మావోల కలకలం: ప్రత్యేక బలగాలతో జల్లెడ
Published Tue, Mar 21 2017 12:59 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట‍్నం పట్టణంలోకి మావోయిస్టులు ప్రవేశించారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఏఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి ప్రత్యేక బలగాలతో జల్లెడ పట్టారు. ఏజెన్సీ ముఖద్వారం కావడంతో ఏజెన్సీ ప్రాంతాల నుండి వందలాది మంది గిరిజనులు నర్సీపట్నం వస్తుంటారు. ఏజెన్సీ నుండి గంజాయి రవాణా కూడా నర్సీపట్నం మీదుగా జరుగుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.
సీఐ చౌదరి ప్రత్యేక బలగాలతో కెఎన్‌ఆర్. లాడ్జీ, వెంకటాద్రిలాడ్జి, కృష్ణాఫేలస్, ఫాలీమర్, సాయి రెసిడెన్సీ వూడా రెసిడెన్సీ, ఫణీచంద్రలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా లాడ్జీల్లో ఉన్న కొంత మందిని విచారించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి సీఐ విచారిస్తున్నారు. ఈ దాడుల్లో పట్టణ ఎస్సై అప్పన్న, దామోదర్ నాయుడు, స్పెషల్ పార్టీ పోలీసులు ఉన్నారు.
Advertisement