brihanMumbai Municipal Corporation (BMC)
-
మహారాష్ట్రకు మరో టెన్షన్.. మీజిల్స్ వైరస్‌తో చిన్నారులు మృతి
కరోనా సమయంలో వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మహారాష్ట్రను తాజాగా మీజిల్స్ వైరస్ టెన్షన్ పెడుతోంది. మీజిల్స్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం మహారాష్ట్రవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం చిన్నారులకు వ్యాక్సినేషన్ చేస్తోంది. వివరాల ప్రకారం.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకింది. దీంతో, ఈ వైరస్ సోకిన చిన్నారుల సంఖ్య 300కి చేరువైంది. కేసుల పెరుగుతున్న క్రమంలో అలర్ట్ అయిన అధికారులు బీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏండ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్-రుబెల్లా స్పెషల్ డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు నెలల్లోనే 2 వందల కేసులు నమోదకావడం అక్కడి వైద్యాధికారులను టెన్షన్ పెడుతోంది. అయితే, గతకొన్నేండ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు.. ఈ వైరస్ కారణంగా చిన్నారులు మృతిచెందడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక, నవంబర్ 22వ తేదీన బీవండిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి చనిపోయాడు. కాగా, నవంబర్ 20వ తేదీన వైరస్ బారినపడిన చిన్నారి ఒంటిపై దద్దుర్లతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, చిన్నారికి అటాప్సీ టెస్టు చేసిన తర్వాత మీజిల్స్ కారణంగా చనిపోయినట్టు నిర్ధారించారు. ఇక, మీజిల్స్ కారణంగా ఈ ఏడాది 13 మంది చిన్నారులు మృతిచెందారు. మరోవైపు.. మీజిల్స్ కేసులు మహారాష్ట్రతోపాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళలోనూ నమోదు అవుతున్నాయి. BMC prepares list of nearly 1.4 lakh Mumbai children for extra measles shot https://t.co/2KLGyJsHYT Download the TOI app now:https://t.co/2Rmi5ecUTa — Vinod KumarTOI🇮🇳 (@vinod904) November 27, 2022 -
ఉద్ధవ్ మాస్టర్ ప్లాన్.. తేజస్వీ యాదవ్‌తో ఆదిత్య థాక్రే భేటీ అందుకేనా?
మహారాష్ట్రలోని శివసేనలో అంతర్గత విభేదాల కారణంగా పార్టీ ఉద్ధవ్ థాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీతో కలిసి షిండే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో, శివసేన వర్గంలో కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ క్రమంలో రానున్న బీఎంసీ(బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ఎన్నికలపై ఉద్ధవ్ వర్గం ఇప్పటి నుంచి ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో అధిక సంఖ్యలో అక్కడ నివసిస్తున్న ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే శివసేన నేత ఆదిత్య థాక్రే.. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ను పాట్నాలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున తేజస్వీని ప్రచారం కోసం ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, శివసేన కోరిక మేరకు తేజస్వీ యాదవ్.. ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బీఎంసీ ప్రాంతంలో యూపీ, బీహార్ వలసవాసులు దాదాపు 50 లక్షల మంది ఉన్నట్టు సమాచారం. ఎన్నికల వీరి ఓట్లు ఎంతో కీలకం కానున్నాయి. ఈ క్రమంలో శివసేనుకు చెందిన ఉద్ధవ్ వర్గం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఇక, ఉద్ధవ్ థాక్రే సైతం.. 2024 రాబోయే లోక్‌సభ ఎన్నికల కన్నా బీఎంసీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు సమాచారం. బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ వర్గం విజయం సాధిస్తే రెట్టించిన ఉత్సాహంతో 2024 ఎన్నికల కోసం బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. After meeting with #AadityaThackeray, Bihar Deputy CM #TejashwiYadav is likely to campaign for the Uddhav Sena faction for the upcoming Brihanmumbai Municipal Corporation elections.@rohit_manas https://t.co/jExTeMlEAy — IndiaToday (@IndiaToday) November 24, 2022 -
25 ఏళ్లుగా శివసేన ఏకఛత్రాధిపత్యం.. ఈసారి ఎలాగైనా దెబ్బకొట్టాల్సిందే!
సాక్షి, ముంబై: వచ్చే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేనను దెబ్బ తీసేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వివిధ రకాల వ్యూహాలు రచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఈసారి జరిగే బీఎంసీ ఎన్నికల్లో శివసేనకు పరాజయం ఖాయమని శిందే, ఫడ్నవీస్ వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు రెండు నెలల కిందట శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుచేసిన శిందే మహావికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని కూల్చారు. దీంతో శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవిని కోల్పోవల్సి వచ్చింది. ఇప్పుడు గత 25 ఏళ్లుగా బీఎంసీలో ఏకచత్రాధిపత్యం చలాయిస్తున్న శివసేనను గట్టి దెబ్బ తీసేందుకు వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని మరాఠీ, ముఖ్యంగా మరాఠేతరుల ఓట్లపై బీజేపీ దృష్టి కేంద్రీకరించనుంది. అలాగే విల్లు–బాణం (ధనుష్య–బాణం) గుర్తు పొందేందుకు ఏక్నాథ్ శిందే వర్గం చట్టపరంగా గట్టిగా కోర్టులో పోరాటం చేయనున్నారు. మరోపక్క దివంగత బాల్ ఠాక్రే స్ధాపించిన శివసేన పార్టీ తమదేనని రుజువు చేసేందుకు ఉద్ధవ్ ఠాక్రే వర్గం తీవ్ర ప్రయత్నాలు చేయనుంది. అదే విధంగా కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన శివసేన ఇప్పుడు మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)కు దూరంగానే ఉండాలని భావిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఎమ్మెన్నెస్ ఎవరితో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ఇటీవల ఆ పార్టీ నేత సందీప్ దేశ్‌పాండే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో శివసేన, ఎమ్మెన్నెస్ ఒకటైతుండవచ్చని గత కొద్దిరోజులుగా వస్తున్న వదంతులకు తెరపడింది. ఫలితంగా శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి పోటీ చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం కనిపించడం లేదు. చదవండి: (కాంగ్రెస్‌లో కీలక మార్పులు.. పటోలే, జగ్తాప్ ఔట్?.. చవాన్ ఇన్!) వ్యూహాత్మకంగా ప్రధాన పార్టీలు... రాష్ట్ర ఎన్నికల సంఘం బీఎంసీసహా రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న 14 కార్పొరేషన్ల ఎన్నికల షెడ్యూల్ ఇంతవరకు విడుదల చేయలేదు. అయినప్పటికీ చిన్న, చితక పార్టీలతోపాటు ప్రధాన పార్టీలన్ని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్లతో పోలిస్తే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బీఎంసీ ఎన్నికలను సవాలుగా తీసుకుంటాయి. దీంతో అన్ని పార్టీలు బీఎంసీపైనే దృష్టి సారిస్తాయి. ఎన్నికలు వచ్చాయంటే యావత్ రాష్ట్ర ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల దృష్టి బీఎంసీపైనే ఉంటుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ బీఎంసీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ పరువును ఫణంగా పెడతాయి. అయినప్పటికీ గత 25 ఏళ్లుగా బీఎంసీలో తిరుగులేని పార్టీగా శివసేన అధికారం చెలాయిస్తోంది. ఈసారి ఎలాగైన శివసేనను గద్దె దించాలని శిందే, ఫడ్నవీస్ వర్గం శత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫలితంగా ఈ ఎన్నికలు మహావికాస్ ఆఘాడి–బీజేపీ మధ్య హోరా హోరీగా జరగనున్నాయి. అంతేగాకుండా ఈ ఎన్నికల్లో ఎవరు..ఎవరితో పొత్తు పెట్టుకుంటారు...ఎవరు తెరవెనక నుంచి మద్దత్తిస్తారు అనేది చూడవచ్చు. రాష్ట్రంలో శిందే, ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ బీఎంసీని కైవసం చేసుకునేందుకు వ్యూçహాత్మకంగా పావులు కదపనుంది. ముఖ్యంగా శివసేన ప్రధాన శత్రువు కావడంతో ఆ పార్టీనే లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ముందుకు వెళ్లనుంది. ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా కూడా శివసేనను గద్దె దించాలని బీజేపీకి సూచించారు. ఆ ప్రకారం ఫడ్నవీస్, శిందే వర్గం సన్నద్ధమైతున్నారు. ఇదిలాఉండగా ఎమ్మెన్నెస్ ఒంటరిగా పోటీ చేస్తుందని ఇటీవల సందీప్ దేశ్‌పాండే ప్రకటించడంతో ఫడ్నవీస్, శిందే వర్గం కూడా బీఎంసీ ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకూడదని నిర్ణయానికొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ రెండు వర్గాలు కలిసే పోటీ చేస్తాయి. త్వరలో సీట్ల పంపకంపై చర్చలు కూడా జరగనున్నట్లు సమాచారం. కొద్ది రోజలుగా ముంబైలో మరాఠేతరుల నియోజక వర్గాలలో బీజేపీ పైచేయి చాటుకుంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ గుజరాత్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్‌సహా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా వ్యూహం పన్నుతున్నారు. మరాఠేతరులతోపాటు మరాఠీ ఓటర్లను కూడా తమవైపు లాక్కునేందుకు బీఎంసీలో శివసేన పాల్పడిన అవినీతి భాగోతాన్ని బయటపెట్టి గద్దె దింపే ప్రయత్నాలు చేయనుంది. ఆ విధంగా ఎన్నికల్లో ప్రచారం చేసి గత 25 ఏళ్లుగా బీఎంసీలో తిరుగులేని పార్టీగా పాగా వేసిన శివసేనను ఈ సారి ఎలాగైన గట్టి దెబ్బతీయాలని శిందే, బీజేపీ వర్గం దృఢ సంకల్పంతో ఉన్నాయి. -
Maharashtra political crisis:...ఇక ముంబై వంతు!
సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి రోజుకో మలుపుతో థ్రిల్లర్‌లా పది రోజుల దాకా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఓ కొసమెరుపుతో ముగిసింది. శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండేకు అనూహ్యంగా సీఎం కుర్చీ అప్పగించి బీజేపీ తన రాజకీయ చతురత చాటుకుంది. అటు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, ఇటు సీఎం పదవి ఆశించిన సొంత నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు గమ్మత్తయిన జవాబు చెప్పింది. రాజకీయ పండితులు కూడా కలలోనైనా ఊహించని ట్విస్ట్ ఇది. షిండే తిరుగుబాటు సాయంతో ఉద్ధవ్‌ను కోలుకోలేని దెబ్బ తీసిన బీజేపీ అగ్ర నాయకత్వం, అదే షిండేను రాజును చేయడం ద్వారా రెండోసారి సీఎం పీఠమెక్కుదామనుకున్న ఫడ్నవీస్‌ను దూకుడు కాస్త తగ్గించాలని అన్యాపదేశంగా చెప్పింది. ఒక ఆట ఈ విధంగా ముగిసినా, అసలైన రసవత్త రాజకీయానికి త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు వేదిక కానున్నాయి. ఉద్ధవ్ శివసేనకు చావో రేవో కావడంతో పాటు ఆయన రాజకీయ భవితవ్యానికీ పెను పరీక్షగా నిలవనున్నాయి. ప్రతిష్టాత్మకమైన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అక్టోబర్–నవంబరులో జరగనున్నాయి. షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వీటిని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోదు. బీఎంసీపై పట్టు బిగించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా, నగర పరిషత్ ఎన్నికలూ ఉన్నా బీఎంసీయే కీలకంగా నిలవనుంది. ఉద్ధవ్ శివసేన, షిండే శివసేన రెండింటికీ ఇదే ప్రతిష్టాత్మకం. 1977 నుంచీ బీఎంసీ శివసేన అధీనంలోనే ఉంది. బీఎంసీ తర్వాత థానే, కల్యాణ్–డోంబీవలి మహానగర్ పాలిక రెండు, మూడో స్థానాల్లో నిలుస్తాయి. ఈ రెండింట్లోనూ షిండేకు పూర్తి పట్టుందని చెబుతారు. కనుక ఉద్ధవ్ తన దృష్టినంతా బీఎంసీపైనే కేంద్రీకృతం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఒకరకంగా షిండేపై ప్రతీకారానికి కూడా ఆయనకిది మంచి అవకాశం. అప్పట్లో రాజ్ దెబ్బ... ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన తొలిసారిగా 2002లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో దిగింది. టికెట్ల పంపిణీ అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. ఈ సమయంలోనే తన అనుయాయులకు టికెట్లివ్వడానికి నిరాకరించిన ఉద్ధవ్‌తో రాజ్ ఠాక్రే తెగదెంపులు చేసుకుని వేరుకుంపటి పెట్టుకున్నారు. అయినా ఉద్ధవ్ బీఎంసీని ఎలాగోలా చేజిక్కించుకున్నారు. రాజ్ నిష్క్రమణతో బలహీనపడ్డ శివసేన క్రమంగా గత వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. బీజేపీ కూడా బీఎంసీలో తన బలాన్ని పెంచుకుంటూ పోయింది. రాజ్ నేతృత్వంలోని ఎంఎన్ఎస్ దెబ్బకు 2012 బీఎంసీ ఎన్నికల్లో శివసేనకు దాదాపు ఓడినంత పనైంది. సాయం కోసం బీజేపీ వైపు చూడక తప్పలేదు. అలా శివసేన–బీజేపీ సంకీర్ణం బీఎంసీని హస్తగతం చేసుకుంది. బీజేపీతో కయ్యం... మరో ఐదేళ్లకు 2017లో విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రస్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, బీజేపీ బీఎంసీ ఎన్నికల్లో మాత్రం పరస్పరం పోటీ పడ్డాయి. బీజేపీ తన బలాన్ని 31 సీట్ల నుంచి ఏకంగా 82కు పెంచుకుంది. శివసేన గట్టిపోటీ నడుమ 84 సీట్లు గెలవగలిగింది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు షిండే సవాలును తట్టుకుని ఏ మేరకు రాణిస్తుందో చూడాల్సిందే. ఒకవైపు బీజేపీ, మరోవైపు షిండే దాడిని ఉద్ధవ్ ఏ మేరకు కాచుకుంటారన్నది ప్రశ్నార్థకమే. వాటికి తోడు రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్, శరద్ పవార్ ఎన్సీపీ నుంచి ఎటూ పోటీ ఉండనుంది. కాంగ్రెస్‌కు పెద్దగా సీన్ కనిపించడం లేదు. మరాఠా ఓటర్లంతా తమవైపేనన్నది ఉద్ధవ్ శివసేన ధీమా అయితే గుజరాతీలు, జైన్లు, ఉత్తరాది వారివంటి మరాఠేతర ఓటర్లు తమను విడిచిపెట్టరన్నది బీజేపీ ధీమా. నిజానికి శివసేనకు ముంబై పెట్టని కోటగా ఉండేది. కానీ దాదర్, మాహిం, కుర్లా, చాందివలి ఎమ్మెల్యేలు కూడా షిండే వర్గంలో చేరడంతో బీఎంసీ ఎన్నికల్లో వారి అనుయాయులు, కార్యకర్తల మద్దతు ఉద్ధవ్‌కు లేకుండా పోయినట్టే. ఇది ఆయనకు ఒకరకంగా గట్టి దెబ్బే. కనీసం 90 సీట్లన్నా రాకుంటే బీఎంసీ పీఠం ఉద్ధవ్ సేనకు దక్కడం కష్టమే. అయితే బీజేపీకి దూరమైంది గనుక ముంబై ముస్లింలు ఈసారి ఉద్ధవ్‌కు ఓటేసే అవకాశముంది. ఇది ఆయనకు కాస్త కలిసొచ్చే పరిణామమే. కాకపోతే, ఇది ఉద్ధవ్‌ను ఘోర పరాజయం గట్టెక్కించడానికి మాత్రమే పనికొస్తుందన్న అంచనాలున్నాయి. బీజేపీ ఆశీస్సులతో సీఎం పీఠం మాదిరిగానే బీఎంసీని కూడా ఉద్ధవ్ నుంచి షిండే లాక్కోవడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకూ బీఎంసీ ఎన్నికల నాటికి సిసలైన శివసేనగా గుర్తింపు, పార్టీ గుర్తు ఉద్ధవ్, షిండేల్లో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికర అంశం. వేచి చూద్దాం. -
కొత్త వేరియెంట్ XE కేసుపై సందిగ్ధం!
Mumbai XE Variant Case: ముంబై(మహారాష్ట్ర)లో ఒమిక్రాన్ మ్యూటేషన్ కొత్త వేరియెంట్ ఎక్స్ఈ(XE) కేసు వెలుగు చూసిందంటూ వార్తలు హోరెత్తిన విషయం తెలిసిందే. నెల కిందట సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఫ్యాషన్ డిజైనర్(50)కు చెందిన శాంపిల్స్‌లో వేరియెంట్ ఆనవాలు గుర్తించినట్లు బీఎంసీ(బృహణ్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్) బుధవారం ప్రకటించుకుంది. అయితే.. ఈ విషయంలో ముంబై అధికారులు తొందరపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది. కరోనా వైరస్‌లో ఇప్పటిదాకా ఒమిక్రాన్ వేరియెంట్‌ను వేగంగా వ్యాపించేదిగా గుర్తించారు వైద్యులు. ఒమిక్రాన్‌లో బీఏ.2 ఉపవేరియెంట్ వ్యాప్తి ఇంకా వేగంగా ఉండేదని అనుకున్నారు. అయితే ఇంతకంటే పది రెట్లు ఎక్స్ఈ వేరియెంట్ వ్యాపించే గుణం ఉందని, అయినా అంతప్రమాదకరమైంది కాదని, కేసులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా మాత్రం ఉండాలంటూ.. వైద్య నిపుణులు దానిని గుర్తించినప్పుడే హెచ్చరించారు. తాజాగా దేశంలోనే తొలి ఎక్స్ఈ కేసుగా బీఎంసీ ప్రకటించుకుంది. గ్లోబల్ జెనోమిక్ డాటా ప్రకారం.. అది ఎక్స్ఈ అని తేల్చేసింది కూడా. కానీ.. కేంద్ర ఆరోగ్య సంస్థ ఇండియన్ సార్స్ కోవ్-2 జెనోమిక్స్ కాన్సోర్టియమ్ మాత్రం అది ఎక్స్ఈ కేసు కాదని కొట్టిపారేసింది. బీఎంసీ అభ్యర్థన నేపథ్యంలో.. మరో దఫా ఆ శాంపిల్స్‌ను పరిశీలించాలని భావిస్తోంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్‌కు శాంపిల్స్‌ను పంపించింది. ఫలితాలు రావాల్సి ఉంది. అయితే ఈలోపే ముంబైలో తొలి ‘ఎక్స్ఈ’ కేసు నమోదు అయ్యిందని ప్రకటించడాన్ని కేంద్ర ఆరోగ్య సంస్థలు తప్పుబడుతున్నాయి. అది ఎక్స్ఈ కేసుగా ఇంకా ధృవీకరణ కాలేదని కేంద్ర ఆరోగ్య సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సూచనల మేరకు.. బీఎంసీ అధికారులు సైతం నివేదికలు వచ్చేదాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ‘‘తొలుత మేం ఆ శాంపిల్‌ను ఎక్స్ఈ కేసుగానే భావించాం. కానీ, జీనోమిక్ పిక్చర్తో అది సరిపోలకపోవడంతో ఎందుకైనా మంచిదని మరోసారి టెస్టులకు పంపించాం’’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు ఈ పాటికే దాని ప్రభావం చూపాల్సి ఉందని, ప్రస్తుతానికి భారత్‌లో ఎక్స్ఈ కేసులు నమోదు అయినట్లు తాము భావించడం లేదని ఆయన అంటున్నారు. యాభై ఏళ్ల వయసున్న సౌతాఫ్రికన్ మహిళ.. ఫిబ్రవరి 10వ తేదీన భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 27న ఆమెకు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను ఓ హోటల్ గదిలో క్వారంటైన్లో ఉంచారు. ఆపై శాంపిల్‌ను కస్తూర్బా ఆస్పత్రి లాబోరేటరీకి జీనోమ్సీక్వెన్సింగ్ కోసం పంపించారు. అందులో ఎక్స్ఈ వేరియెంట్‌గా నివేదిక రావడంతో ముంబై అధికారులు ప్రకటన చేశారు. విశేషం ఏంటంటే.. ఆమెకు స్వల్పలక్షణాలే ఉండగా.. మరోసారి టెస్ట్ నిర్వహించినప్పుడు నెగెటివ్‌గా తేలిందంట. ఆ తర్వాత మరోసారి టెస్టులు నిర్వహించడంతో పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న ఆమె.. ప్రస్తుతం కోలుకుని ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఎక్స్ఈ వేరియెంట్.. ఒమిక్రాన్ స్ట్రెయిన్లు బీఏ.1, బీఏ.2ల మ్యూటెంట్ వేరియెంట్. జనవరి 19న ఈ ఒమిక్రాన్ మ్యూటెంట్ వేరియెంట్ తొలి కేసును యూకేలో గుర్తించారు. ప్రస్తుతం అక్కడ కరోనా విజృంభణకు కారణం.. ఇదే. సంబంధిత వార్త: కొత్త వేరియంట్ ఎక్స్ఈ.. లక్షణాలివే! -
కరీనా కుటుంబంపై బీఎంసీ అధికారులు ఆగ్రహం
BMC Alleged Kareena Kapoor Family Not Cooperating Contact Tracing: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కుటుంబ కాంటాక్ట్ ట్రెసింగ్కు సహకరించడం లేదని బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు ఆరోపిస్తున్నారు. కరీనా ఇటీవల మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. నిర్మాత కరణ్ జోహార్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందు పార్టీకి కరీనాతో పాటు హజరైన పలువురికి సైతం పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన బీఎంసీ కరోనా పరీక్షలు చేయిస్తుంది. ఈ నేపథ్యంలో కరీనా ఇంటిని సీజ్ చేసి శానిటైజ్ చేయించారు. చదవండి: Corona Virus: బాలీవుడ్లో కరోనా కలకలం, కరోనా బారిన వరసగా సెలబ్రెటీలు ఇక కాంటాక్ట్ ట్రెసింగ్తో ఎవరెవరూ పార్టీకి వచ్చారు వారంత ఎక్కడ ఉన్నారో తెలుసుకునే పనిలో పడ్డారు బీఎంసీ అధికారులు. అయితే దీనికి కరీనా కుటుంబం సహకరించడం లేదని బీఎంసీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీనా భర్త సైఫ్ అలీఖాన్ ఎక్కడున్నారన్న విషయాన్ని చెప్పడం లేదని, ఎన్నిసార్లు అడిగినా ముంబైలో లేరనే చెబుతున్నారని, ఎక్కడున్నారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదని అన్నారు. ప్రస్తుతం కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోందని, సేకరించిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిస్తామని చెప్పారు. చదవండి: నుదిటిన సింధూరం.. తాలిబొట్టుతో చూడ ముచ్చటగా కత్రినా, ఫొటోలు వైరల్ కరీనా కపూర్ నిబంధనలు ఉల్లంఘించారని వస్తున్న వార్తలపై ఆమె అధికార ప్రతినిధి స్పందించారు. ఆమె చాలా బాధ్యతాయుతమైన పౌరురాలని, లాక్డౌన్ సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించారని పేర్కొన్నారు. కరణ్ జోహార్ ఈ నెల 8న తన ఇంట్లో ఇచ్చిన పార్టీలో ఓ వ్యక్తి దగ్గుతూ కనిపించాడని, అతడు రాకుండా ఉండాల్సిందని అన్నారు. తనకు కరోనా సోకిన విషయం తెలిసిన వెంటనే కరీనా క్వారంటైన్‌కు వెళ్లిపోయినట్టు చెప్పారు. -
బీ-టౌన్లో కరోనా కలకలం, కరోనా బారిన వరసగా సెలబ్రెటీలు, బీఎంసీ అలర్ట్
థర్డ్‌వేవ్‌పై ప్రజలంతా ఆందోళన చెందుతున్న తరుణంలో బాలీవుడ్లో కరోనా కలకలం రేపుతోంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్ విందు పార్టీ కొవిడ్ హాట్‌స్పాట్‌గా మారింది. కరణ్ హౌస్ పార్టీకి హాజరైన నలుగురు సెలబ్రిటీలకు వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. కే3జీ(K3G) సినిమాకు 20ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కరణ్ జోహార్ డిసెంబర్ 8న తన ఇంట్లో డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఆ తెల్లారే నటుడు సౌహైల్ ఖాన్ భార్య సీమా ఖాన్‌కు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఇదే పార్టీకి హాజరైన కరీనా కపూర్‌ఖాన్, అమృతా అరోరా కూడా పరీక్షలు చేయించుకున్నారు. వారికి కూడా వైరస్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. చదవండి: భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్ వీరితోపాటు పార్టీలో పాల్గొన్న సంజయ్ కపూర్ భార్య మహీప్ కపూర్ కూడా వైరస్ బారిన పడ్డారు. కరణ్ నివాసంలో డిన్నర్ పార్టీకి హాజరైన వాళ్లలో అలియా భట్, కరిష్మా కపూర్, మలైకా అరోరా, అర్జున్‌కపూర్, డిజైనర్ మసాబా గుప్తా సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో వీరు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ పార్టీ జరిగిన మరుసటి రోజే కరీనా కపూర్, అమృత అరోరా అనిల్ కపూర్ పెద్దకూతురు రియా కపూర్ నివాసంలో జరిగిన క్రిస్మస్ పార్టీలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రియా హౌస్ పార్టీకి హాజరైన సెలబ్రిటీలు కూడా సెల్ఫ్ ఐసోలేట్ అయినట్టు తెలుస్తోంది. అయితే కరణ్ జోహార్‌కు మాత్రం కొవిడ్ నెగెటివ్ వచ్చినట్టు సమాచారం. చదవండి: పార్టీలతో హల్చల్.. బీటౌన్‌లో కరో(రీ)నా టెన్షన్ ఇక బాలీవుడ్ సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడటంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అప్రమత్తమైంది. పాజిటివ్ వచ్చిన వారికి ఎవరెవరూ క్లోజ్‌గా కాంటాక్ట్స్ అయ్యారో వారిని వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ఈ మేరకు కరీనా అపార్ట్మెంట్లో బీఎంసీ అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు. సైఫ్ అలీఖాన్, కరిష్మా కపూర్ సహా పలువురికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినట్టు తెలిసింది. అలాగే కరణ్ జోహార్, కరీనా కపూర్, అమృతా అరోరా నివాసాలను బీఎంసీ సిబ్బంది శానిటైజ్ చేశారు. వాటిని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటుచేసి పాజిటివ్ వచ్చిన వారిని ఎవరూ కాంటాక్ట్ అయ్యారో వారిని ట్రెసింగ్ చేసే పనిలో బీఎంసీ పడింది. -
సోనూసూద్‌కు బీఎంసీ మరో షాక్, మాట నిలబెట్టుకోలేదంటూ హెచ్చరిక
Sonu Sood Gets Again Notice From BMC Over Illegal Hotel: రియల్ హీరో నటుడు సోనూసూద్‌కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) మరోసారి షాకిచ్చింది. వసతి గృహం కోసం నిర్మించిన ఆరు అంతస్తుల భవవాన్ని హోటల్‌గా మార్చారని సోనూసూద్‌కు బీఏమ్సీ నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశం మేరకు అక్రంగా హోటల్‌గా మార్చిన ఆరు అంతస్తుల భవనాన్ని తిరిగి రెషిడెన్షియల్ భవంతిగా మార్చుతానని గతంలో సోనూసూద్ మాట ఇచ్చారని, దానిని ఇంకా నిలబెట్టుకోలేదంటూ బీఎంసీ తమ నోటీసులో గుర్తుచేసింది. కాగా నవంబర్ 15, 2021న బీఎంసీ ఈ నోటీసులు పంపుతూ వెంటనే స్పందించి యథాస్థితిలో బిల్డింగ్‌ను కొనసాగించాలని సోనూసూద్‌ను హెచ్చరించింది. చదవండి: Kareena Kapoor: కరీనా డ్రెస్సింగ్‌పై నెటిజన్ల విమర్శలు, ‘హే భగవాన్ ఇంకేం చూడాల్సి వస్తుందో కాగా ఈ ఏడాది ప్రారంభంలో మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేశ్ కుస్ములు అనే వ్యక్తి సోనూసూద్‌పై బీఎంసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాలికల వసతి గృహన్ని సోనూసూద్ హోటల్‌గా మార్చారని.. ఇది చట్టరిత్యా నేరం కాబట్టి ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలంటూ తన ఫిర్యాదులో కోరాడు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలోనే బీఎంసీకి సోనూసూద్ మధ్య సంప్రదింపులు జరిగాయి. ఇక ఇదే విషయంపై సోనూసూద్ సూప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు విచారణ అనంతరం తన పిటిషన్‌ను వెనక్కు తీసుకుని ఆ హోటల్‌ను తిరిగి నివాస భవనంగా మార్చేందుకు సోనూసూద్ అంగీకరించారు. చదవండి: ఎలిమినేషన్ అనంతరం పింకీ తొలి ఇంటర్య్వూ.. మానస్ గురించి ఏం చెప్పిందంటే -
అడ్వాన్స్డ్ ఫైర్ బైక్స్ వచ్చేస్తున్నాయ్.. ఒక్కో బైక్ విలువెంతో తెలుసా?
సాక్షి, ముంబై: ముంబై అగ్నిమాపక విభాగంలోకి త్వరలో ఆధునిక ఫైర్ బైక్స్ రానున్నాయి. ఈ బైక్స్ అందుబాటులోకి వస్తే అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి మంటలు విస్తరించకుండా నిలువరించే ప్రయత్నం చేయవచ్చు. దీంతో ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువ వాటిల్లదని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలనా విభాగం భావిస్తోంది. ఈ మేరకు వార్డుకు ఒకటి చొప్పున ముంబై పరిధిలో ఉన్న మొత్తం 24 వార్డుల కోసం 24 ఫైర్ బైక్స్ కొనుగోలు చేయనున్నట్లు బీఎంసీ డిప్యూటీ చీఫ్ ఫైర్ బ్రిగేడ్ అధికారి రాజేంద్ర చౌదరి తెలిపారు. ఒక్కో బైక్ ధర రూ. 13 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ముంబై నగరం వేగంగా విస్తరిస్తోంది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ టవర్లు, ఆకాశ హర్మ్యాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. అయితే, పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్లు రోడ్ల విస్తరణ జరగలేదు. ఫలితంగా నిత్యం నగర రహదారులపై ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తుతోంది. దీంతో నగరంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్లు సకాలంలో చేరుకోలేకపోతున్నాయి. ఫైరింజన్లే కాదు అంబులెన్స్‌ల పరిస్థితి కూడా దాదాపుగా ఇలానే ఉంటోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు, టవర్ల వద్దకు వెళ్లేందుకు విశాలమైన దారి లేకపోవడంతో భారీ ఫైరింజన్లు సంఘటనా స్థలం దగ్గరి వరకు వెళ్లలేకపోతున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మినీ ఫైరింజన్లతోనే మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే, అప్పటికే మంటలు ఉగ్రరూపం దాల్చి జరగాల్సిన ప్రాణ, ఆస్తి నష్టం జరిగిపోతోంది. దీంతో ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచించిన బీఎంసీ, ఫైర్ బైక్స్ అయితే ఇలాంటి సందర్భాల్లో బాగా పనికొస్తాయని భావించింది. చదవండి: (పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి) ఈ ఫైర్ బైక్స్ ట్రాఫిక్ జామ్‌లో కూడా సునాయాసంగా ముందుకు దూసుకుపోవడంతో పాటు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయి. ఇవి మంటలను పూర్తిగా అదుపు చేయకపోయినప్పటికీ కనీసం విస్తరించకుండానైనా నిలువరిస్తాయి. ఆ లోపు పెద్ద ఫైరింజన్లు వచ్చేస్తాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువ జరగదని రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు. కాగా, ఇలాంటి ఫైర్ బైక్‌లను కొనుగోలు చేయాలని బీఎంసీ రెండేళ్ల కిందటే భావించింది. ఆ మేరకు పరిపాలనా విభాగం మంజూరునిచ్చింది. టెండర్లను ఆహ్వనించే ప్రక్రియ కూడా ప్రారంభించారు. కానీ, కరోనా వైరస్ వ్యాప్తితో ఆ కొనుగోలు ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా వైరస్ అదుపులోకి రావడంతో ఫైర్ బైక్స్ కొనుగోలు అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఫైర్ బైక్స్ ప్రత్యేకతలు ►ఆధునిక సౌకర్యాలుండే ఈ ఫైర్ బైక్స్‌కు 20 లీటర్ల చొప్పున సామర్థ్యం ఉండే రెండు వాటర్ ట్యాంకులు ఉంటాయి. ►నేరుగా సమీప ఫైర్ స్టేషన్‌తో సంప్రదించేలా కమ్యూనికేషన్ సౌకర్యముంటుంది. ►శిక్షణ పొందిన అగ్నిమాపక శాఖ సిబ్బంది బైక్ రైడర్స్‌గా ఉంటారు. ►పోర్టబుల్ ఫైర్ సిస్టం, 30 మీటర్ల హోజరిల్ పైపు, ఫైర్ పంపు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటాయి. చదవండి: (గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా) -
అగ్నిప్రమాదాలకు నిలయంగా ముంబై?
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం అగ్నిప్రమాదాలకు నిలయంగా మారినట్లు తెలుస్తోంది. గత పన్నేండేళ్లలో నగరంలో 50 వేలకుపైగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. లాల్బాగ్ ప్రాంతంలో ని వన్ అవిఘ్న పార్క్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగి ఒకరు చనిపోయిన సంగ తి తెలిసిందే. దీంతో 2008–2018 మధ్య కాలంలో ముంబై నగరంలో మొత్తం ఎన్ని అగ్ని ప్రమాద సంఘటనలు సంభవించాయో తెలపాలని షకీల్ అహ్మద్ షేక్ అనే కార్యకర్త సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ని కోరారు. దీంతో బీఎంసీ ఈ వివరాలను వెల్లడించింది. చదవండి: (ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..) బీఎంసీ తెలిపిన వివరాల ప్రకారం ముంబై నగరంలో 2008–2018 మధ్య కాలంలో 48,434 అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ అగ్నిప్రమాదాల్లో 609 మంది చనిపోయారు. వీరిలో 29 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఈ అగ్నిప్రమాదాల్లో అత్యధికం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే సంభవించాయని బీఎంసీ పేర్కొంది. మొత్తం అగ్ని ప్రమాదాల్లో 1,568 ప్రమాదాలు ఆకాశహరŠామ్యల భవనాలలో జరగగా.. 8,737 ప్రమాదాలు సామాన్య నివాస భవనాలలో సంభవించాయి. 3,833 ప్రమాదాలు వ్యాపార, వాణిజ్య సంస్థల్లో చోటుచేసుకోగా.. 3,151 అగ్ని ప్రమాదాలు మురికివాడల్లో జరిగాయి. మొత్తం ప్రమాదాల్లో 32,516 ప్రమాదాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల సంభవించాయి. 1,116 ప్రమాదాలు గ్యాస్ సిలిండర్లు పేలడం వల్ల జరగగా.. 11,889 ప్రమాదాలు సిలిండర్ లీకేజీ వల్ల చోటుచేసుకున్నా యి. మిగతా ప్రమాదాలు ఇతర కారణాల వల్ల జరిగినట్లు బీఎంసీ పేర్కొంది. వీటితోపాటు, నగరంలో 2020లో మరో 3,841 అగ్నిప్రమాదాలు సంభవించా యని బీఎంసీ తెలిపింది. 2020లో జరిగిన ప్రమాదాల్లో వంద మంది చనిపోగా, సుమారు రూ. 89 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బీఎంసీ వివరించింది. -
ఆ కార్పొరేటర్ల బకాయిలు రూ. 40 లక్షలు
సాక్షి, ముంబై: నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు, అక్రమ కట్టడాలు తదితర కేసుల్లో అనర్హత వేటు పడిన పలువురు కార్పొరేటర్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి భారీగా బకాయిపడ్డారు. మొత్తం 12 మంది మాజీ కార్పొరేటర్లు రూ. 40 లక్షల మేర బకాయి పడ్డారని బీఎంసీ అకౌంట్స్ విభాగం తెలిపింది. వారిని వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించింది. బీఎంసీకి బకాయి పడిన 12 మందిలో శివసేన పారీ్టకి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందినవారు ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, ఎన్సీపీకి చెందిన వారు ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు ఉన్నారు. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పోటీచేసే అభ్యర్థులు టికెట్ దక్కించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఒక్కోసారి తాము గెలిచే అవకాశమున్న రిజర్వుడ్ వార్డుల నుంచి పోటీ చేసేందుకు తప్పుడు లేదా నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు సమరి్పస్తారు. అలాంటి వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత దానికి సంబంధించి ప్రత్యర్థులు ఫిర్యాదు చేస్తే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రాలు, అక్రమ కట్టడాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులుంటే పరిశీలిస్తారు. ఆ తరువాత ఆరోపణలు నిజమని తేలితే గెలిచిన కార్పొరేటర్లపై అనర్హత వేటు వేస్తారు. వారి స్థానంలో ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. కానీ, ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి నాలుగైదు నెలలు గడుస్తుంది. ఈ కాలవ్యవధిలో కార్పొరేటర్లు పొందిన వివిధ భత్యాలు, గౌరవ వేతనం తిరిగి బీఎంసీకి చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. కానీ, గత ఎన్నికల్లో అనర్హత వేటు పడిన మొత్తం 24 మంది కార్పొరేటర్లలో 12 మంది ఇప్పటివరకు బకాయిలు చెల్లించలేదు. అనిల్ గల్గలే అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద బీఎంసీ అకౌంట్స్ విభాగం నుంచి దీనికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఈ బకాయిల విషయం బయటకు వచి్చంది. దీంతో బకాయిలు చెల్లించని ఆ 12 మంది మాజీ కార్పొరేటర్ల ఆస్తులు జప్తు చేయాలని అనిల్ గల్గలే బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్‌ను డిమాండ్ చేశారు. పేరు పార్టీ పార్టీ బకాయిలు(రూ. లక్షల్లో) ముర్జీపటేల్ బీజేపీ 5.64 కేశర్బేన్పటేల్ బీజేపీ 5.64 భావన జోబన్‌పుత్ర బీజేపీ 3.49 రాజపతి యాదవ్ కాంగ్రెస్ 5.64 కిణీ మారిస్ కాంగ్రెస్ 4.84 భారతీ ధోంగడే కాంగ్రెస్ 1.81 సుగుణ నాయిక్ శివసేన 3.55 అనుషా కోడం శివసేన 0.37 సునీల్ చవాన్ శివసేన 0.93 నాజీయా సోఫీ ఎన్సీపీ 7.21 చంగేజ్ ముల్తాని ఇండిపెండెంట్ 0.79 అంజుమ్ అస్లం ఇండిపెండెంట్ 0.45 -
ముంబైలో తొలి డెల్టా ప్లస్ మరణం
ముంబై: కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా ముంబైలో తొలి మరణం సంభవించింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసులు సైతం తీసుకున్న 63 ఏళ్ల మహిళ జూలై 27న మరణించారని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్స్ రిపోర్టు ఆమె మరణించాక వచ్చిందని పేర్కొన్నారు. జూలై 21న పొడి దగ్గు, వాసనలేమి, ఒళ్లునొప్పులు, తలనొప్పితో ఆమె ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా మరణించినట్లు తెలిపారు. ఆమెకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, ఆమెతో స్ననిహితంగా మెలిగిన ఆరుగురికి కరోనా నిర్ధారణ పరీక్ష చేసినట్లు వెల్లడించారు. అందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, ఇద్దరిలోనూ డెల్టా ప్లస్ వేరియంట్ ఉందన్నారు. జూన్ 13న కూడా 80 ఏళ్ల మహిళ రత్నగిరి జిల్లాలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మరణించారు. బుధవారం నాటికి మహారాష్ట్రలో 20 డెల్టా ప్లస్ కేసులు ఉండగా, అందులో ముంబైలోనే 7 కేసులు నమోదయ్యాయి. -
బీఎంసీలోకి ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, ముంబై: స్వచ్ఛ–సుందర్, కాలుష్య రహిత ముంబై కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కార్యాలయం పనులకు, అధికారుల పర్యటనకు, ఉన్నతాధికారులు ఇంటి నుంచి కార్యాలయానికి రావడానికి ఇలా వివిధ పనులకు ఉపయోగించేందుకు బ్యాటరీతో నడిచే వాహనాలను కొనుగోలు చేయనుంది. అందుకు బీఎంసీ ప్ర«ధాన కార్యాలయంతోపోటు, 24 వార్డు కార్యాలయాల్లో, గ్యారేజీల్లో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించింది. పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే సంకల్పంతో చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ నుంచి బ్యాటరీతో నడిచే కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలని బీఎంసీ యోచిస్తోందని పర్యావరణ విభాగం డిప్యూటీ కమిషనర్ సునీల్ గోడ్సే తెలిపారు. 200 వాహనాలు.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాహనాల సంఖ్యతోపాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరుగుతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు బెస్ట్ సంస్థ కూడా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసింది. ఇదే తరహాలో బీఎంసీ సిబ్బంది, అధికారులు వినియోగించే ఫోర్ వీలర్స్‌తోపాటు చిన్న, చితక సామగ్రి, తేలకపాటి సరుకులు చేరవేసే వాహనాలను కొనుగోలు చేయనుంది. కార్లు, ఇతర ఫోర్ విలర్స్ వాహనాలను బీఎంసీ కమిషనర్, డిప్యూటీ, అదనపు, సహాయ కమిషనర్లకు, ఉన్నతాధికారులకు అందజేయనుంది. సుమారు 200 వరకు బ్యాటరీ వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలున్నాయని గోడ్సే తెలిపారు. దశల వారిగా వీటిని వినియోగంలోకి తేనుంది. బ్యాటరీతో నడిచే వాహనాల సంఖ్య పెరగడంతో బీఎంసీకి చెందిన అన్ని కార్యాలయాలలో, గ్యారేజీలలో చార్జీంగ్ పాయింట్ నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో 35 చోట్ల, ఆ తరువాత 100కుపైగా కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. వీటితోపాటు విద్యుత్ పొదుపు చేసేందుకు సోలార్ విద్యుత్ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేయాలని బీఎంసీ భావిస్తోంది. కార్యాలయం పనులకు ఎలాంటి ఇబ్బందులు లేని చోట ఈ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. -
వివాదంలో బిగ్‌బీ బంగ్లా, కూల్చివేయాలని బీఎంసీ ఆదేశం
ముంబైలోని బిగ్‌బీ అమితాబ్ బచ్చన్-జయ బచ్చన్ దంపతుల బంగ్లా ప్రతీక్ష చూడటానికి ఇంద్రభవంలా ఉంటుంది. అటూగా వెళ్లే ప్రతి ఒక్కరూ ప్రతీక్ష నుంచి చూపు తిప్పుకోలేరు. చెప్పాలంటే వారి బంగ్లా టూరిస్టు ప్లేస్‌ను తలిపించేలా ఉంటుంది. ప్రతి రోజు వందల మంది అభిమానులు ప్రతీక్ష దగ్గర క్యూ కడుతుంటారు. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్‌బీ బంగ్లా ప్రతీక్ష వివాదంలో చిక్కుకుంది. ప్రతీక్షను అక్రమ కట్టడంగా పరిగణలోకి తీసుకుని దానిని వెంటనే స్వాధీనం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత తులిప్ బ్రియాన్ మిరండా డిమాండ్ చేశారు. అంతేగాక 2017లో రోడ్డు విస్తిర్ణంలో భాగంగా ప్రతీక్షకు బృహాన్ ముంబై మున్సిపాలిటీ కార్పోరేషన్(బీఎంసీ) నోటీసుల కూడా జారీ చేసిందని, ఇప్పుడు ఆ నోటీసులపై వెంటనే చర్యలు చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నేత మిరండా బీఎంసీని కోరారు. కాగా ముంబై అమితాబ్ మొదటగా నిర్మించుకున్న బంగ్లా పేరు ప్రతీక్ష. దీని తర్వాత ఆయన జాల్సా అనే మరోక బంగ్లాను కూడా నిర్మించుకున్నారు. అయితే ప్రతీక్ష రోడ్డు విస్తిరణలో భాగమై ఉందని వెంటనే దానిని బీఎంసీ స్వాధీనం చేసుకుని కుల్చివేయాలంటూ మిరండా వ్యాఖ్యానించారు. తులిప్ బ్రియాన్ మిరండా శనివారం ఓ ఛానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన.. ‘అమితాబ్ బచ్చన్‌కు 2017లోనే ప్రతీక్ష అక్రమ నిర్మాణంలో ఉందంటూ బీఎంసీ నోటీసులు ఇచ్చింది. వీటిని రోడ్డు విస్తిర్ణంలో భాగంగా జారీ చేసింది. అయితే బీఎంసీ ఇప్పటి వరకు ఉదాసీనంగానే వ్యవహరించింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిని స్వాధీనం చేసుకోలేదు. అదే ఓ సామాన్యుడికి చెందిన భూమి అయి ఉంటే బీఎంసీ ఇప్పటికే దానిని స్వాధీనం చేసుకుని ఉండేది. మున్సిపల్ చట్టం ప్రకారం భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు’ అని ఆయన ప్రశ్నించారు. అయితే అమితాబ్ మరికొందరూ తమ బంగ్లాలకు సంబంధించిన మెయిన్ మ్యాప్‌లలో మార్పులు చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. కాగా కాంగ్రెస్ నేత మిరండా ఆరోపణల మేరకు బీఎంసీ కౌన్సిలర్ స్పందిస్తూ వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, ఆయన బంగ్లాను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
లాక్డౌన్లో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు
సాక్షి, ముంబై: లాక్డౌన్ సమయంలో ముంబైతోపాటు ఉప నగరాల్లో అక్రమ కట్టడాలు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా కారణంగా అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునే బీఎంసీ సిబ్బంది కరోనా నియంత్రించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తోంది. 2020 మార్చి నుంచి 2021 ఫిబ్రవరి కాలవ్యవధిలో బీఎంసీ కార్యాలయానికి ఏకంగా 13 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. అందులో కేవలం 466 అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. తనిఖీలు లేక.. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ వల్ల ప్రభుత్వ, బీఎంసీ అధికారులెవరూ కార్యాలయాల నుంచి బయటపడలేదు. ముఖ్యంగా మురికివాడల్లోకి తనిఖీలకు వెళ్లలేదు. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు మురికివాడల్లో ఖాళీ ఉన్న స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అనేక ఇళ్లపై రెండు, మూడు అంతస్తులు అక్రమంగా నిర్మించుకున్నారు. కరోనా నియంత్రణ పనుల్లో 90 శాతం సిబ్బంది గత సంవత్సరం కరోనా వైరస్ తెరమీదకు రావడంతో బీఎంసీ అధికారులు, ఇతర సిబ్బంది మహమ్మారిని నియంత్రించే పనులు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి మార్గదర్శనం చేయడం, కరోనా విస్తరించకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై సలహాలివ్వడం, మాస్క్‌లు, మందులు పంపిణీ చేయడం, రోగులను ఆస్పత్రులకు చేర్చడం తదితర విధుల్లో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత కోవిడ్ సెంటర్లు, జంబో కోవిడ్ కేంద్రాల నిర్మాణం, అందులో రోగులకు కల్పించాల్సిన సదుపాయాలపై ప్రధానంగా దృష్టిసారించారు. ఇలా 90 శాతం సిబ్బంది కరోనా నియంత్రణ పనుల్లోనే బిజీ అయ్యారు. దీంతో నగరంలో, మురికివాడల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే సమయం దొరకలేదు. కనీసం పర్యటించడానికి కూడా వెళ్లలేదు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ చర్యలు తీసుకునేందుకు వెళ్లాలంటే తగినంత సిబ్బంది అందుబాటులో లేరు. బాధితులు తిరగబడకుండా బీఎంసీ సిబ్బందికి రక్షణగా వెళ్లే పోలీసులు కూడా కరువయ్యారు. దీంతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదుల ద్వారా తెలిసినా అధికారులు వెళ్లలేకపోయారు. దీన్ని క్యాష్ చేసుకున్న మురికివాడల్లోని కొందరు ఇష్టమున్నట్లు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అత్యధికంగా అక్రమ నిర్మాణాలు తూర్పు ఉప నగరంలోని కుర్లా, గోవండీ, మాన్‌ఖుర్ద్ ప్రాంతాల్లో జరిగాయి. ఈ ప్రాంతాల నుంచి అక్రమ నిర్మాణాలకు సంబంధించిన 1,200–3,250 వరకు ఫిర్యాదులు వచ్చాయి. -
Viral Video: టికెట్ లేకుండా దొరికాడు.. ఆపై మన్‌కీబాత్‌తో ముంబైనే కదలించాడు!
ఏదైనా ఒక్కడితోనే మొదలవుతుంది అంటుంటారు పెద్దలు. అలాగే ముంబై మొత్తాన్ని ఆ ఒక్కడి వీడియో కదిలించింది. ‘టికెట్ లేని ప్రయాణం నేరం’ అనే ఆదేశాలకు తలొగ్గిన ఆ యువకుడు.. తనలాంటి వేలమంది ఆవేదనను ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎందుకు అర్థం చేసుకోవట్లేదంటూ నిలదీశాడు. ఆ వీడియో గంటల వ్యవధిలోనే వైరల్ కావడంతో వేలమంది అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ముంబై: మహానగరం.. జూన్ చివరివారంలో ఒక రోజు. లోకల్ రైలులో ప్రయాణిస్తున్న ఆ యువకుడ్ని.. పరేల్ స్టేషన్ వద్ద టీసీ దొరకబట్టాడు. టికెట్ లేదని, పైగా అనుమతి లేకున్నా రైళ్లో ప్రయాణిస్తున్నాడని ఛలానా రాయబోయాడు. ఆ యువకుడు బతిమాలడమో, లేదంటే పారిపోవడమో లాంటి ప్రయత్నాలు చేయలేదు. సరాసరి టీసీ వెంట ఆఫీస్‌కి వెళ్లాడు. అక్కడ తనకు విధించిన ఫైన్‌ను కట్టడానికి కూడా సిద్ధం అయ్యాడు. కానీ, ఆ ఘటనంతా సెల్ఫోన్లో రికార్డ్ చేస్తుండగా.. అధికారులు సైతం అడ్డుచెప్పలేదు. ‘‘ఒకప్పుడు నెలకు 35 వేల రూపాయలు సంపాదించేవాడ్ని. ఏడాదిన్నర క్రితం ఉద్యోగం పోయింది. ఖర్చులన్నీ పోనూ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు 400రూ. చేరింది. ఈ మధ్యే జాబ్ దొరికింది. వెళ్లాలంటే రైలు మార్గం తప్ప నాకు వేరే దిక్కులేదు. కానీ, రెండో రోజే ఇలా టీసీకి దొరికిపోయా. టీసీ సాబ్ తన డ్యూటీ తాను చేశాడు. అలాగే ఫైన్ కట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, లాక్‌డౌన్‌తో నాకంటే దారుణమైన కష్టాలు పడుతున్నవాళ్లను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు. This situation is there with the youth now in Mumbai. Same story can be guessed for me & my fellow DJ's from the Entertainment Industry. The government should look into this very seriously..#LockDown #adityathackeray #mumbailocal @AUThackeray @UdhavThackeray @VijayWadettiwar pic.twitter.com/8pnqtHWPyu — Omkar Raut (@djomkar) June 27, 2021 ఇప్పుడు రోజూ రైళ్లలో నాలాంటి వందల మంది ప్రయాణిస్తున్నారు. వాళ్లంతా నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాళ్లే. కానీ, అది సరదా కోసం చేయట్లేదు కదా. కుటుంబాల్ని పోషించుకోవాలనే తాపత్రయంతోనే అలా చేస్తున్నారు. కరోనా.. లాక్డౌన్ ఇక చాలు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే సంపాదించుకోవడానికి అర్హులా? మాలాంటి వాళ్లకు రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతులు ఇవ్వరా? దయచేసి ప్రభుత్వం ఆ నిబంధనల్ని ఎత్తేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు’’ అని మాట్లాడాడు ఆ యువకుడు. వెల్లువలా మద్దతు కరోనా కమ్మేసిన మహా నగరం ముంబైలో.. ఆంక్షల్ని క్రమంగా సడలిస్తూ వస్తోంది బీఎంసీ. అయితే లోకల్ ట్రైన్లను నడిపిస్తున్నా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురాలేదు. అత్యవసర సర్వీసుల పేరుతో గవర్నమెంట్ ఉద్యోగులకు, ఎమర్జెన్సీ కేటగిరీలో చేర్చిన ఉద్యోగులకు మాత్రమే లోకల్ ట్రైన్ ప్రయాణానికి అనుమతి ఇచ్చారు. ఈ తరుణంలో తనలాంటి వేల మంది ప్రైవేట్ ఉద్యోగుల ఆవేదనను ప్రతిబింబిస్తూ ప్రశ్నించాడు ఆ యువకుడు. దీంతో సోషల్ మీడియా మొత్తం అతనికి మద్ధతుగా నిలుస్తోంది. ప్రైవేట్ వాహనాలకు రోజూ బోలెడు ఖర్చులు చేస్తున్నామని..భరించలేకపోతున్నామని కొందరు, ప్రభుత్వ ఉద్యోగుల వేళలు మార్చాలని మరికొందరు, గవర్నమెంట్ ఉద్యోగులతో కరోనా వ్యాపించదా?.. అందరికీ అనుమతులు ఇవ్వాల్సిందేనని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇక కరోనా సాకుతో సామాన్యుడికి లోకల్ రైలులో ప్రయాణాలపై ఆంక్షలు విధించిన అధికార యంత్రాగం.. బస్సు ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని కొందరు అంటున్నారు. ఇలా ఆ యువకుడి వీడియో సోషల్ మీడియాలో, టీవీ ఛానెల్లో చర్చకు దారితీసింది. పరిష్కారం ఏమిటసలు? కరోనా మహమ్మారి భయం పూర్తిగా పోని తరుణంలో.. రైలు ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తేయడం సరికాదనే అభిప్రాయంలో ఉన్నారు అధికారులు. లోకల్ రైళ్లలో గుంపులుగా ప్రయాణిస్తారు గనుకే ధైర్యం చేయడం లేదని బీఎంసీ చీఫ్ ఇక్బాల్ చాహల్ వెల్లడించారు. అయితే త్వరలో ఆ ఆంక్షల్ని సడలిస్తామని, ముందుగా మహిళలకు, ఆపై మిగతా సెక్టారలకు ఒక్కో దశలో అనుమతులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: బాప్రే.. మాస్క్ లేకుండా నెలలో లక్షమంది!! -
Coronavirus: ముంబైలో కరోనా తగ్గుముఖం
ముంబై : ముంబై మహా నగరంలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం ముంబైలో 1,450 కేసులు మాత్రమే నమోదయ్యాయి. బృహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా 2 వేల లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త కేసుల కంటే కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. దీంతో ముంబైకర్లతోపాటు అధికారులకు కొంత ఊరట లభించింది. ముంబైలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందిన నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ప్రణాళికబద్దంగా చర్యలు చేపట్టింది. అదేవిధంగా ఇందుకు ప్రజలు కూడా సహకరించడంతోనే నేడు పరిస్థితి మారిందని బీఎంసీ చెబుతోంది. ఏప్రిల్ 4 న ముంబైలో కరోనా బాధితుల సంఖ్యను పరిశీలించిస్తే 11 వేలు దాటింది. కానీ, ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల, కఠినతరమైన ఆంక్షలతో కూడిన లాక్‌డైన్ వల్ల రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ముంబైలో ఇంతవరకు 6,31,982 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరి రేటు 92 శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం నగరంలో 37, 656 యాక్టీవ్ కేసులున్నాయి. -
కరోనా మిగిల్చిన విషాదం: దహనానికి కట్టెలూ లేవు
సాక్షి, ముంబై: కరోనా సోకి మృతి చెందిన మృతదేహాలు కుప్పలు తెప్పలుగా రావడంతో ముంబైలోని అనేక శ్మశాన వాటికల్లో కట్టెల కొరత ఏర్పడుతోంది. గత్యంతరం లేక అప్పటికప్పుడు శవాలను ఇతర శ్మశాన వాటికలకు తరలించాల్సిన దుస్థితి వచ్చింది. కొద్ది రోజులుగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అదే స్థాయిలో మృతదేహాలు కూడా నగరం, ఉప నగరాల్లోని శ్మశాన వాటికలు వస్తున్నాయి. ఒక్కో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే దాదాపు రూ.4,500 ఖర్చవుతుంది. అన్ని శ్మశాన వాటికల్లో విద్యుత్ దహన యంత్రాలు అందుబాటులో లేవు. కొన్నిచోట్ల ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు, మరమ్మతులకు నోచుకోలేక అవి పనిచేయడం లేదు. దీంతో గత్యంతరం లేక మృతుల బంధువులు కట్టెలపై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ముంబైతోపాటు ఉప నగరాల్లో ఉన్న వివిధ మతాల శ్మశాన వాటికలకు పెద్ద సంఖ్యలో మృతదేహాలు రావడంతో క్యూ కడుతున్నాయి. ఫలితంగా అంత్యక్రియలు నిర్వహించాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. కానీ, బీఎంసీ ముందు జాగ్రత్తలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. వేయి మాత్రమే చెల్లిస్తున్న బీఎంసీ.. బీఎంసీ శ్మశాన వాటికలో పేదలకు ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు వెసులుబాటు కల్పించింది. దహన క్రియకు అవసరమైన 300 కేజీల కట్టెలు ఉచితంగా అందజేస్తుంది. కానీ, మ«ధ్య తరగతి, ఉన్నత వర్గాలకు కొంత చార్జీలు తీసుకుంటుంది. ఒక్కో శవానికి బీఎంసీ రూ.వేయి చెల్లిస్తుంది. మిగతావి శవం తాలూకు బంధువులే భరించాల్సి ఉంటుంది. కానీ, తాజా పరిస్థితుల దృష్ట్యా అనేక శ్మశాన వాటికలో కట్టెల కొరత ఏర్పడుతోంది. అనేక సందర్భాలలో ఒకే రోజు కొన్ని శ్మశాన వాటికలకు సుమారు 15–20 శవాలు వస్తున్నాయి. కొన్ని శ్మశాన వాటికల్లో దహనం చేసే ప్లాట్‌ఫారాలు రెండు లేదా నాలుగే ఉంటాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో శవాలు రావడంవల్ల గంటల తరబడి వేచిచూడాల్సి వస్తుంది. అంతేగాకుండా అక్కడ విధులు నిర్వహిస్తున్న బీఎంసీ సిబ్బందిపై అదనపు పని భారం పడుతోంది. మూడు షిప్టుల్లో పనిచేస్తున్న సిబ్బందికి తగినంత విశ్రాంతి, సమయానికి భోజనం లభించడం లేదు. ముఖ్యంగా హిందు శ్మశాన వాటికలో ఈ సమస్య అధికంగా ఉంది. కరోనా సోకి మృతి చెందుతున్న వారి సంఖ్య ఇలాగే పెరిగిపోతే అన్ని శ్మశాన వాటికలో కట్టెలు లేక ఖాళీ అవడం ఖాయం. ఒకవేళ ఇదే పరిస్ధితి వస్తే భవిష్యత్తులో శవాలకు అంత్యక్రియలు నిర్వహించడం పెద్ద సమస్యగా మారనుంది. -
కరోనా టెర్రర్.. హోలీ పండుగపై నిషేధం
సాక్షి, ముంబై: కరోనా వైరస్ రోజరోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ముంబైలో ఏటా ఎంతో ఘనంగా జరుపుకొనే హోలీ పండుగపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. రాజధానిలో రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ వెల్లడించారు. నగరంలోని భవనాలు, సొసైటీ కాంపౌండ్లలో, చాల్స్ ఆవరణంలో, రోడ్లపై, మైదానాలలో, బహిరంగ ప్రదేశాల్లో హోలీ దహనకాండ కార్యక్రమం నిర్వహించకూడదని చహల్ ఆదేశించారు. నియమాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే జరిమానా, కొద్ది నెలలు జైలు శిక్ష విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. మైదానాలపై నిఘా.. రాష్ట్రంతోపాటు ముంబైలో కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే ప్రధానంగా జనాలు ముఖాలకు మాస్క్ ధరించడం, చేతులు శానిటైజ్‌తో శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం లాంటివి కచ్చితంగా పాటించాలి. అయితే ఈ నెల 28న (ఆదివారం) హోలీ దహనం, మరుసటి రోజు (సోమవారం) రంగులతో ఆడుకునే వేడుక ఉంటుంది. కానీ, ఆదివారం రాత్రి మైదానాలలో, రోడ్లపై, నివాస భవనాలు, సొసైటీ కాంపౌండ్లలో, చాల్స్‌లో జరిగే హోలీ దహన కార్యక్రమానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఒకచోట గుమిగూడతారు. ఆ తరువాత కట్టెలు, పిడకలు, గడ్డితో పేర్చిన హోలీని దహనం చేస్తారు. ఇది కరోనా వైరస్ వ్యాప్తిని మరింత ప్రోత్సహించినట్లవుతుంది. అదేవిధంగా మరుసటి రోజు సోమవారం రంగులు పూసుకోవడం, జల్లుకునే వేడుక ఉంటుంది. చదవండి: (సీఎం సతీమణికి కరోనా పాజిటివ్) దీంతో పిల్లలు, యువతి, యువకులు, పెద్దలు, వృద్ధులు ఇలా వయోబేధం లేకుండా అందరు రంగులు ఆటలు ఆడతారు. ఇది కూడా కరోనా వైరస్‌కు ఆహ్వానం పలికినట్లే అవుతుంది. దీంతో కరోనా వైరస్ మరింత అదుపుతప్పే ప్రమాదం లేకపోలేదు. దీంతో ముంబైకర్లు ఈ సారి హోలి పండుగకు దూరంగా ఉండాలని బీఎంసీ సూచించింది. నివాస సొసైటీలు, చాల్స్, ఖాళీ మైదానలపై నిఘా వేసేందుకు ప్రత్యేకంగా కొందరు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలను నియమించినట్లు చహల్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. అదేవిధంగా సమస్యత్మక ప్రాంతాల్లో పోలీసు గస్తీ ఉంటుందన్నారు. ఇదిలాఉండగా సోమవారం రోజుంతా హోలీ ఆడిన తరువాత సాయంత్రం అనేక మంది స్నానాలు చేయడానికి సముద్ర తీరానికి చేరుకుంటారు. నగరంలో మెరైన్ డ్రైవ్, చర్నిరోడ్, వర్లీ సీ ఫేస్, శివాజీ పార్క్, మాహీం, బాంద్రా, అక్సా బీచ్, జుహూ, గొరాయి బీచ్ తదితర సముద్ర తీరాలవద్ద రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ కూడా బీఎంసీ బృందాలు ప్రత్యేకంగా దృష్టి సారించనున్నాయి. అదే రోజు రాత్రులందు కూడా బార్లు, పబ్‌లపై కూడా నిఘావేస్తారని ఆయన అన్నారు. అయితే హోలీ పండుగను జరుపుకొనేందుకు ముంబై, పుణే, నాగ్‌పూర్, ఔరంగాబాద్ తదితర ప్రధాన నగరాల నుంచి స్వగ్రామాలకు రావొద్దని ఇదివరకే వారి కుటుంబ సభ్యులు సూచించిన విషయం తెలిసిందే. ఇక్కడ కరోనా లేదు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. మీరొచ్చి చెడగొట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా ఎక్కడున్నవారు అక్కడే ఉండాలని స్వగ్రామానికి రావద్దని వారి బంధువులు ఫోన్లో తెలియజేస్తున్నారు. ఒకవేళ కచ్చితంగా స్వగ్రామానికి రావల్సి వస్తే తనకు కరోనా లేదు అని వైద్యుడి నుంచి సర్టిఫికెట్ తీసుకురావాలని గ్రామస్తులు సూచిస్తున్నారు. చదవండి: (ఐటీ రాజధానిలో మొదలైన కరోనా సెకెండ్ వేవ్) అయోమయంలో వ్యాపారులు.. ముంబైలో హోలీ పండుగను నిషేధించడంతో దీనిపై ఆధారపడి బతుకుతున్న వేలాది కుటుంబాలు ఆయోమయంలో పడిపోయాయి. ముంబై శివారు ప్రాంతాల్లో నివాసముండే పేదలు హోలీ పండుగకు ముందే ఎంతో కష్టపడి పిడకలు, గడ్డి మోపులు, కట్టెల రాసులు సిద్దం చేసుకుంటారు. వాటిని ట్రక్కులు, టెంపోలలో ముంబైకి తీసుకొచ్చి విక్రయిస్తారు. ఇలా హోలీ పేదలకు, వ్యాపారులకూ ఉపాధినిస్తుంది. కానీ, హోలీ పండుగను నిషేధించడంతో పేదలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. నిషేధం కారణంగా వాటిని కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రారు. దీంతో పెద్దఎత్తున పిడకలు, గడ్డి, కట్టెలు ముంబై తీసుకొచ్చి విక్రయించాలన్న లేదా తిరిగి తీసుకెళ్లాలంటే రవాణ చార్జీలు వృథా అవుతాయని ఆందోళన చెందుతున్నారు. వాటిని వచ్చే సంవత్సరం వరకు నిల్వ ఉంచాలంటే స్థలం కొరత, ఆ తరువాత వర్షం నుంచి కాపాడటం పెద్ద సమస్యగా మరనుంది. దీంతో వారు ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడిపోయారు. ఇప్పటికే హోలి పండుగపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కరోనా కారణంగా అనేక మంది పేద కుటుంబాలకు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు నాలుగు డబ్బులు సంపాదించుకునే హోలీని కూడా నిషేధించడంతో వారి పరిస్థితి మూలిగే నక్కమీదా తాటికాయ పడ్డ చందంగా మారింది. -
పురుష ఉద్యోగులకు 730 పెయిడ్ లీవులు
సాక్షి, ముంబై: అంగవైకల్య పిల్లల బాగోగులు చూసుకునేందుకు బెస్ట్ సంస్థలో పనిచేస్తున్న పురుష ఉద్యోగులకు 730 రోజులు పేయిడ్ లీవులు ఇవ్వాలనే ప్రతిపాదనకు బీఎంసీ మహాసభలో ఆమోదం లభించింది. మొదటి ఇద్దరు పిల్లలకు, వారికి 22 ఏళ్ల వయసు వచ్చే వరకు ఇది వర్తిస్తుందని బీఎంసీ స్పష్టం చేసింది. దీంతో ఇంటివద్ద తమ వికలాంగ పిల్లల బాగోగులు చూసుకోవలన్నా, ఆస్పత్రిలో చూపించేందుకు వెళ్లాలన్నా పురుషులు తమ సొంత సెలవులు వాడుకునే అవసరం ఉండదని, 730 రోజుల్లోంచి వాడుకోవచ్చని మేయర్ కిశోరీ పేడ్నేకర్ తెలిపారు. వికలాంగులుగా జన్మించిన పిల్లలను సాకడానికి, చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కొందరి ఇళ్లలో తల్లులుగాని, కుటుంబ సభ్యులు, ఇతరులు ఎవరుండరు. దీంతో గత్యంతరం లేక తండ్రులే వారి బాగోగులు చూసుకోవల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులైతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సెలవుపెట్టి ఇంటివద్ద ఉండటం లేదా ఆస్పత్రికి తీసుకెళ్లడం లాంటివి చేయాల్సి వస్తుంది. ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారు పదవీ విరమణ పొందేవరకు లేదా దివ్యాంగ పిల్లలకు 22 ఏళ్ల వయసు వచ్చేవరకు 730 సెలవులు వాడుకునేందుకు అవకాశం కల్పించినట్లు బెస్ట్ సమితి అధ్యక్షుడు ప్రవీణ్ షిండే తెలిపారు. ఈ సెలవులు పొందాలంటే దరఖాస్తుతోపాటు 40 శాతం వికలాంగుడిగా ఉన్నట్లు సర్టిఫికెట్ జోడించాల్సి ఉంటుంది. వికలాంగ పిల్లలు తనపై ఆధారపడి ఉన్నట్లు సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది. చదవండి: ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే. -
ఒక్క రోజులో రూ.48 లక్షలు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నా ప్రజలు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోవడం లేదు. ఈ క్రమంలో మాస్కులు ధరించని వారి నుంచి జరిమానాలు వసూలు చేస్తున్న మార్పు కనిపించడం లేదు. మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై దాడులు ముమ్మరం చేశారు. దీంతో గత గురువారం ఒక్కరోజే జరిమానా రూపంలో రూ.48 లక్షలు వసూలయ్యాయి. ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టిన తనఖీల్లో మాస్కులు లేకుండా తిరుగుతున్న 24,226 మంది నుంచి రూ.48.45 లక్షలు జరిమానా రూపంలో వసూలు చేశారు. మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకునే అధికారం బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ గత వారం నగర పోలీసులకు ఇచ్చారు. దీంతో గురువారం పట్టుబడిన వారిలో 8,674 మందిపై నగర పోలీసులు చర్యలు తీసుకున్నారు. కరోనా కేసులు పెరిగిపోవడాన్ని బీఎంసీ, ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఇటు పోలీసులకు, అటు బీఎంసీ సిబ్బందికి ప్రతీరోజు 20 వేల మందిని పట్టుకోవాలని టార్గెట్ విధించింది. దీంతో నగర పోలీసులు శాంతి, భద్రతలను పరిరక్షిస్తూనే మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై దృష్టి సారిస్తున్నారు. మరోపక్క బీఎంసీ అధికారులు, సిబ్బందితోపాటు క్లీన్ అప్ మార్షల్స్ కూడా బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో మాస్క్ లేకుండా తిరుగుతున్న జనాలు పట్టుబడుతున్నారు. చదవండి: (కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!) 343 రోజులు.. రూ.37.27 కోట్లు.. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారి నుంచే కరోనా వేగంగా వ్యాపిస్తుందని గుర్తించిన బీఎంసీ ఆ మేరకు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా మాస్క్ లేకుండా తిరుగుతున్న వారిపై 2020 ఏప్రిల్ 20వ తేదీ నుంచి చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇప్పటి వరకు మొత్తం 343 రోజుల్లో 18,45,777 మందిపై చర్యలు తీసుకుంది. వీరి నుంచి రూ.37,27,45,600 జరిమానా వసూ లు చేసినట్లు బీఎంసీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా బీఎంసీ సిబ్బంది, క్లీన్ అప్ మార్షల్స్, నగర పోలీసులతో పాటు ముంబై లోకల్ రైల్వే పోలీసులు కూడా చురుగ్గా విధులు నిర్వహిస్తున్నారు. లోకల్ రైళ్లలో మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8,636 మందిని పట్టుకుని వారి నుంచి రూ.17.27 లక్షలు జరిమానా వసూలు చేశారు. నగర పోలీసులు 1,12,226 పట్టుకుని వారి నుంచి రూ.2,12,5,200 వసూలు చేశారు. వర్లీ, పరేల్, దాదర్, మాటుంగా, ధారావీ తదితర ప్రాంతాల్లో మాస్క్ లేకుండా తిరుగుతున్న 3,03,025 మంది నుంచి రూ.6,63,34,400 జరిమానా వసూలు చేశారు. చదవండి: (వారం రోజులు లాక్డౌన్.. తెరచి ఉంచేవివే..) -
లాక్‌డౌన్‌కు ఆరు ప్రత్యామ్నాయాలు!
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లాక్డౌను నివారించేందుకు ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. లాక్‌డౌన్‌న్‌వద్దనుకుంటే కరోనా నిబంధనల్ని కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన హెచ్చరికల నేపథ్యంలో బీఎంసీ ఆరు ప్రత్యామ్నాయాలు సూచించింది. రైళ్లల్లో, కార్యాలయాల్లో, మార్కెట్లల్లో విపరీతమైన జనసందోహం పెరగడం వల్లే కరోనా వేగంగా వ్యాపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. లోకల్ రైళ్లలో పెరిగిన రద్దీ వల్లే కరోనా వ్యాప్తి చెందుతున్నందున వల్ల లోకల్ రైళ్లల్లో రద్దీని తగ్గించడం ఒక్కటే ప్రత్యామ్నాయంగా బీఎంసీ భావిస్తోంది. అయితే సుదీర్ఘ కాలంగా లోకల్ రైళ్లను రద్దు చేయడం వల్ల ఉపాధి కోల్పోయి జనాలు ఎంతో ఇబ్బందిపడ్డారు. ఇప్పుడిప్పుడే లోకల్ రైళ్లు ప్రారంభించడంతో జనం కళ్లల్లో ఆనందం తొంగిచూస్తోంది. ఇప్పుడు మళ్లీ లాక్డౌన్ విధించి లోకల్ రైళ్ల సేవల్ని రద్దు చేయడం అంతగా ఆమోదయోగ్యం కాకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆరు ప్రత్యామ్నాయాలతో ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదన రైల్వే బోర్డుకు పంపించేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు నిర్వహిస్తామని బీఎంసీ ఇక్బాల్‌సింగ్ చహల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 80 శాతం కరోనా రోగుల్లో లక్షణాలేవీ కనిపించకపోవడం ప్రమాదకరంగా మారుతోందని, రాబోయే 15 రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయనీ, ఇప్పట్నుంచే తగిన చర్యలు చేపట్టడం అనివార్యంగా మారిందని ఆయన అన్నారు. మళ్లీ తెరుచుకోనున్న కరోనా కేర్ సెంటర్లు! కరోనా మహమ్మారి ప్రభావం మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కరోనా కేర్ సెంటర్లన్నింటిని మళ్లీ తెరవాలని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చహల్ అదేశాలు జారీచేశారు. దీంతో మరోసారి కరోనా సెంటర్లు తెరుచుకోనున్నాయి. బీఎంసీ ఆధీనంలో ఉన్న కరోనా కేర్ సెంటర్లలో మొత్తం 70,518 పడకలు ఉండగా వాటిలో ప్రస్తుతం కేవలం 13,135 పడకలపై రోగులు చికిత్సను పొందుతున్నారు. 9,757 పడకల్ని రిజర్వ్ చేసి ఉంచారు. కరోనా రోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం వల్ల ఎక్కువ శాతం కరోనా కేర్ సెంటర్లను మూసివేశారు. అయితే ఏడు జంబో కరోనా సెంటర్లను, ప్రతి విభాగంలో ఒకటి చొప్పున స్థానికంగా మొత్తం 24 కరోనా సెంటర్లను మాత్రం మార్చి 31 వరకు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. కాగా, ప్రస్తుతం రోగుల సంఖ్య పెరగడంతో 30 శాతం పడకలు నిండిపోయాయి. దీంతో మూసి వేసిన కరోనా సెంటర్లన్నింటిని మళ్లీ తెరవాలనీ బీఎంసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బాధితుల మెడికల్ రిపోర్టు 24 గంటల్లో కార్పొరేషన్‌కు తెలియచేయడం, రిపోర్టులన్నింటిని సంబంధిత విభాగంలో వెంటనే అప్లోడ్ చేయడం అనివార్యం చేశారు. రోగుల చికిత్సకు కావాల్సిన ఏర్పాట్లన్ని చేసుకోవాలనీ, ఐసీయూ పడకలు, అక్సిజన్ పడకలు, అంబులెన్స్‌లు, సిబ్బందిని, చికిత్సకు సంబంధించిన అన్ని అంశాలను సిద్ధంగా ఉంచాలనీ అన్ని విభాగాల్లోని డిప్యూటీ కమిషనర్లకు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ ఆదేశాలు జారీ చేశారు. కరోనా సోకినవారిని, కరోనా లక్షణాలు కనిపించిన వారిని హాస్పిటల్లో చేర్పించే బాధ్యత ఆయా వార్డుల్లోని ‘వార్డ్ వార్ రూమ్’ కే అప్పగించారు. ఎప్పటికప్పుడు ఆయా ఆసుపత్రిలోని పడకల లభ్యత, రోగుల వివరాలు వార్డ్‌వార్ రూమ్‌లో అందుబాటులో ఉండేలా బీఎంసీ ఆరోగ్యశాఖ అధికారాలు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎంసీ ప్రత్యామ్నాయాలు.. ఒకటి: అత్యవసరంగా పనికి వెళ్లే వారినే లోకల్ రైళ్లలో ప్రయాణం చేసేందుకు అనుమతించాలి. రెండు: వర్క్ ఫ్రం హోమ్‌ను ప్రోత్సహించాలి, మూడు: ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసు సిబ్బంది సంఖ్యను 15 రోజులకు 50 శాతం తగ్గించాలి. నాలుగు: లోకల్ రైళ్ల టికెట్ బుకింగ్ కౌంటర్లను మూసివేయాలి. ఆన్లైన్ టికెట్ బుకింగ్‌లను కొనసాగించి. నెలవారీ పాసులు జారీ చేయడాన్ని నిషేధించాలి. ఐదు: షాపుల పని వేళల్లో మార్పులు చేయాలి. సరి బేసి తేదీల ప్రకారం దుకాణాలు తెరిచి ఉంచాలి. ఆరు: వసై–విరార్, కల్యాణ్–డోంబివిలి, అంబర్నాథ్, బద్లాపూర్, కసారా, కర్జత్, పాల్ఘర్, నవీముంబై నుంచి ముంబై వరకు స్టేట్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్ని ఎక్కువ సంఖ్యలో నడిపించి లోకల్ రైళ్ల భారాన్ని తగ్గించాలి. -
త్వరలో ముంబై కరోనా రహితం!
సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు 2020 మార్చి నుంచి బీఎంసీ చేస్తున్న పోరాటం, కృషి సత్ఫలితాలనిచ్చినట్లు తెలుస్తోంది. కరోనా రోగుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టడంతో త్వరలో ముంబై కరోనా రహిత నగరంగా మారడం ఖయమని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ముంబైలో కరోనా బాధితుల సంఖ్య 5,797 ఉన్నప్పటికీ అందులో 5,504 అంటే 95 శాతం మంది ఆరోగ్యం మెరుగ్గా ఉంది. అదేవిధంగా ఎమర్జెన్సీ ఉన్న 593 మంది రోగుల్లో 300 మందికి వ్యాధి తగ్గిపోయి ఈ సంఖ్య 293కు చేరింది. దీన్ని బట్టి త్వరలో ముంబై కరోనా రహిత నగరంగా మారే అవకాశముందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక రోజుకు ముంబై మహానగరంలో 500 లోపే కరోనా కేసులు వస్తున్నాయి. ధారావిలో కట్టడి.. 2020 మార్చిలో కరోనా వైరస్ విస్తరించడం ప్రారంభం కాగానే చూస్తుండగానే ఆ వ్యాధి ముంబైని చుట్టుముట్టుంది. మురికివాడలు, ఇరుకు సందులు, రద్దీ కారణంగా కొద్ది రోజుల్లోనే అనేక ప్రాంతాలు కరోనాకు హాట్‌స్పాట్‌గా మారాయి. రోజురోజుకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న వారిలో పాజిటివ్ వస్తున్న రోగుల సంఖ్య పెరిగిపోసాగింది. ఇలా రోజుకు 2,500పైగా పాజిటివ్ రోగులు నమోదు అవుతున్నారు. దీన్ని నివారించేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ‘మాజే కుటుంబ్–మాజీ జబాబ్దారి’ (నా కుటుంబం–నాదే బాధ్యత) అనే పథకాన్ని ప్రారంభించారు. ఇందులో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరుగుతూ కరోనా వైరస్‌పై తీసుకోల్సిన జాగ్రత్తలు, జనజాగృతి, సేకరించిన స్వాబ్ నమూనాలు ల్యాబ్‌కు పంపించడం లాంటివి చేపట్టారు. అదేవిధంగా ‘మిషన్ జీరో అభియాన్’ లో డాక్టర్లు నేరుగా కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు చేపట్టిన ప్రత్యామ్నాయ మార్గాలు మంచి ఫలితాలనిచ్చాయి. దీంతో కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి రావడం మొదలైంది. ప్రారంభంలో సేకరించిన స్వాబ్ నమూనాలలో పాజిటీవ్ వచ్చే వారి శాతం 30–35 ఉండేది. ఇప్పుడు 4–6 శాతానికి పడిపోయింది. అయితే ముంబైలో ఇప్పటి వరకు 28,15,467 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 10.97 శాతమే పాజిటివ్ వచ్చింది. ముంబైలో ప్రస్తుతం 5,797 కరోనా పాజిటివ్ రోగులున్నారు. అందులో 3,881 మందికి పాజిటివ్ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు లేవు. అలాగే 1,623 మందికి స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ వారి ఆరోగ్యానికి ఎలాంటి హానీ లేదు. ముంబైలో ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు మొత్తం 3,08,969 కరోనా పాజిటివ్ రోగులున్నట్లు గుర్తించారు. అందులో 2,90,913 మంది కరోనాను జయించగా 11,351 మంది మృత్యువాత పడ్డారు. -
విషాదం : ముంబైలో సిలిండర్ పేలుడు
ముంబై : ముంబైలోని లాల్బాగ్ ఏరియాలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల మంటలు సంభవించినట్లుగా అనుమానిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగిన స్థలంలో చెలరేగుతున్న మంటలను ఆర్పడానికి రెండు అగ్నిమాపక దళాలతో పాటు రెండు జంబో ట్యాంకర్లను పంపించినట్లు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. -
ఇది కంగనాకు అనవసర ప్రచారం: పవార్
ముంబై: ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) కూల్చివేత చర్య ఆమెకు అనవసరమైన ప్రచారాన్ని ఇచ్చిందని నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మీడియా కవరేజీపై తనకు అభ్యంతరం ఉందన్నారు. అనవసరమైన విషయాన్ని మీడియా పెద్దది చేసి చూపించిందని, ఇలాంటి వాటిని విస్మరించాలని ఆయన ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో పేర్కొన్నారు. బృహన్ ముంబై మున్నిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిబంధనల ప్రకారమే నటి భవనాన్ని కూల్చివేసిందన్నారు. అయితే ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశంగా వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక ముంబైలో అక్రమ కట్టడాలు కొత్త విషయం కాదని, కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నటి కార్యాలయం కూల్చివేత పలు సందేహలకు దారి తీసిందని పవార్ పేర్కొన్నారు. (చదవండి: కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ) అయితే కంగనాకు, శివసేనకు మధ్య జరుగుతున్న మాటల యుధ్దంలో భాగంగా ఆమె భవనం కూల్చివేసినట్లుగా ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. అంతేగాక దీనిపై బీఎంసీ కంగనాకు తగినంత సమయం ఇచ్చిందా లేదనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. కంగనా ముంబైలో నెలల తరబడి ఉంటుందని, ఇంతకు ముందు ఎందుకు ఈ చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలను ప్రతిఒక్కరిలో వెలువడుత్నన్నాయి. దీంతో శివసేనకు కంగనా మధ్య నెలకొన్న వివాదంలో భాగంగానే ఆమె కార్యాలయాన్ని కూల్చివేశారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇవాళ ఉదయం బాద్రాలోని కంగనా కార్యాలయాన్ని బీఎంసీ కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఇది అక్రమ నిర్మాణంలో భాగమని అందువల్లే కూల్చివేస్తున్నట్లు బీఎంసీ వెల్లడించింది. దీనిపై ఆమె ముంబై హైకోర్టుకు వెళ్లగా, కూల్చివేతపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. (చదవండి: ముంబైలో అడుగుపెట్టిన కంగనా)