విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు 1600 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు.
నర్సీపట్నం : విశాఖ జిల్లా నర్సీపట్నం ఎక్సైజ్ పోలీసులు 1600 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ స్టేషన్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టగా.. ఐచర్ లారీలో తరలిస్తున్న 40 బస్తాల గంజాయి (1600 కిలోలు) రవాణా వెలుగు చూసింది. సరుకును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని చింతపల్లి నుంచి తుని రైల్వే స్టేషన్‌కు తరలిస్తున్నట్టు తెలిసింది.