పులివెందుల : ప్రొద్దుటూరు నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధుడు గుండెపోటుతో ఆకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ సంఘటన ప్రొద్దుటూరు నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీలో చోటు చేసుకుంది. ఆర్.కొండలపల్లి వద్ద 70 ఏళ్ల వృద్ధుడు బస్సు ఎక్కాడు. బస్సు సీట్లో కూర్చుని ఉన్న సదరు వృద్ధుడు అలాగే మృతి చెందాడు.
అయితే అతడు గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని బస్సు డ్రైవర్, కండెక్టర్ భావించారు. దాంతో వారు బస్సు పులివెందుల బస్డాండు చేరుకోగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వృద్ధుడి శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆర్.కొండలపల్లికి వెళ్లారు.