traffic jam problem
-
కుమారి ఆంటీ హోటల్ రీ ఓపెన్
హైదరాబాద్: ఎట్టకేలకు కుమారి ఆంటీ హోటల్ తెరుచుకుంది. ఐటీ కారిడార్‌లో కోహినూర్ హోటల్ ఎదురుగా ట్రాఫిక్‌జాం నెలకొనడంతో కుమారి ఆంటీ హోటల్‌ను ఇటీవల రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ హోటల్ తొలగింపు వైరల్ కావడంతో సీఎం కార్యాలయం స్పందించింది. ఈ హోటల్‌ను అదే స్థలంలో నడుపుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించడంతో వివాదానికి తెరపడింది. -
రాత్రి 11 గంటలకూ ‘దారికి’ రాని వైనం
సాక్షి, హైదరాబాద్: రాజధాని రోడ్లపై వాహనశ్రేణులు నత్తలతో పోటీ పడ్డాయి. రెండు రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో రోడ్లు ఛిద్రం కాగా..శనివారం రాత్రి హఠాత్తుగా కురిసిన భారీ వర్షం తోడైంది. దీంతో రోడ్లన్నీ జలమయమై ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కిలోమీటరు దూరం దాటడానికి కనీసం అరగంటకు పైగా పట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇంకొన్ని చోట్ల గంటల తరబడి వాహనాలు ముందుకు కదలనే లేదు. వర్షం నేపథ్యంలో ద్విచక్ర వాహనచోదకులు మెట్రోరైల్ స్టేషన్ల కింద ఆగిపోవడంతో ఆ ప్రాంతాల్లో మరిన్ని ఇబ్బందులు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వీకెండ్లో రోడ్డెక్కిన వాహనాలకు, చోదకుల ఒళ్లు హూనమై పోయింది. సుదీర్ఘకాలం నిరీక్షణతో వారి సహనానికి పరీక్షగా మారింది. అనేక ప్రాంతాల్లో రాత్రి పదకొండు గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. సాధారణ రోజుల్లోనే పీక్ అవర్స్‌గా పరిగణించే ఉదయం, సాయంత్రం వేళ నగరంలో ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతుంటాయి. వరుస వర్షాలు, వరదల తర్వాత శనివారం అనేక మంది ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. దీంతో సాధారణంగా రోడ్లపై రద్దీ పెరిగింది. హఠాత్తుగా రాత్రి వర్షం కురవడంతో రోడ్డంతా అధ్వానంగా మారిపోయి తీవ్ర ఇబ్బందులకు కారణమైంది. అప్పటికే పూర్తిగా నాని ఉన్న రోడ్లపై నీరు ఇంకలేదు. ప్రతి నీటు బొట్టూ ప్రవాహంగా మారి వాహనాలను ఆపేసింది. నగర వ్యాప్తంగా దాదాపు 67 ప్రాంతాల్లో ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాల కారణంగా రోడ్లన్నీ చెరువులుగా మారి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. ఇది నిత్యకృత్యమే అయినప్పటికీ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్డన్నీ ఛిద్రం కావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అనేక ప్రాంతాల్లో తారు కొట్టుకుపోయి, రాళ్లు బయటపడటంతో పాటు గోతులు సైతం ఏర్పడ్డాయి. శనివారం రాత్రి వర్షానికి వీటన్నింటిలో నీళ్లు నిండటంతో ఏది గొయ్యే, ఏది రోడ్డో అర్థంకాక వాహనచోదకులు తమంతట తామే వాహన వేగాలను తగ్గించేసుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ రహదారులపై వాహన శ్రేణులు నిలిచిపోయాయి. కీలక మార్గాల్లోనూ అత్యంత నెమ్మదిగా ముందుకు సాగాయి. నాగోలు–మెట్టుగూడ, సికింద్రాబాద్–బేగంపేట్, ఎల్బీనగర్–చాదర్‌ఘాట్, ఎంజే మార్కెట్–నాంపల్లి, పంజగుట్ట–కూకట్పల్లి ప్రాంతాల్లో వాహనాలు భారీ సంఖ్యలో ఆగిపోయాయి. నగరం చుట్టూ ఉన్న విజయవాడ, వరంగల్, ముంబై, కరీంనగర్ హైవేలపై నీరు ప్రవహిస్తూ వాహనాలు ఆగిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లించారు. మంగళ-బుధ వారాల్లో కురిసిన వర్షానికి నగరంలోని అనేక ప్రాంతాల్లో చెట్లు కూలడంతో పాటు కొమ్మలు, కేబుల్ వైర్లు సైతం తెగిపడ్డాయి. మరికొన్ని చొట్ల కటౌట్లు, హోర్డింగ్స్ రోడ్ల మీద కుప్పకూలాయి. వీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ ఇతర విభాగాల సిబ్బంది ఓపక్క ప్రయత్నిస్తూనే ఉండగా... శనివారం కురిసిన వర్షం రహదారుల్ని వాహనచోదకులకు నరకంగా మార్చింది. రోడ్లన్నీ జామ్ కావడంతో గంటల తరబడి అవి రోడ్ల పైనే ఉండిపోయాయి. వర్షం, ఛిద్రమైన రోడ్లు, ఆగిపోయిన ట్రాఫిక్ కారణంగా వాహనాల మైలేజ్ కూడా ఘోరంగా పడిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కార్లు వంటి వాహనాలు కేవలం ఒకటి, రెండు గేర్లలో మాత్రమే కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుండటంతో ఇంధనం ఎక్కువగా వినియోగించాల్సి వచ్చింది. మరోపక్క వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న రోడ్ల కారణంగా వాహనాలతో పాటు చోదకులు శరీరాలూ హూనం అయ్యాయి. గోతులు, రాళ్లను కప్పేస్తూ రహదారులపై ప్రవహిస్తున్న నీరు కారణంగా వాటిని గుర్తించడం వాహనచోదకులకు కష్టంగా మారి వాటిలోకే వెళ్లడంతో ఇలా జరిగింది. దీంతో కొన్ని వాహనాలు వాటిలో పడటంతో టైర్లతో పాటు వీల్ అలైన్మెంట్లు తదితరాలు దెబ్బతిన్నాయి. ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే ఇవి గోతుల్లో పడుతున్న కారణంగా షాక్ అబ్జర్వర్లు దెబ్బతినడంతో పాటు చోదకుల వెన్నుముక, మెడ వంటి అవయవాలకూ ఇబ్బందులు ఏర్పడ్డాయి. తీవ్రంగా ట్రాఫిక్‌జామ్స్ ఏర్పడిన ప్రాంతాల్లో కొన్ని... ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్, బేగంపేట, ముషీరాబాద్, అమీర్‌పేట్, అబిడ్స్, కోఠి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, నల్లకుంట, ఎంజే మార్కెట్, జీపీఓ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్‌ట్యాంక్, టోలిచౌకి, రవీంద్రభారతి, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, తార్నాకతో పాటు నగరం చుట్టూ ఉన్న అన్ని జాతీయ రహదారుల్లోనూ ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. -
భారీ వర్షాలు.. గోడ కూలి వాహనాలు ధ్వంసం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజిమాబాద్‌లో బుధవారం ఉదయం వర్షం కుండపోతగా కురిసింది. దీంతో ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డు పక్కన ఉన్న సరిహద్దు గోడ కూలిపోవడంతో సాకేత్ ప్రాంతంలోని జే బ్లాక్‌లో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. (కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి..) రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు సంబంధించిన అప్డేట్లను ట్విటర్ ద్వారా వెల్లడిస్తున్నారు. లాజవంతి ఫ్లై ఓవర్ సమీపంలో కస్టర్ బస్సు ఆగిపోవడంతో ఫ్లైఓవర్ నుంచి ధౌలా కువాన్ వైపు క్యారేజ్‌వేలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. ధౌలా కువాన్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం మాయాపురి చౌక్ ద్వారా వెళ్లాలని ట్విటర్లో పేర్కొన్నారు. (నోయిడా విద్యుత్ సబ్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం) #WATCH: A number of vehicles damaged in Saket area's J Block, after a side wall collapsed following incessant downpour in Delhi. pic.twitter.com/6NOQXcQXH9 — ANI (@ANI) August 19, 2020 రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడనుందని, రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే ఆగష్టు 23 వరకు వర్షాలు ఇలాగే కొనసాగనున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. -
ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్, కారణమదే!
చంఢీఘర్: ఢిల్లీ-గురుగ్రామ్ బోర్డ్‌లో శుక్రవారం భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. గురువారం హర్యానా ప్రభుత్వం అన్ని బోర్డర్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. ఢిల్లీ బోర్డర్లో ఉన్న జిల్లాల నుంచే కరోనా రాష్ట్రంలోకి వ్యాప్తిస్తోందని భావించిన హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం గురించి హర్యానా హోం మినిస్టర్ అనిల్ విజ్ మాట్లాడుతూ...‘ఢిల్లీ సరిహద్దు కలిగిన జిల్లాల్లో కరోనా కేసులు సంఖ్య గత వారం నుంచి విపరీతంగా పెరిగింది. అందుకే గురువారం నుంచి ఢిల్లీతో సంబంధం ఉండే అన్ని బోర్డర్లను సీజ్ చేశాం. ఇకపై సరియైన కారణంగా లేకుండా ఢిల్లీ సరిహద్దు నుంచి ఎవరని రాష్ట్రంలోకి అనుమతించాం. రాష్ట్రంలో 8 శాతం కరోనా కేసులు ఢిల్లీ సరిహద్దుగా ఉన్న జిల్లాల నుంచే నమోదయ్యాయి. అందుకే ఢిల్లీ-గురుగ్రామ్ బోర్డర్‌ను సీజ్ చేశాం’ అని తెలిపారు. గురగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, జజ్జార్‌లోనే హర్యానా మొత్తం మీద ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గురువారం గురుగ్రామ్‌లో 68 కేసులు నమోదు కాగా, ఫరీదాబాద్‌లో 18, సోనిపట్‌లో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా గురుగ్రామ్‌లో 405 కేసులు, ఫరీదాబాద్‌లో 276, సోనిపట్‌లో 180, జజ్జర్లో 97 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి భారత్‌లో 1,65,799 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లోనే దేశంలో రికార్డుస్థాయిలో 7,466 కేసులు నమోదయ్యాయి. -
పండగ రద్దీ: టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్
-
పండగ రద్దీ: టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్ : సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జమ్ ఏర్పడుతోంది. సంక్రాంతి పండగ సెలవులు కావడంతో హైదరాబాద్ నగర వాసులు ఇటు తెలంగాణకు, అటు ఏపీకి పయనమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్లో 8 టోల్ బూతులు తెరిచారు. బూత్‌లో ఫాస్ట్ ట్యాగ్ స్కానర్ పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు. ఫాస్ట్ టాగ్‌పై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టోల్గేట్ వద్ద ప్రత్యేకంగా ఫాస్ట్ టాగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులంతా ఫాస్ట్ టాగ్లను తీసుకుంటున్నారు. తెలంగాణలో రేపటి నుంచి విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. దీంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు, జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ బస్టాప్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా నందిగామ వద్ద రహదారులు అన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్ధీ పెరిగింది. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. -
ఫాస్టాగ్‌తో సాఫీగా..
సాక్షి, నెట్వర్క్: టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ తెరదించేందుకు ఉద్దేశించిన ‘ఫాస్టాగ్’ విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద ఈ ఫాస్టాగ్ అతికించిన వాహనాలు వేగంగా ముందుకు వెళ్లాయి. అయితే ప్రతీ వాహనానికి గేటు ఎత్తి పంపాల్సి రావడంతో కాస్త జాప్యం జరిగింది. అయినా అది పెద్ద సమస్యగా మారలేదు. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావటం తో వాహనాలు భారీ క్యూకట్టాయి. దీంతో వాహనాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత రెండు నెలలుగా ఎన్హెచ్ఏఐ ఈ ట్యాగ్ల విషయమై ముమ్మరంగా ప్రచారం చేసినా, ఎక్కువ మంది పట్టించుకోలేదు. అలా ట్యాగ్ లేకుండా జాతీయ రహదారులెక్కిన వాహనదారులకు టోల్‌ప్లాజాలు చుక్కలు చూపించాయి. పండుగ సమయాల్లోలా రద్దీ.. పండుగల సమయంలో టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు ఆదివారం కూడా భారీ రద్దీ ఏర్పడింది. తొలుత ఫాస్టాగ్ లేని వాహనాల కోసం ఒకే లైన్ కేటాయించాలని భావించినా.. ఆ తర్వాత 25 శాతం గేట్లు కేటాయించారు. మూడొంతుల గేట్లు ఫాస్టాగ్ వాహనాలకే వది లారు. ఇదే సమస్యకు కారణమైంది. ఎక్కువ వాహనాలకు ట్యాగ్ లేకపోవటం, వాటికి తక్కువ లైన్లు కేటాయించడంతో క్యూ కట్టాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాలతో పాటు హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిలో గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచే వాహనాల రద్దీ నెలకొంది. టోల్ దాటేందుకు ఒక్కో వాహనదారుడు గంటకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. మహబూబ్‌నగర్ జాతీయ రహదారిపై శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద వందల సంఖ్యలో వాహనాలు బార్లు తీరాయి. భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద బారులుదీరిన వాహనాలు రెట్టింపు రుసుము.. టోల్‌ప్లాజాకు కిలోమీటరు దూరంలో ప్రత్యేక సిబ్బందిని నియమించి ఫాస్టాగ్ ఉన్న వాహనాలను సంబంధిత లైన్లలోకి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని సాధారణ వాహనాలూ అయోమయంలో ఫాస్టాగ్ లైన్లలోకి ప్రవేశిం చాయి. ట్యాగ్ లేకుండా ఆ వరుసలోకి వస్తే రెట్టిం పు రుసుము చెల్లించాలనే నిబంధనతో పలువురు వాహనదారులు పెనాల్టీ చెల్లించాల్సి వచ్చింది. మాల్స్‌లో విక్రయం..! ప్రస్తుతం బ్యాంకులు, టోల్‌ప్లాజాలు, ఆర్టీసీ కార్యాలయాలు, ఆన్లైన్లో ఫాస్టాగ్ పొందే వెసులుబాటు ఉంది. ఆదివారం రద్దీ నేపథ్యంలో వాహనదారులు వాటిని కొనేందుకు పోటీపడే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు.. షాపింగ్ మాల్స్ లోనూ విక్రయ కేంద్రాలు తెరవాలని భావిస్తున్నా రు. కాగా, రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని జనవరి ఒకటి నుంచి అమల్లోకి తేనున్నారు. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై మూడు చోట్ల, అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి ఒక చోట టోల్ ప్లాజాలున్నాయి. అప్పటికప్పుడే కొనుగోలు.. ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ వద్ద క్యూలలో నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఎన్హెచ్ఏఐ కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారాన్ని చాలామంది పట్టించుకోలేదు. దీని ప్రభావం ఆదివారం స్పష్టం గా కనిపించింది. ఇన్ని రోజులు ఫాస్టాగ్ తీసుకోని వారు వాహనాల లైన్లు చూసి అప్పటికప్పుడు ట్యాగ్లు కొన్నారు. అన్ని టోల్ ప్లాజాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి అధికారులు వాటిని విక్రయిం చారు. సాధారణ రోజుల్లో సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల ట్యాగ్లు అమ్ముడవుతుండగా ఆ సంఖ్య ఆదివారం రెట్టింపైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 60 వేల ట్యాగ్లు విక్రయమైనట్లు ఎన్హెచ్ఏఐ ప్రాంతీయాధికారి కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఫాస్టాగ్ అంటే.. ఫాస్టాగ్ విధానంలో వాహనం టోల్‌గేటు వద్ద బారులు తీరే అవసరం ఉండదు. కీలకమైన ‘ఫాస్టాగ్’పేరుతో ఉండే ట్యాగ్ల ను వాహనాల ముందు అద్దానికి అతికించుకోవాలి. టోల్‌గేట్‌పై ఉండే సెన్సార్లు.. గేటు ముందుకు రాగానే ట్యాగ్‌లోని చిప్ నుంచి కావాల్సిన టోల్ రుసుమును మినహాయించుకుంటాయి. ఆ వెంటనే గేట్ తెరుచుకుం టుంది. ఒక్కో వాహనం నుంచి టోల్ రుసు ము మినహాయించుకునేందుకు 6 సెకన్ల సమయమే పడుతుంది. దీంతో వాహనదారుల సమయం ఆదా అవుతుంది. -
ముంబై.. ఇదేం ట్రాఫిక్‌రా బై..
వాహనదారులు అత్యధికంగా ట్రాఫిక్ జామ్ బారిన పడుతున్న నగరాల్లో ముంబై ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై ప్రజానీకం సాధారణ సమయాల్లో కంటే పీక్ అవర్స్‌లో 65 శాతం కంటే అధికంగా తమ విలువైన సమయాన్ని రోడ్డు పాల్జేసుకుంటున్నట్టు 2018 టామ్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్స్‌తో, వాహనరద్దీతో విలవిల్లాడుతోన్న నగరాల్లో కొలంబియా, పెరూ, మాస్కో లాంటి మహానగరాలు కూడా ఉండటం గమనార్హం. అయితే ప్రపంచంలోని అన్ని దేశాల్లోని నగరాలకంటే కూడా మన దేశంలోని ముంబై నగర ప్రజలు తీవ్రమైన ట్రాఫిక్ జామ్ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తేలింది. బొగోటా, కొలంబియాల్లో వాహనాల రద్దీ 63 శాతంగానూ, లిమా, పెరూల్లో రద్దీ తీవ్రత 58 శాతంగానూ ఉంటే, న్యూఢిల్లీ 58 శాతం రద్దీతో ప్రపంచంలోనే ట్రాఫిక్ జామ్ తీవ్రతలో టాప్–5లో స్థానం సంపాదించింది. పై నాలుగు నగరాలు కూడా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లోనివే కావడం గమనించాల్సిన విషయం. ఇక 56శాతం వాహనరద్దీతో ముప్పుతిప్పలు పడుతూ ఐదో స్థానంలో ఉన్న మాస్కో.. అభివృద్ధి చెందిన దేశాలకంటే కూడా అనేక ప్రమాణాల్లో వెనుకబడి ఉన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. పదేళ్ల అధ్యయనం.. ప్రపంచవ్యాప్తంగా 400 నగరాల్లో ట్రాఫిక్ రద్దీని జీపీఎస్ ఆధారంగా అధ్యయనం చేసిన ఈ సంస్థ ముంబై మహానగరాన్ని ‘అత్యధిక వాహన రద్దీ ఉన్న నగరం’గా తేల్చింది. అయితే 8 లక్షల జనాభాకు పైబడిన నగరాలనే ఈ అధ్యయనంలో భాగస్వామ్యం చేశారు. వాహనాల రద్దీపై గత పదేళ్లుగా అధ్యయనం చేస్తోన్న ఈ సంస్థ తొలిసారిగా భారతదేశంలోని వాహన రద్దీ స్థాయిని అంచనా వేసింది. ఆనందించాలా.. బాధపడాలా..! ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ రద్దీ తీవ్రత పెరుగుతోందని టామ్ టామ్ అధ్యయన సంస్థకి చెందిన ప్రముఖుడు రాల్ఫ్ పీటర్ చెప్పారు. అయితే ఇది ఒకరకంగా ఆనందించాల్సిన విషయమూ, మరో రకంగా బాధపడాల్సిన విషయమూ అని ఆయన అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా బలోపేతమౌతోన్న ఆర్థిక వ్యవస్థను ఇది సూచిస్తోంటే, ట్రాఫిక్ జామ్ కారణంగా విలువైన సమయాన్ని కోల్పోతుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై దృష్టి పెట్టాలి.. దురదృష్టవశాత్తూ ప్రపంచమంతా కార్ల చుట్టూనే తిరుగుతోంది. అలాగే కార్ల కొనుగోలు, వాడకానికి సంబంధించిన నియమ నిబంధనలేవీ లేకపోవడం కూడా నష్టం చేకూరుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ని తగ్గించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పడం సుస్థిర పరిష్కారాలను సూచించగలుగుతుందని టామ్ టామ్ ఇండియా జనరల్ మేనేజర్ బార్బరా బేల్పెయిర్ అభిప్రాయపడుతున్నారు. -
దంచేసి..ఆరేసి
సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలో మంగళవారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పలు చోట్ల కుంభవృష్టి కురిసింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్లలోతున వరదనీరు పోటెత్తడంతో ఎక్కడికక్కడ... ట్రాఫిక్ స్తంభించింది. హైటెక్ సిటీ రూట్లో కొన్ని గంటలపాటు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి ప్రాంతం నమోదైనవర్షపాతం(సెంటీమీటర్లలో) ఆసిఫ్‌నగర్ 6.8 సర్దార్‌మహల్ 6.6 మాదాపూర్ 6.4 చందూలాల్‌బారాదరి 5.8 మైత్రీవనం 5.3 శ్రీనగర్‌కాలనీ 4.3 బండ్లగూడా 4.2 గణాంకభవన్ 3.2 నాంపల్లి 3.3 గోల్కొండ 2.8 కూకట్పల్లి 2.6 ముషీరాబాద్ 2.3 మల్కాజ్‌గిరీ 2.2 మోండామార్కెట్ 2.1 జూబ్లీహిల్స్ 2.1 అంబర్పేట్ 2.5 పాశమైలారం 2.3 ఎల్భీనగర్ 1.9 ఆస్మాన్‌ఘడ్ 1.8 విరాట్‌నగర్ 1.7 బేగంపేట్ 1.7 కుత్భుల్లాపూర్ 1.6 షాపూర్‌నగర్ 1.5 కుత్భుల్లాపూర్ 1.4 రాజేంద్రనగర్ 1.1 -
నిత్య నరకం
విశాఖపట్నం, నర్సీపట్నం: పట్టణ జనాభా పెరిగింది. వాహనాల వినియోగం అధికమైంది. ప్రధాన రహదారులు అక్రమణకు గురయ్యాయి. వాహనాల రద్దీ పెరిగి ఫలితంగా ప్రధానరోడ్డులో అడుగడుగున వాహనల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను గురించి ఒక్క పోలీసులే కాస్తో కూస్తో పట్టించుకుంటున్నారు. ఇటు పురపాలక సంఘం అటు రోడ్లు భవనాలశాఖ అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పెరిగిన వాహన రద్దీ.. పట్టణంలో జనాభా బాగా పెరిగింది. దాంతో పాటు పరిసర మండలాల నుంచి విద్య. వైద్య అవసరాలకు వేలాది మంది వస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. పట్టణంలో వివిధ ప్రాంతాలకు వెళ్లటానికి వందలాది ఆటోలు వస్తుంటాయి. పరిసర గ్రామాల నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని ఆటోలు పట్టణానికి క్యూ కడుతున్నారు. నిత్యం ఇటు విశాఖ. తుని, చోడవరం, ఏâలేశ్వరం, చింతపల్లి వైపు బస్సులు, లారీలు, కారులు పట్టణం మీదుగానే వెళుతుంటాయి. అక్రమణతో ఇరుకుగా.. పట్టణంలోని శ్రీకన్య, పాతబస్టాండ్, అబిద్‌సెంటర్ ప్రధానమైన కూడల్లు. పెదబొడ్డేపల్లి నుంచి ఏరియా ఆసుపత్రికి వెళ్లే వరకు రోడ్లు అక్రమణకు గురయ్యాయి. ఫలితంగా రోడ్లు ఇరుకంగా మారాయి. మరోవైపు ఆటోలు, బస్సులు ఎక్కడబడితే అక్కడ ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం చేస్తున్నారు. ఈ కారణాల వల్ల ప్రధానరోడ్లలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. అడ్డదిడ్డంగా వాహనాలతో.. ప్రధానరోడ్ల మీద అడ్డదిడ్డంగా ఆటోలు ఆపటం, రోడ్డు అక్రమణకు గురికాటంతో వచ్చే పోయే వాహనాలకు బాగా అంతరాయం కలుగుతోంది. మరోవైపు ప్రధాన కూడళ్లలో ప్రజలు రోడ్డు దాటాలంటే గగనమైపోతోంది. పాదచారులు నడవటానికి రోడ్డు మార్జిన్ స్థలాన్ని పూర్తిగా అక్రమణకు గురికావడంతో ప్రజలు రోడ్డు నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు మీద నడవాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. శాఖల మధ్య సమన్వయం లేక.. ట్రాఫిక్ విధులకు వచ్చే పోలీసులు కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అర్అండ్బీ రోడ్లు అక్రమణకు గురైనా ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అక్రమణలు తొలగించడానికి ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. పురపాలక సంఘం అధికారులు రోడ్డు మార్జిన్ పాట ద్వారా ఆదాయం కలిసివస్తుందనే ఉద్దేశంతో ప్రధానరోడ్డు స్థలాన్ని అక్రమించిన దుకాణదారులను ఏమీ అనడం లేదు.పాలకవర్గం సభ్యులు ఎన్నికై నాలుగేళ్లు కావస్తున్నా ఈ సమస్య వారికి పట్టలేదు. ఇప్పటికైనా వివిధ శాఖల అధికారులు ట్రాఫిక్ సమస్య మీద దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. సమన్వయంతో ట్రాఫిక్క్రమబద్ధీకరిస్తాం పట్టణంలో ట్రాఫిక్ స మస్య చాలా జఠిలం గా మారింది. ఏఎస్పీ అ రిఫ్ హఫీజ్ ట్రాఫి క్‌పై ప్రధానంగా దృష్టిసారించారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు, రోడ్లు భవనాలు, ము న్సిపల్ అధికారుల సమన్వయంతో అక్రమణలు తొలగింపు చేపడతాం. ఆటోలను కూ డా క్రమబద్ధీకరిస్తాం. అక్రమణలు తొలగిస్తే కొంత మేర ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది.–సింహాద్రినాయుడు, పట్టణ సీఐ, నర్సీపట్నం -
నగరంలోమరో 5 ఫైఓవర్లు
సాక్షి, ముంబై: అంధేరి, బోరివలి లింక్ రోడ్డుపై ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించేందుకు ఐదు ఫ్లై ఓవర్లు లేదా ఎలివేటెడ్ రోడ్ నిర్మాణానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. ఎలివేటెడ్ రోడ్ ప్రాజెక్టు అధ్యయనం కోసం ముగ్గురు సలహాదారులను నియమించారు. ఈ మార్గంలో 13 కి.మీ మేర ఎలవేటెడ్ రోడ్ నిర్మాణానికి ఈ బృందం అధ్యయనం చేస్తోంది. కాగా, ఐదు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి గాను రూ.300 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. గోరేగావ్‌లోని బాన్గర్ నగర్లో, మలాడ్ లోని చించోలి బందర్, మిఠి చౌక్, బోరివలిలోని డాన్‌బాస్కో స్కూల్ సమీపంలో ఈ ఐదు ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదన అమలైతే ప్రయాణ సమయంలో దాదాపు 20 నిమిషాల వరకు ఆదా అవుతుందని బ్రిడ్జిల విభాగం చీఫ్ ఇంజినీర్ ఎస్ఓ కోరి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఎలివేటెడ్ రోడ్ కోసం మరో రెండు నెలల్లో నివేదికను సమర్పిం చనున్నారు. దీని ఖర్చు ఐదు ఫ్లై ఓవర్ల నిర్మాణ ఖర్చు కంటే కూడా అధికంగా ఉంటుంది. కాగా, ఒకేసారి ఒకటి లేదా రెండు ఫ్లై ఓవర ్లనిర్మాణం ప్రారంభిస్తామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) బి.కె.ఉపాధ్యాయ తెలిపారు.