన్ని అక్రమించిన దుకాణదారులను ఏమీ అనడం లేదు.పాలకవర్గం సభ్యులు ఎన్నికై నాలుగేళ్లు కావస్తున్నా ఈ సమస్య వారికి పట్టలేదు. ఇప్పటికైనా వివిధ శాఖల అధికారులు ట్రాఫిక్ సమస్య మీద దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
సమన్వయంతో ట్రాఫిక్‌క్రమబద్ధీకరిస్తాం
పట్టణంలో ట్రాఫిక్ స మస్య చాలా జఠిలం గా మారింది. ఏఎస్పీ అ రిఫ్ హఫీజ్ ట్రాఫి క్‌పై ప్రధానంగా దృష్టిసారించారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, రోడ్లు భవనాలు, ము న్సిపల్ అధికారుల సమన్వయంతో అక్రమణలు తొలగింపు చేపడతాం. ఆటోలను కూ డా క్రమబద్ధీకరిస్తాం. అక్రమణలు తొలగిస్తే కొంత మేర ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది.–సింహాద్రినాయుడు, పట్టణ సీఐ, నర్సీపట్నం