
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం కృష్ణబజార్ సెంటర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబికా జ్యూవెల్లర్స్‌లో భవనంలో షార్ట్ సర్య్కూట్ కారణంగా ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
కాగా, అంబికా జ్యూవెల్లర్స్‌లో పై అంతస్తులో షాపు ఓనర్స్ మల్లేశ్వరరావు ఫ్యామిలీ నివాసం ఉంటోంది. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగా భవనంలో మంటలు చెలరేగడంతో మల్లేశ్వరారావు, ఆయన కుమారుడు మౌలేష్ అక్కడే సజీవ దహనమయ్యారు. మిగిలిన ఇద్దరు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక, పాత భవనం కావడంతో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment