‘మానుకోట’తోనే గిరిజనాభివృద్ధి
మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఏర్పాటుతోనే గిరిజనుల అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా జిల్లాలు ఆవిర్భవిస్తాయి తప్ప.. పోరాటాల ద్వారా కాదని స్పష్టం చేశారు. మానుకోట పట్టణం నుంచి తాళ్లపూసపల్లి, అక్కడి నుంచి కల్వల మీదుగా కేసముద్రం వరకు నిర్మించనున్న డబుల్‌రోడ్డు పనులు, మానుకోటలో సెంట్రల్ లైటింగ్ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం వివేకానంద సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో తుమ్మల మాట్లాడుతూ.. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లాల ఏర్పాటు జరుగుతుందని, చిన్న జిల్లాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. కృష్ణా జలాలను ఇం టింటికీ అందించేందుకు మాధురిపురం గుట్టపై పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మానుకోటలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ బయ్యారం లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం అనేక ఆంక్షలు విధించడం వల్లే ఆటంకం ఏర్పడిందని అన్నారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ మానుకోట మండలం మల్యాల లో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ఏరియా ఆస్పత్రిని అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మునిసిపల్ చైర్ పర్సన్ భూక్యా ఉమ, జెడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, ఆర్డీఓ భాస్కర్‌రావు, ఎంపీపీ గోనె ఉమారాణి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ నర్సింహారావు, ఈఈ పుల్లాదాస్, ఏఈ సీతారామయ్య, కౌన్సిలర్లు మా ర్నేని వెంకన్న, డోలి లింగుబాబు, వెన్నమల్ల విజయలక్షి్మ, భూక్యా స్వప్న, ఫరీద్, నిమ్మల శ్రీనివాస్, నాయకులు పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, గడ్డం అశోక్, వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, వీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పద్మం ఉపేంద్రమ్మ పాల్గొన్నారు.