అనంతపురం నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ గొర్రెల వ్యాపారి గుండెపోటుతో మృతిచెందాడు.
గుత్తి (అనంతపురం) : అనంతపురం నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ గొర్రెల వ్యాపారి గుండెపోటుతో మృతిచెందాడు. యాడికి మండలం రామన్నగుడిసెల గ్రామానికి చెందిన ఈరన్న(49) శనివారం గొర్రెలను కొనుగోలు చేయడానికి అనంతపురం సంతకు వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో ఆర్టీసీ బస్సు ఎక్కాడు.
బస్సు గుత్తికి చేరుకున్నా దిగకపోవడంతో.. డ్రైవర్, కండక్టర్ లేపడానికి ప్రయత్నించారు. ఎంతకీ లేవకపోవడంతో మృతిచెందాడని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.