
మానుకోటను జిల్లా కేంద్రం చేస్తా:చంద్రబాబు
మహబూబాబాద్, న్యూస్‌లైన్ : మానుకోటను జిల్లా కేంద్రంగా చేసి వరంగల్‌కు దీటుగా అభివృ ద్ధి చేస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. స్థానిక ఫాతిమా హైస్కూల్ నుంచి నెహ్రూ సెంటర్ వరకు సోమవారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ సామాజిక, బంగారు నవ తెలంగాణ టీడీపీతోనే సాధ్యమన్నారు. ఎంపీ అభ్యర్థి మోహన్‌లాల్, ఎమ్మెల్యే అభ్యర్థి మూడు బాలు చౌహాన్‌ను గెలిపించాలని కోరారు. ఈ సం దర్భంగా టీడీపీ నాయకుడు శ్యాం లోయ ‘బాబు’ కు తల్వార్ బహూకరించారు. కార్యక్రమంలో నాయకులు కె.సురేందర్, కొండపల్లి రాంచందర్‌రావు, మార్నేని రఘు, అనీల్, బొమ్మ వెంకటేశ్వ ర్లు, కట్ల వెంకన్న, సునీల్, అడప మల్లికార్జున్, సంపత్ భీష్మా, వీరేందర్, దిడుగు సుబ్బారావు, బీజేపీ నాయకులు యాప సీతయ్య, బి.బి.రాఘవు లు, శ్యాంలోయ, తదితరులు పాల్గొన్నారు.
అధికారుల అభ్యంతరం
టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యాహ్నం 1.00 గంటలకు రావాల్సి ఉండగా 4.00 గంటలకు వచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం 4.00 గంటల వరకే ప్రచారం జరుపుకోవాలని ఎన్నికల ఉన్నత అధికారుల నుంచి ఉత్తర్వులు అందాయంటూ మానుకోట తహసీల్దార్ వెంకారెడ్డికి చంద్రబాబు కు సమాచారం అందించారు. ప్రచారం నిర్వహిం చొద్దని, రోడ్ షోకు అనుమతి లేదని ఉత్తర్వులను చూపించారు. అయితే సాయంత్రం ఆరు గంటల కు వరకు సమయం ఉందని, ఈ విషయమై స్పష్టంగా తెలుసుకోవాలని చంద్రబాబు కోరారు. ఈలోగా కొంత సమయం హెలిప్యాడ్ స్థలంలోనే ప్రసంగించారు. అనంతరం ఎన్నికల అధికారుల తో మాట్లాడగా ఆరు గంటల వరకు సమయం ఉం దని చెప్పడంతో రోడ్ షో కొనసాగించారు.
మాట్లాడకుండానే వెళ్లిన బాబు
మరిపెడ : మానుకోట రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు సాయింత్రం 6 గంటలకు మరిపెడకు చేరుకున్నారు. అప్పటికే ఎన్నికల ప్రచారానికి సమయం ముగియడంతో అధికారులు సమాచారం అందించారు. దీంతో ఒక్క మాటకూడా మాట్లాడకుండానే చంద్రబాబు వెంటనే ఓపెన్ టాప్ జీప్ లో కార్గిల్ సెంటర్‌లోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అందులో వెళ్లిపోయారు. దీంతో పార్టీ శ్రేణుల తోపాటు అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.