నర్సీపట్నంలో జ్యూయలర్ షాపులో రికార్డులను పరిశీలిస్తున్న ఐటీ అధికారులు
విశాఖపట్నం, నర్సీపట్నం, పాయకరావుపేట: నర్సీపట్నం, పాయకరావుపేటల్లో సోమవారం ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నర్సీపట్నంలోని సౌత్‌సెంట్రల్ షాపింగ్‌మాల్, జ్యూయలర్స్‌పై దాడులు జరిపారు. రూరల్ జిల్లాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నర్సీపట్నంలో ఇటీవల వస్త్ర, బంగారు షాపులు అధిక సంఖ్యలో వెలిశాయి. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన సౌత్‌సెంట్రల్ షాపింగ్‌మాల్, నాయుడు, శాంతిసాయి జ్యూలయర్స్‌పై ఆదాయ పన్నుశాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సెంట్రల్‌మాల్‌ను మూసివేసి లోపల అధికారులు తనిఖీలు జరిపారు. పాయకరావుపేట పట్టణంలో ఉన్న సౌత్ సెంట్రల్ షాపింగ్‌మాల్‌లో కూడా ఆదాయ పన్ను శాఖ అ«ధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం రెండుగంటలకు ప్రారంభమైన ఈ దాడులు సాయంత్రం వరకు కొనసాగాయి. యాజమాన్యం సమక్షంలోనే అధికారులు షాపింగ్‌మాల్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాపింగ్‌మాల్ తలుపులు మూసి వేశారు.ఈ మాల్‌లో వస్త్రవ్యాపారంతో పాటు, బంగారం వ్యాపారం కూడా జరుగుతోంది. ఐటీ అధికారుల దాడులతో ఈ రెండు పట్టణాల వ్యాపారుల్లో కలవరం మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment