రైట్ రైట్.. నో టికెట్
Published Tue, Jan 7 2014 2:30 AM | Last Updated on Sat, Aug 25 2018 5:10 PM
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట)/తణుకు అర్బన్, న్యూస్‌లైన్ :సంక్రాంతి రోజుల్లో సొంతూరికి వచ్చేవారు.. దూరప్రాంతాలకు వెళ్లేవారు అవస్థలకు గురికాక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు వంటి దూరప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు ఆర్టీసీ బస్సుల్లో వచ్చీపోయే ప్రయూణికులకు కష్టాలు, నష్టాలు తప్పటం లేదు. ఇప్పటికే ఆర్టీసీ, రైల్వే కౌంటర్లలో ‘రిజర్వేషన్లు ఫుల్’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దూరప్రాంత ప్రయూణికుల సౌకర్యార్థం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని.. వాటిలోనూ ముందుగానే టికెట్లు రిజ ర్వు చేసుకోవచ్చని ఆర్టీసీ ప్రకటనలి స్తోంది. తీరా టికెట్ బుక్ చేసుకుంటే అదనంగా 50 శాతం చార్జీ వసూలు చేస్తోంది. పైగా వాటికి డొక్కు బస్సులను వినియోగిస్తోంది.
అప్ అండ్ డౌన్.. అన్నీ ఫుల్
హైదరాబాద్ నుంచి జిల్లాకు.. జిల్లా నుంచి హైదరాబాద్‌కు జిల్లాలోని 6 ఆర్టీసీ డిపోల నుంచి రెగ్యులర్ సర్వీసులుగా రోజుకు 36 చొప్పున బస్సులు నడుస్తున్నాయి. అన్ని సర్వీసులలోనూ ఈనెల 9, 10, 11, 12 తేదీల్లో సీట్లన్నీ రిజర్వు అరుుపోయూరుు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి జిల్లాలోని వివిధ డిపోలకు మరో 108 సర్వీసులను అదనంగా తిప్పుతున్నట్టు ఆర్టీసీ డెప్యూ టీ ఛీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎ.సుధాకర్ తెలిపారు. అదేవిధంగా ఈనెల 15, 16, 17, 18, 19 తేదీల్లో జిల్లానుంచి హైదరాబాద్ వెళ్లే బస్సుల్లోని సీట్లు కూడా బుక్ అయిపోయూయని చెప్పారు. ఈ దృష్ట్యా జిల్లానుంచి హైదరాబాద్‌కు ప్రతి డిపోనుంచి ఒక్కొక్క బస్సును అదనంగా నడుపుతున్నామని, వాటిలోనూ టికెట్లన్నీ రిజర్వ్ అయిపోయూయని తెలి పారు. మరింతమంది ప్రయూణికులు వస్తే మరిన్ని సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇక్కడివరకూ బాగానే ఉన్నా అదనపు సర్వీసుల పేరిట నడిపే బస్సుల్లో ఒక్కొక్క టికెట్‌పై అసలు ధర కంటే 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. పోనీ.. వాటికైనా మంచి బస్సులు వాడుతున్నారా అంటే అదీ లేదు. పాతబడిన బస్సులను స్పెషల్ సర్వీసులుగా నడుతున్నారు.
సాధారణ రోజుల్లో తణుకు నుంచి హైదరాబాద్ వెళ్లే సూపర్ లగ్జరీ బసు టికెట్ ధర రూ.458 కాగా టోల్ ప్లాజా ఇతర ఖర్చులతో కలిపి రూ.499 ప్రయాణికులు చెల్లిస్తున్నారు. ప్రత్యేక సర్వీసులుగా నడుపుతున్న డొక్కు బస్సుల్లో టికెట్ ధరను రూ.680గా నిర్ణయించారు. ఇవికూడా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ వరకూ నడుస్తాయని చెబుతున్నారు. ధర ఎక్కువైనా వాటిలో ప్రయాణాలు చేద్దామనుకుంటే ఒళ్లు హూనం కావడం ఖాయమని ప్రయాణికులు వాపోతున్నారు. నిబంధనలను కఠినతరం చేసిన నేపథ్యంలో కొంతకాలంగా ప్రైవేటు బస్సులు ఎక్కువగా తిరగటం లేదు. దీంతో ఆర్టీసీ బస్సులను, రైళ్లను ఆశ్రయించక తప్పటం లేదు.
Advertisement
Advertisement