నర్సీపట్నం మండలం పెదబోడ్డేపల్లి సమీపంలో పోలీసులు శనివారం అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు నిర్వహించారు.
విశాఖపట్నం : నర్సీపట్నం మండలం పెదబోడ్డేపల్లి సమీపంలో పోలీసులు శనివారం అర్ధరాత్రి ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 800 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే పోలీసులను చూసి కారు డ్రైవర్ పరారైయ్యాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 80 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.