సదరం క్యాంపులో గందరగోళం | Turmoil at sadaram camp | Sakshi
Sakshi News home page

సదరం క్యాంపులో గందరగోళం

Published Thu, Nov 13 2014 3:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

సదరం క్యాంపులో గందరగోళం

సదరం క్యాంపులో గందరగోళం

మహబూబాబాద్ :మానుకోటలో బుధవారం జరిగిన సదరం క్యాంపు వద్ద గందరగోళం నెలకొంది. రోజూ 150 మందికి మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా వేల సంఖ్యలో వికలాంగులు క్యాంపునకు హాజరయ్యారు. దీంతో పరిస్థితి అదుపుతప్పి సిబ్బంది చేతులెత్తేశారు. వివరాలిలా ఉన్నాయి.

స్థానిక ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 1 నుంచి సదరంక్యాంపు ని ర్వహిస్తున్నారు. మానుకోట, నర్సంపేట డివి జన్లకు సంబంధించిన వికలాంగులు ఈ క్యాంపునకు హాజరవుతున్నారు. 11 రోజులుగా క్యాంపు ఎలాంటి ఆటంకాలు లేకుండానే కొనసాగింది. అరుుతే ఇటీవల పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వికలాంగులకు పరీక్షలు నిర్వహించేందుకు డీఆర్‌డీఏ సిబ్బందివారికి ప్రత్యేకంగా స్లిప్‌లను పంపిణీ చేశారు.

బుధవారం వచ్చేందుకు మానుకోట పట్టణంలో 50 మందికి, మండలంలోని ఇతర గ్రామాల్లో 100  మందికి స్లిప్‌లు పంపిణీ చేశారు. అరుుతే ఆ స్లిప్‌లపాటు నకిలీ స్లిప్‌లు కూడా పెద్ద సంఖ్య లో పంపిణీ అయ్యాయి. ఆ స్లిప్‌లతో శిబిరానికి వందలాదిగా వచ్చిన వికలాంగులు తమకు పరీక్షలు నిర్వహించాలని ఆందోళనకు దిగారు. వారికి వికలాంగుల హక్కుల పోరాట సమితి, ఎమ్మార్పీఎస్, సీపీఎం నాయకులు మద్దతుగా నిలిచారు.

ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు పోలపాక మల్లయ్య, సురుగు ఐలయ్య, గార్లపాటి వెంకటేశ్వర్లు, తోట బిక్షం, దుగ్గి సారయ్య మాట్లాడుతూ క్యాంపును పొడగించాలని, వికలాంగులకు సదుపాయాలు కల్పించాలని, అర్హులైన వారందరికి సదరం స ర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దార్ మల్లయ్య, మునిసిపల్ కమిషనర్ రాజలింగు అక్కడికి చేరుకుని డీఆర్‌డీఏ కేవలం 150 స్లిప్పులు మాత్రమే పంపిణీ చేసిందని, మిగతా కార్డులతో సంబంధం లేదని తేల్చిచెప్పారు. సదరం క్యాంపు నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి ఇబ్బందులు పడొద్దని, అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లతోపాటు పింఛ న్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం మిగతావారిని తిరిగి ఇంటికి పంపిం చారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో నిలువనీడ లేక వికలాంగులు ఎండలో కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. కాగా నకిలీ స్లిప్‌లు తయారు చేసిన వారిపై అధికారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఐకేపీ ఏపీఎం శంకర్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement