
సాక్షి, నర్సీపట్నం: మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆదివారం పర్యటించారు. ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యకర్తలు,అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట వైసీపీ నేత కోనేటి రామకృష్ణ, కార్యకర్తలు ఉన్నారు.
మత్స్యకార గ్రామాల్లో ఎమ్మెల్యే గొల్లబాబురావు పర్యటన:
పాయకరావుపేట: మండలంలో మత్స్యకార గ్రామాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు పర్యటించారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. మత్స్యకారులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన వెంట వైసీపీ నేతలు చిక్కాల రామారావు, బాబురావు, సాయిబాబా ఉన్నారు.