
సాక్షి, అనకాపల్లి జిల్లా: నర్సీపట్నం ఇసుక డిపోలో రూ.5 కోట్ల విలువైన ఇసుక తరలించేందుకు టీడీపీ నేతలు ప్లాన్ వేశారని.. ఉచిత ఇసుక అంటూ ప్రజల్ని టీడీపీ మోసం చేస్తోందంటూ నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ మండిపడ్డారు.
టన్నుకు కేవలం రూ.175 తగ్గించి ఉచిత ఇసుక అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమ్తెతారు. మా ప్రభుత్వంలో మంజూరు చేసిన ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇచ్చామని ఉమాశంకర్ అన్నారు. డిపోకి వచ్చిన, అమ్మిన ఇసుక వివరాలు వెల్లడించాలని అధికారులను ఉమా శంకర్ గణేష్ కోరారు.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని టీడీపీ సర్కారు చెబుతున్న మాటలు మాయ నాటకాలని తేలిపోయింది! ఉచిత ఇసుక విధానాన్ని సోమవారం నుంచి అమల్లోకి తెస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించినా స్టాక్ యార్డుల వద్ద మాత్రం ధరల పట్టికలు పెట్టడంతో వినియోగదారులు అవాక్కయ్యారు. కూటమి మేనిఫెస్టోలో ప్రకటించిన ఉచిత ఇసుక హామీకి స్టాక్ యార్డుల వద్ద పెట్టిన ధరల పట్టికలతో సీఎం చంద్రబాబు తూట్లు పొడిచారు.

Comments
Please login to add a commentAdd a comment