
సాక్షి, విశాఖపట్నం: అయ్యన్న వ్యాఖ్యలపై నర్సీపట్నంలో వైఎస్సార్‌సీపీ నిరసన తెలిపింది. అయ్యన్న తీరును నిరసిస్తూ అబిద్ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ ఆందోళన నిర్వహించింది. చంద్రబాబు, అయ్యన్న దిష్టిబొమ్మలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దహనం చేశారు. అయ్యన్న పాత్రుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ వైఎస్సార్‌సీపీ నిరసన వ్యక్తం చేసింది. అయ్యన్నపై ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ, ‘‘సీఎంపై అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు హేయమన్నారు. గత ప్రభుత్వంలో అయ్యన్న భూ దోపిడీకి పాల్పడ్డాడు. అయ్యన్న తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని’’ ఉమాశంకర్ గణేష్ అన్నారు.
చదవండి:
మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు: హోంమంత్రి సుచరిత
‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’