హీరోయిన్‌ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌ | Sara Ali Khan's Driver Tests COVID-19 Positive | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులు, ఇతర సిబ్బందికి నెగిటివ్‌

Published Tue, Jul 14 2020 10:53 AM | Last Updated on Tue, Jul 14 2020 11:48 AM

Sara Ali Khan's Driver Tests COVID-19 Positive - Sakshi

బాలీవుడ్‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే అమితాబ్‌ బచ్చ‌న్ కుటుంబంలో న‌లుగురికి క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. అంతేకాకుండా ప్ర‌ముఖ న‌టుడు అనుప‌మ్ ఖేర్ మిన‌హా మిగ‌తా కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా క‌రోనా సోకిన‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. తాజాగా ఈ జాబితాలోకి యువ హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌ చేరారు. తన డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. తనతో పాటు మిగతా కుటుంబసభ్యులకు, ఇతర సిబ్బందికి కూడా టెస్టులు జరిగాయని.. అందరికి నెగిటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా సారా ఓ ప్రకటన విడుదల చేశారు. (‘ఆ హీరోయిన్‌ చాలా ఓవర్‌ చేసింది’)
 

🙏🏻🙏🏻🙏🏻

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

‘మా డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. బీఎంసీ దీని గురించి వెంటనే అప్రమత్తమై అతడిని క్వారంటైన్‌కు తరలించింది. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, ఇతర సిబ్బందికి కరోనా నెగిటివ్‌గా తేలింది. మేమంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. నాతోపాటు నా కుటుంబ సభ్యులందరి తరఫునా బీఎంసీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీరు కూడా జాగ్రత్తగా ఉండడి’ అంటూ సారా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు. బిగ్‌బి, అభిషేక్‌లకు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం తెలిసిందే. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరిన వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, వారికి పెద్దగా కరోనా చికిత్స అందించాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. (విలన్‌ కరోనా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement