
స్వాధీనం చేసుకున్న మౌస్ డీర్
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా): నర్సీపట్నం అటవీ రేంజ్ పరిధిలోని రోలుగుంట మండలం లోసింగిలో మౌస్ డీర్ (బుల్లి జింక)ను అటవీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వయసు కలిగిన వింత ప్రాణితో లోసింగి గ్రామంలో చిన్నారులు ఆడుకుంటుండగా జాన్ అనే వ్యక్తి గమనించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు.
నర్సీపట్నం రేంజర్ లక్ష్మీనర్సు, సిబ్బందితో లోసింగి గ్రామం వెళ్లి పిల్లల దగ్గర ఉన్న మౌస్ డీర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మౌస్ డీర్‌ను డీఎఫ్‌వో సూర్యనారాయణ పరిశీలించి, ఇది అరుదైన ప్రాణి అని చెప్పారు. అటవీ అధికారుల సంరక్షణలో జాగ్రత్తగా ఉంచారు. ఆదివారం విశాఖ జూకు అప్పగిస్తున్నట్లు రేంజర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment