వంద పడకల ఆస్పత్రిలో ఆరుగురే వైద్యులు
ఏజెన్సీ, మైదాన ప్రాంతాలకు పెద్దదిక్కుగా ఉన్న ఏరియా ఆసుపత్రిని వైద్యుల కొరత వెంటాడుతోంది.
నర్సీపట్నం (విశాఖపట్నం) : ఏజెన్సీ, మైదాన ప్రాంతాలకు పెద్దదిక్కుగా ఉన్న ఏరియా ఆసుపత్రిని వైద్యుల కొరత వెంటాడుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందక అవస్థలు పడుతున్నారు. ప్రధాన విభాగాలకు సంబం«ధించిన వైద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో చిన్నపాటి రోగానికి సైతం కేజీహెచ్‌కు రిఫర్ చేస్తున్నారు.
వంద పండకలైనా..
పేరుకు వంద పడకల ఆస్ప‘తి అయినప్పటికీ అవసరమైన మేర వైద్యులను నియమించడంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్న వైద్యులను సైతం ఇటీవల బదిలీ చేశారు. ఖాళీల భర్తీ విషయంలో ప్రత్యామ్నాయం ఆలోచించకపోవడం వల్ల వైద్యుల కొరత ఏర్పడింది. ఏరియా ఆసుపత్రిని మానస పుత్రికగా చెప్పుకునే రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు సైతం వైద్యాధికారుల పోస్టుల భర్తీపై దష్టి సారించడం లేదన్న విమర్శలున్నాయి.
ప్రథమస్థానంలో ఉన్నా..
నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి వైద్య సేవలు అందించడంలో రాష్ట్రంలో ప్రథమస్థానంలో ఉండేది. అటువంటి ఆసుపత్రిని వైద్యుల కొరత వెంటాడుతోంది. పది మండలాల నుంచి రోజుకు వందల సంఖ్యలో రోగులు నిత్యం ఆస్పత్రికి వస్తుంటారు. వైద్యుల కొరత కారణంగా వైద్యసేవలు అందక చాలా మంది రోగులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. వంద పడకల స్థాయికి సరిపడా వైద్యులు లేరు. రేపోమాపో 150 పడకల వరకు స్థాయికి పెరగనుంది. ఇదే పరిస్థితి కొనసాగితే రూ.కోట్ల వెచ్చించిన పడకలు సైతం నిరుపయోగంగా మారనున్నాయి. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
సమస్యలు పట్టని కమిటీ
పరిసర ప్రాంతాల నుంచి చిన్నపిల్లలు, జనరల్ వ్యాధులతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. చిన్నపిల్లల, జనరల్ ఫిజిషియన్ వైద్యులను నియమించకపోవడంతో రోగులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి అయ్యన్నపాత్రుడే ఆసుపత్రి అభివద్ధి కమిటీ చైర్మన్‌గా ఉండేవారు. ప్రతి మూడు నెలలకు సమావేశం ఏర్పాటు చేసి ఆసుపత్రిని సమీక్షించేవారు. మంత్రికి పనిఒత్తిడి అధికం కావడంతో ఇటీవల ఆసుపత్రి ఆభివద్ధి కమిటీ బాధ్యతలను పట్టణానికి చెందిన సీనియర్ వైద్యాధికారి సుశీలకు అప్పగించారు. కొత్త కమిటీ బాధ్యతలు చేపట్టి సుమారు ఏడాది కావస్తున్నా పర్యవేక్షణ గాలికి వదిలేశారన్న పలువురు విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మంత్రి అయ్యన్నపాత్రుడు దష్టిసారిస్తే తప్ప వైద్యుల నియామకం జరగని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని పది మండలాల ప్రజలు కోరుతున్నారు.