అంధేరి, బోరివలి లింక్ రోడ్డుపై ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించేందుకు ఐదు ఫ్లై ఓవర్లు లేదా ఎలివేటెడ్ రోడ్ ..
సాక్షి, ముంబై: అంధేరి, బోరివలి లింక్ రోడ్డుపై ట్రాఫిక్ జాం సమస్యను పరిష్కరించేందుకు ఐదు ఫ్లై ఓవర్లు లేదా ఎలివేటెడ్ రోడ్ నిర్మాణానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్ణయించింది. ఎలివేటెడ్ రోడ్ ప్రాజెక్టు అధ్యయనం కోసం ముగ్గురు సలహాదారులను నియమించారు. ఈ మార్గంలో 13 కి.మీ మేర ఎలవేటెడ్ రోడ్ నిర్మాణానికి ఈ బృందం అధ్యయనం చేస్తోంది. కాగా, ఐదు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి గాను రూ.300 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. గోరేగావ్‌లోని బాన్గర్ నగర్‌లో, మలాడ్ లోని చించోలి బందర్, మిఠి చౌక్, బోరివలిలోని డాన్‌బాస్కో స్కూల్ సమీపంలో ఈ ఐదు ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారు.
ఈ ప్రతిపాదన అమలైతే ప్రయాణ సమయంలో దాదాపు 20 నిమిషాల వరకు ఆదా అవుతుందని బ్రిడ్జిల విభాగం చీఫ్ ఇంజినీర్ ఎస్‌ఓ కోరి అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఎలివేటెడ్ రోడ్ కోసం మరో రెండు నెలల్లో నివేదికను సమర్పిం చనున్నారు. దీని ఖర్చు ఐదు ఫ్లై ఓవర్‌ల నిర్మాణ ఖర్చు కంటే కూడా అధికంగా ఉంటుంది. కాగా, ఒకేసారి ఒకటి లేదా రెండు ఫ్లై ఓవర ్లనిర్మాణం ప్రారంభిస్తామని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) బి.కె.ఉపాధ్యాయ తెలిపారు.