సాక్షి, విశాఖపట్నం : టీడీపీ, జనసేన వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒకే లక్ష్యంతో పని చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలను నిజం చేసే సంఘటన ఒకటి ఈ రోజు చోటు చేసుకుంది. నర్సీపట్నం జనసేన రెబల్ అభ్యర్థి బైపీ రెడ్డి అశోక్ గురువారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అశోక్ బరిలో ఉంటే టీడీపీ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. అందుకే ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారని సమాచారం. మరోవైపు జనసేన అభ్యర్థి వేగి దివాకర్ నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment