ఫాస్టాగ్‌తో సాఫీగా.. | FASTag Comes Into Force Today | Sakshi
Sakshi News home page

ఫాస్టాగ్‌తో సాఫీగా..

Published Mon, Dec 16 2019 12:52 AM | Last Updated on Mon, Dec 16 2019 4:32 AM

FASTag Comes Into Force Today - Sakshi

బీబీనగర్‌ టోల్‌ప్లాజా వద్ద ‘క్యాష్‌’ గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోగా, ‘ఫాస్టాగ్‌’ గేట్ల వద్ద ఇలా ఖాళీగా కనిపించింది. ఆదివారం నుంచి ఫాస్టాగ్‌ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

సాక్షి, నెట్‌వర్క్‌: టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ తెరదించేందుకు ఉద్దేశించిన ‘ఫాస్టాగ్‌’ విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్‌గేట్ల వద్ద ఈ ఫాస్టాగ్‌ అతికించిన వాహనాలు వేగంగా ముందుకు వెళ్లాయి. అయితే ప్రతీ వాహనానికి గేటు ఎత్తి పంపాల్సి రావడంతో కాస్త జాప్యం జరిగింది. అయినా అది పెద్ద సమస్యగా మారలేదు. ఫాస్టాగ్‌ లేని వాహనదారులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావటం తో వాహనాలు భారీ క్యూకట్టాయి. దీంతో వాహనాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత రెండు నెలలుగా ఎన్‌హెచ్‌ఏఐ ఈ ట్యాగ్‌ల విషయమై ముమ్మరంగా ప్రచారం చేసినా, ఎక్కువ మంది పట్టించుకోలేదు. అలా ట్యాగ్‌ లేకుండా జాతీయ రహదారులెక్కిన వాహనదారులకు టోల్‌ప్లాజాలు చుక్కలు చూపించాయి. 

పండుగ సమయాల్లోలా రద్దీ..
పండుగల సమయంలో టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయినట్లు ఆదివారం కూడా భారీ రద్దీ ఏర్పడింది. తొలుత ఫాస్టాగ్‌ లేని వాహనాల కోసం ఒకే లైన్‌ కేటాయించాలని భావించినా.. ఆ తర్వాత 25 శాతం గేట్లు కేటాయించారు. మూడొంతుల గేట్లు ఫాస్టాగ్‌ వాహనాలకే వది లారు. ఇదే సమస్యకు కారణమైంది. ఎక్కువ వాహనాలకు ట్యాగ్‌ లేకపోవటం, వాటికి తక్కువ లైన్లు కేటాయించడంతో క్యూ కట్టాల్సి వచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి..
హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై  పంతంగి, కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజాలతో పాటు హైదరాబాద్‌– వరంగల్‌ జాతీయ రహదారిలో గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచే వాహనాల రద్దీ నెలకొంది. టోల్‌ దాటేందుకు ఒక్కో వాహనదారుడు గంటకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది.  మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారిపై శాఖాపూర్‌ టోల్‌ప్లాజా వద్ద వందల సంఖ్యలో వాహనాలు బార్లు తీరాయి.
 
భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద బారులుదీరిన వాహనాలు
రెట్టింపు రుసుము..
టోల్‌ప్లాజాకు కిలోమీటరు దూరంలో ప్రత్యేక సిబ్బందిని నియమించి ఫాస్టాగ్‌ ఉన్న వాహనాలను సంబంధిత లైన్లలోకి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని సాధారణ వాహనాలూ అయోమయంలో ఫాస్టాగ్‌ లైన్లలోకి ప్రవేశిం చాయి. ట్యాగ్‌ లేకుండా ఆ వరుసలోకి వస్తే రెట్టిం పు రుసుము చెల్లించాలనే నిబంధనతో పలువురు వాహనదారులు పెనాల్టీ చెల్లించాల్సి వచ్చింది.

మాల్స్‌లో విక్రయం..!
ప్రస్తుతం బ్యాంకులు, టోల్‌ప్లాజాలు, ఆర్టీసీ కార్యాలయాలు, ఆన్‌లైన్‌లో ఫాస్టాగ్‌ పొందే వెసులుబాటు ఉంది. ఆదివారం రద్దీ నేపథ్యంలో వాహనదారులు వాటిని కొనేందుకు పోటీపడే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు.. షాపింగ్‌ మాల్స్‌ లోనూ విక్రయ కేంద్రాలు తెరవాలని భావిస్తున్నా రు. కాగా, రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ విధానాన్ని జనవరి ఒకటి నుంచి అమల్లోకి తేనున్నారు. హైదరాబాద్‌–రామగుండం రాజీవ్‌ రహదారిపై మూడు చోట్ల, అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి ఒక చోట టోల్‌ ప్లాజాలున్నాయి. 

అప్పటికప్పుడే కొనుగోలు..
ఫాస్టాగ్‌ లేని వాహనాలు టోల్‌ వద్ద క్యూలలో నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఎన్‌హెచ్‌ఏఐ కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారాన్ని చాలామంది పట్టించుకోలేదు. దీని ప్రభావం ఆదివారం స్పష్టం గా కనిపించింది. ఇన్ని రోజులు ఫాస్టాగ్‌ తీసుకోని వారు వాహనాల లైన్లు చూసి అప్పటికప్పుడు ట్యాగ్‌లు కొన్నారు. అన్ని టోల్‌ ప్లాజాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి అధికారులు వాటిని విక్రయిం చారు. సాధారణ రోజుల్లో సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల ట్యాగ్‌లు అమ్ముడవుతుండగా ఆ సంఖ్య ఆదివారం రెట్టింపైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 60 వేల ట్యాగ్‌లు విక్రయమైనట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయాధికారి కృష్ణప్రసాద్‌ వెల్లడించారు.

ఫాస్టాగ్‌ అంటే..
ఫాస్టాగ్‌ విధానంలో వాహనం టోల్‌గేటు వద్ద బారులు తీరే అవసరం ఉండదు. కీలకమైన ‘ఫాస్టాగ్‌’పేరుతో ఉండే ట్యాగ్‌ల ను వాహనాల ముందు అద్దానికి అతికించుకోవాలి. టోల్‌గేట్‌పై ఉండే సెన్సార్లు.. గేటు ముందుకు రాగానే ట్యాగ్‌లోని చిప్‌ నుంచి కావాల్సిన టోల్‌ రుసుమును మినహాయించుకుంటాయి. ఆ వెంటనే గేట్‌ తెరుచుకుం టుంది. ఒక్కో వాహనం నుంచి టోల్‌ రుసు ము మినహాయించుకునేందుకు 6 సెకన్ల సమయమే పడుతుంది. దీంతో వాహనదారుల సమయం ఆదా అవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement