బస్సులో గుండెపోటుతో వృద్ధుడి మృతి | The elderly, died of a heart attack on the bus | Sakshi
Sakshi News home page

బస్సులో గుండెపోటుతో వృద్ధుడి మృతి

Published Sun, Aug 21 2016 12:34 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మృతిచెందిన సంఘటన మానుకోట మండలంలోని జమాండ్లపల్లి వద్ద శనివారం జరిగింది. కరీంనగర్‌ జిల్లా కమలాపురం మండలం దేశరాజుపల్లికి చెందిన గొల్లెన మల్లయ్య(80)తో పాటు ఆయన బంధువులు మీరాల మల్లయ్య, మీరాల చంద్రమ్మ, జి.కొమురయ్య హన్మకొండలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కి కొత్తగూడేనికి బయలుదేరాడు.

మహబూబాబాద్‌ : ఓ ప్రయాణికుడు ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మృతిచెందిన సంఘటన మానుకోట మండలంలోని జమాండ్లపల్లి వద్ద శనివారం జరిగింది. కరీంనగర్‌ జిల్లా కమలాపురం మండలం దేశరాజుపల్లికి చెందిన గొల్లెన మల్లయ్య(80)తో పాటు ఆయన బంధువులు మీరాల మల్లయ్య, మీరాల చంద్రమ్మ, జి.కొమురయ్య హన్మకొండలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కి కొత్తగూడేనికి బయలుదేరాడు. మానుకోట మండలంలోని జమాండ్లపల్లి వద్దకు బస్సు చేరుకోగానే గుండెపోటుతో మల్లయ్య కన్నుమూశాడు. మృతదేహాన్ని మానుకోట బస్టాండ్‌లో దింపారు. కొత్తగూడెంలో తమ బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వారు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మల్లయ్య భౌతికకాయాన్ని స్వగ్రామం దేశరాజుపల్లికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement