వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం సోమవారం నర్సిపట్నంలో జరిగింది.
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం సోమవారం నర్సిపట్నంలో జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టీడీపీ నేరవేర్చని హామీలు, తుపాను సాయం అందించడంలో ప్రభుత్వ వైఫల్యంపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. ఈనెల 5న నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాలకు సిద్దంగా ఉండాలని కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ నాయకులు పిలుపునిచ్చారు.