సంక్రాంతి పండుగ నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జమ్ ఏర్పడుతోంది. సంక్రాంతి పండగ సెలవులు కావడంతో హైదరాబాద్ నగర వాసులు ఇటు తెలంగాణకు, అటు ఏపీకి పయనమవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్‌గేట్‌లో 8 టోల్ బూతులు తెరిచారు.