manukota
-
మానుకోటకు పీఓహెచ్ వచ్చేనా?
సాక్షి, మహబూబాబాద్: రైళ్ల నిర్వహణలో అత్యంత కీలకమైనవాటిలో ఒకటి పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్). రైళ్లలో ఏర్పడే సమస్యలను పరిష్కరించేందుకు, పాడైపోయిన పరికరాలను మార్చేందుకు ఈ షెడ్లు ఉపయోగపడతాయి. భారతీయ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటైనప్పటికీ, పీఓహెచ్లు దేశంలో ఆరు మాత్రమే ఉన్నాయి. భూస్వాల్, కంచరపార, చార్బాగ్, పెరంబూర్, ఖరగ్‌పూర్, దాహోడ్‌లో మాత్ర మే వీటిని ఏర్పాటుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్క్ భారీగానే ఉన్నప్పటికీ.. ఇక్కడ ఇప్పటివరకు పీఓహెచ్ను ఏర్పాటుచేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య లో ఉన్న మహబూబాబాద్ (మానుకోట) వద్ద పీఓహెచ్ ఏర్పాటుచేయాలని గతంలో భావించినా అది అందుబాటులోకి రాలేదు. ఇప్పటికైనా ఇక్కడ పీఓహెచ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అర్హత ఉన్నా..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధి కలిగిన దక్షిణ మధ్య రైల్వేలో పూర్తిస్థాయి లోకోమోటివ్ (రైలు ఇంజిన్) ఓవర్ హాలింగ్ షెడ్లు ఇప్పటివరకు లేవు. పీఓహెచ్ ఏర్పాటుచేయాలంటే జోన్ పరిధిలో కనీసం 800 లోకోలు ఉండాలి. కానీ దక్షిణ మధ్య రైల్వేలో 1,100లకు పైగా లోకోలు ఉన్నప్పటికీ పీఓహెచ్ లేదు. రైలు ప్రారంభమైన తరువాత గమ్యస్థానం చేరేలోపు తలెత్తే చిన్నచిన్న మరమ్మతులు పీఓహెచ్లో ఆలస్యం కాకుండా పూర్తిచేసే వీలుంటుంది. ఇక్కడ లోకోమోటివ్ల క్యామ్‌లా షాఫ్ట్‌లు, క్రాంక్ షాఫ్ట్‌లను శుభ్రం చేస్తారు. వాటిని పరీక్షించి కాలం చెల్లిన వాటిని తొలగించి, కొత్తవి అమరుస్తారు.పిష్టిన్లు, కనెక్టింగ్ రాడ్లు, సిలిండర్ హెడ్లను శుభ్రం చేసి దెబ్బతిన్నవాటి స్థానంలో కొత్తవి ఏర్పాటుచేస్తారు. నీరు సరఫరా అయ్యే మార్గాలను పరీక్షించి పగుళ్లను గుర్తిస్తారు. వాల్్వలకు ఎప్పటికప్పుడు మరమ్మతు చేస్తారు. లోకో సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. రోటర్ బ్యాలెన్సింగ్, కొత్త ఆయిల్ సీల్స్, సీలెంట్ గాస్కెట్లు, ఫౌండేషన్ బోల్ట్‌ను అమరుస్తారు. ఇంతటి కీలకమైన పీఓహెచ్ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో లేకపోవటంతో రైళ్లలో తలెత్తే చిన్నచిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయని అధికారులు అంటున్నారు. అనువైన ప్రదేశంగా మానుకోటపీఓహెచ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా మహబూబాబాద్ ప్రాంతాన్ని రైల్వే అధికారులు గుర్తించినట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వేలో సెంట్రల్ పాయింట్‌గా ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. చెన్నై నుంచి న్యూఢిల్లీ, భువనేశ్వర్ నుంచి ముంబైని కలిపే ప్రధాన రైలు మార్గం ఈ ప్రాంతంలో ఉంది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా.. ఇక్కడి పీఓహెచ్ సేవలు వినియోగించుకోవచ్చు. మహబూబాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డు సమీపంలో ఉన్న 865 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ షెడ్ నిర్మాణానికి అనువైనదిగా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇక్కడ వర్క్‌షాప్ నిర్మిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పీఓహెచ్ కోసం గతంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు భూములను పరిశీలించారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ మధ్యలోనే వదిలేశారు. రైల్వే మంత్రికి విన్నవించాం మహబూబాబాద్ పట్టణ సమీపంలో రైల్వే పీఓహెచ్ ఏర్పాటు చేయాలని గతంలో కేంద్ర మంత్రులకు విన్నవించాం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులతో కలిసి రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశాం. గతంలోనే ప్రకటించిన బడ్జెట్ ఇవ్వడంతోపాటు, మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరాం. పోరిక బలరాం నాయక్, ఎంపీ విభజన చట్టం హామీ నెరవేరుతుంది తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం. మానుకోటలో పీఓహెచ్ షెడ్ నిర్మిస్తే ఈ ప్రాంతం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ జిల్లా ప్రజల జీవన ప్రమానాలు మెరుగుపడతాయి. పీఓహెచ్ షెడ్ ఏర్పాటు కోసం ఎంపీ, ఇతర నాయకులు గట్టిగా ప్రయత్నించాలి. అవసరమైతే పారీ్టలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు మేం సిద్ధం. – తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్సీప్రజాప్రతినిధులు గట్టిగా పోరాడాలి పదివేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించే రైల్వే పీఓహెచ్ షెడ్‌ను జిల్లాలో నిర్మించాలి. ఇందుకోసం స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కృషి చేయాలి. – యాళ్ల మురళీధర్ రెడ్డి, యువజన నాయకులు -
KTR: మోదీతోనే ఆందోళన చేసి సాధించుకున్నారు..
-
కేటీఆర్ ఫ్లెక్సీలను చించేసిన గుర్తుతెలియని వ్యక్తులు
-
అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని
మహబూబాబాద్ రూరల్: అంగన్వాడీ టీచర్‌పై స్థానికులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె రాజీనామా కోరుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలంలోని ఇస్లావత్‌తండా గ్రామపరిధిలోని తేజావత్తండాలో చోటుచేసుకుంది. కురవి ఎస్సై బి.రాణాప్రతాప్ వివరాల ప్రకారం.. ఆ గ్రామంలోని అంగన్వాడీ టీచర్ కమల. అంగన్వాడీ కేంద్రం నిర్వహణ విషయంలో కొంతకాలంగా టీచర్‌కు, స్థానికులకు మధ్య వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయి. అవికాస్త పెరిగి సోమవారం రాత్రి ఘర్షణకు దారితీశాయి. స్థానికుల దాడిలో కమల గాయపడింది. పుస్తెలతాడు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారని బాధితురాలు వాపోయింది. దుస్తులు చింపేసి దాడికి పాల్పడ్డారు. స్థానిక సర్పంచ్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారని.. అందుకు అంగీకరించకపోవడంతో దాడి చేశారని ఆరోపించింది. దాడి అనంతరం కురవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై రాణా ప్రతాప్ తెలిపారు. ఉద్యోగానికి రాజీనామాచేయాలంటూ డిమాండ్ చేశారు. -
మానుకోటలో మర్డర్ కలకలం
సాక్షి, మహబూబాబాద్ రూరల్: మానుకోటలో మర్డర్ కలకలం రేపింది. మండలంలోని రేగడితండా గ్రామ శివారులో గల బీడు భూమిలో ఓ యువకుడు శనివారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. అతడిని గుర్తు తెలియని దుండగులు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు. డీఎస్పీ నరేష్కుమార్ కథనం ప్రకారం.. మహబూబాబాద్ జి ల్లా కేంద్రం శివారులోగల మంగలికాలనీకి చెం దిన ఇన్నారపు నవీన్ హౌస్ పెయింటింగ్ వృత్తి చేస్తుండగా భార్య శాంతి ఇందిరాగాంధీ సెంటర్లో కూరగాయలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రేగడితండా గ్రామ పరిధి లో గల టేకులతండాకు చెందిన శాంతితో పదేళ్ల క్రితం ఇన్నారపు నవీన్‌కు ప్రేమ వివాహం జరిగింది. రోజు మాదిరిగానే నవీన్ ఉదయం పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాక బయటకు వెళ్లి వస్తానని భార్యతో చెప్పి రాత్రి 9:30 గంటల వరకు కూడా తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురై న శాంతి తన సోదరులకు విషయం చెప్పి నవీన్ కోసం గాలించారు. రేగడితండా గ్రామ శివారులోగల బీడు భూమి సమీపంలో నవీన్ తన హో ండా యాక్టివా బండి కిందపడి ఉండటంతో పా టు అతడు ఆ బండిపైనే మృతి చెంది కనిపించా డు. కాగా, కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సంఘటనా స్థలంలో మద్యం సేవించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆ సమయంలోనే వారికి, నవీన్‌కు మధ్య ఏమి జరిగిందో ఏమో కానీ అతడిని కొట్టి చంపేసి వాహనంపై నుంచి పడి మృతి చెందిన విధంగా చిత్రీకరించి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి తలపై రెండు బలమైన గాయాలై రక్తస్రావం జరగడంతో పాటు గొంతుపై గట్టిగా నొక్కి మృతి చెందే విధంగా ప్రయత్నించడంతో అతడి నాలుక కూడా బయటకు వచ్చింది. నవీన్ హత్యకు గల కారణాలు తెలుసుకుని విచారణ జరుపుతామ ని, త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని డీఎస్పీ నరేష్కుమార్ తెలిపారు. రూరల్ సీఐ జూపల్లి వెంకటరత్నం, కురవి ఎస్సై జె.శంకర్రావు వివరాలు సేకరించారు. సంఘటన స్థలంలో చిల్లర డబ్బులు, మద్యం గ్లాసులు, ఒక బెడ్‌షీట్ లభ్యమయ్యాయి. క్లూస్‌టీం వివరాలు సేకరించగా, డాగ్‌స్క్వాడ్ బృందాలు సంఘటన స్థలాన్ని పరిశీలించాయి. రూరల్ ఎస్సై సీహెచ్.రమేష్‌బాబు, కురవి, మహబూబాబాద్ రూరల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాగా, మృతుడు నవీన్ భార్య శాంతిని వివరణ కోరగా తమ భార్యాభర్తల మధ్య ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని, ఏమి చెప్పకుండా మద్యం బాటిల్ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పింది. నవీన్ హత్యపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీన్ మృతితో కుమార్తె వైష్ణవి, కుమారుడు వికాస్ అనాథలుగా మారా రు. మృతుడు నవీన్ మృతదేహాన్ని సంఘటన స్థలంలో పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమగ్ర విచారణ కోసం భార్య శాంతిని కురవి పోలీసులు తీసుకెళ్లినట్లు సమాచారం. -
కోట సీటెవరికో?
సాక్షి, కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో మహబూబాబాద్ లోక్‌సభ టీఆర్ఎస్ అభ్యర్థి విషయమై రాజకీయవర్గాలు, టీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ టికెట్ తనకే వస్తుందని సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ ధీమాగా ఉన్నారు. గత డిసెంబర్లో మానుకోటలో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా సీతారాంనాయక్‌ను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. దీంతో టికెట్ తనదేననే ధీమాతో సీతారాంనాయక్ ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ఇందులో కీలకమైన పినపాక, భద్రాచలం, ఇల్లెందు, జయశంకర్ జిల్లాలోని ములుగు స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిని మారుస్తారా అనే అంశంపై టీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠగా ఉన్నాయి. కాగా గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వస్తుందనుకున్న ఎంపీ టికెట్ కోల్పోయిన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తేజావత్ రామచంద్రు సైతం ఈసారి మహబూబాబాద్ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద రామచంద్రుకు మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి. గత ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారిందని, ఈసారి అవకాశం పొందాలని రామచంద్రు ప్రయత్నిస్తున్నారు. ఐఏఎస్ అధికారి అయిన రామచంద్రు ఒడిశాలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పైగా ఢిల్లీలో పలువురు ఐఏఎస్‌లతో సత్సంబంధాలు ఉండడంతో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అనేక సానుకూల ఫలితాలు రాబట్టారు. రామచంద్రు వల్లే ఢిల్లీలో సీఎం కేసీఆర్ పలుకుబడి మరింతగా పెరిగింది. రాష్ట్రానికి సంబంధించిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు అటవీ, పర్యావరణ క్లియరెన్సులు, బీటీపీఎస్‌కు అనుమతులు, 3,100 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా చేయిండంలో రామచంద్రు ఢిల్లీలో సక్సెస్ అయ్యారు. అలాగే 26 దేశాల్లో పర్యటించి అంతర్జాతీయ వేదికలపై దేశ వాణి వినిపించారు. నీతిఅయోగ్, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ క్రమంలో రామచంద్రు ఎంపీ టికెట్ ఆశిస్తుండడంతో కార్యకర్తల్లో ఆసక్తి పెరిగింది. కాగా, జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ సెగ్మెంట్లలో గత కొన్ని నెలలుగా ఆయన పలుమార్లు పర్యటించారు. ఆ సందర్భంగా ఆయా శాసనసభ నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రామచంద్రుకు ఘనస్వాగతం పలికారు. పోటాపోటీగా క్షేత్రస్థాయి పర్యటనలు.. లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కావడంతో ఆశావహులు క్షేత్రస్థాయిలోకి మరింతగా చొచ్చుకెళుతున్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి విస్తృతంగా ఉండడంతో ఇప్పటికే పర్యటనల వేగం పెంచారు. ఈ లోక్‌సభ స్థానం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది. ఇందులో భద్రాద్రి జిల్లానే అత్యంత కీలకమైనది కావడంతో ఇక్కడి సెగ్మెంట్లలో పర్యటనకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మానుకోట పార్లమెంట్ పరిధిలో డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ములుగు, ఇల్లెందు, పినపాక, భద్రాచలం శాసనసభ సెగ్మెంట్లు ఉన్నాయి. నర్సంపేట సెగ్మెంట్ వరంగల్ రూరల్ జిల్లాలో, ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో, డోర్నకల్, మహబూబాబాద్ సెగ్మెంట్లు మహబూబాబాద్ జిల్లాలో ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా ఇల్లెందు, భద్రాచలం, పినపాక సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ జిల్లాలోనే మూడు సెగ్మెంట్లు ఉండడంతో ఇదే కీలకం కానుంది. దీంతో ఇక్కడే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. -
ఈసారైనా..
సాక్షి,మహబూబాబాద్ :1952 నుంచి 2014 వరకు మానుకోట నియోజకవర్గానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా ఒక సారి కాంగ్రెస్ (ఐ), సీపీఐ, టీడీపీ చెరో రెండు సార్లు, టీఆర్ఎస్, పీడీఎఫ్, ఎస్సీఎఫ్ ఒక్కోసారి గెలుపొందాయి. ఎక్కువ పర్యాయాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 1994 నుంచి 2014 వరకు రెండోసారి అభ్యర్థులకు వివిధ కారణాలతో అవకాశం దక్కలేదు. ఇప్పటివరకు మానుకోట నియోజకవర్గానికి మంత్రి పదవి కూడా రాలేదు. ఆ అంశాలపైనే ఈ ఎన్నికల్లో చర్చ కొనసాగుతుంది. మానుకోట రాజకీయం రసవత్తరంగా మారింది. ముఖచిత్రం ఇలా.. 1952లో చిల్లంచెర్ల నియోజకవర్గంగా ఆవిర్భవించింది. ఆ సమయంలో డోర్నకల్ నియోజకవర్గం ఏర్పడలేదు. 1957, 1962 చిల్లంచెర్ల నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించారు. 1952లో ద్విసభ్య నియోజకవర్గంగా ఉంది. 1967లో మానుకోట నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009లో పునర్విభజనలో భాగంగా మానుకోట నియోజకవర్గం ఎస్టీకి రిజర్వు కావడంతో పాటు పార్లమెంట్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. 1994 నుంచి రెండోసారి దక్కని అవకాశం... 1972 నుంచి 1989 వరకు ఐదు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జెన్నారెడ్డి జనార్దన్‌రెడ్డి గెలుపొందారు. ఆ తరువాత 1994 నుంచి 2014 వరకు రెండోసారి గెలుపొందిన అభ్యర్థులు లేరు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డిపై సీపీఐ అభ్యర్థి బండి పుల్లయ్య గెలుపొందారు. 1999లో టీడీపీ అభ్యర్థి శ్రీరాం భద్రయ్య గెలుపొందారు. 2004లో ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో మరోసారి అవకాశం టేకుండా పోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి వేం నరేందర్‌రెడ్డి గెలుపొందారు. 2009లో ఎస్టీకి రిజర్వు కావడంతో వేం నరేందర్‌రెడ్డికి మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2009లో మాలోత్ కవిత కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా చందులాల్పై గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మాలోత్ కవితకు టికెట్ ఇచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ చేతిలో ఓటమి పాలయ్యారు. అలా వివిధ కారణాలతో కొంత మందికి టికెట్ రాకపోవడం టికెట్ వచ్చినా ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వకపోవడం మూలంగా రెండోసారి గెలిచే అవకాశం లేకుండా పోయింది. చరిత్ర తిరగరాసేనా.. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున బానోత్ శంకర్‌నాయక్ గెలుపొందారు. ఈ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో శంకర్‌నాయక్ గెలుపొందితే చరిత్రను తిరగరాసినట్టే. దానిపైనే మానుకోట నియోజకవర్గంలో సర్వత్రా చర్చ కొనసాగుతుంది. మంత్రి పదవి దక్కేనా...! నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా ఎక్కువ పర్యాయాలు కాంగ్రెస్ గెలుపొందింది. వారిలో కూడా ఎవరికీ మంత్రి పదవి దక్కలేదు. ఇంత వరకు మానుకోట నియోజకవర్గం నుంచి గెలిచిన అభ్యర్థులకు మంత్రి పదవి రాకపోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు నిరాశతో ఉన్నారు. ఈసారైనా గెలుపొందిన అభ్యర్థులకు మంత్రి పదవి దక్కుతుందా అని చర్చించుకుంటున్నారు. రసవత్తరంగా రాజకీయం... టీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో బానోత్ శంకర్‌నాయక్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. మహాకూటమి నుంచి నేటికీ అధికారికంగా జాబితా ప్రకటించకపోవడంతో అభ్యర్థి ఖరారు కాక ఆశావాహులంతా ఢిల్లీకి పరిమితమయ్యారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ పేరు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన జాటోత్ హుస్సేన్‌నాయక్ టికెట్ రాదని భావించి ఈ నెల ఆరో తేదీన బీజేపీలో చేరారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన బానోత్ మోహన్‌లాల్ బీఎల్ఎఫ్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీన బీఎల్ఎఫ్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించనున్నారు. మహాకూటమి అభ్యర్థి ఎవరనే విషయంపైన ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మానుకోట నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉండే పరిస్థితి కన్పిస్తుంది. బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్‌తో పాటు మరికొంత మంది ఆశావాహులు ఉన్నారు. బీజేపీ నుంచి అధికారికంగా అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. హుస్సేన్‌నాయక్ అణుచరులు మాత్రం హుస్సేన్నాయక్కే టికెట్ వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారు. -
మానుకోటలో మావోల సంచారం
► రామచంద్రాపురం ఉపాధి పనులపై ఆరా ►తిమ్మాపురం అడవుల్లో కదలికలు ►సీసీ కెమెరాల్లో సాయుధ వ్యక్తులు ►ఆరాతీస్తున్న నిఘా వర్గాలు వరంగల్: మహబూబాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, ఏటూరునాగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండేవి. భద్రాచలానికి సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు, భద్రతా దళాల మధ్య కాల్పులు రోజూ జరుగుతున్నాయి. సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా దళాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవల సీఆర్పీఎఫ్ జవాన్ల దాడిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. దాడుల పరంపర కొనసాగుతుండడంతో మావోయిస్టులు మన రాష్ట్రంలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. గూడూరు–బయ్యారం సరిహద్దు తిమ్మాపురం అడవుల్లో వన్యప్రాణుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా రికార్డుల్లో ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు సంచరించినట్లు రికార్డు అయినట్టు తెలిసింది. మావోయిస్టుల సంచారంపై ప్రాథమిక సమాచారం అందడంతో మన రాష్ట్ర నిఘా విభాగం పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. గూడురు–బయ్యారం ప్రాంతంలో మావోయిస్టులు కదలికలు ఉన్నాయా అనే కోణంలో నిఘా పెంచారు. ఇటీవల జరిగిన సంఘటనలు ఇవీ.. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న వార్త ఈ ప్రాంతంలో సంచలనం కలిగిస్తోంది. ఇల్లందు ఎమ్మెల్యేకు కొన్ని రోజుల క్రితం బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. అంతకుముందు మావోయిస్టుల పేరిట వాల్‌పోస్టర్ వెలిసింది. గత నెలలో గ్రామీణ తాగునీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూస్) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రవికుమార్ అక్రమాలకు పాల్పడుతున్నాడని, జాగ్రత్తగా ఉండాలని మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. అలాగే బయ్యారం మండలంలో ఉపాధి హామీ విభాగం ఫీల్డ్ అసిస్టెంట్‌ను పిలిపించి... పనులు జరుగుతున్న తీరుపై మావోస్టులు వివరాలు అడినట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఆయుధాలు కలిగి ఉన్న ఆరుగురు వచ్చారని, ఒకరు తెలుగులో మాట్లాడారని తెలిసింది. వరుస సంఘటనల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. -
అభివృద్ధి బాటలో మానుకోట
మహబూబాబాద్: తెలంగాణ చిత్రపటంపై తాజాగా కొత్త జిల్లాగా ఆవిర్భవించిన మహబూబాబాద్ పలు అంశాల్లో తనకంటూ ప్రత్యేకతను కలిగి ఉంది. కొత్త జిల్లాల్లో గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడింది. మొత్తం 7,54,845 జనాభా ఉన్న ఈ జిల్లాలో గిరిజనులు 2,89,176(జిల్లా జనాభాలో 38 శాతం) ఉండడం విశేషం. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మహబూబాబాద్ జిల్లా గిరిజన జనాభాలో మొదటి స్థానంలో నిలిచింది. మానుకోట, డోర్నకల్ నియోజకవర్గాలు రెండూ ఎస్టీ ప్రాతినిధ్య నియోజకవర్గాలే. అంతేగాక ఇందులో కలిసే కొత్తగూడ(ములుగు), గార్ల, బయ్యారం(ఇల్లందు) మండలాలతోపాటు మహబూబాబాద్ పార్లమెంటరీ స్థానం కూడా ఎస్టీ ప్రాతినిధ్య నియోజకవర్గాలే కావడం విశేషం. ఇక్కడి రాజకీయాలతోపాటు మిగతా రంగాలను శాసించే స్థాయిలో గిరిజన జనాభా ఉంది. గ్రామపంచాయతీ నుంచి జిల్లా కేంద్రంగా.. 2011 సెప్టెంబర్ వరకు గ్రామపంచాయతీగా ఉన్న మహబూబాబాద్ మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయింది. నూతన తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా మారడంతో అభివృద్ధిపై ఇక్కడి ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో రానున్న రోజుల్లో మహబూబాబాద్ రూపురేఖలు మారునున్నాయనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రముఖ ఆలయాలు.. ఆసియా ఖండంలో పేరొందిన చర్చి ఆఫ్ సౌత్ ఇండియా(సీఎస్ఐ) చర్చి, కురవి మండల కేంద్రంలో తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన శ్రీవీరభద్రస్వామి దేవాలయం, మహబూబాబాద్ శివారులోని నర్సింహులపేటలో శ్రీవెంకటేశ్వర స్వామి, లకీ‡్ష్మనరసింహస్వామి ఆలయాలు, తొర్రూరు మండలం మాటేడులో ఒకే ప్రాంగణంలో ఉన్న కాకతీయుల కాలం నాటి శివాలయం, వేణుగోపాలస్వామి ఆలయం, ఇనుగుర్తిలో పుట్టు లింగస్వామి దేవాలయం, పెనుగొండలో కాకతీయుల కాలం నాటి కట్టడాలు, ఈదులపూసపల్లిలో ఇమాంషావలి దర్గా ఉన్నాయి. అందుబాటులోకి ఉన్నత విద్య.. మానుకోట విద్యాపరంగా చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ కనీసం ఇంజనీరింగ్, మెడికల్, పాలిటెక్నిక్, ప్రభుత్వ డైట్, బీఈడీ కళాశాలలు లేవు. అయితే గతంలో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు హార్టీకల్చర్, గిరిజన యూనివర్సిటీతోపాటు అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. గిరిజన విశ్వవిద్యాలయం విషయంలోను మానుకోట పట్టణంలో ఆందోళన మొదలైంది. గతంలోనే ఇల్లందు రోడ్డులోని ప్రభుత్వ భూమిని విశ్వ విద్యాలయం కోసం పరిశీలించారు. అందుకు సంబంధించిన నివేదిక కూడా పంపించారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం పాటుపడుతానని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి తేజావత్ రాంచంద్రు నాయక్ విలేకరుల సమావేశంలో హామీ ఇచ్చారు. ఆ నివేదిక అందగానే తనవంతు కృషి చేయడంపాటు సీఎంకు వివరించి ఏర్పాటు కోసం శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా మారడంతో యూనివర్సిటీ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్‌పైనే ఆశలు.. బయ్యారం, గార్ల, గూడూరు ప్రాంతాల్లో డోలమైట్ నిక్షేపాలు ఉన్నాయని ప్రభుత్వ సర్వేలు వెల్లడించాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్‌ను కలిసి బయ్యారంలో ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని కోరడం, ఆయన సానుకూలంగా స్పందించి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుకు అంగీకరించడంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. ఇదే జరిగితే జిల్లాలో ఏకైక భారీ పరిశ్రమగా స్టీల్‌ప్లాంట్ అవతరించనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు గతంలో బయ్యారం, గార్ల, గుండ్రాతిమడుగు ప్రాంతాల్లో స్థల పరిశీలన కూడా జరిగిన విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ అభివృద్ధికి బాటలు.. మానుకోట జిల్లా కేంద్రమైతే ఇక్కడి రైల్వే స్టేషన్లో ఆగే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశముంది. పాత బజార్నుంచి కొత్తబజార్‌కు వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, స్టేషన్ లో క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. జిల్లా ఏర్పాటుతో ఈ సమస్యలన్ని తీరుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. ప్రతిరోజు 4 లక్షలకుపైగా ఆదాయం, నెలకు కోటిపైనే ఆదాయం వస్తున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. నూనె, పసుపునకు వాణిజ్య కేంద్రం మహబూబాద్ జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రం నూనె, పసుపు మిల్లులకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పసుపు, నూనె సరఫరా అవుతోంది. ఇక్కడి మార్కెట్లో రోజూ కోట్లాది రూపాయల వ్యాపారం సాగుతోంది. రాజకీయ ముఖచిత్రం మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోటగా ఉండేవి. మహబూబాబాద్ నియోజకవర్గం మొదట్లో ఇది ద్విసభ్య నియోజకవర్గం. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో పీడీఎఫ్ నుంచి కన్నెకంటి శ్రీనివాసరావు, ఎ¯ŒSసీఎఫ్ నుంచి బీఎం చందర్రావు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 1957లో, 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎంఎస్ రాజలింగం, జి.మల్లిఖార్జునరావు గెలిచారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సీపీఐ నుంచి తీగల సత్యానారాయణ గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేత జెన్నారెడ్డి జనార్దన్‌రెడ్డి 1972 నుంచి 1994 వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1994లో సీపీఐ అభ్యర్థి బండి పుల్లయ్య చేతిలో ఆయన ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ నాయకులు రాజవర్ధ¯Œ¯ŒSరెడ్డి, జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి మధ్య గ్రూప్ రాజకీయాలతో 1999 ఎన్నికల్లో శ్రీరాంభద్రయ్య(టీడీపీ), 2004 ఎన్నికల్లో వేం నరేందర్‌రెడ్డి(టీడీపీ) ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఈ స్థానం ఎస్టీకి రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నుంచి మాలోతు కవిత, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి శంకర్‌నాయక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. డోర్నకల్ నియోజకవర్గం ఏర్పాౖటెన తర్వాత కాంగ్రెస్ నుంచి 1957 నుంచి 78 వరకు నూకల రామచంద్రారెడ్డి, 1978 నుంచి 1989 వరకు రామసహాయం సురేందర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. సురేందర్‌రెడ్డి ఎంపీగా పోటీ చేయడంతో ఆయన(జనరల్) స్థానంలో కాంగ్రెస్ నుంచి రెడ్యానాయక్ వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఐదోసారి 2009లో టీఆర్ఎస్ అభ్యర్థి సత్యవతి రాథోడ్ చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో తిరిగి రెడ్యానాయక్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్లో చేరారు. - 2009లో ఏర్పడిన మానుకోట ఎంపీస్థానం ఎస్టీలకు రిజర్వ్ కాగా తొలి ఎంపీగా బలరాంనాయక్(కాంగ్రెస్) గెలుపొందగా, ప్రస్తుత ఎంపీగా ప్రొఫెసర్ సీతారాంనాయక్ కొనసాగుతున్నారు. - మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వస్తున్న గార్ల, బయ్యారం, కొత్తగూడ మండలాల్లో సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ ఉనికిని చాటుకుంటోంది. -
నగల షాపులో చోరీకి యత్నం
తనను చూశాడని గుమిస్తాపై దొంగ దాడి మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని సూర్య థియేటర్ సమీపంలో ఉన్న దివ్య జ్యుఝెల్లరీ షాపులో మంగళవారం రాత్రి ఓ దొంగ చోరీకి యత్నించాడు. షాపు యజమాని అప్రమత్తం కావడం తో అతడు పారిపోయాడు. షాపు యజ మాని కథనం ప్రకారం.. మానుకోటకు చెందిన పమ్మి ధనుంజయచారి పట్టణంలోని సూర్య థియేటర్ సమీపంలో తన నివాస గృహంలోనే దివ్య జ్యుఝెల్లరీ షాపును నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ దొంగ షాపునకు సంబంధించిన ప్రహరీ గోడ దూకి ఆ షాపు ఆవరణలోకి అడుగుపెట్టాడు. షాపు తాళం పగులగొట్టేందుకు యత్నించాడు. అదే సమయంలో ఆ షాపు వర్కర్ పరమేశ్వర్ నిద్ర లేచి మూత్రవిసర్జ నకు బయటికి రాగా దొంగ కనిపిం చాడు. అతడు నిద్ర మత్త నుంచి తేరుకునేలోపే అతడిపై దొంగ కర్ర తో దాడి చేశాడు. పరమేశ్వర్ అరుపులు, కేకలకు షాపు యజమాని ధనుంజయచారి లేవడంతో దొంగ పారిపోయాడు. షాపు యజమాని ఇచ్చిన సమాచారంతో టౌ¯న్ ఎస్సై తిరుపతి చేరుకుని దొంగ కోసం వెదికారు. గతంలోనూ ధనుంజయచారి షాపులో దొంగలు రెండుసార్లు చోరీకి పాల్పడ్డారు. -
వైటీసీ భవనాన్ని పరిశీలించిన జేసీ
మహబూబాబాద్ : మానుకోట పట్టణంలోని వైటీసీ భవనాన్ని సోమవారం జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్ పరిశీలించారు. భవనం పరిసరాలను తిరుగుతూ చూశారు. ఈ భవనంలో ఏర్పాటు చేసే కలెక్టర్ కార్యాలయాన్ని సూచించేలా ప్రధాన రహదారిలో బోర్డు ఏర్పాటు చేయాలని, మార్గ మధ్యలో కూడా బాణం గుర్తుతో చిన్న చిన్న బోర్డులు పెట్టాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చే దారిలో ఉన్న బావులపై జాలి ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్యాలయం ఆవరణ స్థలంలో ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేయాలని, భవనానికి రంగులు వేయించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత వైటీసీ భవనంలోని అన్ని గదులను తిరిగి పరిశీలించారు. భవనంలో కలెక్టర్ చాంబర్, జేసీ చాంబర్, డీఆర్ఓ, ఏఓ కార్యాలయాల పనులు జరుగుతుండగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయం తక్కువగా ఉన్నందున త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ జి.భాస్కర్‌రావు, తహసీల్దార్ కె.విజయ్‌కుమార్, ఆర్అండ్బీ ఈఈ పుల్లాదాస్ ఉన్నారు. -
‘మానుకోట’తోనే గిరిజనాభివృద్ధి
మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఏర్పాటుతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలు ఆవిర్భవిస్తాయి తప్ప.. పోరాటాల ద్వారా కాదని స్పష్టం చేశారు. మానుకోట పట్టణం నుంచి తాళ్లపూసపల్లి, అక్కడి నుంచి కల్వల మీదుగా కేసముద్రం వరకు నిర్మించనున్న డబుల్‌రోడ్డు పనులు, మానుకోటలో సెంట్రల్ లైటింగ్ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం వివేకానంద సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల ఏర్పాటు జరుగుతుందని, చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాలను ఇం టింటికీ అందించేందుకు మాధురిపురం గుట్టపై పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మానుకోటలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ బయ్యారం లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం అనేక ఆంక్షలు విధించడం వల్లే ఆటంకం ఏర్పడిందని అన్నారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ మానుకోట మండలం మల్యాల లో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ఏరియా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, మునిసిపల్ చైర్ పర్సన్ భూక్యా ఉమ, జెడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, ఆర్డీఓ భాస్కర్‌రావు, ఎంపీపీ గోనె ఉమారాణి, ఆర్అండ్బీ ఎస్ఈ నర్సింహారావు, ఈఈ పుల్లాదాస్, ఏఈ సీతారామయ్య, కౌన్సిలర్లు మా ర్నేని వెంకన్న, డోలి లింగుబాబు, వెన్నమల్ల విజయలక్షి్మ, భూక్యా స్వప్న, ఫరీద్, నిమ్మల శ్రీనివాస్, నాయకులు పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, గడ్డం అశోక్, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, వీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పద్మం ఉపేంద్రమ్మ పాల్గొన్నారు. -
మానుకోటలో మరో చోరీ
మహబూబాబాద్ : మానుకోట పట్టణంలో బుధవా రం మరో చోరీ జరిగింది. పట్టపగలే దొంగలు ఓ వ్యా పారి ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు అపహరించిన సంఘటన బుధవారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. మానుకోటకు చెందిన వ్యాపారి కొదుమూరి శివకుమార్ బుక్కబజార్లో నివాసముం టున్నాడు. ముకుందా టాకీస్ రోడ్డులో అతడు నిర్వహిస్తున్న ఐరన్ షాపునకు బుధవారం ఆయన తన భార్య తో కలిసి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఆ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి చొరబడి బీరువా పగులగొట్టి 15తులాల బంగారు ఆభరణాలు(హారం, బ్రాస్లైట్, నెక్లెస్) అపహరించారు. శివకుమార్ మధ్యాహ్న భోజనం నిమిత్తం ఇంటికి వెళ్లేసరికి తాళం తీసి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి బీరువా తాళం పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లుగా గమనించి టౌన్ పోలీస్‌స్టేçÙన్కు సమాచారమిచ్చాడు. డీఎస్పీ బి.రాజమహేంద్ర నాయక్‌తోపాటు టౌన్ సీఐ నంది రామ్ నాయక్ అక్కడికి చేరుకొని ఇంటి పరిసరాలను పరిశీలించారు. ఆందోళనలో పట్టణవాసులు రెండు రోజులుగా జరుగుతున్న వరుస దొంగతనాలతో పట్టణప్రజలు భయాందోళనకుగురవుతున్నారు. పట్టపగలే చోరీలు జరుగుతుండటంతో ప్రజలు భద్రత కరువైందనే ఆందోళనలో ఉన్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు. -
మానుకోట ఆర్టీసీ డిపో పదిలం
∙గతంలో ఎత్తివేసే కుట్రలు జరిగాయి ∙జిల్లా ఏర్పాటుతో పెరుగనున్న బస్సులు సంఖ్య, సిబ్బంది ∙జిల్లా ఏర్పాటుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన యూనియన్ నాయకులు మానుకోట డిపో నష్టాల ఊబిలో ఉందనే కారణంతో డిపోలో బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గించారు. డిపోను కూడా ఎత్తివేసే కుట్రలు జరిగాయి. చివరికి శాటిలైట్ డిపోగా మార్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో జిల్లా ఏర్పాటుకు సానుకూల నిర్ణయం జరిగింది. జిల్లా ఏర్పాటు నేపథ్యంతో ఎత్తివేసే కుట్రలకు స్వస్తి పలికినట్లే. దీంతో మానుకోట ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మహబూబాబాద్ : మానుకోట పట్టణంలో 1989లో డిపోను ఏ ర్పాటు చేశారు. డిపో ఏర్పాౖటెనప్పుడు క్రమం గా 80 బస్సులతో నడిచింది. సుమారు 500 మంది సిబ్బంది పనిచేయడం జరిగింది. త ర్వాత పట్టణంలో ఆటోలు, ఇతర ప్రైవేట్ వాç హనాలు పెరగడంతో ఆర్టీసి ఆదాయానికి కొంత గండి పడింది. మానుకోటలో రైల్వే సౌక ర్యం ఉండటం కూడా ఆర్టీసికి నష్టం జరిగింది. ఏడాదికి సుమారు రూ.20 కోట్లకు పైగా ఆదాయం వచ్చినప్పటికి నష్టాల్లోనే డిపో కొనసాగిందని యూనియన్ నాయకులు తెలిపా రు. ఆ సమయంలో పలు పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మూలంగా ఆ ఆలోచనను ప్రభుత్వం విరమించింది. చివరికి డిపో లో 60 బస్సులు మాత్రమే మిగిలాయి. క్రమం గా బస్సులను తగ్గించే కుట్రలు జరుగుతున్న క్రమంలో మానుకోట జిల్లా ఏర్పాటుకు సానుకూలత ఏర్పడటంతో అట్టి కుట్రలకు భగ్నం కలిగింది. డిపోపై ఆశలు సడలుతున్న సమయంలో జిల్లాలో పునర్విభజనలో మానుకోట పేరు ఉండటంతో డిపో పరంగా అభివృద్ది చెందుతుందనే ఆశ ప్రజల్లో కలుగుతోంది. నష్టాల్లో ఉన్న ఆర్టీసి లాభాల్లో నడిచే అవకాశం ఉంది. ఆర్టీసి యూనియన్ నాయకులు జిల్లా నేపథ్యం దృష్ట్యా ఎంతో ఆనందంగా ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్ తరహాలో మానుకోట డిపో అభివృద్ది జరుగుతుంది. జిల్లా ఏర్పాటుతో మానుకోట ఆర్టీసి సమస్య తీరినట్లే. బస్సుల సంఖ్య పెరుగుతుంది జిల్లా ఏర్పాటు నేపథ్యంలో ఆర్టీసి డిపో అన్ని విధాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తద్వారా బస్సుల సంఖ్య పెరిగి ప్రయాణికులకు మేలు జరుగనుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా ఎక్కువగా ఉండటం వల్ల డిపో ఆదాయం 100 శాతం పెరుగుతుంది. జిల్లా ఏర్పాటుకు సహకరించిన నాయకులందరికీ టీఎంయూ తరపున కృతజ్ఞతలు. –కె.మల్లయ్య, టీఎంయూ చీఫ్ అడ్వయిజర్ మానుకోట డిపో కష్టాలు గట్టెక్కినట్లే కొంత కాలంగా నష్టాల్లో ఉందనే కారణాన్ని చూపిస్తూ బస్సుల సంఖ్య తగ్గిస్తూ వచ్చారు. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మానుకోట జిల్లా ఏర్పాటు నేపథ్యంతో డిపో కష్టాలు గట్టెక్కుతాయి. ఆదాయం పెరగడంతో పాటు అన్ని సౌకర్యాలు మెరుగుపడుతాయి. జిల్లా నేపథ్యంతోనే ఆర్టీసి సమస్యలు తీరనున్నాయి. – బీ.ఆర్.రెడ్డి టీఎంయూ డిపో కార్యదర్శి -
మానుకోటలో ‘ఫైబర్ టు ది హోం’ అభినందనీయం
తొలి విడతలో 10 గ్రామాలకు ఉచిత వైఫై సేవలు ఎంపీ సీతారాం నాయక్ కేబుల్ ఆపరేటర్ల సహకారంతో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్రాజెక్టు పోచమ్మమైదాన్ : మానుకోట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేబుల్ ఆపరేటర్ల సహకారంతో బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ‘ఫైబర్ టు ది హోం’(ఎఫ్టీటీహెచ్) కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. మంగళవారం వరంగల్‌లోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్(పీజీఎం) నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన టెలికాం అడ్వైజరీ కమిటీ(టీఏసీ) సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడమే లక్ష్యంగా ఎఫ్టీటీహెచ్ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. మహారాష్ట్ర తరహాలో మానుకోట పార్లమెంట్ స్థానం పరిధిలో తొలి విడతగా 10 గ్రామాలు ఉచిత వైఫై సేవలు అందేలా చూస్తానన్నారు. చిన్న జిల్లాలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎంపీ అన్నారు. ప్రజలకు మరిన్ని∙మెరుగైన సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ సమాయత్తం కావాలన్నారు. అనంతరం పీజీఎం నరేందర్ మాట్లాడుతూ జిల్లాలో బీఎస్ఎన్ఎల్ ద్వారా ప్రతినెలా 10వేల కొత్త సెల్‌ఫోన్ కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. మహబూబాబాద్‌లో త్వరలో బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభిస్తామన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 6న జరిగిన టీఏసీ సమావేశంలో సభ్యులు లెవనెత్తిన సమస్యలకు చూపిన పరిష్కారాల గురించి నివేదిక చదివి వినిపించారు. టీఏసీ సభ్యుడు ఒగిలిశెట్టి అనిల్ మాట్లాడుతూ వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో ఇటీవల ఓఎఫ్సీ కేబుల్ కట్ కావడంతో రెండు రోజుల పాటు అక్కడి ఎస్బీహెచ్లో బ్యాకింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. అజ్మీర శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ నర్సంపేట మహేశ్వరంలోని రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ గత కొన్ని రోజులుగా పని చేయడం లేదని, బీఎస్ఎన్ఎల్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో సభ్యులు బాస్కుల ఈశ్వర్, వీరస్వామి, సోమనర్సజీ, పీఆర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
బస్సులో గుండెపోటుతో వృద్ధుడి మృతి
మహబూబాబాద్ : ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మృతిచెందిన సంఘటన మానుకోట మండలంలోని జమాండ్లపల్లి వద్ద శనివారం జరిగింది. కరీంనగర్ జిల్లా కమలాపురం మండలం దేశరాజుపల్లికి చెందిన గొల్లెన మల్లయ్య(80)తో పాటు ఆయన బంధువులు మీరాల మల్లయ్య, మీరాల చంద్రమ్మ, జి.కొమురయ్య హన్మకొండలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కి కొత్తగూడేనికి బయలుదేరాడు. మానుకోట మండలంలోని జమాండ్లపల్లి వద్దకు బస్సు చేరుకోగానే గుండెపోటుతో మల్లయ్య కన్నుమూశాడు. మృతదేహాన్ని మానుకోట బస్టాండ్‌లో దింపారు. కొత్తగూడెంలో తమ బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వారు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లయ్య భౌతికకాయాన్ని స్వగ్రామం దేశరాజుపల్లికి తరలించారు. -
మానుకోట జిల్లా పనులు ముమ్మరం
మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఏర్పాటు పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికలను కూడా సిద్ధం చేసి అధికారులకు అందజేశారు. రెండు నెలల్లోపే జిల్లా ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. మానుకోట జిల్లా ఏర్పాటు ప్రకటన మాత్రమే అధికారికంగా మిగిలి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల భవనాల కోసం తొలుత అన్వేషణ ప్రారంభించారు. ఇందులో భాగంగానే జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ కొద్ది రోజుల క్రితం మానుకోటకు వచ్చి పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ఇందిరానగర్ కాలనీ సమీపంలోని వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) భవనం కలెక్టరేట్‌కు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ కలెక్టరేట్ ప్రధాన రహదారి కోసం సుమారు 18 లక్షలను కేటాయించి పనులు చేపట్టారు. ఓ ప్రైవేట్ సంస్థకు వైటీసీ భవనాన్ని అప్పగించినట్లు ఉత్తర్వులు వచ్చాయని మానుకోట ఏటీటీడబ్ల్యూఓ దేశీరాంనాయక్ తెలిపారు. తక్షణమే ఆ భవనంలో కొనసాగుతున్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను వేరే భవనంలోకి మార్చాలని ఆదేశించారు. ఈ విషయమై వెంటనే స్పందించిన రెవెన్యూ ఉన్నతాధికారులు.. ఐటీడీఏ అధికారులతో మాట్లాడి ఆ భవనాన్ని కలెక్టర్ కార్యాలయానికి కేటాయించారని వివరించారు. మానుకోటలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించామని, ఆయా భవనాల్లో జిల్లా కార్యాలయాలకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్‌కు అందజేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం పట్టణంలోని పలు ప్రాంతాలను సర్వే చేయడం పూర్తయ్యిందని, ఆ నివేదికను కూడా అందజేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం మాత్రం ప్రధాన రహదారికి దగ్గరలో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. వైటీసీ భవనమే కలెక్టరేట్‌కు కేటాయించాలని అధికారులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. తాత్కాలిక కార్యాలయాల ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. -
సదరం క్యాంపులో గందరగోళం
మహబూబాబాద్ :మానుకోటలో బుధవారం జరిగిన సదరం క్యాంపు వద్ద గందరగోళం నెలకొంది. రోజూ 150 మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వేల సంఖ్యలో వికలాంగులు క్యాంపునకు హాజరయ్యారు. దీంతో పరిస్థితి అదుపుతప్పి సిబ్బంది చేతులెత్తేశారు. వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 1 నుంచి సదరంక్యాంపు ని ర్వహిస్తున్నారు. మానుకోట, నర్సంపేట డివి జన్లకు సంబంధించిన వికలాంగులు ఈ క్యాంపునకు హాజరవుతున్నారు. 11 రోజులుగా క్యాంపు ఎలాంటి ఆటంకాలు లేకుండానే కొనసాగింది. అరుుతే ఇటీవల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు పరీక్షలు నిర్వహించేందుకు డీఆర్డీఏ సిబ్బందివారికి ప్రత్యేకంగా స్లిప్‌లను పంపిణీ చేశారు. బుధవారం వచ్చేందుకు మానుకోట పట్టణంలో 50 మందికి, మండలంలోని ఇతర గ్రామాల్లో 100 మందికి స్లిప్‌లు పంపిణీ చేశారు. అరుుతే ఆ స్లిప్లపాటు నకిలీ స్లిప్‌లు కూడా పెద్ద సంఖ్య లో పంపిణీ అయ్యాయి. ఆ స్లిప్‌లతో శిబిరానికి వందలాదిగా వచ్చిన వికలాంగులు తమకు పరీక్షలు నిర్వహించాలని ఆందోళనకు దిగారు. వారికి వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్, సీపీఎం నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పోలపాక మల్లయ్య, సురుగు ఐలయ్య, గార్లపాటి వెంకటేశ్వర్లు, తోట బిక్షం, దుగ్గి సారయ్య మాట్లాడుతూ క్యాంపును పొడగించాలని, వికలాంగులకు సదుపాయాలు కల్పించాలని, అర్హులైన వారందరికి సదరం స ర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ మల్లయ్య, మునిసిపల్ కమిషనర్ రాజలింగు అక్కడికి చేరుకుని డీఆర్డీఏ కేవలం 150 స్లిప్పులు మాత్రమే పంపిణీ చేసిందని, మిగతా కార్డులతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. సదరం క్యాంపు నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు పడొద్దని, అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లతోపాటు పింఛ న్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మిగతావారిని తిరిగి ఇంటికి పంపిం చారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో నిలువనీడ లేక వికలాంగులు ఎండలో కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా నకిలీ స్లిప్‌లు తయారు చేసిన వారిపై అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఐకేపీ ఏపీఎం శంకర్ తెలిపారు. -
అవస్థల ఆర్యూబీ!
మూడేళ్లుగా కొనసా..గుతున్న బ్రిడ్జి నిర్మాణం మహబూబాబాద్ : తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచిందన్నట్లుగా తయారైంది మానుకోట రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణం. పెరుగుతున్న పట్టణ జనాభా... వాహనాల రద్దీ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఆర్యూబీ నిర్మాణ పనులు రెండు అడుగులు ముందుకు.. నాలుగడుగులు వెన క్కి అన్న చందంగా కొనసాగుతున్నారుు. పట్టణవాసులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన మానుకోటలో ఆర్యూబీ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.18 కోట్లు మంజూరు చేశాయి. ఇందులో ట్రాక్ కింద బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.3.29 కోట్లు, ఆర్యూబీ నిర్మాణంతో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు పరిహారం అందజేసేందుకు రూ.6.60 కోట్లు కేటాయించారు. మిగతా నిధులతో బ్రిడ్జికి ఇరువైపుల సైడ్‌వాల్స్, పైపులైన్, విద్యుద్దీపాలు, సర్వీసు గో డలు, ఇతర నిర్మాణాలు చేపట్టాలని అధికారులు నిర్ణరుుంచా రు. 2011లో బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్ పిలవగా... ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. అదే సంవత్సరం పనులు ప్రారంభించాడు. మూడేళ్లు కావొస్తున్నా... పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. అనాలోచిత నిర్ణయూలతో... ముందుగా నిర్ణయించిన ప్రకారం పనులు చేపట్టకుండా అధికారులు పలుమార్లు బ్రిడ్జి డిజైన్‌ను మార్చారు. తొలుత టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తనకు నిర్మాణానికి సరిపడా నిధులు మంజూరు చేయాలని అధికారులను కోరగా.. వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో గత టెండర్‌ను రద్దు చేసి మరో కాంట్రాక్టర్‌కు ఆర్యూబీ పనులు అప్పగించారు. ఇలా బ్రిడ్జి డిజైన్, కాంట్రాక్టర్ల మార్పు కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. అంతేకాదు... ముందుగా నిర్ణయించిన ప్రకారం నిర్మాణం చేపట్టకుండా డిజైన్‌లో మార్పులు చేయడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి 10 అడుగుల ఎత్తుతో నిర్మించాల్సిన బ్రిడ్జిని 8.8 అడుగుల ఎత్తుతో కట్టడంతో నాన్ కమర్షియల్ వాహనాలు మాత్రమే బ్రిడ్జి కింది నుంచి వెళ్తున్నాయి. బ్రిడ్జి కింది నుంచి కనీసం 108 అంబులెన్స్ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఏరియా ఆస్పత్రికి, పాతబజార్ నుంచి కొత్త బజార్‌కు వచ్చేందుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉన్న ఆర్ఓబీ (రోడ్డు ఓవర్ బ్రిడ్జి)పై నుంచి రావాల్సి వచ్చేది. ఆర్యూబీ నిర్మాణంతోనైనా తమ కష్టాలు తొలగిపోతాయని భావించిన ప్రజలు, వాహన దారులకు డిజైన్ మార్పు శరాఘాతంగా మారింది. రాత్రివేళల్లో ప్రమాదాలు రాత్రివేళల్లో కొత్త బజార్ బ్రిడ్జి సమీపంలోని రామమందిరం, ఏరియా ఆస్పత్రి రోడ్డు, కురవి రోడ్డు నుంచి వచ్చే వాహనదారులు పాతబజార్‌కు ఏ మార్గం గుండా వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. వాహనాలు అదుపుతప్పడంతో పలువురు ప్రమాదాల బారిన పడ్డారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆర్యూబీ డిజై న్లో మార్పులు చేసి నిర్మాణపనులను త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన వీధి లైట్లకు త్వరగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ప్రమాదాలను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్ అండ్ బీ పనులు పూర్తి చేశాం ఆర్‌అండ్‌బీకి సంబంధించిన పనులను సక్రమంగా పూర్తి చేశాం. వర్షాకాలంలో బ్రిడ్జి కింద నీరు నిలిచిపోకుండా ఉండేందుకు ఇక్కడి నుంచి సమీపంలోని బంధం కాలువకు పైపులైన్ వేశాం. ట్రాక్ క్రింద బ్రిడ్జి పనులు రైల్వే పరిధిలో ఉండడంతో రైల్వే కాంట్రాక్టర్ ఆ పనులను చేస్తున్నారు. డిజైన్‌లో ఏమాత్రం మార్పు వచ్చినా... ఇబ్బందులు తప్పవు. - రమేష్, ఆర్అండ్బీ డీఈ -
మానుకోటను జిల్లా కేంద్రం చేస్తా:చంద్రబాబు
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : మానుకోటను జిల్లా కేంద్రంగా చేసి వరంగల్‌కు దీటుగా అభివృ ద్ధి చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. స్థానిక ఫాతిమా హైస్కూల్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు సోమవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ సెంటర్లో ఆయన మాట్లాడుతూ సామాజిక, బంగారు నవ తెలంగాణ టీడీపీతోనే సాధ్యమన్నారు. ఎంపీ అభ్యర్థి మోహన్‌లాల్, ఎమ్మెల్యే అభ్యర్థి మూడు బాలు చౌహాన్‌ను గెలిపించాలని కోరారు. ఈ సం దర్భంగా టీడీపీ నాయకుడు శ్యాం లోయ ‘బాబు’ కు తల్వార్ బహూకరించారు. కార్యక్రమంలో నాయకులు కె.సురేందర్, కొండపల్లి రాంచందర్‌రావు, మార్నేని రఘు, అనీల్, బొమ్మ వెంకటేశ్వ ర్లు, కట్ల వెంకన్న, సునీల్, అడప మల్లికార్జున్, సంపత్ భీష్మా, వీరేందర్, దిడుగు సుబ్బారావు, బీజేపీ నాయకులు యాప సీతయ్య, బి.బి.రాఘవు లు, శ్యాంలోయ, తదితరులు పాల్గొన్నారు. అధికారుల అభ్యంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యాహ్నం 1.00 గంటలకు రావాల్సి ఉండగా 4.00 గంటలకు వచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం 4.00 గంటల వరకే ప్రచారం జరుపుకోవాలని ఎన్నికల ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులు అందాయంటూ మానుకోట తహసీల్దార్ వెంకారెడ్డికి చంద్రబాబు కు సమాచారం అందించారు. ప్రచారం నిర్వహిం చొద్దని, రోడ్ షోకు అనుమతి లేదని ఉత్తర్వులను చూపించారు. అయితే సాయంత్రం ఆరు గంటల కు వరకు సమయం ఉందని, ఈ విషయమై స్పష్టంగా తెలుసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈలోగా కొంత సమయం హెలిప్యాడ్ స్థలంలోనే ప్రసంగించారు. అనంతరం ఎన్నికల అధికారుల తో మాట్లాడగా ఆరు గంటల వరకు సమయం ఉం దని చెప్పడంతో రోడ్ షో కొనసాగించారు. మాట్లాడకుండానే వెళ్లిన బాబు మరిపెడ : మానుకోట రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు సాయింత్రం 6 గంటలకు మరిపెడకు చేరుకున్నారు. అప్పటికే ఎన్నికల ప్రచారానికి సమయం ముగియడంతో అధికారులు సమాచారం అందించారు. దీంతో ఒక్క మాటకూడా మాట్లాడకుండానే చంద్రబాబు వెంటనే ఓపెన్ టాప్ జీప్ లో కార్గిల్ సెంటర్లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అందులో వెళ్లిపోయారు. దీంతో పార్టీ శ్రేణుల తోపాటు అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. -
అప్పుడు రాళ్లు - నేడు పూలు